కామెడీ థ్రిల్లర్‌గా సైవ కోమాళి
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం సైవ కోమాళి అని ఆ చిత్ర దర్శకుడు సెరేశ్ శాంతారామ్ తెలిపారు. దర్శకుడు ధరణీ, జగన్, బాలుశివన్, శాంతకుమార్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. ఎస్‌ఎంఎస్.మూవీస్ పతాకంపై ఏసీ.సురేశ్, మహేంద్రన్, సారుుమహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సైవ కోమాళి చిత్రంలో నడువుల కొంచెం పక్కల్తై కానోమ్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్, రెహానా, నాన్‌కడవుల్ రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో పవర్‌స్టార్ జీఎం.కుమార్, టీబీ.రాజేంద్రన్, రంజిత్, సూపర్‌గుడ్ లక్ష్మణన్, క్రేన్‌మనోహర్, కృష్ణమూర్తి, టీకే.కళ, గాయత్రి, వనిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కామెడీ థ్రిల్లర్ అంశాలతో రూపొందిస్తున్న చిత్రం సైవ కోమాళి అని తెలిపారు. ప్రతి మనిషిలో సైకో ఉంటాడు. అమాయకుడు ఉంటారన్నారు. సమాజ తీరును బట్టి ఆ మనిషి ప్రవర్తన ఉంటుందని చెప్పే చిత్రంగా సైవ కోమాళి ఉంటుందన్నారు. అదే విధంగా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దురాగతాలు, వాటిని ఎలా ఎదుర్కొవాలన్న అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. 108 అంబులెన్‌స ప్రాధాన్యతను సైవ కోమాళి చిత్రంలో చెప్పనున్నట్లు చెప్పారు. దీనికి కే.బాల ఛాయాగ్రహణ, గణేశ్ రాఘవేంద్ర సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఇందులోని పాటలను గానాబాలా రాసి పాడటం విశేషం అని దర్శకుడు పేర్కొన్నారు.