harrasments
-
నా భర్తను చిత్రహింసలు పెట్టి వాంగ్మూలం తీసుకున్నారు: వర్రా కళ్యాణి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: తన భర్తను నవంబర్ 11వ తేదీన అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నది పూర్తిగా అబద్ధమని సోషల్‌మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి భార్య వర్రా కళ్యాణి చెప్పారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వర్రా కళ్యాణి మీడియాతో మాట్లాడారు.‘కర్నూలు టోల్‌ప్లాజా వద్ద నవంబర్ 8వ తేదీన నా భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియో మీడియాకి విడుదల చేస్తున్నాను. మూడు రోజులు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారు. నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలి. అదుపులోకి తీసుకునే వరకూ పోలీసులకు వర్రా రవీంద్రారెడ్డి ఎవరో కూడా తెలియదు.మాస్కులు వేసి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తిప్పారని మెజిస్ట్రేట్ ముందు నా భర్త వాంగ్మూలం ఇచ్చారు. విపరీతంగా రవీంద్రారెడ్డిని కొట్టారని పక్కన ఉన్నవాళ్లు ఉదయ్,సుబ్బారెడ్డి చెప్తున్నారు. పోలీసులు తాము చెప్పినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారు. నా భర్తకు న్యాయం జరగాలి..స్వయంగా నేను గాయాలు చూశాను. అంత చిత్ర హింసలు పోలీసులు ఎందుకు పెట్టారు? వాళ్ళకు పై నుంచి ఉన్న ఒత్తిడి వల్లే ఇలా చిత్రహింసలు పెట్టారు. ఒప్పుకోకపోతే మీ భార్య,పిల్లలపై కూడా కేసులు పెడతామన్నారు. మా ఆయన ప్రశ్నించారంతే..అసభ్య పోస్టులు పెట్టలేదు. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి నా భర్త పేరుపై 18 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టాడు’అని వర్రా కళ్యాణి తెలిపారు. -
సందేశ్‌ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్‌ఖాలీలోని ఝుప్‌ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్‌చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్‌యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్‌చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్‌ను అరెస్ట్‌చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల కేసు
లాస్ ఏంజెలిస్: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో సహాయకురాలి పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించారంటూ మాజీ ఉద్యోగిని అస్టా జొనాస్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. అట్లాంటాలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో విన్ డీజిల్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె గురువారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశారు. లైంగిక వాంఛను తీర్చలేదనే కోపంతో వెంటనే విన్ డీజిల్‌కు చెందిన వన్ రేస్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనను తొలగించినట్లు ఆరోపించారు. -
మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు..సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. జిల్లాలోని బారాబంకీలో నియామకం అయిన ఏడాదిన్నర నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి రెండు పేజీల లేఖలో ప్రస్తావించారు. ‘నాకు ఏమాత్రం జీవించాలని లేదు. ఏడాదిన్నర కాలంలో నన్ను జీవచ్ఛవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి’అని అందులో తెలిపారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా, బాధితురాలి లేఖపై సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో..
సాక్షి, అన్నమయ్య: నర్సింగ్ చదువుతున్న అమ్మాయిల వెంటపడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలకు దిశ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో, పోకిరీలు.. దిశ పోలీసులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. మరొకసారి అమ్మాయిల వెంటపడి, వేధింపులకు గురిచేయమని ఇద్దరు యువకులు పోలీసులకు లేఖ రాసి ఇచ్చారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరులో నర్సింగ్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు శనివారం కాలేజ్‌కు వెళ్తున్నారు. ఇద్దరు యువకులు అమ్మాయిలను అనుసరించి వేధింపులకు గురిచేశారు. దీంతో, బాధిత యువతులు దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కేవలం ఆరు నిముషాల వ్యవధిలో దిశ టీమ్ విద్యార్థినుల ఉన్న లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం, నర్సింగ్ కాలేజ్ అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న సురేష్, చంద్ర శేఖర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొక్కమారు అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేయమని యువకులు లిఖితపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. ఇక, దిశ యాప్‌ను కొన్ని రోజుల కిందటే డౌన్లోడ్ చేసుకున్నట్లు బాధిత యువతి స్పష్టం చేసింది. దిశ SOSకు కాల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు చాలా బాగుందని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను 21లోగా అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కీలక మలుపు తిరిగింది. ఆదివారం నిరసన దీక్షా శిబిరం వద్దకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్, ఖాప్ మహమ్ 24 నేత మెహర్ సింగ్, సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దేవ్ సింగ్ సిర్సా తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ‘ఇకపై ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనల్లో పాల్గొంటాం. రెజ్లర్లకు వెలుపలి నుంచి మద్దతు తెలుపుతామన్నారు. వారికేదైనా సమస్య వస్తే తోడుంటాం’అని రైతు సంఘాల నేతలు చెప్పారు. బాధిత రెజ్లర్ల డిమాండ్ల కోసం ఈ నెల 11–18 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి, సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 21న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి రాజకీయ నిరసనలు కావు..తమది రాజకీయేతర సంస్థ అని చెప్పారు. ఇలా ఉండగా, తమ నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపారు. ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆదివారం జంతర్‌మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)ను మోహరించారు. ఇలాఉండగా, నిరసనకు దిగిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు తెలపడంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలని కోరారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానన్నానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆరోపణలు రుజువైతే శిక్ష విధించండి. దోషిగా తేలితే నన్ను కొట్టి చంపండి’అని పేర్కొన్నారు. -
న్యాయ నిపుణులతో రెజ్లర్ల చర్చలు
న్యూఢిల్లీ: పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ భారత స్టార్ రెజ్లర్లు తమ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగియడం... ఢిల్లీ న్యాయపరిధిలో తేల్చుకోవాలన్న కోర్టు సూచనపై రెజ్లర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘శుక్రవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. ఖాప్ పంచాయత్, రైతులు, మహిళా సంఘాలకు చెందిన 31 మంది సభ్యులున్న ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులుగా ఉన్న మరో కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిజం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు రెజ్లర్లకే ఈ పోరాటం పరిమితం కాదు. హైకోర్టుకు వెళ్లి మళ్లీ మా పోరాటం మొదలుపెట్టే అవకాశాలున్నాయి’ అని రెజ్లర్ బజరంగ్ పూనియా తెలిపాడు. దర్యాప్తుతోనే వాస్తవాలు: క్రీడల మంత్రి ఠాకూర్ ‘రెజ్లర్ల డిమాండ్లన్నీ తీరుతాయి. ముందయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరగనివ్వండి. దీనిపై సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విచారణలో పోలీసులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తే... న్యాయబద్ధంగా గట్టి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది’ అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. గంగూలీ ఏమన్నాడంటే... భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘రెజ్లర్లు దేశానికెంతో చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. వారి పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. ఈ వ్యవహారంపై నాకు పూర్తి వివరాలు తెలియదు. పత్రికల్లో చదివిందే! ఏదేమైనా ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు. -
ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు ముగిస్తున్నాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్ నెరవేరడంతో కేసును ముగిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఎదురుదెబ్బ కాదని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని బజరంగ్, వినేశ్, సాక్షి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిందని దీనిని కూడా పరిశీలిస్తామని వినేశ్ తెలిపింది. -
8 ఏళ్లప్పుడు మా నాన్న లైంగికంగా వేధించాడు
చెన్నై/జైపూర్: నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రే తనను లైంగికంగా వేధించారని చెప్పారు! ‘మోజో స్టోరీ’ డిజిటల్ వార్తా చానల్ ఇటీవల జైపూర్‌లో నిర్వహించిన ‘వుయ్ ది విమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఒక మగవాడిగా దాన్ని జన్మహక్కుగా భావించేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని గుర్తు చేసుక్నున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు. -
పట్టు విడువని రెజ్లర్లు.. చర్యలు చేపట్టిన కేంద్రం.. నిరసన విరమణ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను తొలగించడం సహా డిమాండ్లన్నీ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజర్లు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తమ ధర్నాను విరమించారు. ‘‘రెజ్లర్ల ఆరోపణలపై ఓవర్‌సైట్ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ డబ్ల్యూఎఫ్ఐ, దాని చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇదిలాఉండగా.. ‘దంగల్’లో దిగితే ప్రత్యర్థుల పట్టుపట్టే రెజ్లర్లు అదే జోరుతో ధర్నాతో హడలెత్తించి.. డిమాండ్లు సాధించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో ఏళ్ల తరబడి తిష్టవేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను గద్దె దించేదాకా ధర్నా విరమించబోమని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, రవి దహియా, బజరంగ్ పూనియా, దీపక్ పూనియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పున్నా వెరువమని, అన్నింటికి సిద్ధపడే న్యాయ పోరాటానికి దిగామని చెప్పారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తొలగించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని వారంతా పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వ్యవహరించారు. అత్యవసర భేటీ నిర్వహించి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని ఉష హామీ ఇచ్చారు. మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ... లైంగిక ఆరోపణల వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న స్టార్ రెజ్లర్ల డిమాండ్‌పై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పందించింది. అథ్లెట్ దిగ్గజం పీటీ ఉష నేతృత్వంలోని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులు శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు ఈసీ సభ్యులైన మాజీ షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్, సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే, ప్రత్యేక ఆహ్వానితులుగా శివ కేశవన్ ఈ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు చేస్తున్నవి తీవ్రమైన ఆరోపణలు కావడంతో వీటిపై నిగ్గు తేల్చేందుకు దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. ఏజీఎం తర్వాతే బ్రిజ్‌భూషణ్ స్పందన గోండా (ఉత్తర ప్రదేశ్): తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూ ఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ త్వరలోనే ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతీక్ భూషణ్ సింగ్ శుక్రవారం మీడియాతో అన్నారు. ‘ఈ నెల 22న డబ్ల్యూఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇది ముగియగానే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారు’ అని అన్నారు. -
‘సాయ్’ స్పందన సరిగా లేదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు. ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం. -
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
పుల్లారెడ్డి ప్రజ్ఞారెడ్డికి అండగా నిలిచిన ద్రౌపది ముర్ము.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు వేధింపుల వ్యవహారం చివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరుకుంది. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రౌపది ముర్ముకు పుల్లారెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి వేధింపుల విషయమై వినతి పత్రం అందజేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞారెడ్డి వినతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల విషయంలో చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, అంతుకు ముందు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి వేధిస్తున్నాడని గతంలో ఫిర్యాదు చేశారు. అంతుకుముందు.. రాఘవరెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని ప్రజ్ఞారెడ్డి వాపోయారు. తమను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు. -
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్‌తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్‌లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం.. మహిళ కాల్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలతో..
సాక్షి, హైదరాబాద్: రహస్యంగా ఓ మహిళ సెల్ఫోన్లో కాల్ రికార్డింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసి.. ఓ మహిళను వేధించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఓ వివాహితకు ఏడాది క్రితం ఫేస్బుక్లో రామచంద్రాపురం బీడీఎల్ కాలనీకి చెందిన తాళ్ల అనుప్ గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరచూ మాట్లాడుకోవటం, కలుసుకోవటం చేసేవాళ్లు. గత అక్టోబర్‌లో బాధితురాలిని బయట కలిసిన నిందితుడు ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో ‘సర్బ్యూస్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. దీంతో సెల్‌ఫోన్ హ్యాక్ చేసి.. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ సంభాషణలు సేకరించాడు. అప్పటినుంచి ఆమెను శారీరక సంబంధం కొనసాగించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేని పక్షంలో ఫొటోలు, వీడియోలు భర్త, కుటుంబ సభ్యులకు పంపిస్తామనని బెదిరించాడు. దీంతో ఆమె అనుప్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో అతను వేరే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీంతో బాధితురాలు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. సెక్షన్ 354 (డీ), 506 కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: పండగ వేళ విషాదం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్యహత్య 64 మంది పోకిరీల ఆటకట్టు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఆరు వారాల్లో రాచకొండ షీ టీమ్స్‌కు 64 మంది ఆకతాయిలు చిక్కారు. ఇందులో 23 మంది మైనర్లు కావడం గమనార్హం. 57 కేసు లు నమోదు కాగా.. వీటిలో 24 ఎఫ్ఐఆర్లు, 23 ఈ–పెట్టీ కేసులు, 10 కౌన్సెలింగ్ కేసులున్నాయి. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, రాచకొండ షీ టీమ్స్ సంయుక్తంగా ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీస్‌లో వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాయి. అలాగే షీ టీమ్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి.. మెట్రో రైల్ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కిన 16 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 45 రోజుల్లో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు రాచకొండ షీ టీమ్స్ 136 చైల్డ్ మ్యారేజ్‌లను అడ్డుకున్నాయి. -
బీజేపీ పాలనలో రైతులకు వేధింపులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనలో వేధింపులకు గురవుతున్నట్లు రైతులు భావిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 స్థానాలకు గాను 400 సీట్లను గెలుచుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ అమలు అసంభవంగా కనిపిస్తోందని తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రజలు, రైతులు ప్రస్తుతం రైతుల ఆదాయం ఎంత అని బీజేపీని అడుగుతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు కూడా పైకెగబాకాయి. అలాంటప్పుడు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఎప్పటికి నెరవేరుతుంది?’అని ఆయన ప్రశ్నించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నా రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ‘రైతులు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, వారు ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములకు సక్రమమైన పరిహారం అందజేస్తాం’అని చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి అనేక పథకాలు, హామీలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. చెరకు రైతులకు చెల్లింపుల విషయమై ఆయన మాట్లాడుతూ..‘అసలు విషయం చెల్లింపులకు సంబంధించింది కాదు. పాత బకాయిల గురించి. రైతుల వేదన సీఎం యోగికి వినిపించడం లేదు’అని చెప్పారు. -
‘నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అత్త పెళ్లి చేసుకోమంటుంది’
భువనేశ్వర్: ‘సార్.. మా ప్రాణాలు కాపాడండి’ అంటూ వివాహిత సునీతా ప్రధాన్ గురువారం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైన ఈమె భర్తతో కలిసి గంజాం జిల్లాలోని చికిటి సమితి, కె.నువాగాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరాడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి నివాసముంటోంది. అయితే కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె భర్త చనిపోగా అప్పటి నుంచి తన ఐదేళ్ల కూతురితో కలిసి అత్త వారి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఆమెని తన అత్త, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఎస్పీకి తెలిపింది. దీంతో పాటు తన అత్త నేర చరిత్ర కలిగిన మహేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెడుతున్నారని బాధితురాలు వాపోయింది. ఇదే విషయంపై తన తండ్రి వారిని ప్రశ్నించగా, అతనిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని ఆమె ఎస్పీ ఎదుట వాపోయింది. ఈ ఘటన పట్ల కె.నువాగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పటికైనా తమ అత్తవారింటి నుంచి ముప్పు ఉందని, నిందితులపై చర్యలు చేపట్టాల్సిందిగా ఎస్పీని ఆమె కోరారు. అనంతరం ఎస్పీ పినాకి మిశ్రాకి ఫిర్యాదు పత్రం అందజేశారు. -
పక్క తడిపాడని కన్నతండ్రే..
ముంబై: ముంబైలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కన్న కొడుకును చిత్రహింసలకు గురిచేసాడు. వివరాల్లోకి వెళ్తే.. థానేలోని వాగ్లేకర్ ఎస్టేట్స్‌లో ఓవ్యక్తి తన రెండో భార్యతో కలిసి మొదటి భార్య కుమారుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 9 ఏళ్ల పిల్లాడు నిద్రలో పక్కతడిపినందుకు అతన్ని చిత్రహింసలు పెట్టాడు. పిల్లాన్ని చితకబాది భార్యాభర్తలిద్దరూ పైశాచికానందం పొందారు. అంతటితో ఆగకుండా బాలుని ప్రైవేటు భాగాలపై వాతలు పెట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఈ ఘటన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన -
క్యాష్ ఇస్తారా? కేటాయిస్తారా?
ఇది సామాన్యుల బడ్జెట్ అని, ఇది రైతుల బడ్జెట్ అని, ఇది వ్యాపారుల బడ్జెట్ అని, ఇది ఉద్యోగుల బడ్జెట్ అని ఏటా ఏదో ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈసారి మాత్రం ఇది పూర్తిగా ‘మహిళా బడ్జెట్’ అవవలసిన అవసరమైతే ఉంది. కొద్ది గంటల్లో బడ్జెట్! కష్టకాలంలో వస్తున్న బడ్జెట్. కరోనా వల్ల అందరూ కష్టపడ్డారు. అందరికన్న ఎక్కువ కష్టం అనుభవించింది మహిళలు, బాలికలు, బాలలే! లాక్డౌన్ సమయంలో వారికి రక్షణ, భద్రత లేకుండా పోయాయి. వారిపై లైంగిక హింసకు అడ్డు లేకుండా పోయింది! సొంత ఇంట్లోనే వారికొక ‘స్పేస్’ కరువై పోయింది. ఆ స్పేస్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ఇవ్వబోతున్నారా? లైంగిక హింసను నిరోధించడానికి కొత్త విధానాలు, కేటాయింపులు బడ్జెట్లో ఏమైనా ఉంటాయా? అయితే అవి ఎలాంటివి అయి ఉంటాయి?! ధీమా కోసం మహిళల కొంగుకు పది రూపాయలు ముడేస్తారా? భారీ నిధుల ప్రణాళిలతోనే ధైర్యం కల్పిస్తారా? స్త్రీ శిశు సంక్షేమానికి యేటా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఈసారి సంక్షేమం కన్నా కూడా లైంగిక హింస నుంచి మహిళలకు రక్షణ, భద్రత కల్పించడానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని కరోనా కలిగించింది. ఈ సంగతి బడ్జెట్ వేసే వాళ్ల దృష్టికి చేరనిదేమీ కాదు. నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇండియా లాక్డౌన్లో ఉన్న సమయంలో ఒక్క జూన్ నెలలోనే మహిళలు, బాలలపై లైంగిక నేరాలు జరిగినట్లు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కు 2043 ఫిర్యాదులు అందాయి! ఇక పిల్లలపై జరిగిన హింసకైతే అంతే లేకుండా పోయింది. లాక్ డౌన్ మొదలైన తొలి 11 రోజుల్లో చైల్డ్ హెల్ప్ లైన్‌కు 3 లక్షల కాల్స్ వెళ్లాయి! కరోనా పరిస్థితులు తెచ్చిపెట్టిన మానసిక ఒత్తిడి కారణం గా మహిళలు, బాలలు లాక్డౌన్ మొత్తం క్షణక్షణం భయం భయం అన్నట్లుగానే గడిపారని మరికొన్ని నివేదికలు వచ్చాయి. స్కూళ్లు మూత పడటం, ఆన్లైన్ చదువులకు సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇరవై నాలుగు గంటలూ ఒకరి కళ్లెదురుగా ఒకరు ఉండిపోవడం, అభిప్రాయభేదాలు, అనవసర ఘర్షణలు, దంపతుల మధ్య మనస్పర్థలు అన్ని కలసి మహిళలు, పిల్లలపైనే దుష్ప్రభావం చూపించాయని స్వచ్ఛంద సంస్థల సర్వే నిపుణులు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఆర్థిక శాఖకు, పోలీసు శాఖకు తమ నివేదికలను అందించారు. ఆ సమాచారం ఆధారంగానైనా నేటి బడ్జెట్లో మహిళలు బాలల భద్రతకు, రక్షణకు మరింతగా నిధులను కేటాయించడం, కొత్తగా ప్రభుత్వ విధానాలను రూపొందించడం వంటివి ఉండొచ్చని, ఉంటే బాగుంటుందని ఒక ఆశ, ఒక ఆకాంక్ష ఈసారి వ్యక్తం అవుతోంది. ∙∙ మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చట్టాలు, శాసనాలు, పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. మళ్లీ కొత్తగా బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అనే సందేహాన్ని రానివ్వనంతగా మహిళల జీవితాన్ని దుర్భరం చేసేసింది లాక్డౌన్. వారి ఉద్యోగాలు పోయాయి. ఉపాధులు కొండెక్కాయి. ఇంటెడు చాకిరి కొండంతైంది. ఇంట్లో హింస పెరిగింది. పర్యవసానంగా మహిళల ఆరోగ్యం క్షీణించింది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. అంతకన్నా దారుణం వారికి వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, కరోనా కాలపు అగమ్యగోచరం రెండూ కలిసి మహిళల్ని జీవచ్ఛవాలను చేశాయి. ఈ దుస్థితి నుంచి వారిని తెరిపిన పడేసే ప్రాధాన్యాలు, నిధులు బడ్జెట్లో లేకుంటే.. స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికి ఉన్న మహిళల శ్రమ శక్తి వాటా పదిహేడు శాతానికంటే తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గత శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును కనీసం 11 శాతానికైనా పెంచుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం అందుకు అవసరమైన మహిళల శక్తి సామర్థ్యాలను, వాళ్లకు కల్పించవలసిన రక్షణ భద్రతలను కూడా గుర్తించి నేటి బడ్జెట్‌కు తుది రూపును ఇచ్చి ఉంటుందనే అనుకోవాలి. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడూ మహిళలపై జరిగే లైంగిక నేరాలను తగ్గించే విషయంలో పరోక్షమైన పాత్రను వహిస్తాయి. షెల్టర్ హోమ్‌లు ప్రత్యక్ష నరక కూపాల నుంచి కాపాడతాయి. ఈ హోమ్‌ల సంఖ్య పెంచేందుకు, సమర్థవంతంగా వాటిని నిర్వహించేందుకు అవసరమైన నిధులు కూడా ఈ బడ్జెట్లో ఉండాలని సూచిస్తున్న ఆర్థిక రంగ నిపుణులు.. ‘క్యాష్ బేస్డ్ సోషల్ ప్రొటెక్షన్’ ని కూడా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కల్పించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. క్రమం తప్పకుండా మహిళల అకౌంట్లో కొంత డబ్బును విధిగా జమ చేయడమే నగదు రక్షణ విధానం. గ్రామీణ ప్రాంత మహిళల సంక్షేమానికి, లైంగిక హింస నుంచి రక్షణకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చాలా వరకు తోడ్పడుతుంది. పై పెచ్చు వారికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. దీనిపైన కూడా ఇవాళ్టి బడ్జెట్లో విధానం నిర్ణయమై ఉంటుందని నేషనల్ ఉమెన్ కమిషన్ అంచనా వేస్తోంది. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
ఇక్కడితో ఆగిపోవడం లేదు
యూఎస్‌లో యాష్లీ జూడ్. ఇండియాలో తనుశ్రీ దత్తా. ఈజిప్టులో నదీన్ అష్రాఫ్! ముగ్గురూ ‘మీటూ’ ఫైటర్స్. ముగ్గుర్లో చిన్న.. నదీన్. పద్దెనిమిదేళ్లకే ఉద్యమజ్వాల. ఇరవై రెండేళ్లకిప్పుడు.. మీటూ మహోజ్వల స్ఫూర్తి. ఇక్కడితో.. ఆగిపోవడం లేదంటోంది. మహిళల్ని సమైక్యం చేస్తానంటోంది. నాలుగేళ్ల క్రితం నదీన్ అష్రాఫ్ వయసు పద్దెనిమిదేళ్లు. అప్పటికి ఏడేళ్ల క్రితం ఆమె వయసు పదకొండేళ్లు. ఈ రెండు వయసులలో ఒకటి ఆమెను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నది. ఇంకోటి.. అలాంటి పీడకల ఏ అమ్మాయిని వెంటాడుతున్నా ఆ అమ్మాయి వైపు నిలిచి తనే ఆ పీడకల వెంటబడి తరిమికొట్టేందుకు నదీన్‌ను ఒక శక్తిగా మలచినది. మరి తన పీడకల మాట ఏమిటి?! ఆ పిశాచి దొరకలేదు. ఆ పిశాచి ముఖం గుర్తు లేదు. నదీన్కు పదకొండేళ్ల వయసులో వెనుక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని అరిచేత్తో కొట్టి మాయమైపోయాడు. ఏం జరిగిందీ ఆ చిన్నారికి అర్థం కాలేదు. తననెందుకు తెలియనివారొకరు తాకడం?! అంతవరకే ఆలోచన. నదీన్ పెద్దదవుతోంది. ఇలాంటి పిశాచాలు ఉంటాయని అర్థయ్యే వయసుకు వచ్చింది. చిన్నతనంలో తనకు జరిగిందీ ‘అలాంటిదే’ అని రోషంతో ఉడికిపోయింది. ఏ అమ్మాయికి అలా జరిగిందని విన్నా తనకు జరిగిందే ఆమె గుర్తుకు వస్తోంది. అతడెవరో తెలియదు కనుక తనేం చేయలేదు. ఇప్పుడైతే ఒకటి కచ్చితంగా చేయగలదు. లైంగిక వికృతాలకు, లైంగిక హింసకు, దౌర్జన్యానికి, దాడికి పాల్పడిన వారిని వేటాడి కలుగుల్లోకి లాగి బాధితులకు న్యాయం జరిపించడం! ఆమెకు ఈ ఆలోచన కలిగించింది ‘మీటూ’ మూవ్మెంట్. నాలుగేళ్ల క్రితం 2017లో అమెరికాలో మొదలైన ఆ ఉద్యమజ్వాల పద్దెనిమిదేళ్ల నదీన్ కు మీటూ బాధితుల తరఫున నిలిచి పోరాడేలా స్ఫూర్తిచ్చింది. అమెరికాలో ఎలాగైతే హాలీవుడ్ నటి యాష్లీ జూడ్ ‘మీటూ’కు ఊపిరులు ఊదిందో ఈజిప్టులో అలా నదీన్ మీటూ ఒత్తిని వెలిగించింది. అందుకే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది శక్తిమంతమైన మహిళల బి.బి.సి. జాబితాలో నదీన్ ఒకరయ్యారు. ఆ గుర్తింపు కూడా నదీన్కు మీటూ ఉద్యమకారిణిగా లభించినదే. ∙∙ యూఎస్‌లో మీటూ మొదలయ్యే సమయానికి నదీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అసాల్ట్ పోలీస్’ అనే పేజ్ని నడుపుతూ ఉంది. హాలీవుడ్లో హార్వీ వైన్స్టీన్లా ఈజిప్టులో అహ్మద్ బస్సమ్ జికీ అనే వ్యక్తి అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన కేసుల్లో ప్రధాన నిందితుడు. యాభై మందికి పైగా మహిళలు అతడి వల్ల తాము పడిన లైంగిక హింసను ‘అసాల్ట్ పోలీస్’లో షేర్ చేసుకున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నదీన్ అనుకోకుండా ప్రారంభించింది. ఆమె అంతకుముందు ఫేస్బుక్లో చురుగ్గా ఉండేది. నదీన్ ఓ రోజు రాత్రి పొద్దుపోయాక అహ్మద్ బస్సమ్ జికీ లైంగిక అకృత్యాలపై ఒక పోస్ట్ చదువుతుంటే అకస్మాత్తుగా అది అదృశ్యం పోయింది. అతడి ఘోరాలపై అప్పటికే రగిలిపోతున్న నదీన్ అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించి, అతడి గురించి ఆరా తీసింది. కొద్ది గంటల్లోనే కనీసం యాభై మంది బాధితులు అతడు తమనెలా మోసం చేసిందీ, లైంగికంగా ఎలా హింసించిందీ నదీన్తో పంచుకున్నారు. అలా ఈజిప్టులో మీటూకు నదీన్ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలి అడుగు పడింది. అదే సమయంలో ఈజిప్టు ప్రభుత్వం మీటూకు ఊతం ఇచ్చేలా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తేవడంతో యూఎస్‌లో వైన్‌స్టీన్ అరెస్ట్ అయినట్లే ఈజిప్టులో అహ్మద్ కూడా అరెస్ట్ అయ్యాడు. మీటూ ఉద్యమకారిణిగా నదీన్ గుర్తింపు పొందారు. నదీన్ ఉండేది ఈజిప్టు రాజధాని కైరోలో. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె తల్లి పౌష్టికాహార వైద్య నిపుణురాలు. తండ్రికి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కూతురి మీటూ ఉద్యమ సారథ్యానికి ఇద్దరూ చోదకశక్తుల్లా పనిచేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప సంగతి. అందుకే.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఉద్యమ పాత్రను పోషిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు నదీన్ కృషి చేస్తోంది’ అని బి.బి.సి. ఇచ్చిన ప్రశంసకు నదీన్ తల్లిదండ్రులూ పాత్రులే. ‘‘నేనిక్కడితో ఆగిపోవడం లేదు’’ అని మంగళవారం ‘ఈజిప్షియన్ స్ట్రీట్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నదీన్ అష్రాఫ్. లైంగిక హింసకు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలబడి, వారికి న్యాయపరమైన సహకారం కూడా ఉచితంగా అందే ఏర్పాటు చేస్తున్న నదీన్ ఆన్లైన్ వేదికగా మహిళలందరినీ బాధితుల తరఫున సమైక్య పరిచే ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటున్నారు. తనుశ్రీ దత్తా, యాష్లీ జూడ్ -
అతివలకు అండగా 'సఖి'
ఆదిలాబాద్‌టౌన్: నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, యువతులపై దాడులు, వేధింపులు, గృహహింస, అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ‘సఖి’ సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తోంది. మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. తమపై దాడులు జరుగుతున్నా బయటకు చెప్పుకోలేనివారు సఖి కేంద్రానికి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి సహాయాన్ని అందిస్తోంది. మహిళల్లో మనోధైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నారు. 2017లో సఖి కేంద్రం ఏర్పాటు మహిళలకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2017 డిసెంబర్ 16న సఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్‌తో పాటు సఖి కూడా సేవలు అందిస్తోంది. చిన్నపిల్లల నుంచి పండు ముసళ్ల వరకు సఖి కేంద్రం సమస్య పరిష్కరిస్తోంది. అత్తామామలు, భార్యాభర్తల గొడవలు, యువతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఐదురోజుల పాటు ఆశ్రయం కూడా కల్పిస్తోంది. లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, ఆడపిల్లల అమ్మకం, పనిచేసే చోట వేధింపులు, తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయం జరిగేలా చేస్తోంది. ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్ 181 వేధింపులకు గురవుతున్న మహిళలకు న్యాయం చేసేందుకు సఖి కేంద్రం సేవలు అందిస్తోంది. అందుల్చో భాగంగానే ఉమెన్ హెల్ప్‌లైన్ పేరిట టోల్‌ఫ్రీ నంబర్ 181 ఏర్పాటు చేసింది. ఇబ్బందులు పడుతున్న మహిళలు టోల్‌ఫ్రీ నంబర్ 181కు సమాచారం అందిస్తే సహాయం అందిస్తోంది. ఎవరైనా అక్కడినుంచి రాలేని పరిస్థితిలో ఉంటే వారికోసం ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకువస్తారు. 24 గంటల పాటు ఈ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. కేసుల పరిష్కారంలో ముందంజ 2017 నుంచి ఇప్పటివరకు 722 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 569 కేసులను పరిష్కరించగా 153 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 710 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 116 మందికి న్యాయసేవ, 85 మందికి వైద్య సహాయం, 54 మందికి పోలీసు సహాయం అందించారు. దాదాపు 70వేల మందికి అవగాహన కల్పించినట్లు సఖి కేంద్రం నిర్వాహకులు యశోద చెబుతున్నారు. ఈయేడాది 258 కేసులు నమోదు కాగా 170 కేసులు పరిష్కరించినట్లు ఆమె పేర్కొన్నారు. విస్తృతంగా ప్రచారం సఖీ కేంద్రం సభ్యులు అందిస్తున్న సేవలపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, గ్రామాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సమైక్య సంఘాల సభ్యులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలను చైతన్య పరుస్తున్నారు. గ్రామాల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మహిళలకు తమ హక్కులతో పాటు తమను తాము ఏవిధంగా రక్షించుకోవాలనే అంశాల గురించి వివరిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. దాడులకు గురైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు, పోలీసు, వైద్యసహాయం అందిస్తున్నాం. అవసరమైన వారికి కేంద్రంలో ఐదురోజుల పాటు వసతి కూడా కల్పిస్తాం. బాధితులను తీసుకురావడానికి ఒక వాహనం కూడా ఏర్పాటు చేశాం. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి, ఆదిలాబాద్ -
కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు
ముంబై: బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. శనివారం ఆమె ట్విట్టర్లో..‘అనురాగ్ కశ్యప్ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు. పటేల్‌కి పంజాబీ బీబీ అనే సినిమాలో, నిభానా సాథియా అనే టీవీ కార్యక్రమంలో పాయల్ ఉన్నారు. ఇప్పటికే నటి కంగనా రనౌత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పాయల్ ఘోష్ ఆరోపణలపై కంగనా మద్దతు తెలిపారు. -
కేసుల్లో సత్వర విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఆర్ఐ భర్తల వేధింపుల కేసులను వేగంగా విచారించి నిందితులకు తగిన శిక్ష పడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో సమస్యలు, మోసాల పరిష్కారానికి వివిధ శాఖల మధ్య సహకారం, సమన్వయానికి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గురువారం కన్వర్జెన్స్ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. నగరంలోని ఎన్ఆర్ఐ సెల్‌తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా పోలీస్ స్టేషన్లలో 586 ఎన్ఆర్ఐ వైవాహిక సంబంధిత ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 2019 జూలై 17న హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్లోనే 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70పై కేసులు నమోదు చేశామని, వీటిలో 41 విచారణలోనూ ఉండగా, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. మరో 32 కేసులు నాన్ బెయిలబుల్‌గా నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసులను సమర్థంగా విచారించేందుకు దర్యాప్తు అధికారులకు వెసులుబాటు ఉండేలా ఎస్.ఓ.పీలను రూపొందించామని వివరించారు. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసేందుకు తగు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం నమోదైన మొత్తం 586 ఎన్.ఆర్.ఐ కేసులలో అత్యధికంగా 248 కేసులు హైదరాబాద్ కమిషనరేట్‌లో, 99 కేసులు రాచకొండ పరిధిలో,99 సైబరాబాద్ పరిధిలో, వరంగల్‌లో 42, కరీంనగర్ లో 21, నిజామాబాద్‌లో 8 , నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఏడు కేసుల చొప్పున, మహబూబ్‌నగర్‌లో ఆరు, రామ గుండం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో ఐదు కేసుల వంతున నమోదయ్యాయని వివరించారు. ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్‌శాఖ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల సామాన్యుల్లో పోలీసులపై ఎలా నమ్మకం ఏర్పడిందో, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు అనంతరం ప్రవాస భారతీయులు చేసే వివాహాల సంబంధిత మోసాల్లో బాధితుల్లో అంతే భరోసా ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. విదేశీ భర్తల కేసుల విషయంలో ఎన్ఆర్ఐ సెల్ బాధితులు, విచారణసంస్థల మధ్య వారధిలా పనిచేస్తోందన్నారు. అనంతరం ఎన్నారై వివాహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియో, కరపత్రాన్ని విడుదల చేశారు. పలు ఎన్నారై వివాహ కేసుల్లో రాజీ కుదిరి ఒక్కటైన జంటలను ఈ సందర్భంగా వేదికపై సత్కరించారు. -
అధికారి ఓవరాక్షన్.. అన్నీ నేనే.. అంతా నేనే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కార్యాలయంలో ఓ సహాయ అధికారి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అని అతను చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. ఆ శాఖలో ఆయన పెత్తనం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. చెప్పాలంటే డీఎస్ఓ కార్యాలయంలో అంతా ఆయన అజమాయిషీయే కొనసాగుతున్నది. ఉద్యోగులపై తప్పుడు ఫిర్యాదులు పెట్టడం, ఆ ఫిర్యాదులతో బ్లాక్మెయిల్ చేయడం, అధికారులు సైతం ఆయన చెప్పినట్టే నడుచుకుంటారని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇప్పడాయనపైనే జాయింట్ కలెక్టర్‌కు, కలెక్టర్‌కు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నారని మొరపెట్టుకోవడమే కాకుండా ఆయన గారి లీలలన్నీ సదరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ జె. నివాస్ ఆయనపై విచారణకు ఆదేశించారు. సస్పెండైన ఒక సీఎస్ డీటీకి మళ్లీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.50 వేలు లాగేశారు. నేరుగా తన బ్యాంకు ఖాతాలోనైతేఇబ్బందులొస్తాయని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలో ఆ సొమ్ము వేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఆ ఉద్యోగికి న్యాయం చేయలేదు. సాధారణంగా సస్పెన్షన్ పునరుద్ధరణ విషయంతో ఆ అధికారికి సంబంధం లేదు. శాఖాపరమైన నిబంధనల మేరకు జేసీ తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేసి ఎలాగూ విధులకు అనుమతిస్తారని తెలుసుకుని తానే అంతా చేస్తానన్నట్టుగా బిల్డప్ ఇచ్చి రూ.50 వేలు పిండేశారన్న వాదనలు ఉన్నాయి. మచ్చుకు ఇదొకటి. ఇలాంటివి అనేకం ఉన్నాయని అక్కడి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. తనకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసని పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పి డీఎస్ఓ కార్యాలయంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఇంకొక విషయమేమిటంటే తానే ఫేక్ ఫిర్యాదులు పెట్టి, ఆ ఫిర్యాదులు చూపించి ఉద్యోగులను బెదిరించడం పరిపాటిగా మారింది. చేసేవి తప్పులు.. ఆపై ఎదురుదాడి ఆ సహాయ అధికారికి ఉన్న అహం అంతా ఇంతా కాదు. తప్పులు చేసి తిరిగి ఎదురు దాడి చేస్తారు. ప్రజాప్రతినిధులను సైతం పట్టించుకోవడం లేదు. వారెంత నా ముందు అన్నట్టుగా ఓవరాక్షన్ చేస్తారు. తాజాగా మిల్లులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల అడ్డగోలు ట్యాగింగ్‌పై ఇదే రకంగా వ్యవహరించారు. పోలాకి మండలం ఈదులవలస కొనుగోలు కేంద్రాన్ని గాలికొదిలేసి రాళ్లపాడుకు చెందిన మిల్లును నరసన్నపేట కొనుగోలు కేంద్రానికి ట్యాగ్ చేయడంపై పెద్ద వివాదమే నడుస్తోంది. మిల్లరు, డీఎస్ఓ కార్యాలయం ఉద్యోగులు కొందరు కుమ్మక్కై చేసిన అడ్డగోలు భాగోతంపై విచారణ కూడా జరిగింది. దీనిపై రైతులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాసారు. రైతులకు అన్యాయం చేసిన వారిని వదలకూడదని లేఖలో తెలిపారు. చినికి చినికి గాలివానగా మారినట్టు అడ్డగోలు ట్యాగింగ్ వివాదం పెద్దది కావడంతో అధికారులు సైతం ఒక ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు ఫైలు పెట్టారు. అయితే ఆ ఉద్యోగిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఈయన గారు ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన బాగోతమే. మహిళా ఉద్యోగికి బెదిరింపు డీఎస్ఓ కార్యాలయంలో జరుగుతున్న అడ్డగోలు బాగోతమంతా బయటికి వెల్లడిస్తున్నారని చెప్పి శారద అనే మహిళా ఉద్యోగిపై కక్ష సాధింపునకు దిగారు. ఆమెను ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా... తానేంటో చూపిస్తానని, తనకు పలుకుబడి ఉందని, వదిలేని లేదని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఫేక్ ఫిర్యాదులను చూపించి భయపెట్టారు. దీంతో ఆ మహిళా ఉద్యోగి ఆందోళనకు గురై, తీవ్ర మనస్తాపం చెంది జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. డీఎస్ఓ కార్యాలయంలో జరుగుతున్న తంతు, ఆయన వ్యవహార శైలి, లీలలను ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాస్తవమేంటో తెలుసుకుని కలెక్టర్ జె.నివాస్ విచారణకు ఆదేశించారు. మహిళ ఫిర్యాదు చేసిన అధికారిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయాన్ని కలెక్టర్ జె.నివాస్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమకు మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణకు ఆదేశించామని, ఇరువురి వాదనలు విన్నాక ఏది వాస్తవమో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
యావద్దేశానికీ... ఒక ‘దిశ’
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పురుషులను చీల్చి చెండాడిన ‘మీటూ’ ఉద్యమం ఈ ఏడాది మహి ళలకు కొత్త శక్తినిచ్చింది. ఈ చైతన్యమే మహిళా ఉద్యమంలో 2019ని మైలురాయిగా నిలిపింది. అక్రమాలపై, అత్యాచారాలపై నిర్భ యంగా గళమెత్తేలా చేసింది. మరోవంక ఇన్ని జరిగినా మృగాళ్లు మాత్రం చెలరేగిపోతూనే వచ్చారు. యావద్దేశానికీ... ఒక ‘దిశ’ నవంబర్ 27, 2019న తెలంగాణలోని శంషాబాద్ టోల్‌ప్లాజా దగ్గర వెటర్నరీ వైద్యురాలిని నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన యావద్దేశాన్నీ అట్టుడికించింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను తక్షణం ఉరితీయాలంటూ ప్రాంతాలకతీతంగా యావ ద్దేశం ఒక్కటైంది. ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపడం వేగంగా జరిగిపోయింది. యువతుల్లో, మహిళల్లో చైతన్యాన్ని నింపే అనేక కార్యక్రమాలకు ఈ ఘటన దారితీసింది. ‘దిశ’పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా తెచ్చింది. అత్యాచార బాధితురాలిని కాల్చేశారు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో తనపై అత్యాచా రానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ కోర్టుకెళ్లిన ఓ మహిళ... వారి దౌర్జన్యానికి బలైపోయింది. ఐదుగురు నిందితుల్లో బెయిల్‌పై వచ్చిన ఇద్దరి తోపాటు మరో ముగ్గురు బాధితురాలిని సజీవ దహనం చేసే యత్నం చేశారు. అగ్ని కీలల్లో దగ్ధమ వుతూనే ఆసరా కోసం చుట్టుపక్కల జనాన్ని ప్రా«థేయపడిన బాధితురాలు... చివరకు పోలీసు లకు స్వయంగా ఫోన్ చేసి సాయం కోరడం అందర్నీ కలచి వేసింది. ఈ కేసులో నిందితుడు శుభం త్రివేదీ ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, తన సోదరుడితో కలసి ఆమెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బా«ధితు రాలు తన మరణ వాంగ్మూలంలో ఇదే చెప్పింది. చివరికామె ఆసుపత్రిలో కన్నుమూసింది. -
ఆడ బిడ్డల ఆర్తనాదాలు
సాక్షి, హైదరాబాద్: నేరం..ఈ ఏడాది రాష్ట్రంపై పడగ విప్పింది. ప్రశాంత జీవనాన్ని తన ఉనికితో ఉలికిపాటుకి గురిచేస్తూ మానవత్వాన్ని మృగ్యం చేసింది. మానవ సంబంధాల విలువల్ని తుంచు తూ వికృత చేష్టలతో మనిషంటే ఓ భరోసా అన్న నమ్మకాన్ని సడలించింది. అవినీతి కేసులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, హత్యలతో అన్ని రకాల నేరాలకూ రాష్ట్రం ఆలవాలమైంది. రాజధానిలో చోటుచేసుకు న్న కొన్ని నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. వరుసగా వెలుగుచూసిన అత్యాచారాలు, హత్యలతో ఒక దశలో మహిళలు, చిన్నారుల రక్షణ సందేహం లో పడింది. ముఖ్యంగా ‘దిశ’కేసులో నిందితులు ఆమెను చంపిన తీరు..దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. అదేరోజు వరంగల్‌లో మానస, అదేవారంలో ఆసిఫాబాద్‌లో ‘సమత’ అత్యాచారం అ నంతరం దారుణహత్యలకు గురయ్యారు. జూన్‌లో వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి హత్య తో ప్రజలు కోపంతో రగిలిపోయారు. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హా జీపూర్లో శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు మైనర్లపై అ త్యాచారం జరిపి, తన వ్యవసాయబావిలో పూడ్చి న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది జరిగిన నేరాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటే... ► కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం (55) జనవరి 31న హత్యకు గురయ్యారు. తెలంగాణలో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వదిలివేశారు. తెలంగాణకు కేసు బదిలీఅయ్యాక ప్ర ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, అతని అ నుచరులను అరెస్టు చేశారు. సహకరిం చిన ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ► డేటా చౌర్యం కేసులో మాదాపూర్‌లోని ఐటీ గ్రీడ్ కార్యాలయాన్ని మార్చి 8న పోలీస్ లు సీజ్ చేశారు. ఈ కేసు తెలంగా ణ, ఏపీలో సంచలనం సృష్టిం చింది. రెండు తెలుగు రా ష్ట్రాల రాజకీయ పార్టీల తో ముడిపడి ఉన్న కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చే సింది. దర్యాప్తు కొనసాగుతోంది. ► యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గు రు బాలికలను అపహరించి అత్యాచారం చేసి న విషయం ఏప్రిల్ 26న వెలుగుచూసింది. ఊరికి రవాణా సదుపాయం లేకపోవడంతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బాలికలను తన వ్యవసా య బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి అక్కడే మృతదేహాల్ని పాతిపెట్టాడు. ► టీవీ9 యాజమాన్య బదిలీ విషయంలో పలు అడ్డంకులు సృష్టించిన కేసులో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై మే 9న పోలీసులు కేసు లు నమోదు చేశారు. టీవీ9 చానల్‌ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు బదిలీ కా కుండా నటుడు శివాజీతో ప లు నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్, శివాజీలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిం దితులిద్దరూ పోలీసులకు చిక్కకుండా పరారవడం, అపుడప్పుడూ వీడియోలు విడుదల చేయడం సంచలనం రేపింది. ► హన్మకొండ కుమార్‌పల్లిలో తల్లిపక్కనే నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు జూన్ 30న ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, చంపేశాడు. పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లో 48 రోజుల్లో నిందితుడి నేరం నిరూపిం చారు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆపై దాన్ని హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. ► కుమరంభీం జిల్లా సార్సాల అటవీ అధికారిణి అనితపై కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీటీ సీ సభ్యుడు కోనేరు కృష్ణారావు తన అనుచరులతో జూన్ 30న దాడి చేశారు. ► పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టు లు జూలై9న అపహరించి కాల్చిచంపారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ► జూలై 10న ఏసీబీ దాడుల్లో కేశంపేట తహసీల్దార్ వి.లావణ్య వద్ద ఏకంగా రూ.93 లక్షల నగదు 40 తులాల బంగారం లభించింది. ► ఎంసెట్ పేపర్ లీకేజీలో సీఐడీ పోలీసులు జూలై 16న చార్జిషీటు దాఖలు చేశారు. ► భద్రాద్రి జిల్లా గుండాలలో జూలై 31న ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మరణించాడు. ► ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య,కుటుంబ సమస్యల కారణంగా కోడెల హైదరాబాద్‌లోని సొంతింట్లో ఆగస్టు 16వ తేదీన ఉరేసుకుని మరణించారు. ► ఈఎస్ఐలోని ఐఎంఎస్ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవతవకలు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 29న మాజీ డైరెక్టర్ దేవికారా ణి, మాజీ జేడీ పద్మలను ఏసీబీ అరెస్టు చేసిం ది. ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు. ► హయత్‌నగర్‌లో..ప్రియుడు శశికుమార్ బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన కీర్తి అనే యువతి అక్టోబరు 28న తల్లి రజితను చంపి, శవాన్ని మాయం చేసిన ఘటన వెలుగుచూసింది. ► అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని భూవివాదంలో కూర సురేశ్ నవంబరు 4న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు సురేశ్, డ్రైవర్ గురునాథం, అ టెండర్ చంద్రయ్య తరువాత మరణించారు. ► కాచిగూడలో హంద్రీనీవా– ఎంఎంటీఎస్ రైళ్లు కాచిగూడలో నవంబరు 11న ఎదురెదురుగా ఢీకొన్నాయి. 8 మంది గాయపడ్డారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మరణించాడు. ► ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై ముగ్గురు టేకు చెక్కల స్మగ్లర్లు నవం బరు 24న లైంగికదాడి చేసి, కత్తితో గొంతుకోసి చంపారు. దీనిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ► రాష్ట్రంలో ఒకేరోజు వెటర్నరీ వైద్యురాలు దిశ, వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని మానసలు నవం బరు 27 అపహరణకు గురై అత్యాచారం అనంతరం హత్యకు గురయ్యారు. ► దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో మరణించారు. డిసెంబరు 6న చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిందితు లు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీ న్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులపై దాడి చేసి, తుపాకులు లాక్కున్నారు. పోలీ సుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. దీనిపై సిట్ విచారణ నడుస్తోంది. -
పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు: నితీశ్
గోపాల్‌గంజ్: పోర్న్ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతు న్నాయని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యా నించారు. పోర్న్సైట్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ‘దిశ’ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, సాంకేతికత పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్లే మహిళలు, చిన్నారులపై దేశమంతటా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు వీటిని చిత్రీకరించి, ఇంటర్నెట్లో పెడుతున్నారు. వీటిని చూసి ఇతరులు దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఈ పోర్న్ సైట్లపై దేశంలో పూర్తి నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ రాస్తా’ అని వెల్లడించారు. -
సాహో తెలంగాణ పోలీస్!
దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. సాహో తెలంగాణ పోలీస్ అంటూ జేజేలు పలుకుతున్నారు.. కానీ, రాజకీయ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌పై ఎవరి స్పందన ఎలా ఉందంటే.. హైదరాబాద్ పోలీసుల్ని చూసి ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం, కోర్టులు ఎంతైనా నేర్చుకోవాలి. నిర్భయ దోషుల్ని వెంటనే ఉరి తీయాలి. క్రూరాతి క్రూరమైన నేరానికి పాల్పడిన వారికి అలాంటి శిక్షలే పడాలి. తెలంగాణ పోలీసులు సరైన పనే చేశారు. మేము ఏడేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. దిశ తల్లిదండ్రులకు ఆ ఎదురుచూపులు తప్పాయి. వారి కడుపుకోత మాకు అర్థమవుతుంది. కనీసం వారికైనా సత్వర న్యాయం జరిగింది. – నిర్భయ తల్లిదండ్రులు ఒక సాధారణ పౌరురాలిగా ఈ ఎన్‌కౌంటర్‌పై ఆనందం వ్యక్తం చేస్తున్నా. ప్రజలంతా ఏ తీర్పు కోరుకున్నారో అదే జరిగింది. అయితే అది చట్టపరంగా న్యాయస్థానంలో జరిగి ఉండాల్సింది. – రేఖా శర్మ, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు హైదరాబాద్ ఎన్కౌంటర్ రేపిస్టులకు గట్టి సందేశాన్ని పంపింది. ప్రజలు న్యాయం జరిగిందనే అంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిర్భయల సంగతేంటి ? నేనైతే ఈ దేశం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. – స్వాతి మాలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ను ప్రజలందరూ హర్షిస్తున్నారు. మన దేశంలో క్రిమినల్ న్యాయవ్యవస్థపై ప్రజలకి నమ్మకం పోయింది. అది అత్యంత ప్రమాదకరమైన విషయం. – కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి పోలీసులు ఆత్మరక్షణ కోసమే నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించడం వల్లే పోలీసులకు వారిని చంపక తప్పలేదు. – యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కానీ ఎవరూ దానిని చేతుల్లోకి తీసుకోకూడదు. హైదరాబాద్, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశానికే సిగ్గు చేటు. బాధితుల గురించి ఆలోచిస్తే నా గుండె రగిలిపోతుంది. రేపిస్టులను శిక్షించడానికి చట్టాలను మరింత పకడ్బందీగా నిర్మించాలి. –మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అత్యాచార బాధితురాలికి సత్వర న్యాయం జరిగింది. ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే ఆలస్యంగానైనా ఏదో ఒకటి చేయడం మంచిది. – జయా బచ్చన్, రాజ్యసభ ఎంపీ హైదరాబాద్ ఎన్కౌంటర్ దేశానికి ఎంతో ప్రమాదకరమైనది. చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోకూడదు. విచారణ పూర్తవకుండా పోలీసులే నిందితుల్ని కాల్చి పారేస్తే ఇంక ఈ చట్టాలు, న్యాయవ్యవస్థ ఎందుకు ? కోర్టులే వారికి ఉరిశిక్ష వేసి ఉండవలసింది. –మేనకా గాంధీ, బీజేపీ నేత హైదరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలు అభినందనీయం. వారిని చూసి యూపీలో పోలీసు యంత్రాంగం స్ఫూర్తి పొందాలి. ఉత్తరప్రదేశ్‌లో ప్రతీరోజూ ప్రతీ జిల్లాలో ఏదో ఒక అత్యాచారం కేసు వెలుగులోకి వస్తోంది. యుక్తవయసులో ఉన్న వారిని, వయసు మీద పడిన వారిని ఏ మహిళనీ వదలడం లేదు. ఈ రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోంది. – మాయావతి, బీఎస్పీ అధినేత్రి మహిళల భద్రతపై ఆందోళనలకు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమాధానం కాకూడదు. నిర్భయ చట్టాన్ని సరిగ్గా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?. – సీతారాం ఏచూరి, సీపీఎం నేత పోలీసుల చేతికి తుపాకులు ఇచ్చింది ఏదో ప్రదర్శన కోసం కాదు. నిందితులు పారిపోతుంటే వాడుకోవడానికి మాత్రమే. –మీనాక్షి లేఖి, బీజేపీ ఎంపీ పురుషుల నుంచి మహిళలు అధికారాన్ని లాక్కొని, తమకు ఎదురయ్యే ఘటనల నుంచి రక్షణ పొందాలి. మహిళలు పంచాయతీ, విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయాలి. రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని పొందడం ద్వారా ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షించుకోవచ్చు. ‘ఉన్నావ్’ లాంటి ఘటనలు జరుగుతుంటే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఎలా ఉంటుంది? – ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి -
మహిళల రక్షణకు చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మహిళల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న అత్యాచార ఘటనలు, దాడుల నేపథ్యంలో లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌భల్లా తెలిపారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేయడంలో పోలీసులు విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు వేగంగా స్పందించాలని కోరారు. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) పోర్టల్ ద్వారా ఆయా రాష్ట్రాలలోని అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేసుకోవచ్చని అందులో సూచించారు. -
వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు
మౌంట్ అబూ: మహిళలపై జరుగుతున్న వరుస పైశాచిక దాడులు దేశాన్ని వణికిస్తున్నాయని, నైతికంగా దెబ్బ తీస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాజస్తాన్‌లోని అబూరోడ్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి తీసుకువచ్చిన ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే హక్కు లేకుండా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో దిశ హత్యాచారం, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి మహిళల భద్రత గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘అత్యాచార నేరాల్లో ఉరి శిక్ష పడిన వారందరూ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. వారికి రాజ్యాంగం ఆ హక్కుని కల్పించింది. అయితే పోక్సో చట్టం కింద శిక్ష పడిన వారికి ఆ హక్కు ఉండకూడదు. ఆ దిశగా కేంద్రం అడుగులు వెయ్యాలి. చట్టాలను పునఃసమీక్షించాలి’అని సూచించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దోషి క్షమాభిక్ష పెట్టుకున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడాన్ని అభినందిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం -
రాత్రులు నిద్రపట్టేది కాదు
‘‘ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా అని నిర్ధారణ కాకముందే తుది నిర్ణయానికి రాకూడదు. తప్పొప్పులు తేలే వరకూ ఒక వ్యక్తి పని కోల్పోవడమే కాకుండా ఏ పని దొరక్కుండా ఖాళీగా ఉండాలా? నా నిర్ణయం ఒకరికి జీవనోపాధి కోల్పోయేలా చేసింది అనే ఆలోచన నాకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. సంగీత దర్శకుడు గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ‘మొఘల్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. సుభాష్ కపూర్ దర్శకుడు. అయితే ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సుభాష్ కపూర్‌ౖపై వేధింపుల ఆరోపణలు (గీతికా త్యాగీ ఆరోపించారు) రావడంతో ‘మొఘల్’ నుంచి ఆమిర్ తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు ప్రకటించారు. ‘‘గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి సరైనది అనిపించింది. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది. నా మనస్సాక్షిని నమ్మి వెళ్తున్నాను. కొందరికి ఈ నిర్ణయం కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. మొన్న మే నెలలో ‘ఐఎఫ్‌టీడీఏ’ (ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్) నుంచి నాకో లేఖ వచ్చింది. ‘సుభాష్ కపూర్ కేస్ ప్రస్తుతం కోర్ట్‌లో నడుస్తోంది. అప్పుడే అతను దోషి అని ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. మీ ఆలోచనను మరోసారి సమీక్షించుకోండి’ అన్నది దాని సారాంశం. సుభాష్‌తో పని చేసిన కొందరు మహిళా అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లతో నేను, నా భార్య కిరణ్ తన తీరు గురించి మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్లు తన గురించి మంచిగా మాట్లాడారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తనెప్పుడూ స్త్రీలతో తప్పుగా ప్రవర్తించి ఉండడు అని చెప్పదలచుకోలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలు పని ప్రదేశంలో జరిగినవి కావు. అందుకే ఈ సినిమాలో మళ్లీ భాగమయ్యాను’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆమిర్ ఖాన్. ఆమిర్ నన్ను సంప్రదించలేదు: గీతికా 2014లో సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి గీతికా త్యాగీ. ఆమిర్ తీసుకున్న తాజా నిర్ణయం గురించి త్యాగీ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది ఆమిర్ తీసుకున్న నిర్ణయం (సినిమా నుంచి తప్పుకోవడం) అభినందించదగ్గది. కానీ ఇప్పుడు సుభాష్ గురించి ఆరా తీసినప్పుడు ఆమిర్ ఖాన్‌గారు నన్ను సంప్రదించలేదు. సంప్రదించే ప్రయత్నం చేశారని నా వరకూ రాలేదు. మీరు (ఆమిర్) అంత జాలి చూపించాలనుకున్నప్పుడు రెండువైపుల కథను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆమిర్ మార్చుకున్న నిర్ణయం వల్ల వేధింపుల గురించి మాట్లాడటానికి ఎవరు ముందుకు వస్తారు? ఆరోపణలు చేసిన తర్వాత నేను కోల్పోయిన పని, పడ్డ బాధ ఎవరికి తెలుసు? మన రూల్స్ మగవాళ్లను కాపాడేందుకు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పోరాటాన్ని ఆపను’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి వేధింపులకు గురైనప్పుడు బాలీవుడ్లో ఒక్కరికీ నిద్రపట్టని రాత్రులు ఉండవు ఎందుకో? (ఆమిర్ కామెంట్‌ను ఉద్దేశించి). సుభాష్‌కి మళ్లీ పని కల్పించినప్పుడు బాధితురాలిని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకో? బాలీవుడ్లో వేధించినవారికి సానుభూతి దొరుకుతుంది కానీ అమ్మాయిలకు మాత్రం ఎప్పుడూ దొరకదేంటో.. అర్థం కావడంలేదు’’ అంటూ వ్యంగ్య ధోరణిలో తనుశ్రీ దత్తా విమర్శనాస్త్రాలు సంధించారు. గీతికా త్యాగీ , తనుశ్రీ దత్తా -
జిల్లాల్లో ‘పోక్సో’ ప్రత్యేక కోర్టులు
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో) కింద 100కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదైన జిల్లాల్లో, పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర నిధులతో ఏర్పాటయ్యే ఈ కోర్టులు ప్రత్యేకంగా పోక్సో కేసులను మాత్రమే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి అవగాహన కల్పించేలా, అలాంటి నేరాలు శిక్షార్హమని తెలిపేలా ఒక చిన్న వీడియోను అన్ని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు చూపాలని ఆదేశించింది. అన్ని టీవీ చానళ్లలోనూ తప్పనిసరిగా ఆ క్లిప్పింగ్‌ను చూపాలని స్పష్టం చేసింది. ఆ వీడియోలో ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ నంబరును పొందుపర్చాలని పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం కావడంతో దర్యాప్తులో జాప్యం చోటు చేసుకుంటోం దని సీనియర్ న్యాయవాది గిరి పేర్కొనడంపై స్పందిస్తూ.. ప్రతీ జిల్లాలో పోక్సో కేసుల కోసం ప్రత్యేకంగా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు.. పోక్సో కేసుల నివేదికలను సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. జడ్జీల నియామకం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బంది, చిన్నారులకు అనుకూలంగా ఉండే కోర్టు భవనాల్లో మౌలిక వసతులు.. ఇవన్నీ కేంద్ర నిధుల ద్వారానే జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. -
అలా మాట్లాడటం తప్పు
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రూటే సపరేటు. ఏ విషయాన్ని అయినా ఆమె ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. ఒక్కోసారి ఆమె మాటలు వివాదంతో పాటు చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా.. ‘పదమూడేళ్ల క్రితం ఆదిత్య పంచోలీ మానసికంగా, లైంగికంగా నన్ను వేధించాడు’ అంటూ కంగన రనౌత్ గతంలో షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, ఆదిత్య పంచోలీ భార్య జరీనా వాహబ్ స్పందించారు. ‘‘నా భర్త గురించి నాకు బాగా తెలుసు. నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఏ తప్పూ చేయలేదు. ఏ విషయమైనా నా వద్ద రహస్యంగా ఉంచేవారు కాదు. గతంలో ఆదిత్య, కంగన మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. అయినా వివాహం అయిన వ్యక్తితో ఏళ్ల తరబడి డేటింగ్ చేసి, తీరా విడిపోయిన తర్వాత అత్యాచారం చేశాడని ఆరోపిస్తే ఎలా? అది చాలా తప్పు’’ అంటూ మండిపడ్డారు. కాగా కంగన వ్యాఖ్యలపై ఆదిత్య పంచోలీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
అందుకే నానాకు క్లీన్ చిట్
‘నటుడు నానా పటేకర్ 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను లైంగికంగా వేధించాడు’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసి తనుశ్రీ దత్తా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ‘మీటూ’ ఉద్యమానికి ఇండియాలో శ్రీకారం చుట్టింది కూడా తనుశ్రీయే. ఆమె వ్యాఖ్యలతో నానా పటేకర్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసును బుక్ చేసి, విచారణ చేపట్టారు. తనుశ్రీ చేసిన వేధింపులకు ఎటువంటి సాక్ష్యం తమకు లభించలేదని పోలీసులు చెప్పారు. దీంతో నానా పటేకర్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై తనుశ్రీ దత్తా మండిపడ్డారు. ‘‘పోలీసు, న్యాయ వ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదు అని భారతీయ చట్టం చెబుతోంది. అందుకే నానా పటేకర్‌కు క్లీన్ చిట్ దక్కింది. పోలీసు, న్యాయ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. ఈ కారణంగా ఈ అవినీతిపరుడైన నానాకి క్లీన్ చిట్ ఇచ్చాయి. నాకంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా అతని తప్పులు బయటపడలేదు. నా కేసు విషయంలో ప్రత్యక్ష సాక్షులను బెదిరించి వారి నోరు నొక్కేశారు. ఈ తీర్పు నన్ను షాక్‌కి గురిచేయలేదు. ఇండియాలోని ప్రతి మహిళ ఇలాంటి అనుభవాలకు అలవాటు పడిపోయింది. నాకు న్యాయం జరగనంత మాత్రాన ఇంకెవరికీ న్యాయం జరగదని కాదు. లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాడాలి. ఏదో ఒక రోజు నానా విషయంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ ఉంది’’ అన్నారు. -
12 మంది ఐటీ అధికారులపై వేటు
న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అశోక్ కుమార్ అగర్వాల్(ఐఆర్ఎస్–1985) ఉన్నారు. ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్(అప్పీల్) ఎస్కే శ్రీవాస్తవ (ఐఆర్ఎస్) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్‌వంశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్ కుమార్, అలోక్‡ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్ విజయ్‌కుమార్(ఐఏఎస్), కె.నరసింహ(ఐఏఎస్), మయాంక్ షీల్ చోహన్(ఐపీఎస్), రాజ్ కుమార్ దేవాంగన్(ఐపీఎస్) ఉన్నారు. -
అత్తింటి వేధింపులు తాళలేక అల్లుడి ఆత్మహత్య
కర్ణాటక, కృష్ణరాజపురం: అత్తింటి వేధింపులు తాళలేక మరణ వాంగ్మూలం రాసి అల్లుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం బగలకుంటెలో చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ (32)కు కొద్ది సంవత్సరాల క్రితం సుమ అనే మహిళతో వివాహమైంది. అయితే శ్రీనివాస్ తన అన్న ఇంట్లోనే కాపురం పెట్టడాన్ని సహించలేకపోయిన సుమ ప్రతీరోజూ వేరు కాపురం పెట్టాలంటూ ఒత్తిడి చేసేది. సుమ ఒత్తిళ్లను శ్రీనివాస్ తేలికగా తీసుకోవడంతో ప్రతీరోజూ మానసికంగా వేధించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా వస్తే ఫోన్ చేసి నోటికొచ్చినట్లు తిట్టడం ప్రారంభించింది. ఇంటికి వచ్చాక కూడా శ్రీనివాస్‌ను దూషిస్తూ గొడవ పడుతుండేది. అందుకు సుమ తల్లితండ్రులు గంగణ్ణ, శారదలు కూడా సహకరించి శ్రీనివాస్‌ను మాటలతో వేధించేవారు. భార్య, అత్తమామల వేధింపుల గురించి అన్న రవీశ్వర్తో చెప్పుకొని తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రవీశ్వర్ దంపతులు దేవాలయానికి వెళ్లగా శ్రీనివాస్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన రవీశ్వర్ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డెత్‌నోట్‌ను స్వాదీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వారు జస్టిస్ బాబ్డేను కలవలేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డేను జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు కలిశారంటూ వచ్చిన పత్రికా కథనాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. ఆ కథనం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణపై జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని అంతర్గత కమిటీ ఏకపక్షంగా దర్యాప్తు సాగించడం సరికాదని, విచారణలో సహకరించేందుకు అమికస్ క్యూరీగా లాయర్‌ను నియమించుకోవాలని జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు సూచించినట్లు ఓ పత్రిక పేర్కొంది. ఈ కథనం అబద్ధమంటూ ఆదివారం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జస్టిస్ ఎస్ఏ బాబ్డేను జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు మే 3వ తేదీ సాయంత్రం కలిసినట్లు ఆ ప్రముఖ వార్తా పత్రికలో కథనం రావడం దురదృష్టకరం. అది పూర్తిగా అబద్ధం. అంతర్గత విచారణ కమిటీ నిర్దేశించిన పనిని మరే ఇతర జడ్జీల సాయం అవసరం లేకుండానే చేసుకుపోతుంది. ఈ విషయంలో ఆ కమిటీకి సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా ఎలాంటి సలహా ఇచ్చినా అది దాని విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లే అవుతుంది’అని ఆయన స్పష్టం చేశారు. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. ఈ కమిటీ విచారణకు మూడు పర్యాయాలు హాజరైన ఫిర్యాదుదారు, మాజీ ఉద్యోగిని వివిధ కారణాలు చూపుతూ విచారణ ప్రక్రియకు ఇకపై హాజరు కాబోనని ఇటీవల వెల్లడించారు. -
ఎంజే అక్బర్‌పై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌పై కోర్టులో ప్రశ్నల వర్షం కురిసింది. ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో జర్నలిస్ట్ రమణి సహా పలువురు మహిళలు అక్బర్‌పై వేధింపుల ఆరోపణలు చేయడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం ఆయన రమణిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో శనివారం కోర్టుకు హాజరైన అక్బర్.. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏషియన్ ఏజ్ పత్రికలో రమణి చేరిక, తదితర అంశాలపై ఆమె తరఫున సీనియర్ లాయర్ అక్బర్‌ను ప్రశ్నించారు. -
వేధింపులపై విచారణకు హాజరైన సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రహస్య విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ బుధవారం సీజేఐని కూడా విచారించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల త్రిసభ్య కమిటీ ఎదుట సీజేఐ విచారణకు హాజరయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిందితుడిగా ఓ సీజేఐ విచారణ కమిటీ ముందు హాజరవ్వడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలోనే ఈ కమిటీ సీజేఐని కోరింది. దీంతో ఆయన విచారణకు వచ్చిన తన వంతుగా సహకరించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన మహిళ, సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా, ఫిర్యాదు చేసిన మహిళ మూడు రోజులపాటు విచారణకు హాజరైన అనంతరం, ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదంటూ వెళ్లిపోవడం తెలిసిందే. కమిటీ విచారణ వాతావరణం తనకు భయాన్ని కలిగిస్తోందనీ, తన లాయర్‌ను కూడా తనతోపాటు ఉండనివ్వటం లేదనీ, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె విచారణ నుంచి మంగళవారం అర్ధాంతరంగా వెళ్లిపోయారు. విచారణను ఆడియో లేదా వీడియో రికార్డింగ్ కూడా చేయటం లేదనీ, ఏప్రిల్ 26, 29 తేదీల్లో ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను కూడా తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. విచారణ ఎలా జరుగుతుందీ, ఏయే విధానాలను అనుసరిస్తారు అనే దానిని కూడా తనకు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆమె లేకపోయినా విచారణ కొనసాగుతుందని చెప్పినా ఆమె విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో సీజేఐని త్రిసభ్య కమిటీ బుధవారం విచారించింది. -
శరణార్థులకు ‘ఉగ్ర’ సెగ
కొలంబో/కల్మునయ్: శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. చర్చిలు, శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్న విదేశీ శరణార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సహా 15 దేశాలకు చెందిన 1,600 మంది మైనారిటీ మతస్తులు శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్‌కు చెందిన క్రైస్తవులే ఉన్నారు. నెగంబో పట్టణంలో వీరికి ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అయితే ఇదే పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిని ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. ఈ శరణార్థులను వేధింపులకు గురిచేయడంతో పాటు వీరికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులను కొందరు స్థానికులు బెదిరిస్తున్నారు. మరోవైపు కల్మునయ్, సమ్మంతురై, చావలకడే ప్రాంతాలు మినహా దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. బుల్లెట్లు అయిపోవడంతోనే ఆత్మాహుతి కల్మునయ్ పట్టణంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తమ సభ్యులేనని ఐసిస్ ప్రకటించుకుంది. అబూ హమ్మద్, అబూ సుఫియాన్, అబూ అల్క్వాలు భద్రతా బలగాలతో పోరులో బుల్లెట్లు అయిపోవడంతో తమనుతాము పేల్చేసుకున్నారని వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు దేశమంతటా విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 106 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. షాంగ్రీలా హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల అన్న ఇర్ఫాన్ అహ్మద్‌ను అరెస్ట్ చేశామన్నారు. అలాగే తమిళ మాధ్యమంలో బోధించే ఓ స్కూల్ టీచర్(40)ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. సదరు టీచర్ నుంచి 50 సిమ్‌కార్డులు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్‌లో వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి జహ్రన్ హషీమ్ భార్య ఫాతిమా, కుమార్తె రుసైనాను ఉగ్రవాదుల స్థావరం నుంచి కాపాడామన్నారు. అలాగే నేషనల్ తౌహీద్ జమాత్ నడుపుతున్న ఓ స్కూలులో ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో డాక్టర్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఆ ముగ్గురిదీ ఒకే కుటుంబం శ్రీలంకలోని కల్మునయ్ శుక్రవారం ఎన్టీజే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భద్రతాబలగాలతో కాల్పుల సందర్భంగా తమను తాము పేల్చేసుకున్న ముగ్గురు ఉగ్రవాదులు ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. దాదాపు 15 మందిని బలికొన్న ఈ ఘటనలో ఉగ్రవాది మొహమ్మద్ హషీమ్, ఆయన కుమారులు జైనీ హషీమ్, రిల్వాన్ హషీమ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విద్వేషాన్ని రెచ్చగొడుతూ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
సీజేఐ వేధింపుల కేసుపై విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో విచారణను ముగ్గురు జడ్జీల అంతర్గత కమిటీ శుక్రవారం ప్రారంభించింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల కమిటీ ఎదుట ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని విచారణకు హాజరయ్యారు. జస్టిస్ బాబ్డే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. మాజీ ఉద్యోగినితోపాటు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కమిటీ విచారణకు వచ్చారు. అయితే విచారణ సమయంలో జడ్జీల ముందు మహిళ మాత్రమే ఉన్నారు. ఇది సాధారణ న్యాయ విచారణ కానందున న్యాయవాదులను విచారణ సమయంలో మహిళతోపాటు ఉండేందుకు అనుమతించబోమని జస్టిస్ బాబ్డే ఇంతకుముందే స్పష్టం చేయడం గమనార్హం. ఈ విచారణను ముగించేందుకు నిర్దిష్ట గడువు కూడా ఏదీ లేదని జస్టిస్ బాబ్డే గతంలోనే చెప్పారు. ఈ విచారణలో వెలుగుచూసే అంశాలను కూడా రహస్యంగానే ఉంచనున్నారు. ఆరోపణలు చేసిన మహిళ గతంలో సీజేఐ ఇంట్లోని కార్యాలయంలో పనిచేసేది. గతేడాది అక్టోబర్‌లో సీజేఐ తనను లైంగికంగా వేధించారనీ, ఖండించినందుకు తనను ఉద్యోగంలోనుంచి తీసేయడంతోపాటు హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తన భర్త, మరిదిలను సస్పెండ్ చేయించారని ఆరోపిస్తూ 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆమె లేఖలు పంపారు. -
సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. విచారణ సమయంలో ఆయనకు సహకరించాలంటూ సీబీఐ, ఐబీ డైరెక్టర్లతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఇతరుల సాయం తీసుకోవచ్చంది. ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ తన దర్యాప్తు నివేదికను సీల్డు కవర్లో అందజేయాలని కోరింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ వేసిన అఫిడవిట్‌ను గురువారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాల ప్రత్యేక ధర్మాసనం విచారించి, పై ఉత్తర్వులను వెలువరించింది. అఫిడవిట్లో పేర్కొన్న వివిధ అంశాలపై కమిటీ కోరినప్పుడు వివరణ ఇవ్వాలని లాయర్‌ను ఆదేశించింది. త్రిసభ్య కమిటీపై అభ్యంతరాలు.. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని అంతర్గత విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీజేఐకు జస్టిస్ రమణ సన్నిహిత మిత్రుడని, నిత్యం సీజేఐ నివాసానికి ఆయన వెళ్తుంటారని, కమిటీలో ఆయన ఉండటం వల్ల తాను సమర్పించిన ఆధారాలు, అఫిడివిట్‌పై సరైన విచారణ జరుగుతుందని భావించడం లేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కమిటీలో మహిళా జడ్జి ఇందిరా బెనర్జీ ఒక్కరు మాత్రమే ఉండటంపైనా ఆమె జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖలో అభ్యంతరం లేవనెత్తారు. కాగా, సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సీజేఐకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఫిర్యాదుదారు అభ్యంతరం తెలిపిన కారణంగా జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగలేదని సమాచారం. -
మూలాలకు వెళ్లి దర్యాప్తు చేస్తాం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల విషయంలో లోతైన మూలాలకు వెళ్లి దర్యాప్తు చేస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణల వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉందని ఓ న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయవ్యవస్థపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ పోతుంటే న్యాయవ్యవస్థే కాదు తాము కూడా మిగలమని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది. జస్టిస్ రంజన్ గొగోయ్‌పై ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిపై తన వద్ద ఆధారాలున్నాయని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్‌ను.. గురువారంలోగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని బుధవారం ధర్మాసనం ఆదేశించింది. గురువారం విచారణ చేపడతామని పేర్కొంది. అయితే ఉత్సవ్ సింగ్ బైన్స్ చేసిన వ్యాఖ్యలపై జరిపే విచారణకు, జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణపై అంతర్గత విచారణకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీస్ చీఫ్‌లు తమ ముందు హాజరుకావాల్సిందిగా బుధవారం ఉదయం ధర్మాసనం ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు వ్యక్తులు చాలా పెద్ద కుట్ర పన్నారంటూ ఏప్రిల్ 20న ఫేస్బుక్లో ఉత్సవ్ సింగ్ బైన్స్ సంచలన పోస్ట్ పెట్టారు. విచారణ సందర్భంగా ఉత్సవ్ సింగ్ బైన్స్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. -
సీజేఐపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి
న్యూఢిల్లీ: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) పేర్కొంది. సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనం ఎంపిక చేసిన కమిటీ ఆరోపణలపై దర్యాప్తు జరపాలంది. భారీ కుట్ర ఉంది... నిష్పాక్షిక దర్యాప్తుతో మాత్రమే సీజేఐపె వచ్చిన ఆరోపణలపై నిజాలు వెలుగుచూస్తాయని, న్యాయవ్యవస్థ స్వతంత్రత బలోపేతమవుతుందని సీనియర్ న్యాయవాది, ప్రముఖ న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. మాజీ ఉద్యోగిని ఒకరు సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయస్థానం పూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకునేదాకా సీజేఐ విధులకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సీజేఐ రాజీనామాకు కుట్ర సీజేఐతో రాజీనామా చేయించేందుకే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారంటూ సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ పేర్కొన్నారు. ఓ మాజీ మహిళా ఉద్యోగి తరఫున అజయ్ అనే వ్యక్తి తన వద్దకు వచ్చి సీజేఐకు వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయిస్తే రూ.కోటిన్నర ఇస్తానంటూ ఆశ చూపాడని బైన్స్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. -
ఆ ఆరోపణలను నమ్మను
‘‘దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో కలసి చాలా సినిమాలు చేశాను. చాలా కాలంగా అతను నాకు పరిచయం. అతని మీద వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను నేను అస్సలు నమ్మను’’ అన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ‘మున్నాభాయ్’ సిరీస్, ‘పీకే, సంజు’ చిత్రాల దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ చేసిన ఆరోపణలను సంజయ్ దత్ కొట్టి పారేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘రాజు మీద ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. ఆరోపణలు కాకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చుగా?’’ అన్నారు. ‘‘మున్నాభాయ్ సిరీస్‌లో కొత్త చిత్రం కచ్చితంగా ఉంటుందని రాజు ఆల్రెడీ చెప్పాడు. కానీ అది ఎప్పుడు ఉంటుందో నాక్కూడా సరిగ్గా తెలియదు’’ అని కూడా సంజయ్ దత్ చెప్పారు. -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు
పంజగుట్ట: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి తన హోదాను అడ్డంపెట్టుకుని తనను పుట్టింటికి పంపి, కుమారుడికి మరో వివాహం చేసేందుకు యత్నిస్తున్నాడని భార్గవి అనే మహిళ ఆరోపించింది. శుక్రవారం ఆమె తన తండ్రి కోటేశ్వరరావుతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివరాలు వెల్లడించింది. ఎల్బీ నగర్‌కు చెందిన ఎమ్.కోటేశ్వర రావు, నాగమణి దంపతుల కుమార్తె భార్గవికి, అంబర్‌పేటకు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిగి శంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్‌కు 2017 జులై 28న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.16 లక్షల నగదు, 30 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలని లేని పక్షంలో కొడుకుతో కాపురం చేయించమని, అత్త, మామలు లక్ష్మి, శంకర్ వేధించినట్లు తెలిపింది. తన భర్తతో మాట్లాడాలన్నా మామ అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై నిలదీస్తే భయబ్రాంతులకు గురి చేసేవారని ఆరోపించింది. అత్త, మామలు, ఆడపడుచులు, మరిది ప్రతి రోజు శారీరకంగా, మనసికంగా తనను హింసించే వారని, మరిది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. కుటుంబసభ్యులు బయటికి వెళితే తనను ఇంట్లో బంధించి బయటినుండి తాళం వేసుకుని వెళ్లేవారని తెలిపింది. 2018 నవంబర్ 1న హెల్త్‌కార్డు పేరుతో రూ.100 ఖాళీ బాండ్ పేపర్‌పై బలవంతంగా సంతకం చేయించుకున్నారని, దీనిపై భర్తను నిలదీస్తే నిన్ను వదిలించుకోవడానికి పరస్పర విడాకుల కోసం దరఖాస్తు చేసేందుకు సంతకాలు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. వారి వేధింపులు తాళలేక తల్లిందండ్రులకు చెప్పడంతో వారు మాట్లాడేందుకు ప్రయత్నించగా తన మామ శంకర్ హోదాను అడ్డం పెట్టుకుని తన చేతిలో కోర్టులు, పోలీస్‌శాఖ ఉన్నాయని, కుల సంఘాల మద్దతు ఉందని నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని బెదిరించినట్లు తెలిపింది. పెద్దల సలహా మేరకు తాను పుట్టింటికి వెళ్లగా తన భర్త శ్రీకాంత్‌కు మరో వివాహం చేసేందుకు వివాహ వేదిక వెబ్సైట్లో బయోడేటా పెట్టినట్లు తెలిపింది. దీనిపై తాను సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని తెలిపింది. అయితే శంకర్ కేసు దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తన మామ నుంచి తనకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది. ఇప్పటికైనా తన భర్తను తన వద్దకు పంపాలని వేడుకుంది. -
అధికారుల వేధింపులతో మహిళా హోంగార్డు మనస్తాపం
అనంతపురం సెంట్రల్: ఏఆర్ విభాగంలో అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఓ మహిళా హోంగార్డు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతమవుతోంది. బాధితురాలి కథనం మేరకు... నగరంలో మూడవ పట్టణపోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా హోంగార్డు (పేరు రాయవద్దని బాధితురాలి విజ్ఞప్తి మేరకు) మంగళవారం ఏఆర్ అధికారుల తీరును వివరించింది. తనకు ఆరోగ్యం బాగలేదని, చిన్న పిల్లాడు కూడా ఉన్నాడని మొరపెట్టుకుంటున్నా పెడచెవిన పెడుతూ ఇతర విభాగాలకు బదిలీ చేస్తున్నారని వాపోయింది. ఎవరినీ బదిలీ చేయకుండా తనను మాత్రమే బదిలీ చేశారని, చిన్న పిల్లాడిని వదిలి ఎక్కడికి పోవాలని విలపించింది. ఆర్ఐ పెద్దయ్య, హోంగార్డు ఇన్చార్జ్ ఇక్బాల్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని విషపుద్రావకం తీసుకొచ్చింది. స్థానిక ఉద్యోగులు ఆమెకు సర్ది చెప్పి పంపారు. ఈ విషయంపై ఏఆర్ డీఎస్పీ మురళీధర్‌ను వివరణ కోరగా సులభతరమైన విధులకు బదిలీ చేసినా పోనని చెప్పడం ఏమటని ప్రశ్నించారు. ఇది పద్ధతి కాదని, పరిపాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సిబ్బంది సహకరించాలని కోరారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలే తప్ప ఇలా చేయరాదని సూచించారు. -
అదనపు కట్నం కోసం..
కర్ణాటక, చింతామణి : అదనపు కట్నం తీసుకురాలేదని భార్యను చితకబాదిన ఘటన తాలుకాలోని కత్తిరగుప్ప గ్రామంలో సోమవారం చోటుచేసుకొంది. వివరాలు... చింతామణి తాలూకా కత్తిరగుప్ప గ్రామానికి చెందని ఇమ్రాన్ ఖాన్‌తో అదే తాలూకా జంగమకోటకు చెందిన షబీరాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ పోషణ పట్టించుకోకుండా భార్య నగలు తాకట్టు పెట్టి జల్సా చేసేవాడని సమాచారం. ఈ క్రమంలో పుట్టింటి వారు పలుమార్లు సహాయం చేశారు. రెండు రోజుల క్రిందట షబీరాను డబ్బులు తీసురావాలని పుట్టింటికి పంపాడు. అయితే ఆమె డబ్బులు ఏమీ తీసుకురాకపోవడంతో ఆగ్రహించి భార్యను చితకబాదాడు. అతని తల్లిదండ్రులు సైతం అతనికి సహకరించారు. ఆమె స్పృహ తప్పిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమె చావుకు నువ్వే కారణమంటూ వేధింపులు.. !
సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి మహేష్(25) అనే యువకుడు గ్రామానికి చెందిన పెరుగు తిరుపతి అనే వ్యక్తి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రెండు నెలల కిందట బలరావుపేట గ్రామానికి చెందిన ఓ యువతి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతితో మహేష్‌కు పరిచయం ఉన్నదనీ, ఆమె ఆత్మహత్యకు నువ్వే కారణమంటూ తిరుపతి మహేష్ ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు ఇవ్వాలనీ, లేకుంటే విషయాన్ని పోలీసులకు చెబుతాన ని బెదిరించాడన్నారు. మహేష్ తన వద్ద అంత డబ్బు లేదనీ, ఆటో నడుపుతూ బతుకుతున్నానని ఎంత బతిమిలాడినా వినకుండా.. నేను ఆల్ ఇం డియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శినని, నీపై అట్రాసిటీ కేసు పెడతానని, సదరు యువతి చావుకు నువ్వే కారణమని ధర్నా చేస్తానని తిరుపతి మహేష్‌ను వేధించాడు. దీంతో మృతుని కుటుంబీకులు కూడా డబ్బులు లేవని, తమను తప్పుడు కేసులో ఇరికించొద్దని తిరుపతి కాళ్లు మొక్కినా వినకుండా పోలీసులకు తెలిపాడు. దీం తో పోలీసులు మహేష్‌ను పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఈ క్రమంలోనే శనివారం జన్నారం మండలం గొడిసెరాలలో ఉన్న ఆలయానికి మహేష్ కుటుం బ సభ్యులతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికి మహేష్ భార్య శారద భర్త కనిపించకపోవడంతో ఫోన్ చేయగా, నన్ను పెరుగు తిరుపతి డబ్బుల కోసం వేధిస్తున్నాడనీ, అందుకే భయంతో పురుగుల మందు తాగానని చెప్పాడు. భార్య శారద వెంటనే ఆలయం దగ్గరికి రమ్మనగా అప్పటికే పురుగుల మందు తాగిన మహేష్ ఆలయానికి ఎలాగోలా వచ్చాడు. అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే మహేష్ ప్రాణాలు వదిలినట్లు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కటుకూరి రాజన్న, నాయకులు తిరుపతి, లక్ష్మణ్, శ్రీనివాస్ మృతుడి కుటుం బానికి నష్టపరిహారం చెల్లించి, మృతికి కారణమై న తిరుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సీఐ చట్ట పరమైన చర్యలు తీసుకొని మృతుని కుటుంబాని కి న్యాయం చేస్తామని తెలుపడంతో వారు శాం తించారు. మృతుడి తల్లి రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిసారు. కాగా, మృతుడికి నాలుగు నెలల పాప కూడా ఉంది. -
యువకుడి వేధింపులకు విద్యార్థిని బలి
మాగనూర్ (మక్తల్): ప్రేమ పేరుతో వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. ఈ సంఘటన మాగనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మాగనూర్‌కు చెందిన సౌందర్య(20) హైదరాబాద్‌లో ఉంటూ డిగ్రీ చదువుతుంది.ఈ క్రమంలో మంగళవారం స్వగ్రామానికి వచ్చింది. అయితే మక్తల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం యువకుడు ఏకంగా తన తల్లితోపాటు యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. అయితే తాను ప్రేమించకున్నా ఇంటికి రావడాన్ని తట్టుకోలేని యువతి అవమానభారంతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయమై ఏఎస్ఐ మహిభూషన్రెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో సీఐ వెంకట్ అక్కడికి చేరుకొని విద్యార్థిని కుటుంబ సభ్యులతో వివరాలు తెలుసుకున్నారు. -
ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష
పాతపట్నం: ఎన్నారై భర్త మోసం చేశాడంటూ భార్య మౌన పోరాటం చేసిన సంఘటన పాతపట్నం ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలంలోని హరిజన గోపాలపురం గ్రామానికి చెందిన పట్నాల సింహాద్రి, భారతిల కుమార్తె శిరీషకు పాతపట్నం ఎస్సీ కాలనీకు చెందిన సాన ధర్మపురి, విజయల కుమారుడు సాన గౌరీశంకర్‌తో 2016లో వివాహం జరిగింది. గౌరీశంకర్లో బ్యాంకాక్‌లో పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో రూ.5 లక్షలు, 5 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకగా ఇచ్చారు. పెళ్లయిన నెల రోజుల నుంచే అదనపు కట్నం కావాలంటూ అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. రెండు నెలలు గడిచిన తర్వాత శిరీషను బ్యాంకాక్ తీసుకెళ్లిన గౌరీశంకర్ 15 రోజుల అనంతరం భార్యను ఒంటరిగా పాతపట్నం పంపించేశాడు. అప్పటి నుంచి శిరీష కన్నవారింట్లోనే ఉంటుంది. గౌరీశంకర్ మాత్రం పాతపట్నం రాకుండా విదేశాల్లోనే ఉంటున్నాడు. ఎప్పటికీ భర్త రాకపోవడంతో శిరీష శనివారం తన మూడేళ్ల కుమారుడు సుజిత్ శంకర్‌తో కలిసి మౌనదీక్షకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, పోలీసులు స్పందించి తన భర్త పాతపట్నం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడింది. -
అదనపు కట్నం కోసం వేధింపులు
తూర్పుగోదావరి , అమలాపురం టౌన్: భర్త, అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన ప్రస్తుతం అమలాపురం హెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న వాసంశెట్టి శ్రీలక్ష్మి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్త మామలపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీలక్ష్మి తండ్రి ముంబైలో టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ రెండు నెలలకోసారి సొంతూరు ముమ్మిడివరం మండలం అనాతవరం వస్తూ ఉంటారు. శ్రీలక్ష్మిని 2004 మే 28న అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామానికి చెందిన వాసంశెట్టి రాంబాబుకు ఇచ్చి వివాహం చేశారు. వారి పెళ్లి అయ్యే సమయంలో భర్త రాంబాబు ముంబైలోనే నివాసముంటున్నాడు. పెళ్లి సమయంలో తన భర్తకు కట్నం కింద రూ.ఐదు లక్షలు ఇచ్చామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలో తన భర్త మేము అద్దెకు ఉంటున్న ఇంట్లోనే వదిలేసి తాను మాత్రం కోనసీమకు వచ్చేశాడని తెలిపింది. తనను భర్త, అత్త మామలు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న దృష్ట్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. ఇటీవల తన తల్లిదండ్రులు బండార్లంకలోని తమ అత్త వారి ఇంటి వద్ద ఉంచి వెళ్లారని, అప్పటి నుంచి తనను మరీ వేధిస్తున్నారని తెలిపింది. అత్త మామలపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. -
కోడలిపై మామ వేధింపులు
నరసరావుపేట రూరల్: మామ వేధింపులు తాళలేక కోడలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్సప్పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది జూన్‌లో తన కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని బాధితురాలు బయటకు చెప్పలేదు. అయితే రానురాను మామ వేధింపులు ఎక్కువ కావడంతో గురువారం రూరల్ పోలీసులను ఆమె ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ షఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదనపు కట్నం కోసం ఖాకీ వేధింపులు
సాక్షి,కర్ణాటక, బళ్లారి: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను గర్భవతి అని తెలిసినా కూడా చిత్రహింసలకు గురి చేస్తూ వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై భార్య మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వరకట్నం విషయంలో పోలీసులు కూడా అతీతులు కాదని బళ్లారి జిల్లా పోలీసు కానిస్టేబుల్ నిరూపించారు. ఈసందర్భంగా బళ్లారి నగరానికి చెందిన నసీమా బేగం(25) అనే మహిళ తన భర్త కానిస్టేబుల్ మహబూబ్ బాషాపై మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. ఆమె మహిళా పోలీసు స్టేషన్లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి నగరంలోని కౌల్‌బజార్‌కు చెందిన నసీమా బేగంను తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన రూ.3 లక్షల నగదుతో పాటు మరో 10 తులాలు బంగారం లాంఛనాలుగా ఇచ్చి జిల్లాలోని మరియమ్మనహళ్లికి చెందిన మహబూబ్ బాషాతో ఏడాదిన్నర క్రితం ముస్లిం సంప్రదాయం ప్రకారం అన్ని విధాలుగా ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత రెండు నెలలు సజావుగా వారి వైవాహిక జీవితం సాగిన అనంతరం కట్నం కోసం భర్త వేధింపులు మొదలు పెట్టారు. ప్రస్తుతం నసీమా బేగం ఆరు నెలల గర్భవతి కూడా అయినప్పటికీ పెళ్లి సందర్భంలో మాట్లాడిన మరో రెండు లక్షలు నగదు ఇవ్వాలని సంవత్సరం నుంచి వేధింపులతో పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేసేవారు. కూతురుని కట్నం కోసం వేధిస్తున్నారని తెలిసి మనోవేదనతో తన తండ్రి ఇటీవల మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కట్నం కోసం వేధించడంతో పాటు కొట్టడం, మానసికంగా చిత్రహింసలు చేయడం అలవాటు చేసుకున్న మహబూబ్ బాషా తీరు మారదని నిర్ధారించుకున్న ఆమె చివరకు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని హొసపేటె నగరంలోని తుంగభద్ర డ్యాం పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా మహిళా పోలీసు స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నసీమా బేగం తన భర్తపై అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సుభాష్ ఘాయ్... కేస్ గయా
‘తాల్, ఖల్నాయక్’ వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు మోడల్ కేట్ శర్మ. తనతో తప్పుగా ప్రవర్తించాడని, మానసికంగా టార్చర్ చేశాడని గత నెల ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారామె. నెలన్నర తర్వాత ఆ కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేసు వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ – ‘‘మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. మా ఇంట్లోవాళ్లను చూసుకోవాలి. నాకు జరిగిపోయినదాని గురించి న్యాయం కోసం పరుగులు తీయలేను. ఇప్పటికే అన్నింటికీ విసిగిపోయాను’’ అన్నారు. ఇంకా ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ – ‘‘మీటూ’ గురించి చాలా మంది జోక్ చేస్తున్నారు. ఇంతమంది బయటకు వచ్చి చెబుతున్నా ఇంకా ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. పోరాటం చేయడానికి గల కారణం నాకు కనిపించడం లేదు. నేను చెప్పాల్సిందంతా పబ్లిక్ ప్లాట్ఫార్మ్ లోనే ఉంది. నేను, సుభాష్ ఘాయ్ ఫ్రెండ్స్. కానీ ఆ స్నేహం నిలిచేలా అతను ప్రవర్తించలేదు’’ అని పేర్కొన్నారు కేట్ శర్మ. -
మహిళా రక్షక్
నెల్లూరు(క్రైమ్): మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకోసం మహిళా రక్షక్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. తొలిసారిగా జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని ఆరు పోలీస్ స్టేషన్లు, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ల సిబ్బందితో 10 బృందాలు (ఒక్కో స్టేషన్‌కు ఒక్కో బృందం, మహిళా స్టేషన్లో మూడు బృందాలు)ను నియమించామని, వారిద్వారా పోకిరీల భరతం పడతామని ఎస్పీ చెప్పారు. మంగళవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో ఉన్న ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో బృందాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ప్రయత్నంగా జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళా డీఎస్పీ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయన్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగ పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. వీరు ఆయా ప్రాంత పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళలపై వేధింపులు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి మఫ్టీలో సంచరిస్తారన్నారు. ఈవ్‌టీజింగ్, మహిళలపై దాడులకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తారన్నారు. మొదటిసారి పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై కేసులు నమోదుచేసి జైలుకు పంపుతామని చెప్పారు. నిఘా కెమెరాలతో పరిశీలన ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ కె.శ్రీనివాసాచారి పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సిబ్బంది అక్కడి నుంచే సీసీ కెమెరాల ద్వారా నగరంలో ఈవ్‌టీజింగ్, దాడులను గుర్తించి మహిళా రక్షక్ బృందాలకు సమాచారం అందిస్తారన్నారు. వెంటనే సిబ్బంది నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొంటారన్నారు. పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. తమ ప్రాంతాల్లో యువతులపై ఆకతాయిల వేధింపులు, మహిళలపై దాడులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యతాయుతంగా పనిచేయండి మహిళా రక్షక్ బృందాల్లోని సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ అన్నారు. మీరిచ్చే స్ఫూర్తితో జిల్లాలోని అన్నీ పట్టణాల్లో రక్షక్ బృందాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాలను త్వరలోనే సమకూరుస్తామన్నారు. అనంతరం ఆయన మహిళా రక్షక్ బృందాల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అడ్మిన్, క్రైమ్ ఏఎస్పీలు పి.పరమేశ్వరరెడ్డి, ఆంజనేయులు, ఏఆర్ ఏఎస్పీ వీరభద్రుడు, నెల్లూరు నగర, ఎస్సీ, ఎస్టీ సెల్–1, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, కె.శ్రీనివాసాచారి, పి.శ్రీధర్, నగర ఇన్స్పెక్టర్లు పాపారావు, వేణుగోపాల్‌రెడ్డి నరసింహారావు, పి.శ్రీనివాసులురెడ్డి, ఎస్సై తదితర సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందికి అభినందన ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొందరిపై కత్తులతో దాడిచేయబోయిన వారిని చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ ఆర్ఎస్సై కృష్ణయ్య, కానిõస్టేబుల్ శివకృష్ణలను ఎస్పీ రస్తోగి అభినందించారు. సిబ్బంది సకాలంలో స్పందించి నిందితులను పట్టుకోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదన్నారు. అనంతరం వారికి నగదు రివార్డులను అందించారు. ఫోన్ నంబర్లు మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలిపేందుకు వీలులేని పక్షంలో డయల్ 100కు ఫోన్ చేయొచ్చు. లేదా 93907 77727, 94904 39561లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. -
నవాజుద్దీన్ తీరుకి షాకయ్యా
నవాజుద్దిన్ సిద్ధిఖీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వెర్సటైల్ యాక్టర్. నవాజుద్దిన్ సినిమా ఓకే చేశాడంటే ఆ సినిమాలో ఎదో స్పెషాలిటీ ఉన్నట్టే అనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే రచయిత ‘మంటో’ పాత్ర పోషించి చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఈ నటుడిపై వేధింపుల ఆరోపణలు చేశారు మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్. ఆల్రెడీ నవాజుద్దిన్ సిద్ధిఖీ తన ఆటోబయోగ్రఫీ ‘యాన్ ఆర్డినరీ లైఫ్’ లో నిహారికా సింగ్‌తో ఉన్న సంబంధం గురించి రాసుకొచ్చారు. ఇంకా మరో ఇద్దరు ముగ్గురి గురించి కూడా ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించారు. దాంతో మా అనుమతి లేకుండా పుస్తకంలో మా గురించి రాశారని సంబంధిత వ్యక్తులు పేర్కొనడంతో అప్పటికే స్టాల్స్‌కి వెళ్లిన ఆ పుస్తకాలను పబ్లిష్ చేసిన సంస్థ వెనక్కి తెప్పించింది. ఇప్పుడు జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తన కథను చెప్పుకొచ్చారు నిహారికా సింగ్. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అనుభవాలను విశ్లేషిస్తూ రాసుకొచ్చారు. అందులోని సారాంశం ఏంటంటే.. ‘‘బాలీవుడ్లో నటిగా ఎదుగుదాం అనుకున్న రోజుల్లో ‘మిస్ లవ్లీ’ అనే సినిమా అవకాశం వచ్చింది. నవాజుద్దిన్ అనే నటుణ్ణి అప్పుడే ఫస్ట్ టైమ్ కలిశాను. తను గొప్ప నటుడు అనుకోలేదు. తను నటించిన షార్ట్ ఫిల్మ్ సీడీ నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన మీద ఒకలాంటి గౌరవం ఏర్పడింది. మరుసటిరోజు నన్ను భోజనానికి ఆహ్వానించాడు. ఫిల్మీ ప్రపంచంలో ఆయనతో మాట్లాడుతుంటే చాలా నిజమైన వ్యక్తిగా తోచాడు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్ నిమిత్తం మా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చానని ఆయన మెసేజ్ చేయడంతో మా ఇంటికి ఆహ్వానించాను. ఇంటికి రావడంతోనే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను షాకయ్యా. తనని వెనక్కి తోసేయాలనుకున్నా కూడా అది విఫల ప్రయత్నమే అయింది. ‘పరేశ్ రావల్, మనోజ్ బాజ్పాయిలా మిస్ ఇండియానో, హీరోయిన్నో పెళ్లి చేసుకోవాలనుంది’ అన్నాడు నవాజుద్దిన్. అప్పటికి తను ఇన్సెక్యూర్డ్గా ఉండేవాడు. తన లుక్స్, స్కిన్ కలర్, ఇంగ్లీష్ చూసి ఇండస్ట్రీ ఏమంటుందో అని బాధపడేవాడు. అందులో నుంచి బయటకు రావడానికి నేను కొంత సాయం చేశాను. మెల్లిగా అతను చెబుతున్నవన్నీ అబద్ధాలని తెలియడం మొదలైంది. కేవలం నాతోనే కాదు చాలా మంది స్త్రీలతో రిలేషన్షిప్లో ఉన్నాడనీ, ఒక అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నాడని తెలుసుకున్నాను. కట్నం కోసం వేధిస్తున్నాడని వాళ్లు విడిపోయారు. నేను అతన్ని నిజాయతీగా ఉండమన్నాను. అలా ఉండేంతవరకూ నిన్ను కలవనని కూడా చెప్పాను. ఆ తర్వాత మేం నటించిన ‘మిస్ లవ్లీ’ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక అయింది. మళ్లీ మూడేళ్లకు అప్పుడే కలుసుకున్నాం. తను ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత ‘అన్వర్ కా అజాబ్ కిస్సా’ అనే చిత్రంలో నాకో పాత్ర రికమెండ్ చేశాడు. ఆ సమయంలో మళ్లీ నాతో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించాడు. తనతో ఉండమని బతిమాలాడు. కానీ ఫ్రెండ్‌లా అయితే ఉంటానని చెప్పాను. ఆ సినిమా రిలీజ్ కాలేదు. నేనంత గొప్ప నటి కాదని అందరితో చెప్పడం మొదలెట్టాడు. నా అవకాశాలు తగ్గాయి. మమ్మల్ని సంప్రదించకుండానే తన పుస్తకంలో తనకు నచ్చినట్టుగా మా గురించి రాసుకొచ్చాడు’’ అని పేర్కొన్నారు నిహారికా సింగ్. -
వేధింపుల కేసులో బాక్సర్‌కు జైలుశిక్ష
విశాఖపట్నం, పీఎంపాలెం(భీమిలి): బాక్సింగ్ క్రీడలో పతకాలు తీసుకు వచ్చిన యువకుడు కట్టుకున్న భార్యకు ప్రేమాభిమానాలు కనబరచడంలో విఫలమయ్యాడు. వివాహ బంధానికి తూట్లు పొడిచాడు. భర్త గొప్ప క్రీడాకారుడని ఎంతో మురిసిపోయిన యువతికి నరకం చూపించాడు. కట్న పిశాచిలా మారాడు. అమ్మాయి తరఫువారు ఎంతగా ప్రాధేయ పడినా.. అడిగినప్పుడల్లా కానులు సమర్పించినా మనసు కరగలేదు. బాక్సర్ అయిన భర్త పెట్టే హింసలు తాళలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిది. కేసును విచారించిన భీమిలి న్యాయ స్థానం నేరం రుజువవడంతో వీరోతి సంతోష్‌కుమార్ అనే అంతర్జాతీయ బాక్సర్తో పాటు ఇదే కేసులో మరో ముగ్గురు కుటుంబసభ్యులకు న్యాయమూర్తి ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ. 2500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ. కె.లక్ష్మణమూర్తి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపగుంట సాయిమాధవ్నగర్కు చెందిన వీరోతి సంతోష్‌కుమార్ (27)అంతర్జాతీయ స్థాయి బాక్సర్. ఆసియాడ్‌లో పతకాలు సాధించాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు.అతని క్రీడా ప్రతిభను కేంద్రప్రభుత్వం గుర్తించి ఆర్మీ లో సుబేదార్ హోదా ఉద్యోగం ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మధురవాడకు చెందిన వి.మారుతీ ప్రసాద్ తన కుమార్తె మణిరత్నానికి బాక్సర్ సంతోష్ కుమార్‌కు 2014 డిసెంబరు 12న వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. వధువు కన్నవారు ఉన్నంతలో కట్నకానుకలు, కారు సమర్పించారు. అయినా సంతోష్‌కుమార్‌కు అతని తండ్రి విశ్వనాథంకు కట్నం దాహం తీరలేదు. నిత్యం అదనపు కట్నం కోసం వేధించేవారు. సూటి పోటి మాటలతో హింసించేవారు. పండగలు, పబ్బాలకు కన్నవారింటికి పంపించేవారు కాదు.నరకం చూపించేవారు. కుమార్తెకు పెట్టే హింసలు చూసి కన్నవారు అక్కున చేర్చుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు 2016 ఆగస్టే 23న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం భీమిలి కోర్టులో చార్జిషీటు దాకలు చేశారు. నేరారోపణలు రుజువు కావడంతో భీమునిపట్నం 16వ అడిషనల్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ బాక్సింగ్ క్రీడాకారుడు సంతోషకుమార్, అతని తల్లిదండ్రులు విశ్వనా«థం,ఈశ్వరమ్మతో పాటు సోదరుడు భాను అప్పలగణేష్(అలియాస్ గణేష్‌ల)కు వరకట్న నిషేధ చట్టం కింద, 498 కింద ఏడాది జైలుశిక్ష, రూ. 2500లు వంతున జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారని సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. -
అప్పుడు శ్రుతి ఎందుకు మాట్లాడలేదు?
‘‘నిబుణన్’ షూటింగ్లో నాతో అర్జున్ అసభ్యకరంగా వ్యవహరించారు. సినిమాను ఆపడం ఇష్టం లేకే ఈ విషయాన్ని అప్పుడు కాకుండా ఇప్పుడు చెబుతున్నా’’ అని నటి శ్రుతీ హరిహరన్ పేర్కొనడం సంచలనం రేపింది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో పాటు మరికొందరు శ్రుతీకి మద్దతుగా నిలిస్తే, ‘నిబుణన్’ చిత్రదర్శకుడు అరుణ్ వైద్యనాథన్‌తో పాటు ఇంకొందరు అర్జున్‌ని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా అర్జున్ తనయ, నటి ఐశ్వర్య స్పందిస్తూ – ‘‘మీటూ’ ఉద్యమాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు. తన సినిమా కథలను వినమని నాన్న నాకు చెబుతుంటారు. ‘నిబుణన్’ కథలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాల్ని తొలగిస్తే కానీ చేయనని మా నాన్న చెప్పినప్పుడు శ్రుతి ఎందుకు మాట్లాడలేదు? ఆ సినిమాకి ఆమె పనిచేసింది 5 రోజులే. ఆ 5 రోజుల్లో నాన్న వల్ల ఇబ్బంది కలిగిందని వెల్లడించారు. రిసార్ట్‌కి, డిన్నర్‌కి పిలిచేంత టైమ్ నాన్నకు లేదు. అస్సలు మా నాన్న పబ్‌కు వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది ఆమెను రిసార్ట్‌కు రమ్మంటారా? శ్రుతి సొంత లాభం కోసమే ఇలా చేస్తున్నారు’’ అన్నారు ఐశ్వర్య. -
తనుశ్రీకి పిచ్చి పట్టింది
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి. -
నిర్మాత శ్రేయస్సే ముఖ్యం
నటి తనుశ్రీ దత్తాను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించారని నటుడు నానా పటేకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘హస్‌ఫుల్ 4’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఆరోపణలు క్లియర్ అయ్యే వరకూ సినిమా షూటింగ్ నిలిపివేద్దాం అని హీరో అక్షయ్ కుమార్ టీమ్‌ని కోరిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ మీద కూడా ఈ ఆరోపణలు రావడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారాయన. తాజాగా ఈ సినిమా నుంచి నానా పటేకర్ కూడా తప్పుకున్నారట. ‘‘అందరి సౌకర్యం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నానా పటేకర్. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే సరైన స్టెప్. ఎవరైనా నిర్మాత శ్రేయస్సే కోరుకుంటారు. అందుకే.. నానా కూడా సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని నానా తనయుడు మల్హర్ మీడియాతో చెప్పారు. ప్రస్తుతం నానా పటేకర్ స్థానంలో అనిల్ కపూర్ పేరుని పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. -
ఆ నిబంధన పెట్టుకున్నా!
‘మర్డర్, జన్నత్, గ్యాంగ్‌స్టర్, మిస్టర్ ఎక్స్, బాద్షాహో’ వంటి హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ఇమ్రాన్ హష్మి. రీసెంట్గా ‘చీట్ ఇండియా’ సినిమాతో నిర్మాతగానూ మారారాయన. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న ఈ సినిమాలో హీరోగానూ నటిస్తున్నారు ఇమ్రాన్. ప్రస్తుతం మహిళలపై లైగింక వేధింపులకు సంబంధించిన ‘మీటూ’ ఉద్యమం గురించి ఎంత చర్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఉద్యమానికి సంబంధించి ఇకపై తాను నటించబోయే సినిమా కాంట్రాక్ట్స్‌లో ‘యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్’ క్లాజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని ఇమ్రాన్ పేర్కొన్నారు. ‘‘ఇతర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో ఇలాంటి క్లాజ్ ఉంది. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ క్లాజ్‌ను పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. కానీ ఫిల్మ్ ప్రొడక్షన్లో సరిగ్గా అమలు కావడం లేదు. నా కంపెనీలో స్త్రీలు, పురుషులకు ఈ నిబంధన వర్తించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మీ టూ’ ఉద్యమంలో నా పేరు వస్తుందనుకోవడం లేదు. ఎందుకంటే నేనేప్పుడూ డైరెక్టర్స్ చెప్పిన వాటిని మాత్రమే చేశాను’’ అన్నారు. -
అతనితో పని చేయొద్దు
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని బాలీవుడ్ మీడియాకు తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా హృతిక్‌పై మాటల తూటాలు పేల్చుతూనే ఉంటారు కంగనా. తాజాగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా మాట్లాడుతూ హృతిక్‌తో ఎవ్వరూ పని చేయకూడదు అని సంచలన వాఖ్యలు చేశారామె. ‘‘దర్శకుడు వికాస్ బాల్ విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ నిజమే. మన ఇండస్ట్రీలో స్త్రీలతో సరిగ్గా ప్రవర్తించనివాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లందర్నీ శిక్షించాలి. తమ భార్యలను పతకాలుగా ఉంచుకొని యవ్వనంలో ఉన్న స్త్రీలను గర్ల్‌ఫ్రెండ్‌గా భావించేవాళ్లను కూడా శిక్షించాలి’’ అన్నారు. మీరు ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు అని అడగ్గా ‘‘నేను హృతిక్ రోషన్ గురించే మాట్లాడుతున్నాను. అతనితో కలసి పని చేయడం మానేయాలి’’ అన్నారు. -
మార్పుకి ముందడుగు
‘మీటూ’ అంటూ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి స్త్రీలు తమకు జరిగిన వైధింపుల గురించి బయటకు వచ్చి చెబుతున్నారు. వారి ధైర్యానికి మద్దతు లభిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇకపై కలసి పని చేయబోమని పలువురు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. వికాస్ బాల్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనతో చేయబోయే ప్రాజెక్ట్ నుంచి వికాస్‌ని తప్పిస్తున్నాం అని అమేజాన్ సంస్థ పేర్కొంది. అలాగే ‘స్టాండప్ కామెడీ’ టీమ్ ఏఐబీ మీద వచ్చిన ఆరోపణల వల్ల హాట్‌స్టార్ తమతో వాళ్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తోడయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా తర్వాత దర్శకుడు సుభాష్ కపూర్‌తో కలసి ఆమిర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా అతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించే సరికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమిర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఆ సారాంశం ఏంటంటే... ‘‘క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకడానికి నటులుగా మేం ప్రయత్నిస్తుంటాం. మా నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను అస్సలు సహించకూడదనే పాలసీ ఉంది. అంతే సమానంగా తప్పుడు ఆరోపణలను కూడా ప్రోత్సహించం. మేం త్వరలో మొదలుపెట్టబోయే ఓ ప్రాజెక్ట్‌లో ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి అని మాకు తెలిసింది. కేసు లీగల్‌గా నడుస్తున్నందు వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం. పాత తప్పులన్నీ సరిచూసుకొని మార్పువైపు అడుగు వేయడానికి ఇదో ముందడుగు. చాలా ఏళ్లుగా స్త్రీలు లైంగికంగా దోచుకోబడుతున్నారు. ఇది ఆగాలి’’ అని ఆమిర్ భార్య కిరణ్ రావ్, ఆమిర్ పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తి’ అని ఆయన పేర్కొన్నది సుభాష్ కపూర్ గురించే అని బాలీవుడ్ టాక్. -
చీకటి కోణాలు
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. భవిష్యత్‌లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్ బాల్, అలోక్నాథ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్‌ల వివాదం మరో స్థాయికి చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు రాకేష్ సారంగ్‌లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాల్సిందే! ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్ బాల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్‌పై సోషల్æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్. ‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్‌ను, ఇమేజ్ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్ ఫిల్మ్స్‌ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్ తరఫు లాయర్. మరోవైపు వికాస్ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవీంగ్ ఇమేజ్ బోర్డ్ (ఎమ్ఎఎమ్ఐ) సభ్యత్వాన్ని అనురాగ్ కశ్యప్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్‌పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్‌లకు దూరం చేశాయని తెలుస్తోంది. అపస్వరం! సింగర్‌గా పలు హిట్ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్ ఖేర్ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్ కైలాష్ ఖేర్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్ అనే నేను), ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్ సాంగ్స్‌ను పాడారు కైలాష్. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్ సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు. భార్యను వేధించిన దర్శకుడు! మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్‌తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్‌లో నాగరాజ్ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్ కూడా మూవీ లొకేషన్లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్ ఇండస్ట్రీలో నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదొక ఫ్యాషన్! గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్‌ను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్ చేశారు. బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు. -
నానా పటేకర్‌పై తనూశ్రీ దత్తా ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను వేధించారంటూ నటి తనూశ్రీ దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నటి తనూశ్రీ శనివారం నానా పటేకర్‌పై మాకు ఫిర్యాదు అందజేశారు. ఈ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు’ అని ముంబై (పశ్చిమ) ఏసీపీ మనోజ్ తెలిపారు. జోథ్‌పూర్‌లో జరుగుతున్న హౌస్‌ఫుల్–4 సినిమా షూటింగ్ నుంచి ఇక్కడికి చేరుకున్న పటేకర్ ఈ విషయమై స్పందిస్తూ..‘ఆమె ఆరోపణ అబద్ధమని పదేళ్ల క్రితమే చెప్పా’ అని అన్నారు. క్షమాపణ చెప్పాలంటూ తనూశ్రీకి ఇప్పటికే ఆయన లీగల్ నోటీసు పంపారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది. -
నోటీసులు అందాయి
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) సినిమా సెట్లో నటుడు నానా పటేకర్, ‘చాక్లెట్’ సినిమా సెట్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. ‘‘తన పట్ల వివేక్ అగ్నిహోత్రి అమర్యాదగా ప్రవర్తించారన్న తనుశ్రీ మాటల్లో వాస్తవం లేదు. పబ్లిసిటీ లేదా వ్యక్తిగత లబ్ధి కోసమే ఆమె ఇలా చేస్తున్నారు’’ అన్నది ఆ నోటీసుల సారాంశమట. ‘‘నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి నాకు గురువారం నోటీసులు వచ్చాయి. వేధింపులు, అవమానం, అన్యాయాలకు నోరు విప్పితే ఇక్కడ ఇలాంటి బహుమతులు వచ్చాయి. నానా, వివేక్ బృందాలు నాపై బురద చల్లడానికి అసత్యాలు మాట్లాడుతున్నారు’’ అని తను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారని బాలీవుడ్లో తాజాగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ‘‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సంఘటనను ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’’ అని ముంబై మంత్రి ఒకరు ఫోన్లో తనుశ్రీతో సంభాషించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రీదా పింటో కూడా తనుశ్రీకి మద్దతు తెలిపారు. -
‘అధికారులపై వేధింపులకు పాల్పడితే చర్యలు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉన్నతాధికారులపై, కార్మికులపై ఎవరు దూషణలకు పాల్పడినా అకారణంగా వేధించినా సహించేది లేదనీ, వారిపై చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్లో మాట్లాడు తూ.. ఇటీవల సీసీఎస్ బకాయిలను చెల్లించాలంటూ జరిగిన నిరసన సందర్భంగా టీఎం యూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలు అకారణంగా ఆర్థిక సలహాదారు స్వర్ణ శంకరన్‌పై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు చెందిన సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్ నిధులను సంస్థ మళ్లించడం తప్పేనని, తప్పని పరిస్థితుల్లోనే అలా చేశామన్న సంగతిని గుర్తించాలని విన్నవించారు. ప్రగతి నివేదన సభకు తరలించే బస్సులకు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
చదువుల తల్లికి ‘సోషల్’ వేధింపులు
కొచ్చి: హానన్ హమీద్ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే తను బతకడం కోసం, తన తల్లిని బతికించుకోవడం కోసం తనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్ హమీద్ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ కేరళ ‘మాతృభూమి’ దిన పత్రిక కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు హానన్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. రంగంలోకి పోకిరీలు హానన్ పేరు పత్రికల్లో రావడం సహించలేని కొందరు వ్యక్తులు ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్‌లోకి చొరబడి ఆమె ఫొటోలు, ప్రముఖులతో దిగిన సెల్ఫీలూ, డబ్స్మాష్ వీడియోలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హానన్ నిజాయితీని శంకిస్తూ పోస్ట్‌లు పెట్టి వ్యక్తిగతంగా దాడికి దిగారు. హానన్ నిజంగా పేదరాలైతే ఆమె వేలికున్న ఉంగరం ఎక్కడిది? అని ఒకరు, ప్రచారం కోసం ఇదంతా చేస్తోందని మరొకరు. ఇలా నానా రకాలుగా ఆమెను వేధించారు. చివరికి తనకు ఎవ్వరి సాయం అక్కర్లేదనీ, తన మానాన తనను వదిలేయాలని హానన్ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అర్థించినా ఈ నీచులు వెనక్కి తగ్గలేదు. హానన్‌కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ మద్దతు.. ఆకతాయిలు ఓ యువతిని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్ తీవ్రంగా స్పందించారు. ‘కేరళ సొర చేపల్లారా.. హానన్‌పై దాడిచేయడాన్ని ఆపండి. మీ చర్యల పట్ల నేను సిగ్గుపడుతున్నా. చెదిరిన తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి పోరాడుతుంటే మీరు మాత్రం రాబందుల్లా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఫేస్బుక్లో మండిపడ్డారు. హానన్‌ను సోషల్‌మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసుల్ని ఆదేశించారు. మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో తాను చేయబోయే సినిమాలో హానన్‌కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపి ప్రకటించారు. ఎంబీబీఎస్ చదవాలన్నదే లక్ష్యం.. ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడుకోళలోని అల్ అజహర్ కాలేజ్‌లో హనన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయాన్నే చేపల్ని కొనుక్కుని వచ్చి ఫ్రిజ్‌లో దాచడం, కాలేజీకి వెళ్లివచ్చిన వెంటనే వాటిని చంపెక్కరా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మడం ఆమె దినచర్య. ఈ చేపల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పోషిస్తూ హానన్ చదువుకుంటోంది. కేవలం చేపలే కాదు.. యాంకరింగ్, ట్యూషన్లు, రేడియో ప్రోగ్రాములు ఒక్కటేమిటీ వీలైన ప్రతివిభాగంలో హానన్ పనిచేసింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ రాణించింది. ఎప్పటికైనా ఎంబీబీఎస్ చదవడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్న హానన్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. చేపలు అమ్ముతున్న హానన్ (ఫైల్). -
అలాంటి వారికి సినిమా కరెక్ట్ కాదు
‘‘మానసికంగా ధైర్యంగా లేని వారికి సినిమా సరైనది కాదు’’ అంటున్నారు అమలా పాల్. ప్రస్తుతం స్త్రీలపై అఘాయిత్యాలు, వేధింపులు జరగడం ప్రతిరోజూ గమనిస్తున్నాం. ఈ చర్యలను ఉద్దేశించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘స్త్రీలపై వేధింపులు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయి అనుకోవడం పొరపాటు. అన్ని రంగాల్లో ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. కానీ స్త్రీ మాత్రం తన ధైర్యాన్ని కోల్పోకూడదు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే వాళ్లు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మానసికంగా ధైర్యంగా లేకపోతే ఇక్కడ రాణించలేం. కేవలం సినిమా అనే కాదు, ఇది ఏ వృత్తికి అయినా అప్లై అవుతుంది. వర్కింగ్ ప్లేస్‌లో రకరకాల వేధింపులకు గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. మన నిర్ణయం మీద కచ్చితంగా నిలబడగలగటం, ఆలోచనల్ని సూటిగా వ్యక్తపరచడం నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యకైనా ఎదురుగా నిలబడి పోరాడటం నేర్చుకోగలుగుతాం’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
భర్తను హత్య చేసిన భార్య, కుమారుడు
బాన్సువాడ టౌన్: నిత్యం మద్యం సేవించి భార్యను వేధింపులకు గురి చేసిన భర్తను వాటి నుంచి విముక్తి కోసం కట్టుకున్న భర్యనే భర్తను కుమారుడి సహాయంతో హత్య చేసింది. ఇంటి పక్కనే ఉన్న పాత ఇంట్లో పూడ్చి పెట్టిన సంఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పిట్లం మండలం చిల్లెర్గి గ్రామానికి చెందిన మంగలి సాయిలు(50), దెగ్లూర్‌కు చెందిన ఎందోళ్ల సునంద దంపతులు. జీవనోపాధి కోసం 15 ఏళ్ల కిత్రం బాన్సువాడకు వచ్చారు. పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రోడ్డు–4లో ఉంటున్నారు. వీరికి కిరణ్, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులు. కిరణ్ హైదరాబాద్‌లో హోటల్లో పని చేస్తున్నాడు. శ్రీనివాస్ తల్లి దగ్గర ఉంటున్నాడు. బాన్సువాడలోని ఓ హెర్ కటింగ్ సెలూన్లో సాయిలు పని చేస్తున్నాడు. మద్యంకు బానిసై డబ్బుల కోసం నిత్యం భార్యను కొట్టి, చిత్ర హింసలకు గురిచేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి పెద్ద కుమారుడు కిరణ్ బాన్సువాడకు వచ్చాడు. ఇదే క్రమంలో ఈనెల 20న అర్ధరాత్రి సాయిలు భార్య సునంద, కుమారుడి కిరణ్‌తో గొడవ పడ్డాడు. ఇంట్లో ఉన్న రోకలి బండతో సాయిలు తలపై కిరణ్ బలంగా కొట్డాడు. చనిపోయాడో లేదోనని కరెంట్ షాక్ కూడా పెట్టారు. అర్ధరాత్రి దాటాక ఇంటి పక్కనున్న పాత ఇంట్లో గుంత తవ్వి సాయిలు మృతి దేహాన్ని పూడ్చిపెట్టారు. సోమవారం రెండు రోజులుగా సాయిలు కనిపించడంలేదని, మృతుడి బావ కిష్టాపూర్‌కు చెందిన మంగళి నాగయ్య వద్దకు వెళ్లి సునంద చెప్పింది. దీంతో మృతుడి బావ నాగయ్య, మృతుడి అన్న చిల్లెర్గి విఠల్ ఇద్దరు కలిసి సంగమేశ్వర కాలనీలో వాకబు చేశారు. మృతుడి భార్య, కుమారుడిపైనే అనుమానం ఉందని కాలనీవాసులు చెప్పడంతో నాగయ్య, విఠల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేశారు. మృతుడి భార్య సునందను, కుమారుడు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. సీఐ శేఖర్‌రెడ్డి మృత దేహం పాతిన ప్రదేశాన్ని, హత్యకుపయోగించిన రోకలి బండ, విద్యుత్ తీగలను పరిశీలించారు. తహసీల్దార్ సమక్షంలో నిందితులు చెప్పిన పాత ఇంట్లో ఉన్న మృతి దేహాన్ని వెలికి తీస్తామని సీఐ అన్నారు. ప్రస్తుతం అదృశ్యం కేసు నమోదు చేశామని, మంగళవారం మృత దేహం లభిస్తే హత్య కేసుగా నమోదు చేస్తామని ఆయన అన్నారు. -
హోలీ వేడుకల్లో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. హోలీ పేరుతో కొందరు దుండగులు తమపై వీర్యం నింపిన బెలూన్లను విసిరివేస్తూ వేధిస్తున్నారని లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థినులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ద్రవపదార్థం నిండిన బెలూన్ను తనపై కొందరు విసిరివేశారని, అది తన దుస్తులపై పడిందని ఓ విద్యార్థిని తన ఫ్రెండ్‌తో చెప్పగా, అయితే అవి రంగు నీళ్లు కాదని, వీర్యమని గుర్తించిన వారు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు పలువురు విద్యార్థినులకు ఎదురయ్యాయని కాలేజ్ ఉమెన్ డెవలప్మెంట్ సెల్ విచారణలో వెల్లడైంది. తమపై కొందరు ఇలాంటి బెలూన్లు విసిరారని ముగ్గురు విద్యార్థినులు చెప్పారని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై కళాశాల విద్యార్థి సంఘం, కళాశాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపు ఘటనలపై తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు పోలీసు అధికారులు ఓ మొబైల్ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు. మరోవైపు విద్యార్థినులపై వేధింపులు నివారించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (విమెన్)ను కలిసి ఫిర్యాదు చేశామని లేడీ శ్రీరాం కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారు. -
తండ్రి ఘాతుకం
సంతమాగులూరు: ఓ తండ్రి కన్న కొడుకును రోకలి బండతో మోది హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని వెల్లలచెరువులో శనివారం అర్ధరాత్రి జరిగింది. సీఐ హైమారావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కె.బ్రహ్మనాయుడికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు సంపత్‌కుమార్ (25). గుంటూరులో కెమెరా మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. క్రిస్మస్ సందర్భంగా అతడు స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. శనివారం రాత్రి పూటుగా మ ద్యం తాగి ఇంటికి వచ్చి దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రం సమీపంలో బల్లపై పడుకున్నాడు. కుమారుడు నిత్యం మద్యం తాగి పరువు తీస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బ్రహ్మనాయుడు రోకలి బండతో తలపై బలంగా మోదాడు. అంతటితో ఆగకుండ బండరాయితో బాదడంతో సంపత్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో ఉన్న సంపత్‌కుమార్‌ను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. అద్దంకి సీఐ హైమారావు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లొంగిపోయిన తండ్రి కుమారుడిని చంపిన తండ్రి బ్రహ్మనాయుడు నేరుగా గుంటూరు వెళ్లాడు. సీఐ హైమారావు ఫోన్ చేయడంతో తాను గుంటూరులో ఉన్నానని చెప్పాడు. మధ్యాహ్న ప్రాంతంలో పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి
కేశంపేట (షాద్‌నగర్): తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో చోటుచేసుకుంది. మీనమోనిపల్లికి చెందిన ఆనెపోసల జంగయ్య, పాపమ్మ దంపతుల చిన్న కూతురు సునీత(21) కడ్తాల పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ తనను ప్రేమించాలంటూ సునీతను వేధిస్తున్నాడు. విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సునీత తల్లి ఏడాది క్రితం శివకుమార్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రుల ముందే మందలించింది. అయినా శివ తీరు మారకపోవంతో చేసేదేమీ లేక సునీత కళాశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఎటూ తోచని శివ మంగళవారం మీనమోనిపల్లికి వచ్చాడు. గ్రామంలో తల్లితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్న సునీత వద్దకు చేరుకుని వెంట తెచ్చుకున్న కత్తితో నాలుగుసార్లు పొడిచి అక్కడ నుంచి పరారయ్యడు. సునీతను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. శివకుమార్ నేరుగా ఆమన్‌గల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. -
యువతిని వేధిస్తున్నఎస్ఐ అరెస్ట్
విశాఖపట్నం: విజయవాడలో రిజర్వ్ ఎస్ఐగా పనిచేస్తున్న జీవీఎన్ ప్రసాద్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో కప్పరాడలో ఉంటున్న ఓ యువతిని ఎస్ఐ మూడు రోజులుగా వేధిస్తున్నాడు. సదరు యువతి స్నేహితురాలు వారం రోజుల నుంచి కనపడటంలేదు. ఆమెను నువ్వే హత్య చేశావు.. నా కోరిక తీర్చకపోతే నిన్ను ఆ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా బుధవారం రాత్రి యువతికి ఫోన్ చేశాడు. ఫోన్లో ఎక్కడ ఉంటున్నావో చెప్పాలంటూ నిలదీశాడు. దీంతో బెదిరిపోయిన ఆ యువతి తన అడ్రస్ చెప్పడంతో అర్థరాత్రి అక్కడకు వచ్చిన ప్రసాద్.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో పారిపోయిన యువతి స్థానికుల సాయంతో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన అధికారులు ఎస్ఐని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
విశాఖ: తనకు న్యాయం చేయాలని కోరుతో ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విశాఖ పారిశ్రామికవాడలోని శ్రీహరిపురంలో నివాసముంటున్న ఓ మహిళ తన ఏడేళ్ల పాపతో కలిసి శనివారం భర్త ఇంటి ముందు బైఠాయించింది. దీంతో అత్తింటివారు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. -
పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి
‘బాబు’ వియ్యంకునిలా నేను రివాల్వర్ వాడను: ముద్రగడ జగ్గంపేట: తనపై, తన అనుచరులపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రిలో సమావేశం పెట్టుకుంటే అడ్డంకులు సృష్టించారన్నారు. మండపం ఇచ్చినందుకు తన వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారన్నారు. తన వియ్యంకుడిని శుక్రవారం రివాల్వర్ అప్పగించాలని పోలీసులు కోరారన్నారు. ఆయన రివాల్వర్‌కు, తనకు సంబంధమేమిటని ప్రశ్నించారు. ‘రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ. నేనేమీ ఆయనలా రివాల్వర్ వాడను’ అన్నారు. ఆయన భార్య రివాల్వర్‌ను కూడా బాలకృష్ణ వాడారన్నారు. తాను ఆస్పత్రి అనే జైలులో 14 రోజులు గడిపానని, రాష్ట్రంలో మానవహక్కులు లేవని వ్యాఖ్యానించారు. ముద్రగడను సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు తదితరులు కలుసుకున్నారు. -
నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా..
యువతికి వేధింపులు అర్ధరాత్రి ఆమె పని చేసే ఇంట్లోకి ప్రవేశించి హంగామా హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ఓ యువకుడు... అర్ధరాత్రి పూట ఆమె పని చేసే ఇంట్లోకి ప్రవేశించి హంగామా సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ నివాసి వినోద్‌సింగ్ కొంత కాలంగా జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో పని చేస్తున్న యువతి వెంటపడి ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి.. మూడు రోజులుగా పనికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉంటోంది. వినోద్ ఫోన్ చేస్తే తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయబోతున్నారని, ప్రేమ పేరుతో తనను వేధించవద్దని స్పష్టం చేసింది. తనను కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా.. పెళ్లికొడుకుతో పాటు నిన్నుకూడా చంపేస్తానని అతను యువతిని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు తన ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో ఆగ్రహానికి గురైన వినోద్ ఆదివారం అర్ధరాత్రి ఆమె పని చేసే ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. యువతి ఉండే గది వద్దకు వెళ్లి తచ్చాడుతుండగా ఇంటి యజమాని గమనించి అక్కడికి వెళ్లే లోపు పరారయ్యాడు. విషయాన్ని యజమాని బాధిత యువతి దృష్టికి తీసుకెళ్లగా ఆమె సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమపేరుతో తనను వేధిస్తున్న వినోద్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.