nankadavul Rajendran
-
త్వరలో తెరపైకి ముందల్
తమిళసినిమా: సామాజిక దృక్పథంతో కూడిన భారీ యాక్షన్ కథా చిత్రంగా ముందల్ ఉంటుందని చిత్ర దర్శకుడు జయంత్ తెలిపారు. 250 చిత్రాలకు పైగా స్టంట్‌మాస్టర్‌గా పనిచేసిన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రం ఇది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి జయంత్ మాట్లాడుతూ ఒక స్టంట్ కళాకారుడిగా తన జీవితం ప్రారంభం అయినా దర్శకుడవ్వాలన్నది తన జీవిత లక్ష్యం అన్నారు. అది ఈ ముందల్ చిత్రం ద్వారా నెరవేరిందని చెప్పారు. ఇది సామాజిక దృక్పథంతో కూడిన యాక్షన్ ఎడ్వెంచర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కాన్సర్ వ్యాధిని శాశ్వతంగా రూపుమాపే మందు ఫార్ములాను సిద్ధులు తాళపత్రాలపై రాసి వాటిని ఒక రహస్య ప్రదేశంలో భద్రపరచినట్లు కథానాయకుడికి తెలుస్తుందన్నారు. దాన్ని ఆ తాళపత్రాల గురించి కనిపెట్టి ఫార్ములాను ప్రభుత్వానికి అప్పగించి, తద్వారా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలని ప్రయత్నిస్తాడన్నారు. ఇదే ఫార్ములా గురించి తెలుసుకున్న మరో ముఠా దాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. అయితే ఆ ఫార్ములా ఎవరికి లభిస్తుంది అన్నది చిత్ర కథ అని తెలిపారు. ఇందులో ఏడు ఫైట్స్ ఉంటాయని చెప్పారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న అప్పుకృష్ణ పోరాట దృశ్యాల్లో నటించడానికి కుంగ్‌ఫూ, సిలంబ్బాట్టం వంటి విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారని చెప్పారు. అదే విధంగా పలు సన్నివేశాలను సముద్ర అడుగు భాగంలో చిత్రీకించినట్లు, అందుకు హీరో ఈత కూడా నేర్చుకుని నటించారని తెలిపారు. విలన్‌గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ అద్భుతంగా నటించారని చెప్పారు. చిత్రాన్ని ఏడు దేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని కాంబోడియాలోని అంకూర్ వాడ్ ఆలయంలో పాట సన్నివేశాలను, ఫైట్ దృశ్యాలను చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణం కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు జయంత్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం కూడా సామాజక స్పృహతో కూడిన కథాంశంతోనే ఉంటుందని ఆయన చెప్పారు. -
కామెడీ థ్రిల్లర్‌గా సైవ కోమాళి
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం సైవ కోమాళి అని ఆ చిత్ర దర్శకుడు సెరేశ్ శాంతారామ్ తెలిపారు. దర్శకుడు ధరణీ, జగన్, బాలుశివన్, శాంతకుమార్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇది. ఎస్ఎంఎస్.మూవీస్ పతాకంపై ఏసీ.సురేశ్, మహేంద్రన్, సారుుమహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సైవ కోమాళి చిత్రంలో నడువుల కొంచెం పక్కల్తై కానోమ్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్, రెహానా, నాన్‌కడవుల్ రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో పవర్‌స్టార్ జీఎం.కుమార్, టీబీ.రాజేంద్రన్, రంజిత్, సూపర్‌గుడ్ లక్ష్మణన్, క్రేన్‌మనోహర్, కృష్ణమూర్తి, టీకే.కళ, గాయత్రి, వనిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కామెడీ థ్రిల్లర్ అంశాలతో రూపొందిస్తున్న చిత్రం సైవ కోమాళి అని తెలిపారు. ప్రతి మనిషిలో సైకో ఉంటాడు. అమాయకుడు ఉంటారన్నారు. సమాజ తీరును బట్టి ఆ మనిషి ప్రవర్తన ఉంటుందని చెప్పే చిత్రంగా సైవ కోమాళి ఉంటుందన్నారు. అదే విధంగా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దురాగతాలు, వాటిని ఎలా ఎదుర్కొవాలన్న అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. 108 అంబులెన్స ప్రాధాన్యతను సైవ కోమాళి చిత్రంలో చెప్పనున్నట్లు చెప్పారు. దీనికి కే.బాల ఛాయాగ్రహణ, గణేశ్ రాఘవేంద్ర సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఇందులోని పాటలను గానాబాలా రాసి పాడటం విశేషం అని దర్శకుడు పేర్కొన్నారు. -
ఆళుక్కు పాది 50-50 ఫస్ట్‌లుక్
ఆళుక్కు పాది 50-50 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. కన్నా లడ్డూ తిన్న ఆశైయా చిత్రంలో సంతానంతో కలిసి నటించిన సేతు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఆళుక్కు పాది 50-50. ఆయనకు జంటాగా శ్రుతి రామకృష్ణ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నాన్‌కడవుల్ రాజేంద్రన్, బాలశరవణన్ ముఖ్య పాత్రలను పోషించారు. లిపీ సినీ క్రాఫ్ట్స్ పతాకంపై ఏఎస్.రంజిత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణసాయి దర్శకత్వం వహిస్తున్నారు. ధరణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సేతు మిత్రుడు, ప్రముఖ నటుడు సంతానం శుక్రవారం విడుదల చేశారు. చిత్రం టీజర్‌ను శుక్రవారం సాయంత్రం సంతానం ఆవిష్కరించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ సందర్భంగా వాలిభరాజా చిత్రం తరువాత తాను నటిస్తున్న చిత్రం ఆళుక్కు పాది 50-50 అని చిత్ర హీరో సేతు తెలిపారు. వాలిభరాజా చిత్రంలో తమకున్న స్నేహం కారణంగా సంతానం ముఖ్య పాత్రలో నటించారని, ఆ చిత్రానికి ఆయన నటించడం చాలా ప్లస్ అయిందని చెప్పారు. కాగా ఇందులోనూ సంతానం నటించాల్సిందని, అయితే ఆయన హీరోగా చాలా బిజీగా ఉనందువల్ల నటించలేకపోయినట్లు వివరించారు. ఆళుక్కు పాది 50-50 చిత్రం వైవిధ్యంతో కూడిన ప్రేమ కథా చిత్రం అని సేతు తెలిపారు.