అమలా పాల్
‘‘మానసికంగా ధైర్యంగా లేని వారికి సినిమా సరైనది కాదు’’ అంటున్నారు అమలా పాల్. ప్రస్తుతం స్త్రీలపై అఘాయిత్యాలు, వేధింపులు జరగడం ప్రతిరోజూ గమనిస్తున్నాం. ఈ చర్యలను ఉద్దేశించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘స్త్రీలపై వేధింపులు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయి అనుకోవడం పొరపాటు. అన్ని రంగాల్లో ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. కానీ స్త్రీ మాత్రం తన ధైర్యాన్ని కోల్పోకూడదు.
ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే వాళ్లు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మానసికంగా ధైర్యంగా లేకపోతే ఇక్కడ రాణించలేం. కేవలం సినిమా అనే కాదు, ఇది ఏ వృత్తికి అయినా అప్లై అవుతుంది. వర్కింగ్ ప్లేస్‌లో రకరకాల వేధింపులకు గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. మన నిర్ణయం మీద కచ్చితంగా నిలబడగలగటం, ఆలోచనల్ని సూటిగా వ్యక్తపరచడం నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యకైనా ఎదురుగా నిలబడి పోరాడటం నేర్చుకోగలుగుతాం’’ అని పేర్కొన్నారు అమలా పాల్.
Comments
Please login to add a commentAdd a comment