wife killed
-
కట్టుకున్నవాడే కడతేర్చాడు..
గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేటలో ఇటీవల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అది ఆత్మహత్య కాదు...హత్య అని తేల్చారు. కట్టుకున్న భర్తే భార్యను అమానుషంగా చంపడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు శనివారం స్థానిక గజపతినగరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగారమ్మపేటకు చెందిన నక్కా జగదీష్‌కు అదే గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (తనూజ)తో మూడు నెలల కిందట వివాహం జరిగింది. మొదట్లో వీరి కాపురం సజావుగా సాగినా, జగదీష్‌కు అనుమానం ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. అక్కడకు కొద్ది రోజుల తర్వాత అనూషను కన్నవారింటిలో ఉంచి జగదీష్ ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ నెల 16న గ్రామానికి వచ్చిన జగదీష్ అనూషకు ఫోన్ చేసి ఇంటి సమీపంలో ఉన్న పశువుల శాల వద్దకు రమ్మన్నాడు. దీంతో ఆరోజు (ఆదివారం) రాత్రి అనూష తన ఇంటి సమీపంలోని పశువులశాల వద్దకు రాగా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన జగదీష్ భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి వేశాడు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బోని ప్రసాద్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అనూష సెల్ నుంచి ఆమె తండ్రి, సోదరుడు, స్నేహితురాళ్లతో పాటు తన సెల్‌కు కూడా జగదీష్ మెసేజ్‌లు పంపించాడు. దీంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బోని ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. అతను నేరం చేయలేదని తేలింది. ఈ పరిస్థితుల్లో భర్త జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు విషయం బయట పడింది. భార్యను తనే హత్య చేసినట్లు జగదీష్ ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.బోని ప్రసాద్ ఇంటిపై దాడితన కుమార్తె మృతికి కారణమనే అపోహతో అనూష తండ్రి, కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడి చేసి అతని తండ్రి గోవిందరావుపై దాడి చేశారు. దీంతో గోవిందరావు ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో స్థానిక సీఐ ఎన్వీ ప్రభాకరరావు, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
సంతానం లేదని తరచూ వేధిస్తోందని.. భార్యను చంపేశాడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తరచూ వేధిస్తోందని ఆమెను హత్య చేసిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన కుమ్మరి లక్ష్మణ్ బీనా (49) 29 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం లేరు. లక్ష్మణ్ ప్రస్తుతం ఐడీపీఎల్ సమీపంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయినప్పటి నుంచి బీనా తరచూ లక్ష్మణ్‌తో గొడవపడుతూ ఉండేది. ఇంటి ఓనర్లతో సైతం తరచూ గొడవ పడుతుండటంతో అతను పలు మార్లు ఇళ్లు మారాల్సి వచ్చింది. కొంత కాలం క్రితం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఫ్రెండ్స్ కాలనీకి మకాం మార్చారు. ఇటీవల వీరి మధ్య గొడవలు జరగడంతో బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్‌కు సైతం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న లక్ష్మణ్ మంగళవారం ఉదయం ఆమె మెడకు ఎలక్ట్రికల్ వైర్ బిగించి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు -
భార్యను హత్య చేసి హైడ్రామా
యశవంతపుర: భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి ఏమీ ఎరుగనట్లు ఆస్పత్రికి తీసుకువచ్చారు. తన భార్య అచేతనంగా పడిపోయిందని రోదించాడు. దీంతో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. ఈ ఘటన యశ్వంతపురలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. నిందితుడు శరత్‌ను విచారణ చేయగా అసలు కథ బయటపడింది. వివరాలు... శరత్‌కు మొదటి భార్య ఉండగా రెండో భార్యగా ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ప్రియను వదలించుకోవాలని తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రిందట ప్రియతో గొడవపడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు ఆస్పత్రికి తీసుకువచ్చి రోదించాడు. అతని హైడ్రామాపై అనుమానించిన పోలీసులు పరిశీలించగా హత్య చేసినట్లు తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ఆర్ఎంపీ డాక్టర్ ఉన్మాదం.. నిద్రపోతున్న భార్యను దారుణంగా చంపి.. ఆపై
సాక్షి, హైదరాబాద్: అతని వృత్తి ప్రాణాలను పోసే ఆర్ఎంపీ డాక్టర్. కానీ అందుకు భిన్నంగా భార్యను కత్తితో మెడ కోసి ప్రాణం తీసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి ఏసీపీ జీవీ రమణగౌడ్ కథనం ప్రకారం.. శంకర్పల్లి మండలం జన్వాడలోని ఓ ఇంట్లో ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు తన భార్య సుధారాణి, ఇద్దరు కుమారులతో కలిసి ఉంటూ అనుబంధ గ్రామమైన మియాఖాన్‌గూడలో క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రపోతున్న భార్యను కొబ్బరికాయలు కొట్టే కత్తితో మెడ కోసి హత్య చేశాడు. అనంతరం ఏడేళ్ల పెద్ద కుమారుడు దీక్షిత్ మొహంపైనా దిండు పెట్టి బలంగా ఒత్తాడు. అంతలోనే అతన్ని వదలి కిచెన్‌లోకి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తేరుకున్న దీక్షిత్ తన తమ్మున్ని తీసుకుని పక్క గదిలోకి వచ్చి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడిపారు. శనివారం ఉదయం పక్కింట్లోని మహిళ వాకిలి ఊడుస్తుండటంతో అలికిడి చప్పుడు విని ఆమెను పిలిచి విషయం చెప్పారు. వెంటనే స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, భార్యాభర్తలిద్దరూ గొడవ పడిన దాఖలాలు కూడా లేవని, హత్యకు, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఏసీపీ చెప్పారు. చదవండి: విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని.. -
భార్యను చంపి 5 ముక్కలుగా నరికి..
బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. బాత్రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్‌తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
అప్పటికే రెండు పెళ్లిలు.. మరో మహిళతో ఎఫైర్.. లవర్ కోసం ఆమె..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. క్షణ కాలం సుఖాల కోసం కొందరు వ్యక్తులు కుటుంబ సభ్యులను అనాథలను చేస్తున్నారు. తాజాగా ఓ ప్రియుడి కోసం ప్రియురాలు.. ఎవరూ చేయని పనిచేసింది. తన లవర్ రెండో భార్యను హత్య చేసి కటకటాల్లోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దేవాస్ జిల్లాకు చెందిన బబ్లూకి 14 సంవత్సరాల కిందటే నీలం అనే యువతిని పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, బబ్లూ.. తన మొదటి భార్యకు తెలియకుండా ఈ ఏడాది మే నెలలో రాణి అనే మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన నీలం.. అతడిని నిలదీసింది. పెళ్లి విషయం తెలిసి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ఓ రోజు బంగారం కొనేందుకు బబ్లూ.. జ్యుయలరీ షాపునకు వెళ్లాడు. ఈ క్రమంలో రీతూ గౌర్తో పరిచయం ఏర్పడింది. అయితే, రీతూ గౌర్‌కు వివాహమై ఓ పాప కూడా ఉంది. ఇక, వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధాన్ని దారి తీసింది. ఆమె ఇంటికి బబ్లూ తరచుగా వెళ్లేవాడు. కాగా, ఓరోజు తన రెండో భార్యతో ఉన్న సమస్యలను రీతూకు చెప్పాడు. తన పోరు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. లవర్ ఆవేదనను అర్థం చేసుకున్న రీత్.. తనను ఓదార్చింది. అనంతరం, ఇద్దరూ కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. రీత్.. రాణిని చంపేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది. మరో మహిళతో కలిసి జాకెట్ కుట్టించుకునే నెపంతో రాణి ఇంటికి వెళ్లి.. గొంతు నులిమి హత్య చేసింది. ప్లాన్‌లో భాగంగా బబ్లూ ఏమైందో తెలియనట్టు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. అనంతరం, పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పోలీసులు.. బబ్లూను గట్టిగా ప్రశ్నించడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో, ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: క్లబ్లో యువతులతో అనుచిత ప్రవర్తన.. తాకరాని చోట టచ్ చేసి.. -
రూ.80 వేల జీతం, అయినా సరిపోలే.. భార్యను నిత్యం అనుమానిస్తూ..
బెంగళూరు: పుట్టించి నుంచి డబ్బు తేవాలని వేధిస్తూ భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. హాసన్ తాలూకా దొడ్డమండిగనహళ్లికి చెందిన మంజునాథ్ బెంగళూరులో ఒక ఆటోమొబైల్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి రూ.80 వేల జీతం వస్తుంది. కానీ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన అతడు భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. పుట్టింటికెళ్లి డబ్బు తేవాలని భార్య తేజస్వినిని వేధించేవాడు. పెద్ద మనుషులు అనేకసార్లు రాజీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇక బెంగళూరులో జీవించలేని మంజునాథ్ సంసారాన్ని హాసన్‌కు మార్చాడు. అక్కడ తేజస్విని చిన్న ఉద్యోగానికి వెళ్లేది. ఆమెను అనుమానిస్తూ వేధించేవాడు. చివరకు సోమవారం ఆమెను బండరాయితో కొట్టి చంపాడు. పోలీసులు మంజునాథ్‌తో పాటు అతని తల్లిదండ్రులు సరోజమ్మ, బసవేగౌడలను అరెస్ట్ చేశారు. చదవండి: (షట్టర్ పగలగొట్టి.. గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచి..) -
భార్య చికెన్ ఫ్రై వండలేదని భర్త నిరాశ.. తట్టుకోలేక..
బెంగళూరు: క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి భార్య చికెన్ ఫ్రై వండలేదని ఆగ్రహంతో ఆమెను ఓ చెక్కతో బలంగా కొట్టగా తీవ్ర గాయాలపాలై ఆమె మృతి చెందింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో నివసిస్తున్న ముబారక్ పాషాకు భార్య షిరాను బాను, ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే) ఆగస్టు 18వ తేదీన చికెన్ ఫ్రై వండాలని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి ఎంతో ఆశగా చూస్తే ఇంట్లో చికెన్ ఫ్రై వండలేదు. దీంతో అతడు నిరాశకు గురయ్యాడు. ఈ సమయంలో భార్యతో గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన భర్త ఆమె తలపై ఓ చెక్కతో బలంగా బాదాడు. ఆ తర్వాత పాషా ఏమీ తెలియనట్టు ఉంటున్నాడు. అయితే కొన్ని గంటలుగా ఆమె కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కదలికలపై నిఘా వేశారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పోలీసుల విచారణ తీవ్రమవడంతో చివరకు ఆగస్టు చివరకు సోమవారం (ఆగస్ట్ 23) నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. తర్వాత జరిగిన సంఘటన అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. కొట్టిన దెబ్బతో తీవ్ర గాయాలపాలైన భార్య ఇంట్లోనే మృతి చెందింది. పిల్లలు రాత్రి నిద్రిస్తుండగా భార్య మృతదేహాన్ని ఓ సంచిలో వేసుకుని బయటకు వచ్చాడు. బైక్‌పై చిక్కబనవర సరస్సుకు చేరుకుని మృతదేహాన్ని నీటిలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సరస్సులో మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ -
తాగుడు మానేయాలని చెప్పిన భార్యను చపాతీ చేస్తుండగా..
అనంతపురం క్రైం: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భర్తనే కాలయముడయ్యాడు. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... నగర శివారులోని పిల్లిగుండ్ల కాలనీలోని ఉషాకృష్ణ సాయి కాంప్లెక్స్‌లో ఎర్రిస్వామి, వరలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి మహేష్ (12), నీలిమ (10), శశిధర్ (7) ముగ్గురు సంతానం. గృహ నిర్మాణ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎర్రిస్వామి మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానాలంటూ భార్య ప్రాధేయపడుతూ వచ్చేది. సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న ఎర్రిస్వామి భార్యతో ఘర్షణ పడ్డాడు. పిల్లలు ఆకలితో బాధపడుతుంటే వారికి చపాతీలు చేసేందుకు వరలక్ష్మి (30) సిద్ధమైంది. ఆ సమయంలో సుత్తితో వరలక్ష్మి ముఖంపై ఎర్రిస్వామి దాడి చేశాడు. సుత్తి దెబ్బకు ఆమె ముఖం ఛిద్రమై కుప్పకూలింది. ఆమె మరణించినట్లు ధ్రువీకరించుకున్న అనంతరం ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న కుమారుడు శశిధర్.. ఏమో జరిగిదంటూ ఇంటిలోకి వెళ్లి చూశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి బోరున విలపిస్తూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల వారు గమనించి, సమాచారం అందించడంతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్య్లూస్ టీంను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
‘నా ప్రమేయం లేకుండా పనికి వెళతావా?’ అంటూ
సాక్షి, మోతుగూడెం: దంపతుల విభేదాల ఫలితంగా అందరూ చూస్తుండగానే నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిన సంఘటన డొంకరాయిలో చోటు చేసుకుంది. గాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భార్య వెంకటలక్ష్మి(38)ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఏపీ జెన్కో ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం భార్యాభర్తల మధ్య పది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కుమారుడితో కలసి వెంకటలక్ష్మి గ్రామంలోనే మరోచోట ఉంటోంది. డొంకరాయి మార్కెట్ సెంటర్లోని ఒక ఇంట్లో కూలి పనికి వెళ్లిన భార్య వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు ‘నా ప్రమేయం లేకుండా పనికి వెళతావా?’ అంటూ ఆమె గుండెల్లో కత్తితో పొడిచి పరారయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు. చదవండి: భర్త మందలింపు; టైలరింగ్ షాప్‌కు వెళ్తున్నానని చెప్పి.. -
భార్యను గొడ్డలితో నరికి.. ఊరేసుకున్న భర్త
చిట్టినగర్ (విజయవాడపశ్చిమ): అనుమానంతో భార్యను గొడ్డలితో నరికిన భర్త.. ఆపై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని జక్కంపూడి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జక్కంపూడి కాలనీకి చెందిన అవనిగడ్డ నరసింహారావు, కృష్ణకుమారి భార్యభర్తలు. వీరికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. వెల్డింగ్ పనులు చేసే నరసింహారావుకు తొలి నుంచి భార్యపై అనుమానం ఉండేది. పుట్టిన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఆ అనుమానం వీడలేదు. మూడు రోజుల కిందట కృష్ణకుమారి ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో ఉంటున్న అక్క దగ్గరకు వెళ్లింది. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన కృష్ణకుమారి భోజనం చేసి నిద్రపోయింది. బయటినుంచి ఇంటికి వచ్చిన నరసింహారావు ఇంట్లో ఉన్న భార్యను చూసి కోపంతో రగిలిపోయాడు. ఆవేశంతో గొడ్డలితో తలపై వేటు వేయడంతో నుదిటిపై తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో కృష్ణకుమారి మంచంపైనే ప్రాణాలు విడిచింది. కృష్ణకుమారిని హత్య చేసిన తర్వాత గొడ్డలిని బాత్రూమ్లో శుభ్రం చేసేందుకు ప్రయత్నించాడు. తెల్లవారితే విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఇంటిలోనే ఫ్యాన్ హుక్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం కాలనీలోని అదే బ్లాక్‌లో ఉంటున్న కుమారుడు వచ్చి చూసే సరికి తలుపులు మూసి ఉండటం, లోపల నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల తండ్రి ఉరి వేసుకుని ఉండటం, మంచంపై తల్లి గాయాలతో చనిపోయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను హత్య చేసిన భార్య
-
భార్యను గొంతు కోసి చంపిన కిరాతకుడు
ప్రకాశం ,బద్వీడు (పెద్దారవీడు): వ్యసనాలకు బానిసైన భర్త.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన మండలంలోని బద్వీడులో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగమణి (25)ని ఆమె మేనత్త కుమారుడు ప్రగళ్లపాడుకు చెందిన వెంగళయ్య వివాహం చేసుకున్నాడు. వెంగళయ్య కొంతకాలం నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను హింసిస్తున్నాడు. దంపతలు మధ్య తరుచూ ఏర్పడే వివాదాలను గ్రామస్తులు, పెద్దలు పరిష్కరించేవారు. బతకుదెరువు కోసం భార్యతో కలిసి వెంగళయ్య మార్కాపురం, త్రిపురాంతకం, గుంటూరు జిల్లా గొల్లెపల్లెలో కాపురం పెట్టాడు. అక్కడ కూడా ఇంట్లోని వస్తువులు తాకట్టు పెట్టి మద్యం తాగేవాడు. భార్యపై వేధింపులు కూడా అలాగే కొనసాగించాడు. గొల్లపల్లెలో తరుచూ దంపతులు గొడవ పడుతుండటంతో స్థానికులు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాగమణి తన తమ్ముడికి ఫోన్ చేసి తక్షణమే తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరింది. ఆమె తమ్ముడు వచ్చి అప్పటికే తన బావ వెంగళయ్య తాకట్టులో ఉంచిన వస్తువులకు రూ.10 వేలు కట్టి విడిపించాడు. ఆటోలో సామగ్రితో పాటు అక్క, బావతో కలిసి స్వగ్రామం బయల్దేరారు. మార్గమధ్యంలో భార్య, బావమరిది గాలెయ్యను కర్రలతో కొట్టుతుండటంతో స్థానికులు వెంగళయ్యను మందలించి వారిని లారీలో సాగనంపారు. అంత వరకూ ఓకే.. దంపతులు బద్వీడులో అత్తగారింట్లో కాపురం ఉన్నారు. కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయినా తరుచూ భార్యతో గొడవపడుతూ కొట్టుతున్నాడు. గొడవ ఎక్కువ చేస్తుండటంతో గురువారం అదే గ్రామంలో అద్దె ఇంట్లో సామగ్రి చేర్చారు. ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు యజమానికి ఇష్టం లేకున్నా గ్రామస్తులు నచ్చజేప్పి ఇప్పించారు. రాత్రి పిల్లలు నాగమణి తల్లి ఇంట్లో నిద్రించారు. దంపతులు మాత్రం అద్దె ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి కత్తితో నాగమణి గొంతుకోసి చంపి తలుపులు మూసి వెంగళయ్య ఎటో వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అమ్మమ్మ ఇంటి నుంచి పిల్లలు తల్లిదండ్రుల కోసం వచ్చారు. ఎంతకూ తల్లి పలకకపోవడంతో పెద్దగా కేకలేశారు. ఇరుగుపొరుగు వచ్చి చూడగా నాగమణి నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉంది. మృతురాలి తల్లి రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వీఆర్వో ఏడుకొండలు ఫిర్యాదు మేరకు మార్కాపురం సీఐ భీమానాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇన్చార్జి తహసీల్దార్ రమణారావు సమక్షంలో వైద్యులు పంచనామా నిర్వహించారు. -
వేధింపులకు విసిగి వేసారి..
కొండమల్లేపల్లి(దేవరకొండ) : మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండడంతో తన భర్త మొఖంపై బెడ్‌షీట్‌ను అదిమిపట్టి హత్యచేసింది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలంలోని చెన్నారం గ్రాపంచాయతీ ఏపూర్తండాలో గురువారం అర్ధరాత్రి చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఏపూర్‌తండాకు చెందిన రమావత్ సోమూనా యక్(33)కు, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన భారతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు మహేశ్ ఉన్నాడు. తండాలోనే వ్యవసాయంతో పాటు మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన సోమూనాయక్ భార్యను వేధిస్తుండేవాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సోమూనాయక్, భార్య భారతి, కుమారుడు మహేశ్‌లతో ఘర్షణకు దిగాడు. అదే రోజు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సోమూనాయక్ ముఖంపై భారతి బెడ్‌షీట్‌ను అదిమిపట్టింది. దీంతో ఊపిరి ఆడక సోమూనాయక్ మృతి చెందాడు. సోమూనాయక్ మృతి విషయాన్ని తెలుసుకున్న బంధువులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ శంకర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భారతిని అదపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సుధాకర్‌రెడ్డిపై నాకేం పగలేదు
-
ప్రేమించి పెళ్లాడాడు.. అనుమానంతో హతమార్చాడు
నెల్లూరు(క్రైమ్): ప్రేమించుకొన్నారు... పెళ్లిచేసుకున్నారు... చక్కగా సాగిపోతున్న వారి సంసారంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య గొంతలో కత్తెరతో పొడిచి హతమార్చాడు భర్త. ఈ ఘటన నగరంలోని రామ్మూర్తినగర్ ఒకటోవీధిలో సోమవా రం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల స మాచారం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం మూడోమైలుకు చెందిన ఏకొ ల్లు రమణయ్య, కామేశ్వరమ్మ దంపతులు. వారికి ఇద్దరు కమార్తెలు. పెద్ద కుమా ర్తె లలిత(36) నవాబుపేట బీవీఎస్ స్కూల్లో 2000లో పదోతరగతి చదువుతున్న సయమంలో పారిపోయి తిరుపతికి వెళ్లింది. తిరుపతి రైల్వేస్టేషన్లో కర్నాటకలోని హుబ్లి రాజ్‌పూత్ బంకాపూరుకు చెందిన డోరమని సుభాష్(రైల్లో ఏసీకోచ్‌లో బెడ్షీట్లు మార్చే పని)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి.. ఇద్దరూ వివాహం చేసుకొన్నా రు. తిరుపతిలోనే లలిత పాచిపనులు, సుభాష్ పెయింట్ పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. వారికి శ్రీను, లక్కి కొడుకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుందన్న అనుమానంతో సుభాష్ భార్య లలితను తీవ్రంగా కొట్టేవాడు. విషయం తెలుసుకున్న లలిత తల్లిదండ్రులు అల్లుడిని కుమార్తెను మూడోమైలుకు íతీసుకొచ్చారు. ఈ క్రమంలో రమణయ్య, కామేశ్వరమ్మ రామ్మూర్తినగర్లోని గచ్చుకాలువకు మకాం మార్చారు. దీంతో లలిత, సుభాష్‌లు కూడా పిల్లలిద్దరిని గచ్చుకాలువలోని మున్సిపల్ హైస్కూల్లో చేర్పించి, రామ్మూర్తి నగర్‌లోని రామాదేవి అనే మహిళ ఇంటిలోని రేకులషెడ్‌లో అద్దెకు ఉంటున్నారు. లలిత రమాదేవి ఇంట్లో పాచిపనులు చేస్తుండగా, సుభాష్ పెయింట్‌పనులు చేసుకుంటన్నాడు. ఈ నెల 30న సోమవారం రాత్రి లలిత, సుభాష్‌లు మళ్లీ తీవ్రంగా గొడవపడ్డారు. పద్దతి మార్చుకోమని చెబితే వినవా అంటూ సుభాష్ ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి చెట్టువద్ద తీవ్రంగా కొట్టసాగాడు. ఈ విషయాన్ని గమనించిన వారి చిన్న కొడుకు లక్కీ అమమ్మకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వారు ఇంటికి వచ్చే సమయానికి సుభాష్ కత్తెరతో లలిత గొంతు, ఎదపై బలంగా పొడవసాగాడు. కామేశ్వరమ్మ రావడాన్ని గమనించి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయపడిన కుమార్తెను కామేశ్వరమ్మ స్థానికుల సహాయంతో ఆటోలో నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లింది. అప్పటికే లలిత పరిస్థితి విషమంగా ఉండటంతో వారు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆమెను పరీక్షించి, అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.సంగమేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి కామేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మంగళవారం తెల్లవారుజామున సుభాష్‌పై హత్యకేసు నమోదు చేశారు. అయితే హత్య జరిగిన కొద్దిసేపటికే సుభాష్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
కన్నకూతురు కళ్లెదుటే భార్యను హత్యచేసిన భర్త
చింతపల్లి(పాడేరు): వివాహేతర సంబంధం అనుమానంతో కట్టుకున్న భార్యను కుమార్తె కళ్లేదుటే ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్యచేశాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తమ్మంగుల పంచాయతీ కె.దుర్గం గ్రామానికి చెందిన సాగిన బాబూరావు, కరుణమ్మ (30)భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య మీద అనుమానంతో బాబూరావు తరచూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం పసుపు ఉడకబెట్టేం దుకు కట్టెల కోసం సమీప అటవీ ప్రాంతా నికి వెళదామని భార్యను నమ్మించాడు. మూడవ కుమార్తె శ్రీలక్ష్మి కూడా తల్లిదండ్రులతో అడవికి వెళ్లింది. ఊరికి కిలోమీటరు దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. వివాహేతర సంబంధం అనుమానాన్ని భార్యవద్ద వ్యక్తం చేసి, ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బాబూరావు కట్టెలు నరికేందుకు వెంటతెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. తీవ్ర భయాందోళనకు గురైన కుమార్తె శ్రీలక్ష్మి గ్రామంలోకి పారిపోయింది. బాబూరావు రాత్రంతా అడవిలో ఉండిపోయి బుధవారం పోలీసుల ఎదుటలొంగి పోయాడు. సంఘటనపై ఇన్చార్జి సీఐ గోవిందరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ వెంకటరావు తెలిపారు. -
చిట్టిబాబు మృతిపై విచారణ: సీపీ
- ప్రజాసంఘాల ఆందోళన దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యాయత్నం, ఆయన భార్య మృతిపై ప్రజాసంఘాలు, దళిత సంఘాల వారు స్థానికంగా ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఆయన ఈ చర్యకు ఒడిగట్టారని వారు ఆరోపించారు. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, సంఘటన స్థలికి ఏసీపీ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ఆందోళన కారకులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
భార్యను కాల్చి,తాను కాల్చుకున్న ఎస్ఐ
-
భార్యను కాల్చి, తాను కాల్చుకున్న దుబ్బాక ఎస్ఐ
దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి, అనంతరం తాను కూడా కాల్చుకున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని క్వార్టర్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో భార్య రేఖ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా అవినీతి ఆరోపణలతో మూడు రోజులు క్రితం ఎస్ఐ సస్పెండ్ అయినట్లు సమాచారం. అయితే ఇంతవరకూ సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని తెలుస్తోంది. చిట్టిబాబు స్వస్థలం కడప. కాగా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిట్టిబాబుకు కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల చిట్టిబాబు అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. చిట్టిబాబు మృదుస్వభావి అని, ఏదైనా కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం ఉన్నవారిని తోటి సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న డీఐజీ ఘటనా స్థలానికి చేరుకుని, సంఘటన పై ఆరా తీశారు. -
నీ వెంటే నేనూ..
► భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య మృత్యువాత ►మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి ►ఆప్యాయతకు దూరమైన ఇద్దరు చిన్నారులు ►నల్లగొండలో విషాదఛాయలు నలగొండక్రైం: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ బాలింతరాలు మృతిచెందింది. వివరాలు.. నకిరేకల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేశ్ కుటుంబం పట్టణంలోని సావర్కర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఇతడి భార్య హేమలత నిండు గర్భిణి కావడంతో ప్రసవానికి ఇటీవల పుట్టింటికి విజయవాడకు వెళ్లింది. అయితే గత నెల 26వ తేదీన పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేశ్ (30) దుర్మరణం చెందాడు. ఆ విషయాన్ని అతడి భార్య హేమలత (25)కు చెప్పలేదు. మంగళవారం మధ్యాహ్నం హేమలత మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులందరూ విషాదంలో ఉండడంతో ఏం జరిగిందని హేమలత వారిని ప్రశ్నించింది. సురేశ్ మృతి చెందిన విషయం తెలుసుకుని గుండెలు బాదుకుని ప్రాణాలు విడిచింది. మూడు రోజుల క్రితమే తండ్రి, నేడు తల్లికూడా మృత్యుఒడికి చేరడంతో అప్పుడే పుట్టిన పసికందును చూసి బంధువులు బోరున విలపించారు. -
భార్యను చంపి, శవాన్ని తీసుకెళ్లి అత్తపై కాల్పులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోరం జరిగింది. 35 ఏళ్ల వ్యక్తి తన భార్యను చంపి, అత్తను కాల్చి తీవ్రంగా గాయపరిచాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్‌లోని మసూరిలో సత్యేంద్ర టియెటియా తన భార్య రాజకుమారి, ముగ్గురు పిల్లలతో కలసి ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం సత్యేంద్ర కారులో భార్యను ఊరిబయటకు తీసుకెళ్లి కాల్చిచంపాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని ఇంటి దగ్గరకు తీసుకువచ్చాడు. రక్తపు దుస్తులతో ఉన్న రాజకుమారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించాడు. అతను కారులో ఆమె శవాన్ని తీసుకుని హపుర్ చుంగిలో ఉంటున్న అత్తింటికి వెళ్లాడు. అక్కడ అత్త ఇంద్రాణిపై రెండుమార్లు కాల్పులు జరిపాడు. అక్కడ నుంచి వెనుదిరిగిన సత్యేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని అతని భార్య శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఇంద్రాణిని ఆస్పత్రికి తరించారు. తనకు, తన భార్యకు మధ్య సంబంధాలు సరిగా లేవని, తనను అయిష్టంగా చూస్తోందని సత్యేంద్ర పోలీసుల విచారణలో చెప్పాడు. పీజీ చదవిన తాను ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నానని చెప్పాడు. 2003లో వివాహం జరిగిందని, ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నాడని తెలిపాడు. -
సంచలనం సృష్టించిన వీడియో
చింతపల్లి : మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ రోటిగడ్డతండాలో ఆదివారం భార్యను హత్య చేసిన భర్త కేసులో పోలీసులకు కీలక ఆధారం చిక్కింది. వివరాలు..రోటిగడ్డతండాకు చెందిన నేనావత్ రాజు బోరుబండిపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య మోతీ(25) వ్యవసాయకూలీగా పనిచేస్తుంది. రాజు పది ఇరవైరోజులకొకసారి ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భర్య పై రాజు అనుమాను పెంచుకున్నాడు. శనివారం రాత్రి డ్యూటీ దిగి వచ్చిన మద్యం మత్తులో భార్యను అక్రమ సంబంధం అంటగట్టి విచారించసాగాడు. ఈ నేపథ్యంలో కుమారులు ముఖేశ్, రాకేష్ ఇద్దరితో రాత్రి 12గంటల సమయంలో తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ సుత్తితో కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పోలీసులకు దొరికిన వీడియోలో ఉంది. ఈ వీడియో పోలీసులకు హత్యకు సంబంధించి పూర్తి ఆధారంగా మా రింది. రెండు రోజుల నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం గ్రామానికి రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘట నాస్థలానికి చేరుకుని రాజును విచారించగా తన భార్య తప్పు చే సిందనే అనుమానంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. -
కట్టుకున్నవాడే కాలయముడై..
రోకలిబండతో మోది భార్యను హతమార్చిన భర్త మద్యం మత్తులో ఘాతుకం కొండమల్లేపల్లి(దేవరకొండ) : కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో భార్యను రోకలిబండతో మోది హతమార్చాడు. హృదయవిదారక ఈ సంఘటన కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతచెట్టుతండాకు చెందిన సరిత(27)కు కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుడ్డోనితండాకు చెందిన ఇస్లావత్ రమేశ్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. ఇరువురు కూలి పనిచేస్తూ జీవనం సాగించేవారు. రమేశ్ మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగుతుండేవి. సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రమేశ్ భార్య సరిత(27)తో గొడవపడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరడంతో రమేశ్ మద్యం మత్తులో ఇంట్లో ఉన్న రోకలిబండతో సరిత తలపై బలంగా బాదాడు. తలకు బలమైన గాయం కావడంతో సరిత ఒక్కసారిగా అరిచింది. తండావాసులంతా అక్కడి చేరి రక్తపుమడుగులో చావుబతుకుల్లో ఉన్న సరితను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ శంకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనాథలైన చిన్నారులు.. రమేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తుతం తల్లి మృతిచెందడం, రమేశ్ జైలుపాలు కానుండడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఆడపిల్లలిద్దరూ పదేళ్లలోపు వారే కావడంతో వారి పరిస్థితి ఏంటని పలువురు కంటతడి పెట్టారు. -
దంపతుల మధ్య కోతి చిచ్చు..
దుగ్గొండి : కోతి తన చేష్టలతో ఇల్లంతా చిందర వందర చేసింది. అది కాస్తా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. భర్త దూషించడంతో కలత చెందిన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. నాలుగు రోజుల పాటు ఎంజీఎంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కందకట్ల మనోహర(40), శ్రీనివాస్ దంపతులు గ్రామంలో సైకిల్స్టాండ్తో పాటు కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు కోతి ఇంట్లోకి దూరి చాక్లెట్ డబ్బాలు ఎత్తుకెళ్లింది. దీంతో కోతి వచ్చే వరకు ఎందుకు చూడలేదని భార్య మనోహరను శ్రీనివాస్ మందలించి తీవ్రంగా తిట్టాడు. దీంతో గొడవ పెద్దదిగా మారింది. భర్త దూషించడంతో అవమాన భారాన్ని తట్టుకోలేక మనోహర ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. చికిత్స నిమిత్తం ఎంజీఎం అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. ఇదిలా ఉండగా మనోహరతో శ్రీనివాస్ నిత్యం గొడవ పెట్టుకునే వాడని మనోహర పుట్టింటి వారు అంటున్నారు. అవమానకర మాటలను తట్టుకోలేకే తమ బిడ్డ చనిపోయిందని బాధితురాలి తల్లి వరలక్ష్మీ ఆరోపించారు. వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
భార్యను చంపిన భర్త
లావేరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గడ్డపారతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో భర్త. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిసెట్టిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కలిసెట్టి సత్యం, సత్తమ్మ(45) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో కోపోద్రిక్తుడైన సత్యం పక్కనే ఉన్న గడ్డపారతో ఆమె తలపైన బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
పట్టపగలు భార్య మెడ నరికి..
చింతలపుడి : అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతుందని అనుమానించిన భర్త పట్టపగలు అందరుచూస్తుండగా.. గొడ్డలితో ఆమె మెడ నరికి కిరాతకంగా చంపాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఊటసముద్రంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్‌రావు, జగదీశ్వరి(30) దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భార్య వేరే వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన లక్ష్మణ్ పామాయిల్ మట్టలు నరికే గొడ్డలితో భార్య మెడపై వేటు వేసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోతానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెవి కమ్మలు ఇవ్వలేదని భార్యను హత్య..
మల్కాజిగిరి: చెవికమ్మలు అమ్ముకొని మద్యం తాగుతానంటే భార్య నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడో తాగుబోతు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి, మృతురాలి తమ్ముడు నరేష్ కథనం ప్రకారం...రంగారెడ్డిజిల్లా పూడూరుకు చెందిన ఆకుల ప్రభాకర్‌తో షాబాద్ మండలానికి చెందిన యశోద(32)కు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరు మల్కాజిగిరి వీణాపాణినగర్‌లో ఉంటున్నారు. యశోద తమ్ముడు నరేష్ అక్కకు తోడుగా ఉంటూ స్థానిక వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. క్యాటరింగ్ పనిచేసే ప్రభాకర్ తరచూ బయటకు వెళ్లి నెలల తరబడి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. తాగుడుకు కూడా బానిసై తరచూ భార్యను వేధించేవాడు. చిత్తూర్ వెళ్లిన ప్రభాకర్ ఈనెల 2వ తేదీ రాత్రి ఇంటికి వచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. డబ్బులు లేవని చెప్పడంతో చెవి కమ్మలు ఇస్తే అమ్ముకొని మందు తాగుతానని అన్నాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్టు బావమరిది పని చేసే దుకాణానికి వెళ్లి మీ అక్క చనిపోయిందని చెప్పాడు. దీంతో నరేష్ బంధువులకు సమాచారం ఇవ్వగా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ అక్కను బావ వేధించేవాడని, తన అక్క చావుకు అతనే కారణమని నరేష్ పేర్కొన్నాడు. గొంతు మీద కొన్ని గుర్తులు ఉన్నాయని, పోస్ట్‌మార్టం నివేదిక అందింతే పూర్తి వివరాలు తెలుస్తాయని, నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు..
ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు.. అతడి మాయమాటలకు ఆమె పొంగిపోయింది.. ఏదేమైనా అతడితోనే జీవితమునుకుంది.. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు.. కొంతకాలానికే అతడి నిజస్వరూపం బయటపడింది..కట్నం కావాలంటూ వేధించాడు. బాధలకు పంటికింద అదిమిపెట్టుకుని ఓర్చుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.. చేసేదేమీ లేక.. పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బతికీడుస్తోంది.. అయినా ఆమెపై కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టాడు. మిర్యాలగూడ అర్బన్ : కట్టుకున్న భార్యను భర్త సుత్తెతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నందిపాడుకు చెందిన కొంక నర్మద(27) పట్టణంలోని కలాల్‌వాడకు చెందిన కొంక రాము ప్రేమించుకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా నర్మద పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ పుట్టింట్లోనే తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగా పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నందిపాడు బైపాస్ వద్ద మాటు వేసిన ఆమె భర్త రాము సుత్తెతో నర్మద తలపై బలం గా మోదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు మణిదీప్, 3సంవత్సరాల కూతురు గాయత్రి ఉన్నారు. కాగా నర్మద భర్త రాము పట్టణంలోని కేఆర్ ఎస్టేట్‌లో చైనాబజారును నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భార్యను హత్య చేసిన తరువాత పిల్లలను తీసుకుని పారిపోయినట్టు సమాచారం. గతంలోనూ హత్యకు కుట్ర.. నాలుగేళ్లగారాము, నర్మద తరుచూ గొడవ పడుతుం డగా పెద్దల సమక్షంలో ఒకటి చేశారు. కొద్ది రోజుల పాటు నందిపాడులోనే కాపురం పెట్టిన వారు నర్మదను హత్య చేయడానికి రెండు సార్లు ప్రయత్నిం చినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. ఎలాగోలా తప్పించుకున్న నర్మద భర్తకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. అయినా దారుణం జరగడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. అదనపు కట్నం కావాలని.. నర్మదను పెళ్లి చేసుకున్న అనంతరం తరుచూ కట్నం కావాలని వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలి పారు. దీంతో దొరికిన కాడికల్లా అప్పు తెచ్చి రూ.లక్ష వరకు ఇచ్చామని విలపిస్తూ చెప్పారు. పోలీసుల పరిశీలన హత్యకు గురైన నర్మద మృతదేహాన్ని డీఎస్పీ సందీప్‌గోనే, వన్ టౌన సీఐ దూసరి భిక్షపతి పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నమ్మినందుకు ‘గొంతు’ కోశాడు
► ఆడపిల్లలు పుట్టారని నిత్యం వేధింపులు ► పెద్దల సమక్షంలో కుదిరిన రాజీ ► బాగా చూసుకుంటానని హామీ ► నమ్మి వెంట వచ్చిన భార్య హత్య ► గొంతు కోసి చంపిన భర్త నవమాసాలు మోసి జన్మనిచ్చింది ఆడది. నాతిచరామి ప్రమాణాన్ని నమ్మి వెంటవచ్చిందీ ఆడదే. ఒకరు జన్మనిచ్చారు. మరొకరు ఆజన్మాంతం ఆనందాన్నిస్తారు. ఆ ప్రబద్ధుడు అదే విస్మరించాడు. ఆడపిల్లలు కన్నందుకు కట్టుకున్నదానిపై అక్షరాలా ‘కత్తి’గట్టాడు. అర్ధరాత్రి కాలయముడయ్యాడు. కిరాతకంగా మెడకోసి నరికేశాడు. విజయనగరానికి సమీపంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం రాత్రి జరిగిందీ ఘోరం. పోలీసులు, గ్రామస్తులు అందించిన వివరాలివి. విజయనగరం క్రైం: వేపాడ మండలం చినగుడిపాల గ్రామానికి చెందిన గజ్జి కృష్ణకు లక్కవరపుకోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన లక్ష్మి (25)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణ పొక్లెయిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లపాటు బెంగళూర్‌లో పనిచేసేవాడు. పెళ్లైన మొదట్లో లక్ష్మిని కృష్ణ బాగానే చూసుకునేవాడు. మొదటి కాన్పులో ఆడపిల్లల వెంకటలక్ష్మి (4), రెండో కాన్పులో యశస్వని (3) జన్మించారు. రెండో కుమార్తె పుట్టాక లక్ష్మికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంకెవరినైనా పెళ్లాడితే మగపిల్లలు పుట్టేవారని తరచూ గొడవ పడుతుండటంతో లక్ష్మి కన్నవారింటికి వచ్చేసింది. సుమారు ఏడాది తొమ్మిదినెలలపాటు దంపతులు దూరంగా ఉన్నారు. భర్త ఎప్పటికీరాకపోవడంతో లక్ష్మి రెండు నెలల క్రితం లక్కవరపు కోట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలను పోలీసులు పిలిచారు. దీంతో భార్య లక్ష్మిని బాగానే చూసుకుంటానని పెద్దల సమక్షంలో కృష్ణ అంగీకరించడంతో రాజీ కుదిర్చారు. ముందుస్తు వ్యూహం ప్రకారమే.. ఈ క్రమంలో ఈనెల 1న విజయనగరం పట్టణానికి ఆనుకున్న బియ్యాలపేట పంచాయతీ ప్రసాద్‌నగర్‌లో ఎలుబండి రాజబాబు ఇంట్లో అద్దెకు దిగారు. ఇక్కడినుంచి విధులకు విశాఖపట్నం వెళ్లి వస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చాక భార్యభర్తలు రాత్రి భోజనాలు చేశారు. తొమ్మిది గంటల వరకు ఇంటి బయట కూర్చొని పడుకోవడానికి లోపలికి వెళ్లారు. అర్థరాత్రి వేళ లక్ష్మి నడుంపై కూర్చొని తలను పెకైత్తి కత్తితో పీక కోసేశాడు. బాత్రూమ్లోకి వెళ్లి కత్తిను కడిగి ఇంటిముందు ఉన్న తుప్పల్లో పారేసి పరారయ్యాడు. కృష్ణ తమ్ముడు సన్నిబాబు సమీపంలోని పాలకేంద్రంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో లోపలినుంచి ఇద్దరు పిల్లలు రోడ్డుపైకి వచ్చారు. వారిని చూసిన పొరుగింట్లోని ఎలుబండి నాగమణి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో లక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పక్కనే నివాసం ఉంటున్న కృష్ణ తమ్ముడు సన్నిబాబుకు, తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మి మృతదేహాన్ని విజయనగరం డీఎస్పీ ఎ.వి.రమణ, విజయనగరం రూరల్ సీఐ ఎ.రవికుమార్, రూరల్ ఎస్ఐ టి.శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎస్ఐ హెచ్.ఉపేంద్రరావు, గంట్యాడ ఎస్ఐ టీవీ తిరుపతిరావు పరిశీలించారు. ఏఎస్ఐ టి.విజయ ఆధ్వర్యంలో క్లూస్ టీం సంఘటన స్థలంలో నిందితుని వేలిముద్రలను సేకరించింది. ఇంతకుముందే హత్యాయత్నం కృష్ణ ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. ఈనెల 1న ఇంట్లో అద్దెకు దిగినప్పటికీ ఎలాంటి సామగ్రి తీసుకురాని కృష్ణ అతి పదునైన కత్తిని తీసుకుని వచ్చాడంటే ముందస్తుగానే హత్య చేయడానికి పథకం రచించినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కృష్ణ విశాఖపట్నం జిల్లా రైవాడ జలాశయంలో లక్ష్మిని తోసి చంపేందుకు ప్రయత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన లక్ష్మి బాగా చూసుకుంటానన్న భర్తను నమ్మి వెళ్లి అంతమైపోయింది. ఒక్కగానొక్క కుమార్తె గొంతు కోశాడని మృతురాలి తల్లి గొలగాన కృష్ణమ్మ, తండ్రి సన్యాసిరావు బోరున విలపిస్తున్నారు. తల్లి హత్యకు గురవడంతో పిల్లలు అనాథలయ్యారు. వారిని స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
సినిమా క్రైం స్టోరీని మించిపోయాడు!
సినిమాల్లో బ్యాడ్ పోలీసులు ఎలా చేస్తారో అచ్చం అలాగే చేశాడా భర్త. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. కట్టుకున్న భార్యను కాల్చి చంపేసి, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు తన రెండు కాళ్ల మీద కూడా పిస్టల్‌తో కాల్చుకున్నాడు. దీంతో పోలీసులు కూడా మొదట్లో అంతా నిజమేననుకున్నారు. కానీ అనుకోకుండా అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. మీరట్- పరీక్షిత్‌గఢ్ రహదారిపై జరిగిన ఈ దారుణం నిజంగా ఎవరో చేసిందేననే అంతా అనుకున్నారు. తాను భార్యతో కలిసి వెళ్తుండగా ఎవరో దుండగులు వచ్చి కాల్పులు జరిపారని, దాంతో ఆమె మరణించిందని, తాను ప్రతిఘటించకుండా ఉండేందుకు తన కాళ్ల మీద కూడా కాల్చేశారని బిజేంద్ర సింగ్ (24) చెప్పాడు. కానీ చివరకు అతగాడి బాగోతం మొత్తం బయటపడింది. పరీక్షిత్‌గఢ్ రోడ్డులో మీరట్ నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో బహదూర్‌పూర్ గ్రామం వద్ద ఈ డ్రామా మొత్తం జరిగింది. బిజేంద్ర సింగ్ (24), అతడి భార్య రజనీసింగ్ (30)లపై కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె అక్కడికక్కడే మరణించగా, బిజేంద్రను ఆనంద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్చారు. అయితే.. దాని గురించిన వివరాలు అడిగినప్పుడు బిజేంద్ర భిన్న కథనాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. గ్రామస్తులను విచారిస్తే ఇద్దరి మధ్య ఆరేళ్ల వయసు తేడా ఉందని, భార్యే పెద్దదని తెలిసింది. బిజేంద్రకు చాలామందితో సంబంధాలు ఉన్నా, రజని మాత్రం అతడిని పిచ్చిగా ప్రేమించేది. ఆరోజు బూడిద రంగు శాంత్రో కారు అక్కడ కనిపించిందని, దానికి ఢిల్లీ నంబర్ ప్లేటు ఉందని గ్రామస్తులు చెప్పారు. పోలీసులకు నాలుగు బూడిరంగు కార్లు కనిపించగా, వాటిలో ఒకదానికి ఢిల్లీ నంబర్ ఉంది. వెంటనే కారులో ఉన్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు. వాళ్ల దగ్గర రెండు నాటు తుపాకులు, వాడిన లైవ్ కార్ట్రిడ్జులు దొరికాయి. వాళ్లను తమదైన శైలిలో ప్రశ్నిస్తే.. నాటకం అంతా బయటపడింది. వేరే మహిళ మోజులో పడిన బిజేంద్ర.. తన భార్యను అడ్డు తొలగించుకోవాలనే ఇలా చేసినట్లు చెప్పారు. ఇంత నాటకం ఉందని తెలిసిన పోలీసులు ముక్కున వేలేసుకుని.. బిజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. -
‘ఔటర్’పై నెత్తుటిధార..
- రెయిలింగ్‌ను ఢీకొన్న ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని కారు - ఆయన భార్య, కారు డ్రైవర్ మృతి - సీట్‌బెల్ట్ ధరించడంతో గాయాలతో బయటపడ్డ వెంకటేశ్వరరావు.. అపోలోలోచికిత్స - ఈ ఘటనకు 3 గంటల ముందు మరో ప్రమాదం.. ఓ మహిళ మృతి - రెండు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే కారణమన్న పోలీసులు హైదరాబాద్: నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు నిత్యం నెత్తురోడుతోంది. మూడు గంటల వ్యవధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆప్కాబ్ చైర్మన్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్(క్రాష్ బ్యారియర్)ను ఢీ కొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి(52), డ్రైవర్ స్వామిదాసు(40) అక్కడికక్కడే కన్నుమూశారు. సీట్‌బెల్ట్ ధరించడం వల్ల గాయాలతో బయటపడిన వెంకటేశ్వరరావు ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు మూడు గంటల ముందు కూడా ఔటర్‌పై జరిగిన మరో ప్రమాదంలో సౌతాఫ్రికాలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వాసు భార్య మాధురి చనిపోయారు. ఈ రెండు ప్రమాదాలకూ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు చెప్తున్నారు. ఊడిన చక్రం.. పల్టీలు కొట్టిన కారు.. పిన్నమనేని సోమవారం తన భార్యతో కలసి అధికారిక వాహనమైన మిత్సుబిషి పజేరో స్పోర్ట్(ఏపీ16డీసీ0555)లో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. వాహనాన్ని ఆయన డ్రైవర్ స్వామిదాస్ నడుపుతుండగా ముందు సీట్లో పిన్నమనేని, వెనుక సీట్లో భార్య కూర్చున్నారు. పిన్నమనేని సీట్ బెల్ట్ ధరించగా.. సాహిత్యవాణి, స్వామిదాస్ ధరించలేదు. సోమవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో వీరి వాహనం రింగ్ రోడ్డుపై ఉంది. ఔటర్‌పై గరిష్ట పరిమితి వేగం గంటకు 120 కిలోమీటర్లు. అయితే స్వామిదాస్ ఆ వేగాన్ని మించి పోవడాన్ని గమనించిన పిన్నమనేని రెండు, మూడుసార్లు మందలించారు. ఆయన చెప్పినప్పుడు వేగం తగ్గిస్తున్న డ్రైవర్ కొద్దిసేపటికే మళ్లీ పుంజుకోవడం మొదలెట్టాడు. వాహనం మంఖాల్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులో జోగడం, వాహనం గంటకు 120 కిమీ కంటే ఎక్కువ వేగంతో ఉండటంతో ఔటర్ కార్నర్ వద్ద రెయిలింగ్‌ను ఢీ కొంది. ఈ ధాటికి ముందు చక్రం ఊడిపోవడంతో కారు పల్టీలు కొట్టింది. దీంతో సీట్ బెల్ట్ పెట్టుకోని సాహిత్యవాణి, స్వామిదాస్ వాహనం నుంచి ఎగిరి కిందపడ్డారు. బలంగా రోడ్డును తాకడంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న వెంకటేశ్వరరావు గాయాలతో కారులోనే ఉండిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన ఇతర వాహనచోదకులు పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పిన్నమనేనిని శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వెంకట్వేరరావును మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిన్నమనేని విజయవాడ నుంచి తన కారులో తీసుకొచ్చిన మామిడికాయలు, ఆవకాయ పచ్చడి, పాలడబ్బా తదితరాలు ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పిన్నమనేని సతీమణి మృతి పట్ల జగన్ సంతాపం - ఆప్కాబ్ చైర్మన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కారుడ్రైవర్ కూడా మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన పిన్నమనేని వెంకటేశ్వరరావు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మరో ప్రమాదంలో మహిళ మృతి.. ఔటర్‌పై పిన్నమనేని వాహనానికి ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు మరో ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా నాగారం నివాసి వాసు దక్షిణాఫ్రికాలో అకౌంటెంట్. ఆయన మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం నుంచి సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి భార్య మాధురి(34), కుమార్తెలు ధరిణి ప్రియ, నందిని, బంధువు శ్రీనివాస్‌తో కలసి కారు(ఏపీ11జే3495)లో బయలుదేరారు. ఔటర్‌పై ప్రయాణిస్తున్న వీరి వాహనం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తుక్కుగూడ వద్దకు చేరుకుంది. విమానాశ్రయానికి వెళ్లడానికి తుక్కుగూడ వద్ద ఔటర్ దిగాల్సి ఉండగా.. వీరి వాహనం కాస్త ముందుకు వెళ్లింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీనివాస్ దీన్ని గమనించి వాహనాన్ని రోడ్డు మధ్య నుంచి రివర్స్ గేర్‌లో వెనక్కి తిప్పుతుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వాహనం(టీఎస్10యూఏ3306) వీరి కారును ఢీ కొంది. దీంతో ముందుసీట్లో కూర్చున్న మాధురి అక్కడికక్కడే చనిపోగా.. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భార్యకు నిప్పంటించిన భర్త
హైదరాబాద్: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను సజీవ దహనం చేశాడు. నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలోని గౌస్‌నగర్‌లో శనివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. షబ్బీర్ అనే వ్యక్తి తన భార్య రెహనా బేగంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రియురాలి కోసం భార్యను చంపేశాడు
కాకినాడ రూరల్ : వివాహేతర బంధానికి అడ్డొస్తుందన్న నెపంతో భార్యను కడతేర్చాడు భర్త. కాకినాడ విద్యుత్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనలో కిలిం నూకరత్నం దేవి( 27) బలైంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రతాప్‌నగర్‌కు చెందిన పచ్చిపాల సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నూకరత్నందేవి విజయవాడ గవర్నర్‌పేటలో సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. రమణయ్యపేటకు చెందిన కిలిమ్ శ్రీనివాసరావు కాకినాడ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాదిన్నర బాబు ఉన్నాడు. విద్యుత్‌నగర్‌లోని నాన్సిస్ట్రీట్‌లో ఉన్న ఓ అపార్టమెంట్లో శ్రీనివాసరావు, నూకరత్నందేవి ఉంటున్నారు. ఉద్యోగరీత్యా నూకరత్నందేవి వారానికి ఒకసారే కాకినాడకు వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన నూకరత్నం దేవి అప్పుడప్పుడూ భర్తను నిలదీసేది. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లొచ్చాక వీరిమధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో శ్రీనివాసరావు తన భార్యను కొట్టి, తువాలును ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న నూకరత్నందేవి తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఆస్పత్రిలో చేర్చాం’ అని చెప్పాడు. తండ్రి, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా, నూకరత్నందేవి చనిపోయి ఉంది. గొంతు నుమిలినట్టు ఉండడం, అపార్టమెంట్లో తువాలు చుట్టి ఉండడంతో.. ఆమెను హతమార్చారని నిర్ధారణకు వచ్చిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మురళీకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపాడు
హుజూర్నగర్: మద్యానికి బానిసై అతిగా మద్యం సేవించి భార్యపై దాడి చేసి ఆమెను దారుణంగా హతమార్చాడో భర్త. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హుజూర్నగర్ గోవిందాపురంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పచ్చిపాల లింగయ్య, నాగమణి(28) దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన లింగయ్య తరచు భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన లింగయ్య నిద్రిస్తున్న నాగమణి తలపై రాడ్ తో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
భార్యను హతమార్చిన భర్త
వెంకటాయపాలెం(రామచంద్రపురం) :కట్టుకున్న భర్తే కాలయముడై ఆమెను అంతమొందించిన విషాద సంఘటన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం ఎస్సీ పేటకు చెందిన తాతపూడి సత్యనారాయణ అలియాస్ సత్తికొండ, వెంకటాయపాలెం శివారు బొడ్డువారిపేటకు చెందిన చిన మంగను (43) ఇరవై ఐదేళ్ల కిత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్లవరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం సత్తికొండ భార్యను వేదింపులకు గురిచేసేవాడు. నాలుగేళ్లుగా వీరిద్దరూ విడి గా జీవిస్తున్నారు. చినమంగ కుమారులు శ్రీను, రమేష్‌లతో కలిసి వేరుగా ఉంటున్నారు. అప్పుడప్పుడు సత్తికొండ ఉంటున్న ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండురోజుల క్రితం చినమంగ ఆమె కుమార్తె ఇంటికి జి.మామిడాడ వెళ్లింది. అక్కడకు వెళ్లిన భర్త సత్తికొండతో కలిసి బుధవారం ఉదయం వెంకటాయపాలెం తిరిగి వచ్చారు. రాత్రి సమయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోవటంతో భార్య తలను గోడకు ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం ఉదయం రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ పి.కాశీవిశ్వనాథ్, ద్రాక్షారామ ఎస్సై కె.వంశీధర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్న కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
'అయినా.. నన్ను భయపెట్టలేకపోయారు'
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ లో చేసిన ఓ పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. పారిస్ ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ బాధితుడు ఆంటోనీ లీరిస్. ఈ ఘటనను జీర్ణించుకోలేని ఆ వ్యక్తి 'మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్లు చచ్చిన శవాలు' అని పేర్కొంటూ చేసిన ఫేస్బుక్ పోస్ట్ అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని చంపేశారని, నా జీవితాన్ని నాకు దూరం చేశారని పేర్కొన్నాడు. ఇన్నీ చేసినా మీరు నన్ను భయపెట్టలేక పోయారు. 'నా స్వేచ్ఛకు భంగం కలిగించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నేటి ఉదయం కూడా నేను ఆమెను చూశాను.12 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాను. బాటాక్లాన్ థియేటర్ వద్ద జరిపిన కాల్పుల్లో 89 మందికి పైగా చనిపోయారు. కానీ, ఇది ఉగ్రవాదుల స్వల్ప విజయం' అని భార్య మృతదేహాన్ని చూస్తూ ఈ విషయాలను పోస్ట్ ద్వారా వివరించాడు. 'నేను, నా బాబు(17 నెలలు) ప్రపంచంలోని అన్ని ఆర్మీల కంటే ధృడంగా ఉన్నాం. మీ గురించి ఆలోచిస్తూ టైం వృథా చేసుకోను. నా బాబును సంతోషంగా, దైర్యంగా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తుంటాను. మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు' అంటూ ఉద్వేగభరితంగా తన మనసులోని బాధను ఆంటోనీ లీరిస్ బయటపెట్టాడు. -
నువ్వులేక నేను లేను..
భర్త చనిపోయాడనే బాధతో రోదిస్తూ.. దింపుడు కల్లం వద్దే భార్య మృతి హుస్నాబాద్ రూరల్: అన్యోన్య జీవితం గడిపి పిల్లలను ప్రయోజకుల్ని చేసిన ఆ దంపతులు మరణంలోనూ తోడు వీడలేదు. భర్త మరణించడంతో గుండలవిసేలా విలపించిన భార్య కడకు ఆయనతోనే వెళ్లిపోరుుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ బుడిగజంగాల కాలనీకి చెందిన చెన్నూరు రాములు(65), వెంకమ్మ(60) దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూమార్తెలున్నారు. రాములు నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు ఏ లోటూ రాకుండా భార్య వెంకమ్మ సపర్యలు చేసింది. ఈక్రమంలో రాములు బుధవారం మృతి చెందగా, భార్య వెంకమ్మ బాగా రోదించింది. గురువారం సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు వెళ్తున్నారు. దింపుడు కల్లం కార్యక్రమంలో భాగంగా హిందూ సాంప్రదాయ ప్రకారం చనిపోయిన వారి నోటిలో ఏదైనా బంగారు వస్తువును పెడుతుంటారు. భర్త నోటిలో చెవి పోగును పెడుతూనే రోదిస్తున్న వెంకమ్మ.. నువ్వు సచ్చినంక నేనెవరి కోసం బతుకాలె.. అని రోదిస్తూ కుప్పకూలిపోరుుంది. వెంటనే ఆమెను అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
జొన్నాడ (ఆలమూరు) : ఆలమూరు మండలం జొన్నాడలో పెనుగొండ దేవి (24) అనే వివాహిత శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త బాలకృష్ణ అత్త, మామ వెంకన్న, సత్యవతి వేధింపులు భరించలేకే ఉరి వేసుకుని ఉండవచ్చని స్థానికులు... అత్తింటివారే చిత్రహింసలు పెట్టి హతమార్చారని దేవి తల్లి దండ్రులు అంగర కొండయ్య, లక్ష్మి ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం స్థానిక తారక రామ కాలనీలో నివాసముంటున్న దేవి, బాలకృష్ణ దంపతులకు 2007 మే నెలలో వివాహమైంది. వీరికి పిల్లలు సంధ్య, ఉదయ్ కుమార్ ఉన్నారు. మూడేళ్ల పాటు సఖ్యతగానే ఉన్న భర్త బాలకృష్ణ అక్కడ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ఇటీవల తరచూ ఇంట్లో గొడవలు పడటంతో స్థానిక పాత కాలనీకి బాలకృష్ణ, దేవి దంపతులు మకాం మార్చారు. అయినా పరిస్థితి మారలేదు. శనివారం రాత్రి మీ అమ్మాయికి ‘ఒంట్లో బాగోలేదు-కడుపు నొప్పి వస్తోంది’ అంటూ సంధిపూడిలోని దేవి తల్లిదండ్రులకు ఆమె మరిది శ్రీను ఫోన్ చేశాడు. కలవ రం చెందిన వారు ఒక గంట తరువాత ఫోన్ చేయగా మృతి చెందిందని తెలియజేయడంతో తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. జొన్నాడలోని తారక రామ పాత కాలనీకి చేరుకోగా అప్పటికే అద్దె ఇంట్లో మృతి చెందిన దేవి మృతదేహాన్ని బాలకృష్ణ తల్లిదండ్రుల ఇంటికి తరలించడం అనుమానాలకు తావిస్తోంది. వంట విషయంలో గొడవ పడి బయటకు వెళ్లి, ఇంటికి చేరుకునే లోపే ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిందని భర్త బాలకృష్ణ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.. తమ కుమార్తె దేవిని అత్తింటివారు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు కొండయ్య, లక్ష్మి ఆరోపిస్తున్నారు. కొట్టడంవల్లే చనిపోయిందని, తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. భర్త బాలకృష్ణ, కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ మృతురాలు దేవి నివాసముంటున్న జొన్నాడలోని పాత తారకరామ కాలనీ, అత్తమామలు నివాసముంటున్న కొత్త కాలనీలో స్థానిక పోలీసులు విచారణ జరిపారు. తహశీల్దారు పి.రామమూర్తి, సీఐ వి.పుల్లారావు, ఎస్సై ఎం.శేఖర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన దేవి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో తామే కిందకు దింపామని ఇంటి యజమాని మారిశెట్టి శ్రీనివాసు తెలిపారు. భర్త, అత్త మామల వేధింపుల వల్లే దేవి మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.శేఖర్‌బాబు కేసు నమోదు చేశారు. -
కోర్కె తీర్చలేదనే...
భార్యను చంపేశానని ఒప్పుకున్న భర్త రాములు పొందూరు: తన కోర్కె తీర్చలేదనే కారణంతోనే భార్యను చంపేశానని గారపేట గ్రామానికి చెందిన రాములు ఒప్పుకున్నాడు. గారపేట గ్రామంలో భార్యను చంపిన భర్తను స్థానిక పోలీసు స్టేషన్లో క్రైమ్ పోలీసులు ఆదివారం విచారించారు. ఎటువంటి తడబాటు లేకుండా భార్యను ఎలా చంపాడో హెడ్ కానిస్టేబుల్ రాజుకు రాములు వివరించాడు. తన కోర్కె తీర్చలేదనే కారణంతో చంపేశానని ఒప్పుకున్నాడు. ఇంటి గడపలో నిద్ర మత్తులో ఉన్న భార్య మెడకు గట్టిగా చీరను చుట్టేసి లాక్కొని ఇంట్లోకి తీసుకెళ్లిపోయి చంపేశానని చెప్పాడు. మెడమీద, పొట్టమీద కాళ్లుతో మట్టేసి తన్నేశానని తెలిపాడు. ఆమె విడిపించుకోకుండా ఉండేందుకు చేతులును, కాళ్లును కదలకుండా కట్టేశానని చెప్పాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు ఫ్యాన్‌కు ఉరేయడంతో మరణించిందని తెలిపాడు. అయితే ఇదంతా తాగిన మైకంలో చేశానని చెప్పాడు. చిత్ర హింసలు పెట్టినప్పుడు ఆమె అరవలేదా అని పోలీసులు ప్రశ్నిస్తే, అరుస్తున్నప్పటికీ బయటకు శబ్దం రాలేదని పేర్కొన్నాడు. దీనిని బట్టి మెడను ఎంత బిగుతుగా ఇరించేశాడో అర్ధమవుతుంది. గతంలో తన భార్య తల బద్దలు కొట్టి పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగిన సంఘటనలు ఉన్నాయని వివరించాడు. ఈ విచారణలో క్రైమ్ పోలీసు కానిస్టేబుల్లు కె.సి.రాజు, తారక్, స్థానిక పోలీసులు ఉన్నారు. -
భర్త చేతిలో భార్య హతం
పొందూరు: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కర్కశకంగా చంపేశాడో భర్త. విషయం బయటకు చెబితే కన్నకూతుర్ని కూడా హతమారుస్తానని బెదిరించి మనిషి అనే మాటకు అర్థం లేకుండా చేశాడా మానవ మృగం. ఈ ఘోరం గారపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తన కూతురును అల్లుడే చంపేసాడని మృతురాలు తండ్రి సోపేటి అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు. తాగిన మైకంలో మురపాక తవుడమ్మ (30)ను ఆమె భర్త రాములు చీరను మెడకు చుట్టి చంపేసి తరువాత ఫ్యాన్‌కు వేలాడిదీసినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న రాములు భార్యను కోరిక తీర్చమని అడగడంతో వారి మధ్య గొడవ జరిగి పెనుగులాడుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. తవుడమ్మ మెడకు చీరను చుట్టి చంపేశాడని, ఆ సమయంలో అప్పటివరకూ నిద్రంలో ఉన్న కూతురు భవానికి మెలకవరావడం, తల్లిని తండ్రే చంపేయడాన్ని చూసింది. దీంతో ఆగ్రహించిన రాములు ఈ విషయం బయటకు చెబితే నిన్ను కూడా చంపేస్తానని కూతురుని బెదిరించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యలో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు. -
భార్యను హత్య చేసిన వ్యక్తి అరెస్టు
యలహంక: భార్యను హత్య చేసిన అనంతరం కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిని యలహంక పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు, మూడేళ్ల క్రితం బాగేపల్లి తాలూకా చేలూరుకు చెందిన మీనాక్షి(21)తో యలహంకకు చెందిన అశోక్‌కు వివాహమైంది. అశోక్ యలహంకలోని వెంకటాచలలో ఉన్న మంజునాథ్‌కు చెందిన తోటలో కూలి పనులు చేస్తూ తోటలోని చిన్నషెడ్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మీనాక్షి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలతో భార్యాభర్తల మధ్య గొడవ లు జరుగుతుండేవి. మీనాక్షి తల్లి లక్ష్మీదేవమ్మ అప్పుడప్పుడు వచ్చి ఇద్దరికి నచ్చచెప్పి వెళుతుండేది. అయితే ఈ నెల 21న భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో అశోక్, భార్య మీనాక్షిని కొడవలితో హత్య చేశాడు. అనంతరం అక్కడ గొయ్యి తవ్వి భార్య మృతదేహాన్ని పూడ్చివేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి ఇంట్లో భార్య కనిపించడం లేదని శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య గురువారం సాయంత్రం నుంచి కనబడడం లేదని దయచేసి వెతికిపెట్టాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు పోలీసులు అశోక్‌ను తీసుకువచ్చి విచారించగా నేను తిరుపతికి వెళ్లానని తాను తిరిగి వచ్చేలోగా మీనాక్షి వెళ్లిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇతని మాటలపై అనుమానం వచ్చిన ఎస్ఐ విచారణ ముమ్మరం చేశారు. శుక్రవారం ఇంటి నుంచి దర్జాగా తిరుగుతూ వస్తుండడాన్ని గమనించిన పోలీసులు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి తమదైనశైలిలో విచారించడంతో అశోక్ హత్య విషయం బయటపెట్టాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
భార్యను కడతేర్చిన భర్త
బాల్కొండ: మండలంలోని సావెల్ గ్రామంలో అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఏడడుగులు నడిచి పదికాలల పాటు కలిసి ఉంటామని బాస చేసిన భర్త కత్తితో పొడిచి చంపేశాడు. బాల్కొండ ఎస్సై సుఖేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సావెల్ గ్రామానికి చెందిన ఎండ్ర లీల(35)ను భర్త పిరాజీ శనివారం రాత్రి హత్య చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకారాకు చెందిన పిరాజీ, లీలా దంపతులు 8 ఏళ్ల క్రితం సావెల్ గ్రామానికి రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా లీలా ఐదు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను హాస్టల్లో చేర్పించడానికి వెళ్లి, శుక్రవారం ఇంటికి వచ్చింది. రాత్రి పిరాజీ అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇన్ని రోజలు ఎక్కడికి వెళ్లావని లీలాతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తితో పిరాజీ లీలా తలపై పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై లీల అక్కడిక్కడే మృతి చెందింది. లీలాకు అక్రమ సంబంధం ఉందని తరుచూ గొడవ పడేవాడని లీలా కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తాళం వేసి ఎవరికి అనుమానం రాకుండా ఉదయం హోటల్లో టీ తాగి పరారయ్యాడు. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్య
శాంతిపురం: వుండలంలోని కాలిగానూరు వద్ద సోవువారం రాత్రి గుర్తించిన వుహిళ శవం కేసు కొత్తవులుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావించిన వుృతురాలి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాళ్లబూదగూరు ఎస్ఐ గోపి, వుృతురాలి బంధువుల సవూచారం మేరకు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వరటనపల్లెకు చెందిన చిన్నస్వామి కువూరుడు అయ్యుప్ప(26)తో వీ.కోట ఈశ్వర్‌నగర్‌కు చెందిన సుబ్రవుణ్యం, యుశోదవ్ము కువూర్తె వనిక(21)కు 13 నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన ఐదు నెలలకు అయ్యుప్ప బతుకు తెరువు కోసం సింగపూరుకు వెళ్లాడు. అప్పట్లో భార్యను పుట్టింట్లో ఉంచి వెళ్లడంతో ఆమె వి.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఇటీవల తిరిగి వచ్చిన అయ్యుప్ప భార్యతో పాటు వి.కోటలోనే ఉంటూ గతనెల 29న వరటనపల్లెకు వెళ్లివచ్చారు. ఇరువురి వుద్య చిన్నపాటి వివాదాలు నడుస్తున్నాయి. వనికకు తరచూ కడుపునొప్పి వస్తుండటంతో పరీక్షల కోసం సోవువారం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి వెళ్లేందుకు వి.కోట నుంచి ద్విచక్ర వాహనంపై బయులుదేరారు. అయితే కాలిగానూరు సమీపంలో సోవువారం రాత్రి వనిక శవమై కనిపించింది. సవూచారం ఆందుకున్న రాళ్లబూదగూరు ఎస్ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి రాత్రే వుృతురాలి వివరాలు సేకరించారు. వుృతురాలి నోరు నొక్కి, గొంతు నులిమి హత్య చేసినట్టు గుర్తించారు. భర్తే నిందితుడన్న అనువూనంతో విచారణ ప్రారంభించారు. వుంగళవారం వనిక వుృతదేహానికి కుప్పం వంద పడకల ఆస్పత్రిలో పోస్టువూర్టం అనంతరం ఆమె బంధువులకు అప్పగించారు. ఈ సందర్బంగా కుప్పం సీఐ రాజశేఖర్ వుృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అయితే భార్యను కడదేర్చిన అయ్యుప్ప స్వగ్రావూనికి వెళ్లి సోవువారం రాత్రి ఉరి వేసుకుని వుృతి చెందాడు. దీనిపై తమిళనాడులోని బరుగూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వుృతుడి వద్ద నుంచి అక్క డి పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ వెలు గు చూస్తే వురిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మూడో వ్యక్తి ఎవరు? సోవువారం సాయుంత్రం వుృతురాలు, ఆమె భర్తతో పాటుగా 50 ఏళ్లకు పైగా వయుస్సున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. ఆయితే కొంతసేపటి తరువాత అయ్యుప్పతో పాటు తెల్లపంచె, చొక్కాతో ఉన్న సదరు వ్యక్తి వూత్రమే తిరిగి వచ్చాడని వారు చెబుతున్నారు. దీంతో ఈ మూడోవ వ్యక్తి ఎవరన్నది సందేహంగా మిగిలింది. భార్యను కడదేర్చాలని మూడో పథకం పన్నిన అయ్యుప్ప సాయుంగా ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాడా? లేదా క్షణికావేశంలో భార్యను హ త్య చేస్తే అక్కడే ఉన్న మూడో వ్యక్తి ఏమి చేస్తున్నాడు? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరన్నదీ పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సింది. -
భార్య గొంతుకోసి చంపిన భర్త
నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యను గోంతుకోసి కడతేడ్చాడో భర్త. ఈ సంఘటన నల్గొండ జిల్లా దండెంపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ(47), ఇందిరమ్మ(42) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి మధ్య కుటుంబ కలహాలతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి మద్యం సేవించిన సత్యనారాయణ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ముంజ కొడవలితో భార్య పై దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిరమ్మను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
భార్యను కడతేర్చిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు కోటనందూరు (తుని) :కలకాలం కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధం చిచ్చురగిల్చింది. భార్యను భర్తే కడతేర్చిన సంఘటన కోటనందూరు మండలం అల్లిపూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లిపూడికి చెందిన రుత్తల రాఘవ (45)ను భర్త రుత్తల సత్యనారాయణ అలియాస్ రాంబాబు హత్య చేశాడు. కాకినాడకు చెందిన రాఘవకు అల్లిపూడికి చెందిన సత్యనారాయణతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె హేమనిలక్ష్మి విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. కుమారుడు భాస్కర్ హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు. రాఘవకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, బుధవారం అర్ధరాత్రి సమయంలో సత్యనారాయణ ఇంటికి వచ్చిన సమయంలో వీరిద్దరూ కలిసి ఉండడం చూశాడు. దీంతో ఆగ్రహం చెందిన సత్యనారాయణ గట్టిగా కేకలు వేయడంతో బయట వ్యక్తి పలాయనం చిత్తగించాడు. రాఘవ, సత్యనారాయణ ఇద్దరు ఘర్షణ పడ్డారని, పెనుగులాటలో రాఘవ ఇంట్లో ఉన్న రాతిరోలుపై పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్రగాయమై అక్కడకక్కడే మృతి చెందిందని కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. మృతురాలి సోదరుడు నాళం దుర్గాప్రసాద్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ఎస్సై గోపాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక వీఆర్వో సమక్షంలో పంచనామా చేసి తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త
గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లిలో బుధవారం జరిగింది. గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మి-శంకరయ్య దంపతుల పెద్ద కూతురు మమతను ధర్మపురి మండలం మద్దునూర్‌కు చెందిన సోమ మల్లేశంకు ఇచ్చి 2010లో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.5.50 లక్షలకట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. మమత పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతరు రజితకు పెళ్లి చేశారు. మమత కన్నా రజితకు ఎక్కువ కట్నం ఇచ్చారని మమత భర్త మల్లేశం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను రెండేళ్ల నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏడు నెలల క్రితం వచ్చిన మల్లేశం వరకట్న వేధింపులు మానుకోలేదు. రెండు రోజుల క్రితం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో భర్తపై వరకట్నం కేసు పెట్టింది. ఈ క్రమంలో మమతపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశం ఆమె కుట్టుమిషన్‌కు వెళ్లే సమయంలో హత్య చేయూలని పథకం వేసుకున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మమత గోవింద్‌పల్లి బస్టాండ్‌కు నడుచుకుంటూ వస్తుండగా నడిరోడ్డుపైనే పదునైన ఆయుధంతో మెడపై నాలుగుసార్లు నరికాడు. దీంతో మమత అక్కడిక్కడే మృతి చెందింది. -
భార్యను హత్య చేసి ఆత్మహత్య
తిరువళ్లూరు: భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్త ఆ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేపంబట్టులోని వల్లలార్ నగర్లో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా అత్తిపట్టు గ్రామానికి చెందిన రాజేష్‌కుమార్(24) కాల్ టాక్సీ డ్రైవర్. ఇదే ప్రాంతానికి చెందిన కోదండరామన్ చెన్నైలో ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె తమిళ్‌సెల్వి శ్రీపెరంబదూరులోని శ్రీవెంకటేశ్వరా కళాశాలలో ఈసీఈ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతూ వుంది. ఈ నేపథ్యంలో రాజేష్‌కుమార్‌కు తమిళ్‌సెల్వికి మధ్య వున్న పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఐదు నెలల బాలుడు వున్నాడు. వివాహ మైనప్పటి నుంచి అత్తారింటిలో వున్న రాజేష్‌కుమార్ దంపతులు మూడు రోజుల కిందట వేపంబట్టులోని వల్లలార్ నగర్లో అద్దెకు దిగారు. ఈ నేపథ్యంలో రాజేష్‌కుమార్ తమిళ్‌సెల్వి సోమవారం ఉదయం పది గంటలు దాటుతున్నా బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన ఇంటి యజమాని తలుపులు తెరిచి చూసి షాక్‌కు గురయ్యాడు. రక్తపు మడుగులో వున్న తమిళ్‌సెల్వి, ఉరి వేసుకుని రాజేష్‌కుమార్ మృతి చెంది వుండడాన్ని గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా తమిళ్‌సెల్వి గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు. అనంతరం రాజేష్‌కుమార్ సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని వుంటాడని పోలీసులు భావించి, మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం వైద్యశాలకు తరలించారు. రాజేష్కుమా ర్ తమిళ్‌సెల్విల వైవాహిక జీవితం సజావుగా సాగినా ఆరు నెలల నుంచి తర చూ ఘర్షణ పడేవారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. రాజేష్‌కుమార్ తన వదినతో అక్రమ సంబంధం కలిగి ఉన్నారన్న అనుమానంతో భార్యభర్తలు ఇద్దరు తరచూ ఘర్షణ పడేవారని పోలీసులు వివరించారు. అయితే తల్లి హత్యకు గురి కావడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఐదు నెలల చిన్నారి అనాథగా మారిపోయింది. విగతజీవులుగా పడి వున్న తల్లి వద్ద పాలు కోసం ఏడూస్తూ చిన్నారి రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది. -
అనుమానం పెనుభూతమై..
అనుమానం పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. తల్లిదండ్రుల సంరక్షణలో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్నారులను అనాథలను చేసింది. జీవితాంతం తోడుంటానన్న భర్త పెళ్లినాటి బాసలు చెదిరిపోయాయి. నిండు నూరేళ్లూ కాపురం చేయాల్సిన భర్త.. అనుమానంతో భార్యను నరికి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుడ్లూరు మండలం స్వర్ణాజీపురం ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. - భార్యను గొంతు కోసి చంపిన భర్త - ఆపై బావిలోకి దూకి తానూ ఆత్మహత్య - స్వర్ణాజీపురం ఎస్సీ కాలనీలో ఘటన.. స్వర్ణాజీపురం (గుడ్లూరు) : కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కసి తీరా చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన మండలంలోని స్వర్ణాజీపురంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది. తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండగా ఆ చిన్నారుల అర్తనాదాలతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. స్వర్ణాజీపురం గ్రామానికి చెందిన తాటితోటి ఏడుకొండలు(40)కు ఉలవపాడు మండలం వీరేపల్లికి చెందిన రమాదేవి(34)తో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నవీన్, వినయ్ అనే కుమారులతో పాటు ఇందు అనే కుమార్తె ఉంది. ఏడుకొండలు హైదరాబాదులో బేల్దారి పనులు చేసుకుంటూ అక్కడే కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలం పాటు బాగానే సాగిన వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్త ఏడుకొండలు మద్యానికి బానిసై భార్యను నిత్యం అనుమానించేవాడు. పెద్ద కుమారుడు నవీన్ గుడ్లూరులో హాస్టల్ ఉండి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె ఇందు అమ్మమ్మ వద్ద ఉంటూ ఏడో తరగతి ఉలవపాడు మోడల్ పాఠశాలలో చదువుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఏడుకొండలు భార్యను ఇక్కడే వదిలేసి ఒక్కడే హైదరాబాద్ వెళ్లాడు. రమాదేవి గ్రామంలోనే పనులకు వెళ్తూ చిన్న కుమారుడిని చదివించుకుంటోంది. ఏడుకొండలు 17వ తేదీ శివరాత్రి రోజు గ్రామానికి వచ్చాడు. బుధవారం రాత్రి భోజనాలు చేసిన అనంతరం ఏడుకొండలు, రమాదేవి, చిన్న కుమారుడు ఇంట్లో నిద్రపోగా ఏడుకొండలు తల్లి బయట వరండాలో పడుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఉన్మాదిగా మారిన ఏడుకొండలు కత్తితో గాఢ నిద్రలో ఉన్న రమాదేవిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రమాదేవి కేకలేస్తూ తలుపులు తీసుకొని బయటకు వచ్చి పడిపోయింది. కాలనీ వాసులు 108కి సమాచారం అందించి అప్పటికప్పుడు ఆటోలో కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ఆమెను 108లోకి మార్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో రమాదేవి మృతి చెందింది. ఇంట్లో నుంచి పారిపోయిన ఏడుకొండలు కాలనీకి చివర ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విజయ్‌చందర్ తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. తల్లిదండ్రులు లేని ముగ్గురు బిడ్డల అర్తనాదాలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని కందుకూరు డీఎస్పీ అజయ్‌ప్రసాద్, సీఐ లక్ష్మణ్‌లు గురువారం పరిశీలించారు. ఏడుకొండలు తల్లి కొండమ్మ, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మణ్ తెలిపారు. -
నగలు చేయించమందని భార్యను చంపేశాడు
అనంతపురం: బంగారు నగలు చేయించమని అడిగినందుకు భార్యను హతమార్చాడో కిరాతక భర్త. అంతేకాకుండా ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... డి.హీరేహాళ్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మల్లెన్నకు ఇద్దరు భార్యలు. మల్లెన్న వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం విడాకులు ఇచ్చింది. ఆ తరువాత మల్లెన్న కర్ణాటకలోని కన్నేకుప్పకు చెందిన నాగవేణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మల్లెన్నతనకున్న 30 ఎకరాల పొలంలో ఈ మధ్య పత్తి పంట వేశారు. పంటలో దిగుబడి బాగా రావడంతో నాగవేణి బంగారం చేయించమని భర్తను అడిగింది. అందుకు మల్లెన్న ససేమిరా అన్నాడు. దాంతో ఇద్దరికి మాటామాటా పెరిగడంతో మల్లెన్న కోపోద్రిక్తుడై నెత్తిమీద బలంగా కొట్టడంతో నాగవేణి అక్కడిక్కడే మృతి చెందింది. అయితే ఏంచేయాలో దిక్కుతోచని మల్లెన్న భార్య మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని తమదైన శైలిలో విచారించడంతో జరిగిన విషయమంతా చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. (డి.హీరేహాళ్) -
స్కెచ్ గీసి ...భార్యను హతమార్చిన సీఐ
అనంతపురం : అనంతపురం జిల్లా నల్లమాడ మండలం అవరవాండ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మిస్టరీని పోలీసులు చేధించారు. కడప సీఐ అర్జున్ నాయక్...భార్య పద్మలతను పథకం ప్రకారం హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. పద్మలత మృతిపై అర్జున్ నాయక్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వారిపై 490, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే సీఐ అర్జున్ నాయక్, అతని భార్య పద్మలత మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. తమ వ్యవసాయ పొలంలోని కంది పంటను గ్రామ సమీపంలోని రోడ్డుపైనే నూర్పిడి చేసి, దాని కాపలా కోసం రోడ్డు పక్కన భార్యాభర్తలు నిద్రించారు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహంన ఢీకొన్నట్లు తెలియటంతో అక్కడకు చేరుకున్నారు. పద్మలతను నల్లమాడ ఆస్పత్రిలో చేర్పించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గాయపడిన అర్జున్ నాయక్‌ను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తమ కుమార్తెను భర్తే హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడంటూ పద్మలత తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
అనుమానం పెనుభూతమై..
సూరేపల్లి(నిడమనూరు) : అనుమానం పెనుభూతమైంది.. ఆదమరచి నిద్రపోతున్న రెండో భార్యను రోకలితో మోది దారుణంగా హత్య చేశాడు.. ఓ భర్త. ఈ దారుణ ఘటన నిడమనూరు మండలం సూరేపల్లిలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇరుగంటి శ్రీను వ్యవసాయ బావి మోటార్లను మరమ్మతు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే గ్రామానికి చెందిన నాగేంద్రమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో 11 ఏళ్ల క్రితం మొదటి భార్య చెల్లెలు రేణుక(30)ని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి శివకుమార్, ప్రియాంక ఇద్దరు సంతానం కలిగారు. భార్యలతో గొడవపడి.. శ్రీను మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇద్దరు భా ర్యలతో గొడవపడ్డాడు. రెండో భార్య రేణుక మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను తీవ్రంగా కొట్టడడంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందోనని చుట్టుపక్కల వారు అనుమానం వ్యక్తం చేయడంతో రేణుక కోసం గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. మొదటి భా ర్య నాంగేంద్రమ్మ ఇంట్లో పడుకోగా, శ్రీను బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి వచ్చి.. ఘాతుకానికి పాల్పడి.. కొద్దిసేపటి తరువాత రేణుక ఇంటికి వచ్చి మంచంలో పడుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు శ్రీను తప్పతాగి ఇంటికి వచ్చాడు. తలుపులు బాదడంతో కొద్ది సేపటి వరకు ఎవరూ తీయలేదు. ఆగ్రహానికి లోనైన శ్రీను పక్కనే ఉన్న రోకలితో తలుపు కొట్టడంతో నాంగేంద్రమ్మ వచ్చి తెరిచింది. బూతులు లంకించుకుని తలుపు గట్టిగా తోయడంతో నాగేంద్రమ్మ కిందపడిపోయింది. శ్రీను ఇంట్లోకి వెళ్లి మంచంపై పడుకున్న రేణుక తలపై విచక్షణా రహితంగా మోదడంతో నిద్రలోనే ప్రాణాలు విడిచింది. భయాందోళన చెందిన నాగేంద్రమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో శ్రీను అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన రేణుకను పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ హత్యోదంతం సమాచారం తెలుసుకుని బుధవారం ఉదయం మిర్యాలగూడ టూటౌన్ సీఐ పాండురంగారెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ ఆధ్వర్యంలో కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు. -
భర్తే కాలయముడై..
భీమవరం టౌన్ : తాళికట్టిన భర్తలే కాలయముళ్లుగా మారుతున్నారు. నిత్యం వేధింపులకు గురై లేత వయసులోనే నూరేళ్లు నిండిపోతున్నాయి. నిన్న ఉమామహేశ్వరి ఉదంతం మరిచిపోకముందే భీమవరం ప్రాంతంలో మరో అబల భర్త అకృత్యానికి బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గర్భిణిగా ఉందనే కనికరం కూడా లేకుండా ఉన్మాది చేష్టలతో ఉసురుతీశాడు. వివరాల్లోకి వెళితే.. భీమవరం మండలం పెదగరువుకు చెందిన మేడిది వినోద్‌కుమార్.. కొమరాడ గ్రామానికి మరియమ్మను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి మూడేళ్ల కుమార్తె శ్రీకుమారి ఉంది. మరియమ్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. హైదరాబాద్‌లో తాపీ పని చేసుకుంటూ వినోద్‌కుమార్ కుటుంబం కొంతకాలంగా అక్కడే ఉంటోంది. మరియమ్మ తండ్రి డేవిడ్ గతంలోనే చనిపోగా, తల్లి ఆశీర్వాదం దుబాయ్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా, చిన్న చిన్న విషయాలకు కూడా వినోద్‌కుమార్ భార్య మరియమ్మను చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. అతనికి దూరంగా వచ్చేయాలని ఎన్నోసార్లు బంధువులు ఆమెకు చెప్పారు. అయినా తన భర్తతోనే ఉంటానని మరియమ్మ వారికి నచ్చజెప్పేది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండగకు మంగళవారం ఉదయం కొమరాడలోని నాన్నమ్మ ఇంటికి వినోద్‌కుమార్ కుటుంబం వచ్చింది. రాత్రి వినోద్‌కుమార్ భార్యతో గొడవకు దిగి ఇష్టం వచ్చినట్టు ఆమెను కొట్టాడు. అడ్డువచ్చిన మరియమ్మ నాన్నమ్మ, అమ్మమ్మలను సైతం తోసివేశాడు. దీంతో వారు కేకలు వేయగా స్థానికులు గుమికూడారు. ఇంతలోనే భార్య గొంతు, పొట్టను గట్టిగా నొక్కి హత్య చేశాడు. ఆమె మృతి చెందినా హింసిస్తుండటాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో వినోద్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడ్నించి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి భర్త వినోద్‌కుమార్ కోసం గాలించారు. బుధవారం ఉదయం తహసిల్దార్ గంధం చెన్నుశేషు, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మ నిద్రపోతోంది.. లేపకండి తల్లి నిద్రపోతోందని భావించి అక్కడే ఉన్న చిన్నారి శ్రీకుమారిని చూసి స్థానికులు చలించిపోయారు. మరియమ్మ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులతో తన తల్లి నిద్రిస్తోందని.. లేపవద్దని చెప్పడంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిని పోగొట్టుకున్న చిన్నారి భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు. భర్తే కావాలంది.. ప్రేమించి పెళ్లాడిన భర్త వినోద్‌కుమార్ అంటే మరియమ్మకు ఇష్టం. అయితే చీటికిమాటికి భార్యతో గొడవపడి భర్త చిత్రహింసలకు గురిచేస్తున్న వినోద్‌కుమార్ ప్రవర్తనతో బంధువులు విసుగు చెందారు. అతని నుంచి దూరంగా ఉండాలని హితవు పలికారు. అయినా మరియమ్మ తనకు భర్తే జీవితమంటూ వారికి నచ్చజెప్పింది. అతనిలో మార్పు వస్తుందని ఆశించింది. అయితే రానురాను అతని ప్రవర్తన మితిమీరడం.. మరియమ్మ తండ్రి లేకపోవడం, తల్లి దుబాయ్‌లో ఉండటం, అమ్మమ్మ, నాన్నమ్మ వృద్ధులు కావడంతో వినోద్‌కుమార్‌ను నిలదీసేవారు లేకపోయారంటూ బంధువులు వాపోతున్నారు. దీంతో అతని చేష్టలు శ్రుతిమించి తమ మనవరాలు బలైందని కన్నీరుమున్నీరయ్యారు. -
భార్యను కడతేర్చిన భర్త
భీమవరం అర్బన్ :తాళి కట్టిన ఆలి గొంతు కర్కశంగా నులిమేశాడు ఓ మృగాడు. పసుపు పారాణి ఆరకముందే నుదుట సింధూరం దిద్దిన చేతులతోనే ఆమె నిండు నూరేళ్ల జీవితాన్ని నిర్ధాక్షణ్యంగా చిదిమేశాడు. పట్టణంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గొల్లవానితిప్పరోడ్లోని ప్రకాష్‌నగర్ ప్రాంతంలోని లోసరి పంట కాలువ గట్టున నివాసముంటున్న మల్లుల వెంకటేశ్వరరావుకు పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి (19)కి ఈ ఏడాది మేలో వివాహమైంది. భవనాలకు టైల్స్ అతికే పనులు చేసే వెంకటేశ్వరరావు భార్య ఉమామహేశ్వరిని పెళ్లయిన నాటి నుంచి ఉన్మాదిగా మారి చీటికిమాటికీ వేధింపులకు గురిచేస్తుండేవాడు. దీనిపై పలుమార్లు ఫోన్లో తల్లిదండ్రులకు ఉమామహేశ్వరి తన గోడును వెళ్లబోసుకునేది. దీంతో ఫోన్లో సైతం తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకునేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటి తలుపులు గడియ పెట్టి భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ బాధలు తట్టుకోలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఉమామహేశ్వరి గొంతు నులిమి వెంకటేశ్వరరావు దారుణంగా హత్య చేశాడు. తొలుత బిగ్గరగా ఉమామహేశ్వరి కేకలు విన్న స్థానికులకు అనంతరం వెంకటేశ్వరరావు దుఃఖిస్తున్నట్టు వినిపించడం, ఉమామహేశ్వరి తలుపు తీయకపోవడంతో అనుమానించారు. వెంటనే తలుపులు కొట్టి పిలిచారు. లోపల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వడ్రంగి మేస్త్రిని పిలిచించి తలుపు గడియలను తొలగించి ఇంట్లోకి వెళ్లి చూశారు. లోపల గదిలో మంచంపై ఉమామహేశ్వరి నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి వెంకటేశ్వరరావును ప్రశ్నించగా అతను అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జయసూర్య ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, బంధువుల నుంచి వివరాలను ఆరా తీశారు. అదే సమయంలో ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాదిగా మారి ఉమామహేశ్వరిని కడతేర్చాడంటూ బంధువుల రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భర్తే కాలయముడు
కాకినాడ క్రైం :కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మద్యం మానివేయాలని చెప్పినందుకు భర్తే ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. ఈ సంఘటనతో ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. గర్భిణి అయిన భార్యను హతమార్చడమే కాకుండా ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు భర్త ప్రయత్నించి విఫలమయ్యాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో హత్యోదంతం వెలుగుచూసింది. సోమవారం కాకినాడలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సత్య(26)కు, కాకినాడ పర్లోపేటలోని చినమార్కెట్ ప్రాంతానికి చెందిన పొట్టి సతీష్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి మూడేళ్ల చైతన్య లహరి, రెండేళ్ల బిందు లహరి ఉండగా, సత్య ప్రస్తుతం నాలుగో నెల గర్భిణి. సముద్రంపై చేపలవేట చేస్తూ కుటుంబాన్ని పోషించే సతీష్ మద్యానికి బానిసయ్యాడు. సతీష్ కుటుంబం, అతడి తల్లి లక్ష్మి, తమ్ముడు రాజు కుటుంబం ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. మద్యం తాగి వచ్చే సతీష్ తరచూ భార్యతో తగాదా పడేవాడు. ‘ఇద్దరు ఆడపిల్లలున్నారు, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, తాగుడు మానేయండి’ అని భార్య మొత్తుకున్నా అతడు వినకుండా ఫూటుగా తాగొచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా అతడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో అతడు సత్య పీక పట్టుకుని నొక్కాడు. ఊపిరాడక ఆమె అక్కడికక్కడే మరణించింది. మద్యం మత్తు దిగిపోవడంతో భయపడిన సతీష్ ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులను, స్థానికులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. చీరను ఆమె మెడకు కట్టి, ఇంటి దూలానికి వేలాడదీశాడు. తనతో గొడవపడి ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులతో చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి ఆమె దూలానికి వేలాడుతూ కనిపించింది. ఆమె మృతదేహాన్ని కిందకు దించి, ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని భద్రాచలంలోని తల్లికి ఫోన్లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ అద్దంకి శ్రీనివాసరావు, పోర్టు ఎస్సైలు పార్ధసారథి, వై. సతీష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మిం చేందుకు ప్రయత్నించాడు. మృతదేహంపై గాయాలు ఉండడం, సంఘటన స్థలంలో పరిస్థితులను పరిశీ లించి ఆమెది ఆత్మహత్య కాదని నిర్ధారించుకున్నారు. దీంతో సతీష్‌ను ఆరా తీయగా.. ఆమెను తానే హతమార్చినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇలాఉండగా చిన్నారులు తల్లి కోసం ఏడుస్తుంటే.. కుటుంబ సభ్యులు వారిని ఎత్తుకుని ఓదార్చడం స్థానికులకు కంటతడి తెప్పిం చింది. సత్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఎస్సై పార్ధసారథి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త చేతిలో భార్య హతం
లింగాల: మూడుముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచిన ఓ భర్త జీతాంతం తోడు ఉంటాననే మాటమరిచి భార్య ను హతమార్చాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని అంబట్పల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దండు శ్రీశైలం, రేణుక భార్యాభర్తలు కాగా వారికి ఇద్దరుపిల్ల లు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మరోసారి గొడవపడ్డారు. ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగి భర్త భా ర్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. ఈ విషయం బయటకు పొక్కకుండా జా గ్రత్తపడ్డాడు. చనిపోయిన భార్యపై చీర కప్పి ఏమి తెలి యనట్లు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. తిరిగి ఇం టికొచ్చి తన భార్య చనిపోయినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు గ్రామానికి చేరుకుని హంగామా సృష్టిం చారు. మృతురాలి భర్తను కొట్టడమే కాకుండా పోలీ సులు, గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ హుటాహుటిన నాగర్‌కర్నూల్, అచ్చంపేట సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, బల్మూర్, సిద్దాపూర్ ఎస్ఐలు శ్రీధర్, చంద్రమోహన్‌రావుతో కలిసి గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే నేరమని హెచ్చరించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ అన్నారు.మృతురాలి అన్న ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణసింగ్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
శృంగవరపుకోట:తన కాపురాన్ని పండించుకోవాలని కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ ఇల్లాలు పెళ్లయి రెండో ఏడు నిండకుండానే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో మంగళవారం జరిగిన సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్న వానపల్లి త్రిమూర్తులు, దేవి దంపతుల కుమారుడు రవివర్మ, స్థానిక బర్మాకాలనీకి చెందిన కొట్యాడ కొన్నాయుడు, ఎర్నమ్మల కుమార్తె మణిలకు 2013 మే 12వ తేదీన వివాహం జరిగింది. అయితే వానపల్లి మణి(17)ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త పట్టణమంతా ఒక్కసారిగా వ్యాపించడంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే మణి మృతదేహాన్ని ఆరుబయట గడ్డిపై వేసి, ఆమె ముఖమంతా పసుపురాసి, మలేరియా జ్వరంతో చనిపోయిందంటూ వచ్చి న వారందరికీ కుటుంబీకులు చెబుతున్నారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసిఆరా తీయగాతొలుత జ్వ రంతో చనిపోయిందని చెప్పిన కుటుంబీకులు తర్వాత ఉరిపోసుకుని చనిపోయిందని, ఆ సమయంలో తామెవరం ఇంటి వద్ద లేమని చెప్పారు. మృతురాలి అత్త, మామలైన వానపల్లి త్రిమూర్తులు, దేవిలు మాట్లాడుతూ గదిలో చీరతో ఉరిపోసుకున్నమణిని తాము దిం పి బయట వేశామని చెప్పారు. ఎటువంటి తగాదాలు లేవని, ఎందుకు ఈ పని చేసిందో తమకు తెలియదన్నారు. మృతురాలి భర్త రవివర్మ మాట్లాడుతూ తాను పనికి పోయి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేసరికి ఇంటివద్ద జనం గుమిగూడి ఉన్నారని, తీరా చూస్తే తన భార్య చనిపోయి ఉందని, ఎందుకు చనిపోయిందో తనకేమీ తెలియదని చెప్పాడు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహంపై ఉన్న పసుపును కడిగించి చూడడంతో ఆమె మెడ కమిలిన నల్లని గుర్తులు కనిపించాయి. ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఎస్.ఘనీ కేసు నమోదు చేశారు. డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ లక్ష్మణమూర్తిలు మంగళవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబీకులను విచారణ చేశారు. మణి చావుకు కారణం అద నపు కట్నం వేధింపులే అని పలువురు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం విజయనగరం క్రైం: అదనపు కట్నం వేధింపులు తాళలేక పట్టణానికి చెందిన ఓ వివాహిత మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం..పట్టణంలోని ఇప్పిలివీధిలో ఎస్.గణేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. గణేష్‌కు రెండేళ్లక్రితం విశాఖ జిల్లా వేపగుంటకు చెందిన విజయమాధవితో వివాహమైంది. ఈ దంపతులకు ప్రస్తుతం ఓ పాప కూడా ఉంది. పెళ్లి అయిన దగ్గర నుంచి గణేష్‌తోపాటు అత్త మహాలక్ష్మి, చిన్నత్త పద్మ, అడపడుచు కామేశ్వరి అదనపుకట్నం కోసం మాధవిని నిరంతరం వేధిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉదయం కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లిన తర్వాత మాధవి ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు భరించలేక కేకలు వేయడంతో స్థానికులు చూసి 108కు సమాచారం అందించి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మాధవి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలు తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని ఇన్చార్జ్ సీఐ కె.రామారావు తెలిపారు. -
టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు
భువనేశ్వర్: టీ ఇవ్వటంలో ఆలస్యం చేసిందని భార్యను హతమార్చాడో కిరాతక భర్త. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని దెన్కనల్ జిల్లా గుహలిపుల్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... మహలి నాయక్ (56) సోమవారం ఉదయం భార్య ఝనాను టీ కావాలని అడిగాడు. అయితే టీ చేసి ఇవ్వటంలో జాప్యం కావటంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో అతడు భార్యతో వాగ్వివాదానికి దిగాడు. అతి కాస్తా తీవ్రతరం కావటంతో ఆమె భర్తకు వంట చేసి, వడ్డించేందుకు నిరాకరించింది. ఇదే విషయంపై బుధవారం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగటంతో కోపోద్రిక్తుడైన మహలి నాయక్ బుధవారం రాత్రి పదునైన ఆయుధంతో భార్య హతమార్చాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
పోలీస్.. నా భార్యను చంపేస్తున్నాను!
టర్కీలో ఓ వ్యక్తి తాను కట్టుకున్న భార్యను కరెంటు షాక్ ఇచ్చి చంపుతూ.. ఆ ప్రక్రియ చేస్తుండగానే పోలీసులకు ఫోన్ చేశాడు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా.. రెండోసారి కూడా ఆడబిడ్డకు జన్మనివ్వడం. అతడితో ఫోన్లో మాట్లాడిన పోలీసులు అంతా అయ్యేవరకు వేచి ఉన్నారు తప్ప ఆ నేరాన్ని మాత్రం ఆపడానికి ప్రయత్నించకపోవడం ఇందులో మరో విశేషం. టర్కీలోని ఆగ్నేయ దియార్బకిర్ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి (29) తన భార్య నిద్రపోతున్న సమయంలో ఆమె గెడ్డం కింద కరెంటు వైరు పెట్టి చంపేశాడు. ఆమెకు రెండో కూతురు పుట్టిన రెండోరోజే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పోలీసులకు, ఆ వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను వతన్ అనే వార్తాపత్రిక యథాతథంగా ప్రచురించింది. ఆ వివరాలివీ.. ''నేను ఒకళ్లని చంపేశాను''.. అని ఆ వ్యక్తి పోలీసు ఆపరేటర్‌కు చెప్పాడు ''ఎవరిని చంపావు''.. అవతలి అధికారి అడిగాడు ''నేను నా భార్యను ఇప్పుడే చంపుతున్నాను''.. ఆ వ్యక్తి ''నువ్వు ఆమెను చంపేశావా, లేక చంపుతున్నావా?'' పోలీసు అధికారి ''ఆమె ఇంకా చనిపోలేదు. కానీ ఈ హత్య హలాల్ (ఇస్లాంలో ఆమోదయోగ్యం) అయితే నేను ఆమెను చంపుతున్నాను''.. ఆ వ్యక్తి ''ఆమెతో నీకు సమస్య ఏంటి?''.. పోలీసు అధికారి ''నేను నా భార్యను చంపుతున్నానని చెబుతుంటే, నువ్వు మాత్రం సమస్య ఏంటని అడుగుతావా? బాధతో అరుస్తోందని ఆమె నోరు మూసేశా''.. ఆ వ్యక్తి అప్పటికి ఆ పోలీసుకు మెలకువ వచ్చి, ''సరే.. ఆగు. నేను ఓ యూనిట్‌ను పంపుతున్నాను'' అని చెప్పాడు. కుర్దిష్ ప్రాంతంలో ఓ స్థానిక రెస్టారెంటులో వెయిటర్‌గా పనిచేస్తున్న నిందితుడికి ఇప్పటికే నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండోసారి కూడా కూతురికే జన్మనివ్వడంతో తట్టుకోలేని కోపం వచ్చి ఇలా చేసినట్లు డిఫెన్స్ న్యాయవాది కోర్టులో తెలిపారు. పైపెచ్చు, నిందితుడు నేరం మొత్తం చేసేవరకు ఫోన్లో మాట్లాడారు తప్ప పోలీసులు సరిగా స్పందించలేదన్నారు. -
భార్యను నరికి చంపిన భర్త
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చాయాపురంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త తన భార్యను గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భార్యభర్తల మధ్య నెలకొన్న కలహాలే ఆ ఘటనకు కారణమని పోలీసులు విచారణలో స్థానికులు వెల్లడించారు.