భర్త చేతిలో భార్య హతం | Husband and wife to death | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో భార్య హతం

Published Tue, Oct 7 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

భర్త చేతిలో భార్య హతం

భర్త చేతిలో భార్య హతం

లింగాల: మూడుముళ్లు వేసి.. ఏడు అడుగులు నడిచిన ఓ భర్త జీతాంతం తోడు ఉంటాననే మాటమరిచి భార్య ను హతమార్చాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని అంబట్‌పల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దండు శ్రీశైలం, రేణుక  భార్యాభర్తలు కాగా వారికి ఇద్దరుపిల్ల లు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మరోసారి గొడవపడ్డారు. ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగి భర్త భా ర్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. ఈ విషయం బయటకు పొక్కకుండా జా గ్రత్తపడ్డాడు.

చనిపోయిన భార్యపై చీర కప్పి ఏమి తెలి యనట్లు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. తిరిగి ఇం టికొచ్చి తన భార్య చనిపోయినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు గ్రామానికి చేరుకుని హంగామా సృష్టిం చారు. మృతురాలి భర్తను కొట్టడమే కాకుండా పోలీ సులు, గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ హుటాహుటిన నాగర్‌కర్నూల్, అచ్చంపేట సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, బల్మూర్, సిద్దాపూర్ ఎస్‌ఐలు శ్రీధర్, చంద్రమోహన్‌రావుతో కలిసి గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే నేరమని హెచ్చరించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ అన్నారు.మృతురాలి అన్న ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణసింగ్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement