ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రహస్యంగా ఓ మహిళ సెల్‌ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి.. ఓ మహిళను వేధించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఓ వివాహితకు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో రామచంద్రాపురం బీడీఎల్ కాలనీకి చెందిన తాళ్ల అనుప్ గౌడ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరచూ మాట్లాడుకోవటం, కలుసుకోవటం చేసేవాళ్లు. గత అక్టోబర్‌లో బాధితురాలిని బయట కలిసిన నిందితుడు ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లో ‘సర్‌బ్యూస్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేశాడు.
దీంతో సెల్‌ఫోన్ హ్యాక్ చేసి.. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ సంభాషణలు సేకరించాడు. అప్పటినుంచి ఆమెను శారీరక సంబంధం కొనసాగించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేని పక్షంలో ఫొటోలు, వీడియోలు భర్త, కుటుంబ సభ్యులకు పంపిస్తామనని బెదిరించాడు. దీంతో ఆమె అనుప్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో అతను వేరే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీంతో బాధితురాలు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. సెక్షన్ 354 (డీ), 506 కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
చదవండి: పండగ వేళ విషాదం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్యహత్య
64 మంది పోకిరీల ఆటకట్టు..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఆరు వారాల్లో రాచకొండ షీ టీమ్స్‌కు 64 మంది ఆకతాయిలు చిక్కారు. ఇందులో 23 మంది మైనర్లు కావడం గమనార్హం. 57 కేసు లు నమోదు కాగా.. వీటిలో 24 ఎఫ్‌ఐఆర్‌లు, 23 ఈ–పెట్టీ కేసులు, 10 కౌన్సెలింగ్ కేసులున్నాయి. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, రాచకొండ షీ టీమ్స్ సంయుక్తంగా ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ ఆఫీస్‌లో వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాయి. అలాగే షీ టీమ్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి.. మెట్రో రైల్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కిన 16 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 45 రోజుల్లో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు రాచకొండ షీ టీమ్స్ 136 చైల్డ్ మ్యారేజ్‌లను అడ్డుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment