వేధింపులకు విసిగి వేసారి.. | Husband harassing wife and killed husband | Sakshi

వేధింపులకు విసిగి వేసారి..

Dec 30 2017 12:32 PM | Updated on Dec 30 2017 12:32 PM

Husband harassing wife and killed husband - Sakshi

సోమూనాయక్‌మృతదేహం

కొండమల్లేపల్లి(దేవరకొండ) : మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండడంతో తన భర్త మొఖంపై బెడ్‌షీట్‌ను అదిమిపట్టి హత్యచేసింది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలంలోని చెన్నారం గ్రాపంచాయతీ ఏపూర్‌తండాలో గురువారం అర్ధరాత్రి చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఏపూర్‌తండాకు చెందిన రమావత్‌ సోమూనా యక్‌(33)కు, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన భారతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు మహేశ్‌ ఉన్నాడు. తండాలోనే వ్యవసాయంతో పాటు మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగించేవారు.

గత కొంత కాలంగా మద్యానికి బానిసైన సోమూనాయక్‌ భార్యను వేధిస్తుండేవాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సోమూనాయక్, భార్య భారతి, కుమారుడు మహేశ్‌లతో ఘర్షణకు దిగాడు. అదే రోజు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సోమూనాయక్‌ ముఖంపై భారతి బెడ్‌షీట్‌ను అదిమిపట్టింది. దీంతో ఊపిరి ఆడక సోమూనాయక్‌ మృతి చెందాడు. సోమూనాయక్‌ మృతి విషయాన్ని తెలుసుకున్న బంధువులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ శంకర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భారతిని అదపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement