పొందూరు: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కర్కశకంగా చంపేశాడో భర్త. విషయం బయటకు చెబితే కన్నకూతుర్ని కూడా హతమారుస్తానని బెదిరించి మనిషి అనే మాటకు అర్థం లేకుండా చేశాడా మానవ మృగం. ఈ ఘోరం గారపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తన కూతురును అల్లుడే చంపేసాడని మృతురాలు తండ్రి సోపేటి అప్పలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు. తాగిన మైకంలో మురపాక తవుడమ్మ (30)ను ఆమె భర్త రాములు చీరను మెడకు చుట్టి చంపేసి తరువాత ఫ్యాన్‌కు వేలాడిదీసినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న రాములు భార్యను కోరిక తీర్చమని అడగడంతో వారి మధ్య గొడవ జరిగి పెనుగులాడుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
తవుడమ్మ మెడకు చీరను చుట్టి చంపేశాడని, ఆ సమయంలో అప్పటివరకూ నిద్రంలో ఉన్న కూతురు భవానికి మెలకవరావడం, తల్లిని తండ్రే చంపేయడాన్ని చూసింది. దీంతో ఆగ్రహించిన రాములు ఈ విషయం బయటకు చెబితే నిన్ను కూడా చంపేస్తానని కూతురుని బెదిరించినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యలో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు.
భర్త చేతిలో భార్య హతం
Published Sun, Jul 5 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement