అమెరికా మహిళతో అసభ్య ప్రవర్తన... | Youth held for harrasing American woman in Mumbai | Sakshi
Sakshi News home page

అమెరికా మహిళతో అసభ్య ప్రవర్తన...

Published Wed, Aug 19 2015 12:25 PM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితుడి ఫోటో - Sakshi

బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితుడి ఫోటో

ముంబై: అమెరికా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గోపాల్ వాల్మీకి(20)ని ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్టు దక్షిణ ముంబైలోని కొలాబా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ వినయ్ గాడ్గిల్ తెలిపారు.

సోమవారం మార్నింగ్ వాక్ కు వెళ్లిన అమెరికా మహిళ పట్ల గోపాల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. నిందితుడి ఫోటో తీసిన బాధితురాలు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఘటన గురించి ట్విటర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. అంతేకాదు తన కేకలు విని సహాయం అందించడానికి ముందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు గురించి కూడా ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన పోలీసులు మంగళవారం ఆమె వాంగ్మూలం తీసుకుని, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement