harrasing
-
సాయం పేరిట ఘోరం.. ఆశ్రమం ముసుగులో అవయవాల దోపిడీ?
పేరుకు అనాథ ఆశ్రమ నిర్వాహకులు.. కానీ వారి మనసంతా కాలకూట విషమే. అవును.. మానసిక వికలాంగులు, దిక్కులేని వారిని ఆదరిస్తామంటూ తమ ఆశ్రమంలో చేర్చుకుని.. వారిపై లైంగిక దాడులు చేయిస్తూ సొమ్ము దండుకుంటున్నారు. అంతేకాక కొందరి అవయవాలను సైతం ప్రైవేటు ఆస్పత్రులకు అడ్డోగోలుగా అమ్మేస్తూ.. నరరూప రాక్షసులను తలపిస్తున్నారు. విల్లుపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాక్షి, చెన్నై: అభాగ్యులను చేరదీస్తామనే ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న అన్బు జ్యోతి అనాథ ఆశ్రమ బండారం గురువారం అధికారుల విచారణలో బయటపడింది. ఇప్పటి వరకు ఈ ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యమైనట్లు వెలుగు చూసింది. ఇక తమ దారుణాలు బయటి ప్రపంచానికి తెలియడంతో అనారోగ్యం పేరిట నాటకాలాడిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అన్బుజ్యోతి ఆశ్రమం (ఇన్సెట్) పోలీసులు రక్షించిన అభాగ్యులు వివరాలు.. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని గుండల పులియూర్‌లో అన్బుజ్యోతి పేరుతో ఓ అనాథ ఆశ్రమం ఉంది. దీనిని కేరళకు చెందిన జుబీన్(45), ఆయన భార్య మరియ జుబీన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న వారు తరచూ కనిపించకుండా పోతున్నట్లుగా చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తిరుప్పూర్‌కు చెందినన హనీదుద్దీన్ తన బంధువు జబరుల్లా(45)ను ఈ ఆశ్రమంలో చేర్పించారు. మానసిక రుగ్మతతో బాధ పడుతున్న వారికి ఇక్కడ ప్రత్యేక చికిత్స ఇస్తుండడంతో అనేక మంది యువతులు, మహిళలను వారి కుటుంబాలు తీసుకొచ్చి ఇక్కడ వదిలి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారం క్రితం జబరుల్లా బెంగళూరులో ప్రత్యక్షం కావడంతో హనీదుద్దీన్కు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడుతున్న అధికారులు కోర్టు ఆదేశాలతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఆశ్రమంలో ఉంటున్న కోల్క తాకు చెందిన ఓ యువతి విచారణలో తనకు మత్తు మందు ఇచ్చి రాత్రిళ్లు లైంగిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల అదుపులో ఆశ్రమ సిబ్బంది ఆశ్రమం సీజ్..? ఆశ్రమంలో ఉన్న రికార్డుల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కొందరు వచ్చి తమ వారిని వెంట బెట్టుకెళ్లారు. మరి కొందరి బంధువులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సెంజి డీఎస్పీ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం దృష్టి సారించింది. కలెక్టర్ పళణి ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఆశ్రమంలోని మానసిక రోగులు, అనాథలను పొలీసు సంరక్షణలో ఉంచారు. ఈ ఆశ్రమానికి అనుబంధం ఉన్న మరో భవనంలో 27 మంది మానసిక రోగులను నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లతో ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. వీరంతా తమకు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పడంతో అవయవాల విక్రయం కోసమే ఇదంతా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యం అయినట్లు తేలింది. వీరి సమాచారంపై ఆందోళన నెలకొంది. విచారణ జరుపుతున్న పోలీసులు అలాగే ఇక్కడి అనాథలు, మానసిక రోగుల అవయవాలను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారనే అంశానికి సంబంధించిన రికార్డులు బయటపడినట్లు కూడా ప్రచారం సాగుతోంది. బాధితుడు జబరుల్లాను ఆశ్రమ నిర్వాహకులు బెంగళూరుకు పంపించడంతో అక్కడి ఆసుపత్రులతో ఈ ఆశ్రమానికి ఉండే సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సోదాలు...రక్షింపు.. బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ, వైద్యాధికారులు ఆశ్రమంలో పెద్దఎత్తున సోదాలు చేశారు. ఇక్కడ మొత్తం 150 మంది మానసిక రోగులు, 27 మంది అనాథలు ఉన్నట్లు తేలింది. అయితే అనేక మంది మహిళలు తమకు రాత్రుల్లో మత్తు మందు ఇస్తున్నారని, తమపై కొందరు లైంగిక దాడి చేస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. దీంతో ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సమాచారంతో జుబీన్, ఆయన భార్య మరియా అనారోగ్యం బారిన పడ్డామంటూ విల్లుపురం ముండియం బాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు ఆశ్రమ మేనేజర్ కేరళకు చెందిన విజయ మోహన్(46), సిబ్బంది అయ్యప్పన్, గోపీనాథ్, ముత్తమారితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్వాహకులు జుబీన్, ఆయన భార్య మరియా ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తేల్చడంతో గురువారం అరెస్టు చేశారు. -
మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..
బనశంకరి: మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను అడ్డుపెట్టుకుని నగ్నచిత్రాలను తీయడం మొదలుపెట్టాడో సైకో. వాటిని చూపి బెదిరిస్తున్న కామోన్మాదిని ఈశాన్య విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పై కెమెరా వినియోగించి ఈ దందాకు పాల్పడుతున్న వ్యక్తి మైసూరు జిల్లా టీ.నరసిపురకు చెందిన మహేశ్. ఇన్‌స్టా ద్వారా వేధింపుల పర్వం ఒక యువతి ఫిర్యాదుతో ఇతని బాగోతం బయటపడింది. ఆ యువతి ఇన్‌స్టా అకౌంట్‌కు మహేశ్ నుంచి మెసేజ్ రాగా, ఎవరో అపరిచితుడు అని బ్లాక్ చేసింది. మళ్లీ వేరే ఇన్‌స్టా ఖాతా నుంచి మెసేజ్‌లు చేసి, తనతో చనువుగా చాట్ చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే మీ నగ్న వీడియో తన వద్ద ఉందని బెదిరించాడు. ఆమె పట్టించుకోలేదు. దీంతో దుండగుడు నిజంగానే ఒక వీడియోను ఆమెకు పంపాడు. అది చూసి బాధితురాలు భయభ్రాంతురాలైంది. ఎందుకంటే ఆ వీడియో ఆమె ప్రైవేటు రూమ్‌లో చిత్రీకరించినట్లు తెలుసుకుని ఈశాన్య విభాగ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఈఎన్ పోలీసులు తీవ్రంగా గాలించి మైసూరులో మహేశ్ ను శనివారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి స్పై కెమెరా, ల్యాప్‌టాప్, రెండు మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్, రెండు సెల్పోన్లను స్వాదీనం చేసుకున్నారు. ఎలా చేశాడంటే.. నిందితుడు మహేశ్, ఫిర్యాదురాలికి పరిచయస్తుడు కాగా ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె రూమ్‌లో మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చాడు. ఇంకా ఎన్ని చోట్ల ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనేదానిపై విచారణ ప్రారంభించారు. ఈశాన్య విభాగం డీసీపీ అనూప్ ఏ.శెట్టి, సీఐ సంతోష్ రామ్ ఈ కేసును దర్యాప్తు చేశారు. (చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత ) -
హైదరాబాద్: కార్పొరేటర్ తనయుడి నిర్వాకం.. ప్రేమించాలంటూ బాలికకు..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించాలంటూ ఓ బాలికను వేధిస్తున్న కార్పొరేటర్ తనయుడిపై మీర్‌పేట పోలీసులు పోక్సో, నిర్భయ కేసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లెలగూడ మల్రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు, మీర్‌పేట బీజేవైఎం అధ్యక్షుడు బచ్చనమోని ముఖేష్‌యాదవ్ స్థానికంగా నివసించే ఓ బాలిక (15)ను ప్రేమించాలంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. తరచూ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బాలిక సమీపంలోని కిరాణాషాప్‌నకు వెళ్తుండగా ముఖేష్‌యాదవ్ వెంబడించి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముఖేష్‌యాదవ్‌పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేష్‌పై మరో కేసు కూడా నమోదైందని, విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు. చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం.. మహిళ కాల్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలతో..
సాక్షి, హైదరాబాద్: రహస్యంగా ఓ మహిళ సెల్ఫోన్లో కాల్ రికార్డింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసి.. ఓ మహిళను వేధించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఓ వివాహితకు ఏడాది క్రితం ఫేస్బుక్లో రామచంద్రాపురం బీడీఎల్ కాలనీకి చెందిన తాళ్ల అనుప్ గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరచూ మాట్లాడుకోవటం, కలుసుకోవటం చేసేవాళ్లు. గత అక్టోబర్‌లో బాధితురాలిని బయట కలిసిన నిందితుడు ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో ‘సర్బ్యూస్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. దీంతో సెల్‌ఫోన్ హ్యాక్ చేసి.. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ సంభాషణలు సేకరించాడు. అప్పటినుంచి ఆమెను శారీరక సంబంధం కొనసాగించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేని పక్షంలో ఫొటోలు, వీడియోలు భర్త, కుటుంబ సభ్యులకు పంపిస్తామనని బెదిరించాడు. దీంతో ఆమె అనుప్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో అతను వేరే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీంతో బాధితురాలు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. సెక్షన్ 354 (డీ), 506 కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: పండగ వేళ విషాదం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్యహత్య 64 మంది పోకిరీల ఆటకట్టు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఆరు వారాల్లో రాచకొండ షీ టీమ్స్‌కు 64 మంది ఆకతాయిలు చిక్కారు. ఇందులో 23 మంది మైనర్లు కావడం గమనార్హం. 57 కేసు లు నమోదు కాగా.. వీటిలో 24 ఎఫ్ఐఆర్లు, 23 ఈ–పెట్టీ కేసులు, 10 కౌన్సెలింగ్ కేసులున్నాయి. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, రాచకొండ షీ టీమ్స్ సంయుక్తంగా ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీస్‌లో వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాయి. అలాగే షీ టీమ్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి.. మెట్రో రైల్ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కిన 16 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 45 రోజుల్లో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు రాచకొండ షీ టీమ్స్ 136 చైల్డ్ మ్యారేజ్‌లను అడ్డుకున్నాయి. -
ఆమెలాగా అతగాడి పరిచయం.. అశ్లీల వీడియోలను పంపించాలని..
లక్నో: ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమకు తెలియని వారితో ఫేస్బుక్, ఇన్‌స్టాలో చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత స్నేహం పేరుతో తమ నంబర్లను మార్చుకుంటున్నారు. కొత్తలో బాగా ఉన్నా.. ఆతర్వాత కొందరు మోసగాళ్ల బారినపడి బ్లాక్ మెయిలింగ్‌కు గురౌతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటన తాజాగా.. ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన 23 ఏళ్ల యువకుడు ఫేస్బుక్, ఇన్స్టాలలో అనేక నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత అనేక మంది యువతులకు రిక్వెస్ట్ పేట్టేవాడు. తాను ఒక ఎన్ఆర్ఐకు చెందిన యువతి అని, కెనడాలో ఉంటానని చెప్పుకునే వాడు. అతగాడి మెసెజ్‌కు రిప్లై ఇచ్చిన వారితో కొన్నిరోజులు చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత అవతలి అమ్మాయికి తన నకిలీ అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపేవాడు. అంతటితో ఆగకుండా నువ్వుకూడా నీ న్యూడ్ ఫోటోలు, వీడియోలను పంపాలని కోరేవాడు. ఈ క్రమంలో అతగాడి మాయలో పడిన కొందరు వారి ఫోటోలు పంపగానే తన అసలు రంగును బయటపేట్టేవాడు. వారిని డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడేవాడు. అడిగినంతా డబ్బు ఇవ్వకపోతే ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఆ దుర్మార్గుడికి 15 ఏళ్ల బాలిక ఇన్‌స్టాలో పరిచయం అయ్యింది. ఆమెను ఇలాగే వేధింపులకు పాల్పడ్డాడు. అయితే, సదరు యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. వారు వెంటనే యూపీలోని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. ఐదుగురు కలిసి ఇంట్లో బంధించి.. -
వేధింపులకు విసిగి వేసారి..
కొండమల్లేపల్లి(దేవరకొండ) : మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండడంతో తన భర్త మొఖంపై బెడ్‌షీట్‌ను అదిమిపట్టి హత్యచేసింది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలంలోని చెన్నారం గ్రాపంచాయతీ ఏపూర్తండాలో గురువారం అర్ధరాత్రి చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఏపూర్‌తండాకు చెందిన రమావత్ సోమూనా యక్(33)కు, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన భారతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు మహేశ్ ఉన్నాడు. తండాలోనే వ్యవసాయంతో పాటు మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన సోమూనాయక్ భార్యను వేధిస్తుండేవాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సోమూనాయక్, భార్య భారతి, కుమారుడు మహేశ్‌లతో ఘర్షణకు దిగాడు. అదే రోజు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సోమూనాయక్ ముఖంపై భారతి బెడ్‌షీట్‌ను అదిమిపట్టింది. దీంతో ఊపిరి ఆడక సోమూనాయక్ మృతి చెందాడు. సోమూనాయక్ మృతి విషయాన్ని తెలుసుకున్న బంధువులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ శంకర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భారతిని అదపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎంపీడీఓపై టీడీపీ నాయకుల దురుసు ప్రవర్తన
సోమందేపల్లి: సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదని మండల పరిషత్ అబివృద్ధి అధికారి లలితాబాయిపై టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎంపీడీఓపై టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, మాజీ సర్పంచ్ రంగప్ప, మహిళా ఎంపీటీసీ సభ్యురాలు భర్త బాబయ్య దౌర్జన్యంగా వ్యవహరించారు. అధికారి, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల మాటలతో మనస్థాపానికి గురైన ఎంపీడీఓ.. గ్రీవెన్స్‌లో అధికారుల సమక్షంలోనే కంట తడిపెట్టారు. తాను ఇక్కడ పని చేయలేనని,సెలవుపై వెళ్తానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులు అక్కడికి చేరుకోవడంతో తగ్గిన టీడీపీ నాయకులు మెత్తబడ్డారు. అనంతరం అక్కడికక్కడే ఆమె మెడికల్ లీవ్‌పై వెళ్తున్నట్లు తహశీల్దార్ రామాంజనరెడ్డితో తెలిపారు. టీడీపీ మండల కన్వీనర్ గతంలోనూ పలు సమావేశాల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. -
దావూద్ అనుచరుడిని వినకపోతే ఖతం చేస్తా..
బంజారాహిల్స్: నేను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ అనుచరుడినని ...తనతో సంబంధం కొనసాగింకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్న ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూర్‌కు చెందిన యువతి(33) కమలాపురి కాలనీలో ఉంటూ సాఫ్ట్వేర్ సంస్దలో టెక్నికల్ రైటర్‌గా పనిచేస్తోంది. గత జూన్‌లో ఆమెకు ఫేస్బుక్ ద్వారా డీజే. అడ్డి దుబాయ్ అలియస్ ఎండీ సఫీ –ఉర్– రెహమాన్ అలియాస్ సఫీతో పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు లేరని దుబాయ్ పౌరసత్వం ఉందని, గత 8 ఏళ్లుగా అక్కడే డీజేగా పనిచేస్తున్నానని ఒక కేఫ్‌తో పాటు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నట్లు నమ్మించాడు. గత జులైలో ఇద్దరూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో సహజీవనం చేశారు. అతడికి అప్పటికే వివాహం జరిగిందని, ఒక కుమార్తె కూడా ఉందని, తల్లిదండ్రులతో కలిసి అత్తాపూర్ హుస్సేన్కాజిల్లో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ఈ నెల 2న అడ్డీని నిలదీయగా ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. దీంతో అతను తన లాప్‌ట్యాప్‌తో పాటు ఫోన్, నగలు, నగదు తీసుకుని పరారయ్యాడని ఈ విషయం పోలీసులకు చెబితే తనతో దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో విడిపోవాలని తాను నిర్ణయించుకున్నా తాను పిలిచినప్పుడల్లా వచ్చి కోరికలు తీర్చాల్సిందిగా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. తనకు సహకరించకపోతే దావూద్ ఇబ్రహీంతో చెప్పి అడ్రస్ లేకుండా చేయిస్తానని హెచ్చరిస్తున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అడ్డి దుబాయ్‌పై పోలీసులు ఐపీసీ కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు, ఎస్ఐ వినోద్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా మహిళతో అసభ్య ప్రవర్తన...
ముంబై: అమెరికా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గోపాల్ వాల్మీకి(20)ని ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్టు దక్షిణ ముంబైలోని కొలాబా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ వినయ్ గాడ్గిల్ తెలిపారు. సోమవారం మార్నింగ్ వాక్ కు వెళ్లిన అమెరికా మహిళ పట్ల గోపాల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. నిందితుడి ఫోటో తీసిన బాధితురాలు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఘటన గురించి ట్విటర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. అంతేకాదు తన కేకలు విని సహాయం అందించడానికి ముందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు గురించి కూడా ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన పోలీసులు మంగళవారం ఆమె వాంగ్మూలం తీసుకుని, కేసు నమోదు చేశారు.