Amalapal
-
నాకు తప్పుగా అనిపించలేదు
‘‘లెవల్ క్రాస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కళాశాలలో జరిగిన ఈవెంట్లోపాల్గొన్నాను. ఆ ఈవెంట్‌కి నేను వేసుకుని వెళ్లిన డ్రెస్ నాకు చాలా సౌకర్యంగా అనిపించింది. ఆ దుస్తుల్లో ఆ ఈవెంట్‌కు వెళ్లడం నాకు తప్పుగా అనిపించలేదు’’ అని హీరోయిన్ అమలా΄ాల్ అన్నారు. ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘లెవల్ క్రాస్’ శుక్రవారం (జూలై 26) విడుదలైంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజ్‌లో నిర్వహించిన ఈవెంట్లోపాల్గొన్నారు అమలాపాల్. అయితే ఈ కార్యక్రమంలో ఆమె వేసుకున్న డ్రెస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పొట్టి దుస్తుల్లో కాలేజ్‌కి వెళ్లి విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు పద్ధతిగా వెళితే బాగుంటుంది? అంటూ అమలాపాల్‌ను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు పలువురు నెటిజన్లు.ఈ విమర్శలపై అమలాపాల్ స్పందిస్తూ– ‘‘కాలేజ్‌లో జరిగిన ఈవెంట్లో నేను ధరించిన డ్రెస్ నాకు సౌకర్యంగా అనిపించింది. ఆ డ్రెస్‌లో నన్ను చూడటం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంగా అనిపించలేదు. నిజానికి నా దుస్తులను కెమెరాలు ఎలా చూపిస్తాయన్నదే అసలు సమస్య. కాలేజ్‌కి నేను ఆ డ్రెస్ వేసుకుని వెళ్లడం వెనక ఉన్న ఉద్దేశం విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే. నేను మోడ్రన్ డ్రెస్సులతోపాటు సంప్రదాయ దుస్తులు కూడా ధరిస్తాను’’ అన్నారు. -
వచ్చే ఏడాది ది గోట్ లైఫ్
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించారు. విజువల్ రొమాన్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘1990వ దశకంలో జీవనోపాధిని వెతుక్కుంటూ కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. పూర్తి స్థాయిలో ఎడారి నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది’’ అని యూనిట్ పేర్కొంది. -
అమలాపాల్ తో స్పెషల్ చిట్ చాట్
-
మరోసారి బోల్డ్ పాత్రలో...
హోమ్లీ పాత్రల్లోనే కాదు.. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్ రోల్లో నటించడానికి వెనకాడరు అమలాపాల్. ఆ మధ్య ‘ఆమె’ చిత్రంలో బోల్డ్‌గా నటించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారామె. తాజాగా మరోసారి ఓ బోల్డ్ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారట. అయితే సినిమాలో కాదు.. ఓ వెబ్ సిరీస్ కోసం కావడం విశేషం. 1970ల నాటి కథతో తెలుగు, తమిళ భాషల్లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో అమలాపాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్లో మహేష్ భట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారు. దీని ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అమలాపాల్. -
ఆమె వస్తోంది
‘నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమలాపాల్ నటించిన తొలి థ్రిల్లర్ మూవీ ‘ఆడై’. రత్నకుమార్ దర్శకత్వంలో రాంబాబు కల్లూరి, ఎం. విజయ్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. ‘ఆమె’ పేరుతో చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తెలుగులో విడుదల చేయనున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘రత్నకుమార్ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమలాపాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్, సంగీతం: ప్రదీప్ కుమార్, ఊర్క, కెమెరా: విజయ్ కార్తీక్ ఖన్నన్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్: హరిహర సుతన్. -
నగ్నంగా ఇరవై రోజులు!
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది ‘ఆడై’ అనే తమిళ సినిమా టీజర్. అందులో అమలాపాల్ నగ్నంగా కనిపించడమే అందుకు కారణం. ఆమె గట్స్‌కి ప్రేక్షకులు షాక్ అయ్యారు. అది కేవలం సినిమాలో ఓ సన్నివేశం అని ఊహించారు. కానీ సినిమాలో కొంత పోర్షన్ వరకూ అమలాపాల్ ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా కనిపిస్తారని సమాచారం. రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘ఆడై’. అంటే ‘బట్టలు’ అని అర్థం. ఈ సినిమాలో నగ్నంగా కనిపించే సన్నివేశాలను 20 రోజులపాటు షూట్ చేశారట చిత్రబృందం. చిత్రానికి ఇవే ఎంతో కీలకంగా నిలవబోతున్నాయని సమాచారం. ఈ ఇరవై రోజులూ చాలా తక్కువమంది చిత్రబృందంతో జాగ్రత్తగా చిత్రీకరణ జరిపారట. కథలో ఎంత బలం ఉంటే అమలాపాల్ ఈ సాహసం చేయడానికి అంగీకరించారో ఊహించుకోవచ్చు. మరోవైపు ఈ సన్నివేశాలకు సెన్సార్ బృందం అంగీకారం తెలపకపోవచ్చని, నగ్నసన్నివేశాలను బ్లర్ చేయడమో, కట్ చేయడమో జరిగే అవకాశం ఉందని తమిళ పరిశ్రమలో చర్చ మొదలైంది. మరి.. బట్టలు కత్తెరకు గురవుతాయా? వేచి చూడాలి. ‘ఆడై’ లె లుగులో ‘ఆమె’ పేరుతో రిలీజ్ కానుంది. -
బంపర్ ఆఫర్
అవునా.. అమలాపాల్ బంపర్ ఆఫర్ కొట్టేశారా? అని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మరి.. మణిలాంటి దర్శకుడి సినిమాలో అంటే రత్నంలాంటి అవకాశమే కదా. యస్.. మీరు ఊహిస్తున్నది నిజమే. మణిరత్నం తీయబోతున్న భారీ మల్టీస్టారర్‌లో అమలా పాల్ నటించనున్నారట. మణిరత్నం సినిమాల్లో ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ ఎవరి పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత వాళ్లకు ఉంటుంది. గత ఏడాది అరవింద్‌సామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతికలతో ‘చెక్క›చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) తీశారు. లేటెస్ట్గా ఆయన తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, కీర్తీ సురేశ్, నయనతార నటించనున్నారని సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్‌లో ఓ కీలక పాత్ర కోసం అమలా పాల్ అయితే బావుంటుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతోందట. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తొలుత లైకా ప్రొడక్షన్స్ నిర్మించాలి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను రిలయన్స్ సంస్థ నిర్మించనుందని తెలిసింది. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
డీ గ్లామర్ లుక్ లో...
మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ కొత్త లుక్‌లోకి మారిపోయారు. డ్రీమ్‌బాయ్ లుక్‌లో కనిపించే ఆయన డీ గ్లామర్ రోల్‌లోకి చేంజ్ అయ్యారు. ఇదంతా ఆయన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ కోసమే. మలయాళ ఇండస్ట్రీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఆడు జీవితం’ ఒకటి. మలయాళంలోని ఓ ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ విభిన్న గెటప్స్‌లో కనిపిస్తారట. ఆ గెటప్స్‌లో ఇదొకటి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. 25 సంవత్సరాల తర్వాత మలయాళ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించనుండటం విశేషం. 2020లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. -
బలవంతంగా ముద్దు పెట్టబోయాడు!
‘‘నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’’.. మీటూ అంటూ పలువురు సినీ తారలు తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ‘మీకు తోడుగా నేనున్నాను’ మీటూ.. అంటూ పలువురు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు పురుషుల కోసం ‘హీటూ’ రావాలంటున్నారు. కొందరు ‘వియ్ టు’ (వీటూ) అంటూ మగవాళ్లే ముందుకు రావాలని చెబుతున్నారు. ఎవరెవరు ఏమేం అన్నారు? ఎవరెవరు తాజాగా మీటూ అని ఆరోపించారు? అనేది తెలుసుకుందాం. బలవంతంగా ముద్దు పెట్టబోయాడు! వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్... ఇలా కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లకు ‘మీటూ’ ఉద్యమ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్‌లో కన్నడ స్క్రీన్‌ప్లే రైటర్, డైరెక్టర్ ఎరే గౌడ ఈ జాబితాలో చేరారు. ‘తిథి’ సినిమాకి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసినప్పుడు ఎరే తనను లైంగికంగా వేధించాడని ఏక్తా అనే యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘‘సినిమాలపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేద్దామని బెంగళూరు వచ్చాను. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తానంటూ, ఎరే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు. ఏక్తా చెప్పిన ఈ విషయాన్ని నటి శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎరేపై ఏక్తా చేసిన ఆరోపణ వెంటనే ప్రభావం చూపింది. ఎరే దర్శకత్వంలో వచ్చిన ‘భలేకెంపా’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సైతం నామినేట్ అయ్యింది. త్వరలోనే ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉంది. కానీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ‘భలేకెంపా’ సినిమాను ప్రదర్శించడం లేదని వెల్లడించారు. అలాగే ఎరే మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలిసే వరకు ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్స్ కమిట్మెంట్స్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నాం’’ అని స్వయంగా ఈ సినిమా నిర్మాణసంస్థ జూ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు పేర్కొన్నారట. నా పోరాటం ఆగదు ‘‘అర్జున్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేయడం నా పొరపాటుగా ఒప్పుకోవాలని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నాను. అర్జున్ పై ఆరోపణలు చేయాలని చేతన్, ప్రకాశ్ రాజ్, కవితా లంకేశ్, మరి కొందరు నన్ను ప్రోత్సహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాపై తమాషా వీడియోలను తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్లు ఏమి కావాలో అది చేసుకోవచ్చు, నేనేం చేయాలో అది చేస్తాను. భట్, సంజన, మరికొందరు నటీమణులు ‘మీటూ’ ఆరోపణలు చేస్తున్నారు. వారికి భవిష్యత్ లేకుండా చేయాలని కన్నడ ఫిల్మ్ చాంబర్ ప్రయత్నిస్తున్నట్లుంది. నా పోరాటం ఆగద’’ని వివరిస్తూ శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకది పెద్ద షాక్ – అమలాపాల్ ఇటీవల ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లీలా మనిమేకళై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధించారని ఆరోపించారు. ఇప్పుడు నటి అమలాపాల్ కూడా సుశీపై ఆరోపణలు చేశారు. ‘‘లీలాను నేను నమ్ముతున్నాను. సుశీ డైరెక్షన్లో ‘తిరుట్టుపయలే 2’ అనే సినిమా చేశాను. సెట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవాడు. మహిళల పట్ల అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు’’ అన్నారు అమలాపాల్. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సుశీ, ఆయన భార్య మంజరి నాకు కాల్ చేశారు. ఈ ఇష్యూ గురించి మంజరికి వివరిస్తున్నప్పుడు సుశీ తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మంజరి నవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. నాపై పగ తీర్చుకోవడానికి వాళ్లు ఏకమయ్యారు. నేను భయపడతానని వాళ్లనుకుంటున్నారేమో’’ అన్నారు. పురుషులకు ‘హీటూ’ ఉండాలి ఒకవైపు ‘మీటూ’కి పలువురు మద్దతుగా నిలుస్తుంటే బాలీవుడ్ తార రాఖీ సావంత్, కన్నడ తార హర్షికా పూనాచా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘తనుశ్రీ పబ్లిసిటీ కోసమే నానాపై ఆరోపించిందని, తనకు పిచ్చి అని నేను అన్నందుకు నాపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే, నన్ను లో క్లాస్ గాళ్ అని అన్నందుకు ఆమెపై నేను 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. ‘మీటూ’ ఉద్యమంలో మహిళలు చెబుతున్నవన్నీ వాస్తవాలని ఎందుకు నమ్ముతున్నారు? అయోధ్యన్ సుమన్, హృతిక్‌రోషన్ ఎంతో టార్చర్ అనుభవించారు. మహిళలకు ‘మీటూ’ ఉన్నట్లే.. పురుషులకు ‘హీటూ’ లేదా ‘మెన్‌టూ’ మూమెంట్స్ ఉండాలి’’ అని రాఖీ సావంత్ అన్నారు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం హర్షిక పూనాచా ‘వీటూ’ (వియ్ టూ) మూమెంట్ రావాలని అభిప్రాయపడుతూ ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో ఉంచారు. ‘‘మీటూ’ డెవలప్‌మెంట్స్‌ను గమనిస్తున్నా. మహిళల ప్రమేయం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక స్ట్రాంగ్ ఉమెన్‌గా నా అభిప్రాయం. పబ్లిసిటీ కోసమే కొందరు నటీమణులు ఫెమినిటీని ఓ టూల్‌గా వాడుకుంటున్నారు. పదేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ‘యాక్టివిస్ట్ యాక్ట్రసెస్’గా చెప్పుకుంటున్న కొందరు కెరీర్ స్టార్టింగ్‌లో తమ సౌకర్యాల కోసం పురుషులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఎ’ లిస్ట్ సూపర్ స్టార్స్ పేర్లు మీటూ ఉద్యమంలో ఎందుకు రావు? సూపర్ స్టార్ హీరోయిన్లు ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమంలో ఉన్న కొందరు తారలు హ్యాపీగా మత్తు పీలుస్తూ.. మీటూ ఉద్యమంలో ఫేమస్ పర్సనాలిటీస్‌ను ఎలా లాగాలి? అని చర్చించుకుంటున్న వీడియోను చూశాను. ఇంకో వీడియోలో అర్ధనగ్నంగా కారులో ఉన్న ఓ హీరోయిన్ ‘మీ తర్వాతి చిత్రంలో కూడా నేనే హీరోయిన్.. ఓకేనా’ అని ఓ ఫేమస్ హీరోని అడగడం చూశాను. ఒక నటిగా నన్ను కొందరు ‘ఆఫర్స్’ అడిగారు కానీ నేను నో చెప్పాను. దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో నేను చాన్సులు మిస్ అయ్యుండవచ్చు. కానీ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఈ రోజు నేను చెప్పిన ఈ విషయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వ్యక్తులు ఉండవచ్చు. వర్క్ ఇస్తామంటూ మహిళలను ప్రలోభ పెట్టవచ్చు కానీ మహిళల ప్రమేయం ఎంతో కొంత లేకుండా బలవంతంగా రేప్ చేయలేరు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ‘మీటూ’ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్న మహిళలను ఒక విషయం కోరుతున్నాను. దయచేసి రియల్‌గా ఉండండి. ఇప్పుడు పురుషులు ‘వీటూ’ అనే ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా తోటి నటీమణులకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఇతరులు మనల్ని, మన ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నారు. మనకు ఇండస్ట్రీ ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇస్తోంది. ఆ పరిశ్రమను అపహాస్యం కానివ్వకూడదు ’’ అని చెప్పుకొచ్చారు. సుశీ గణేశన్, అమలాపాల్ -
స్క్రీన్ టెస్ట్
1. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ యంగ్ రెబల్‌స్టార్‌కి హీరోగా ‘సాహో’ ఎన్నో సినిమానో తెలుసా? ఎ) 19 బి) 23 సి) 25 డి)16 2. సంజయ్‌దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. సంజు తల్లి ‘నర్గీస్‌దత్’ పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సోనమ్ కపూర్ బి) అనుష్కా శర్మ సి) విద్యాబాలన్ డి) మనీషా కోయిరాల 3. ‘కేరళ బ్లాస్టర్స్’ అనే ఫుట్‌బాల్ టీమ్ ఓనర్స్‌లో ఈ హీరో వన్నాఫ్ ది పార్టనర్స్. ఎవరా టాప్ హీరో కనుక్కోగలరా? ఎ) చిరంజీవి బి) వెంకటేశ్ సి) రజనీకాంత్ డి) కమల్ హాసన్ 4. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌దేవ్ నటించిన చిత్రం ‘విజేత’. ఆ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) అజయ్ భూపతి బి) రాకేశ్ శశి సి) రాహుల్ రవీంద్రన్ డి) ఇంద్రసేన .ఆర్ 5. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో రామ్, ఇలియానా జంటగా వచ్చిన ‘దేవదాసు’ గుర్తుండే ఉంటుంది. అందులో స్పెషల్ క్యారెక్టర్లో నటించిన ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సమీరా రెడ్డి బి) త్రిష సి) శ్రియా శరన్ డి) జెనీలియా 6. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒకరు క్యాథరిన్ థెరిస్సా. మరొక హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) పూజా హెగ్డే బి) రకుల్‌ప్రీత్ సింగ్ సి) కియారా అద్వాని డి) అమలా పాల్ 7. వీవీ వినాయక్ ఏ హీరోతో సినిమా చేయటం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారో గుర్తుందా? ఎ) రామ్‌చరణ్ బి) రవితేజ సి) ప్రభాస్ డి) ఎన్టీఆర్ 8. ‘టెంపర్’ చిత్రంలో ఎన్టీఆర్సరసన నటించిన హీరోయిన్ ఎవరో చెప్పుకోండి? ఎ) ఇలియానా బి) కాజల్ అగర్వాల్ సి) తమన్నా డి) నివేథా థామస్ 9. ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే పాట ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా లోనిది. ఆ పాట రచయితెవరో తెలుసా? ఎ) వేటూరి సుందరామ్మూర్తి బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సి) వంశీ డి) వనమాలి 10. ‘వెల్కమ్ టూ న్యూయార్క్’ అనే హిందీ చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించిన టాలీవుడ్ నటుడెవరో తెలుసా? ఎ) నానీ బి) రామ్ సి) రానా డి) అఖిల్ 11. 2010లో హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హీరోయిన్గా 20 చిత్రాల్లో నటించిన ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి? ఎ) తాప్సీ బి) అంజలి సి) శ్రుతీహాసన్ డి) సమంత 12. ‘రాజీ’ చిత్రం ద్వారా మంచి పేరుతో పాటు హీరోయిన్గా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న బాలీవుడ్ భామ ఎవరో తెలుసా? ఎ) కంగనా రనౌత్ బి) ఆలియా భట్ సి) కరీనా కపూర్ డి) సోనాక్షీ సిన్హా 13. ‘హలో గురూ ప్రేమకోసమే రా జీవితం’ అనే పాటలో నాగార్జునతో కలిసి స్టెప్పులేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) అమల బి) రమ్యకృష్ణ సి) మీనా డి) టబు 14. ‘నీవెవరో’ అనే చిత్రంలో అంధునిగా నటిస్తున్న నటుడెవరో కనుక్కోండి? ఎ) నవీన్ చంద్ర బి) రాజ్ తరుణ్ సి) ఆది పినిశెట్టి డి) ఆది సాయికుమార్ 15. ‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కట్ వేసిండే’ అనే పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) స్మిత బి) అంజనా సౌమ్య సి) చిన్మయి డి) మధుప్రియ 16. 1971లో రిలీజైన ‘ప్రేమనగర్’ చిత్రంలో హీరో అక్కినేని. ఆయన తండ్రి పాత్రలో నటించిన నటుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) ప్రభాకర్ రెడ్డి బి) గుమ్మడి సి) సత్యనారాయణ డి) యస్వీ రంగారావు 17. రజనీకాంత్ ‘2.0’లో హీరోయిన్గా నటిస్తున్న నటి ఎవరు? ఎ) ఆండ్రియా బి) ఐశ్వర్యా రాయ్ సి) అమీ జాక్సన్ డి) దీపికా పదుకోన్ 18. ‘వెన్నెల’ చిత్రం ద్వారా దర్శకునిగా మారిన ఎన్నారై ఎవరో చెప్పుకోండి? ఎ) శేఖర్ కమ్ముల బి) దేవా కట్టా సి) ప్రవీణ్ సత్తార్ డి) సాయికిరణ్ అడివి 19. ఈ ఫొటోలోని చిన్న పాప ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్. ఆమె ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) సోనాక్షీ సిన్హా సి) కత్రినా కైఫ్ డి) శ్రద్ధాకపూర్ 20. సుజాత, ఎన్టీఆర్, మురళీమోహన్ నటించిన ఏ సినిమాలోని స్టిల్ ఇది.. కనిపెట్టండి? ఎ) మహాపురుషుడు బి) యుగపురుషుడు సి) డ్రైవర్ రాముడు డి) అడవి రాముడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) ఎ 4) బి 5) సి 6) బి 7) డి 8) బి 9) బి 10) సి 11) డి 12) బి 13) ఎ 14) సి 15) డి 16) డి 17) సి 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
అలాంటి వారికి సినిమా కరెక్ట్ కాదు
‘‘మానసికంగా ధైర్యంగా లేని వారికి సినిమా సరైనది కాదు’’ అంటున్నారు అమలా పాల్. ప్రస్తుతం స్త్రీలపై అఘాయిత్యాలు, వేధింపులు జరగడం ప్రతిరోజూ గమనిస్తున్నాం. ఈ చర్యలను ఉద్దేశించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘స్త్రీలపై వేధింపులు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయి అనుకోవడం పొరపాటు. అన్ని రంగాల్లో ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. కానీ స్త్రీ మాత్రం తన ధైర్యాన్ని కోల్పోకూడదు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చే వాళ్లు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మానసికంగా ధైర్యంగా లేకపోతే ఇక్కడ రాణించలేం. కేవలం సినిమా అనే కాదు, ఇది ఏ వృత్తికి అయినా అప్లై అవుతుంది. వర్కింగ్ ప్లేస్‌లో రకరకాల వేధింపులకు గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. మన నిర్ణయం మీద కచ్చితంగా నిలబడగలగటం, ఆలోచనల్ని సూటిగా వ్యక్తపరచడం నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యకైనా ఎదురుగా నిలబడి పోరాడటం నేర్చుకోగలుగుతాం’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
అందుకు గర్వంగా ఉంది!
డ్రెస్ చాలా బాగుంది.. ఎవరు డిజైన్ చేశారో! డ్రెస్ స్టైల్ కూడా అదుర్స్! ఇలాంటి మాటలే మాట్లాడుకున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్లో నటి అమలాపాల్‌ని చూసి. ఇంతకీ ఆ డ్రెస్‌ను డిజైన్ చేసింది ఎవరో చెప్పలేదు కదూ. అమలాపాల్‌నే డిజైన్ చేసుకున్నారు. పైన ఉన్న ఫొటోలో అమలాపాల్ ఉన్నది ఆ డ్రెస్‌లోనే. ‘‘ప్రతి మహిళలో రెడ్ షేడ్ ఉంటుంది. నేను నా రెడ్ను ధరించాను. నా డ్రెస్ డిజైనర్ పేరు చెప్పమని నన్ను చాలా మంది అడిగారు. అది నేనే అని చెప్పడానికి గర్వంగా ఉంది. టాలెంటెడ్ టైలర్ స్ట్రిచ్చింగ్ చేశారు’’ అన్నారు అమలాపాల్. నిజానికి ఫుల్ లెంగ్త్ డ్రెస్ చూస్తే ఈ బ్యూటీ ఎంతమంచి డిజైనరో అర్థమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని వెరైటీ డ్రెస్సులు డిజైన్ చేసుకుంటారేమో. -
కొంచెం దృష్టి పెడదాం
... అంటున్నారు అమలా పాల్. ఏ విషయంపై దృష్టి పెడదామంటున్నారంటే ‘చూపు’పై. అర్థం కావడంలేదా? చూపు లేనివాళ్లకు చూపునిద్దాం అంటున్నారు. ఈ విషయం గురించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘ఓ సంస్థకు చెందిన ఐ క్యాంపైన్ స్పీచ్‌కు రెడీ అవుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది చూపులేక బాధపడుతున్నారని, అందులో ఎక్కువమంది ఇండియాలోనే ఉన్నారని తెలుసుకుని షాక్ అయ్యాను. నేత్రదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ఒక కారణమై ఉంటుందనిపించింది. అంతా సవ్యంగా ఉంటే ఏటా 40 వేలకుపైగా సర్జరీలు జరుగుతాయి. వారందరూ ఎంతో సంతోషంగా ప్రపంచాన్ని చూడగలరు.. చూపులేని వాళ్లు ఈ రంగుల ప్రపంచాన్ని చూసేందుకు మన వంతు సాయం చేద్దాం’’ అని అమలాపాల్ పేర్కొన్నారు. అంతేకాదు కళ్లను దానం చేసేందుకు ‘అమలహోమ్’ అనే ఫౌండేషన్‌ను కూడా స్టార్ట్ చేశారు. నేత్రదానం చేయాలనుకునేవాళ్లు ఈ ఫౌండేషన్‌ని సంప్రదించవచ్చు. కంటి ఆపరేషన్స్‌కి ఆర్థిక సహాయం అందజేయడానికి ఈ ఫౌండేషన్ కృషి చేయాలనుకుంటోంది. -
హద్దులు చెరిపేస్తున్న అమలాపాల్
తమిళసినిమా: నటి అమలాపాల్ అందాలారబోతలో హద్దులు చెరిపేస్తోంది. దీని గురించి కోలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. మైనా చిత్రంలో పక్కింటి అమ్మాయిగా నటించిన అమలాపాల్ ఆ తరువాత కూడా దైవతిరుమగళ్, తలైవా వంటి చిత్రాల్లో గ్లామర్ విషయంలో హద్దుల్లోనే ఉంది. ఎప్పుడైతే దర్శకుడు విజయ్ను ప్రేమ వివాహం చేసుకుని ఆ తరువాత ఆయన నుంచి విడిపోయిందో అప్పటి నుంచి గ్లామర్ విషయంతో ఎల్లలు దాటుతోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఈ జాణ ధనుష్‌తో నటించిన వీఐపీ–2 చిత్రం ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తిరుట్టుప్పయలే–2 చిత్రంలో నటిస్తోంది. సుశీగణేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ అందాలారబోతలో శ్రుతి మించిందంటున్నారు. ఈ చిత్రంలోని ఆమె నటించిన గ్లామరస్ సన్నివేశాలతో కూడిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో నటి అమలాపాల్ అరకొర దుస్తులు ధరించి సిగరెట్ దమ్మును గట్టిగా పీల్చి ముక్కు ద్వారా పొగను వదిలే దృశ్యాలు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇవేవీ పట్టించుకోని అమలాపాల్ ఇకపై తనది గ్లామర్ పయనమే అంటూ నిర్ణయించుకుందట. తమిళంలో పాటు మలయాళంలోనూ నటిస్తున్న ఈ అమ్మడు ముందుముందు ఇంకెంత సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో చూడాలి. అదే విధంగా తిరుట్టుప్పయలే–2 చిత్రంలో అమలాపాల్ దమ్ము కొట్టే సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు తమ కత్తెరకు ఏ మేరకు పని చెబుతారోనన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. -
నో రెస్ట్... ఓన్లీ వర్క్
– ధనుష్ ‘పిల్లలకు ఆడుకోవడం ఎంత ఇష్టమో.. నాకు పని చేయడమంటే అంత ఇష్టం. చేసే పనిని ఎంజాయ్ చేయాలనుకుంటా. నాకసలు రెస్ట్ అవసరం లేదు. పని చేయడమే రిలాక్సేషన్’’ అని హీరో ధనుష్ అన్నారు. ధనుష్, అమలాపాల్ జంటగా సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించిన ‘వీఐపీ 2’ ఈ శుక్రవారం తెలుగులో విడుదలవుతోంది. ధనుష్ మాట్లాడుతూ– ‘‘రఘువరన్ బీటెక్’ సినిమా తెలుగులో మంచి హిట్ అవడంతో సీక్వెల్‌ను రెండు భాషల్లోనూ తీశాం. ‘వీఐపీ 2’లో వినోదం, భావోద్వేగాలు, మాస్ అంశాలన్నీ ఉంటాయి. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్‌గా ‘వీఐపీ 2’ కరెక్ట్ అనిపించింది. తమిళ్లో మా సినిమాకి వసూళ్లు బాగున్నాయి. కానీ, క్రిటిక్స్ వేరేలా రాశారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల చేయాలనుకున్నాం. కానీ, తెలుగులో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చేయలేదు. తమిళంలో ఆ డేట్ దాటితే తర్వాత మంచి డేట్ లేదని అక్కడ రిలీజ్ చేశాం. ఈ సినిమాకు నేనే స్క్రిప్ట్ రాశా. కానీ, సినిమా ఎలా మొదలుపెట్టాలో క్లారిటీ లేదు. సౌందర్య ఆలోచనలు కూడా గ్రాండ్‌గా ఉంటాయి. అందుకే డైరెక్టర్‌గా సౌందర్య బెటర్ అనిపించింది. నేను డైరెక్ట్ చేసిన ‘పవర్‌పాండి’ని తెలుగులో డబ్ చేస్తాం. ‘మారి 2’ తెలుగు, తమిళ భాషల్లో తీయనున్నాం’’ అన్నారు. సౌందర్యా రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారితో (నాన్న) పనిచేయాలని ఎవరికైనా ఉంటుంది. తొలి సినిమాకే నాకా అవకాశం రావడం అదృష్టం. ధనుష్సార్ కూడా మంచి యాక్టర్. వారిని డైరెక్ట్ చేయడం నేను ఎంజాయ్ చేశా. డైరెక్టర్ అంటే డైరెక్టరే. అందులో ఆడ, మగ అనే తేడా ఉండదు. బంధుప్రీతి అన్నది ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంటుంది. కానీ, ఏ రంగంలో అయినా ప్రతిభ ఉంటేనే మనం నిలబడగలం’’ అన్నారు. -
పర్సనల్ విషయాలు అడగొద్దు
నన్ను నటుడు ధనుష్‌ను చాలా టార్చర్ పెట్టారని నటి అమలాపాల్ అంటోంది. మైనా చిత్రంతో ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి అతి కొద్ది కాలంలోనే తమిళనాటి కోడలైంది. అంతే వేగంగా ఆ బంధాన్ని తెగ తెంపులు చేసుకుని కేరళకు తిరుగు టపా కట్టింది. నటిగా మాత్రం తమిళ సినిమాలనే ఎక్కువగా నమ్ముకున్న అమలాపాల్‌పై ప్రచారం అవుతున్న వదంతులు ఇటీవల ఏ నటిపైనా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ ధనుష్‌తో రొమాన్స్ చేసిన తాజా చిత్రం వీఐపీ–2 ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా అమలాపాల్ భేటీ చూద్దాం. ⇒ నటుడు ధనుష్‌తో వరుసగా నటిస్తున్నారే? ♦ మీరలా అంటున్నారు గానీ, నేను అలా అనుకోవడం లేదు. ధనుష్‌కు జంటగా తొలిసారిగా వేలైఇల్లా పట్టాదారి చిత్రంలో నటించాను. ఆ తరువాత ఆయన నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో నటించాను. ఇప్పుడు వీఐపీ 2లో నటించాను. ఆ మధ్య వడచెన్నై చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా అంగీకరించలేకపోయాను. నిజం చెప్పాలంటే ధనుష్‌తో నటిస్తే నాకు మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఆయన చాలా హార్డ్ వర్కర్. ఏ పని చేసినా దానిపై చాలా క్రేజీగా ఉంటారు. నటించేటప్పుడు చాలా మోటివేషన్‌గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. నాకు మంచి ఫ్రెండ్. నటనలో నాకు ధనుష్‌కు మధ్య పోటీ ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉంటుంది. ⇒ మీ వ్యక్తిగతం గురించి జరుగుతున్న ప్రచారం గురించి? ♦ సారీ. నా పర్సనల్ విషయాల గురించిన ప్రస్థావన వద్దు. అదంతా ముగిసి పోయిన కథ. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా బాధ పడను. ⇒ కోలీవుడ్లోకి నటిగా రంగప్రవేశం చేసి ఆపై తమిళనాట కోడలయ్యారు. ఇప్పుడు మళ్లీ కేరళాకెళ్లి పోయారు.మళ్లీ చెన్నైలో మకాం పట్టే అవకాశం ఉందా? ♦ మీరే అర్థంతో ఆ ప్రశ్న అడిగారో నాకర్థం కాలేదు. అయితే నేను మళ్లీ చెన్నైలో సెటిల్ అవ్వలేను. చెన్నైలో షూటింగ్ ఉంటే మాత్రం నేను ఎప్పుడూ ఉండే అపార్ట్మెంట్లోనే బస చేస్తున్నాను. ఇక చెన్నైలో సొంతంగా నివాసమేర్పచుకునే ఆలోచన లేదు. ⇒ సుశీ లీక్స్ విషయంలో ఏమైంది? ధనుష్‌తో కలుపుతూ మీపై వదంతులు వరదలా ప్రచారం అవుతున్నాయి? ♦ నిజంలేని ప్రచారానికి నిలకడ ఉండదు. ఎంత వేగంగా వచ్చాయే అంతగా గాలిలో కలిసి పోతాయి. నిజం చెప్పాలంటే గాయనీ సుచిత్ర నాకు మంచి స్నేహితురాలు. తను నేను కలిసి యోగా చేశాం. సుచిత్ర భర్త కార్తీక్కుమార్తో కలిసి నేను దైవతిరుమగళ్ చిత్రంలో నటించాను.అలాంటి అనూహ్యంగా నాపై వదంతులు ప్రచారం అయ్యాయి. ఆరా తీస్తే సుశీలీక్స్ విషయంలో సుచిత్రకు సంబంధం లేదని తెలిసింది. ఎవరో ఆమె పేరును మిస్ యూజ్ చేశారు. ఈ విషయంలో నన్ను,నటుడు ధనుష్‌ను చాలా టార్చర్‌కు గురి చేశారు. మా గురించి ఏదో వీడియో వస్తుందని అన్నారు. అది ఇంకా ప్రసారం కాలేదని చాలా బాధగా ఉంది. ⇒ మళ్లీ పెళ్లి ఆలోచన ఉందా? ♦ ఇప్పుడు ఆ విషయం గురించి అవసరమా? నేను చదువుకునేటప్పుడు నటినవుతానని ఊహంచలేదు. నటి అయిన తరువాత ఒకరిని ప్రేమిస్తానని అనుకోలేదు. ప్రేమించినప్పుడు పెళ్లి జరుగుతుందని భావించలేదు. ఆ తరువాత అందరకీ తెలిసిందే. నా జీవితం గురించి నేనెలాంటి ప్లాన్ చేసుకోలేదు. అంతా అలా జరిగిపోయింది.అందువల్ల ఇకపై కూడ భవిష్యత్తు గురించి చింత లేదు. రేపేం జరుగుతుందో తెలియదు.ఈ రోజేమి జరుగుతుందో అదే నిజం. నేనూ అదే చూస్తాను. -
తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్ విడుదల
తిమిళసినిమా: తిరుట్టుప్పయలే–2 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. సుశీగణేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన తిరుట్టుప్పయలే సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా తిరుట్టుప్పయలే–2 రూపొందుతున్న విషయం తెలిసిందే. సుశీగణేశన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. నటుడు విజయ్‌సేతుపతి ఆవిష్కరించిన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగే అబ్బాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుందనే తిరుట్టుప్పయలే–2 చిత్రం అని తెలిపారు. ఇది తన ఊహకన్నా సమాజంలో జరుగుతున్న సంఘటనలతో సహజత్వంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
సెప్టెంబర్‌లో భాస్కర్ ఒరు రాస్కెల్
తమిళసినిమా: సెప్టెంబర్ నెలలో భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మాలీవుడ్‌లో నయనతార, మమ్ముట్టి జంటగా నటించిన చిత్రం భాస్కర్ ది రాస్కెల్. సిద్ధిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఆయన 2.ఓ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల భాస్కర్ ది రాస్కెల్ చేయలేకపోయారన్న ప్రచారం జరిగింది. మొత్తం మీద ఆ పాత్రలో నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు.ఆయనకు జంట గా నటి అమలాపాల్ నటిస్తున్నారు. నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్ రాఘవ నటిస్తున్నారు. తెరి చిత్రం ద్వార బాల నటిగా రంగప్రవేశం చేసిన నటి మీనా కూతురు నైనిక కీలక పాత్రను, బాలీవుడ్ నటుడు అఫ్తాబ్శివ్దసాని ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. మలయాళం చిత్రాన్ని తెరకెక్కించిన సిద్ధిక్‌నే తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు తమిళంలో విజయ్,సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్, విజయకాంత్, ప్రభుదేవా నటించిన ఎంగళ్ అన్నా, విజయ్, అసిన్ జంటగా నటించిన కావలన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. భాస్కర్ ఒరు రాస్కెల్ సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్న నాలుగవ తమిళ చిత్రం అవుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయ్ఉళగనాథన్ చాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆయనకు మంచి భార్యగా ఉంటా!
తమిళసినిమా: నటుడు ధనుష్‌కు మంచి భార్యగా ఉంటానని చెప్పింది నటి అమలాపాల్. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు రెండేళ్లు గడవక ముందే ఆయనతో తెగతెంపులు చేసుకుని మళ్లీ నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న అమలాపాల్ ఇటీవల తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి వీఐపీ–2 పేరుతో సీక్వెల్ సిద్ధం అవుతోంది. ఇందులోనూ ధనుష్‌కు జంటగా అమలాపాలే నటిస్తోంది. వీఐపీ–2లో అమలాపాల్ ధనుష్‌ను సతాయించే భార్యగా నటించింది. దీని గురించి ఇటీవల జరిగిన చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో అమలాపాల్ మాట్లాడుతూ వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో తన పాత్రను కొనసాగించినందుకు ధనుష్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానంది. అందులో ప్రియురాలిగానూ, ఈ చిత్రంలో హింసించే అర్ధాంగిగా నటించిన తాను వీఐపీ–3 చిత్రం చేస్తే అందులో తప్పకుండా ధనుష్‌కు మంచి భార్యగా ఉంటానని చెప్పింది. ఈ అమ్మడి మాటలు చూస్తుంటే వీఐపీ–3 చిత్రం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఊహించుకోవచ్చు. -
కాజోల్ పక్కన నటించడమే చాలెంజ్
తమిళసినిమా: నటి కాజోల్ పక్కన ఫ్రేమ్‌లో నిలబడడమే ఛాలెంజ్‌గా భావించానని నటుడు ధనుష్ పేర్కొన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రాల్లో వేలై ఇల్లాపట్టాదారి 2(వీఐపీ– 2) ఒకటి. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను, ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలను అందించింది నటుడు ధనుష్ కావడం విశేషం. రజనీకాంత్ హీరోగా కోచ్చడైయాన్ అనే తొలి 3డీ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించిన సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వీఐపీ 2. నటి అమలాపాల్ నాయకిగా, బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శాన్రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో వీఐపీ– 2 పేర్లతోనూ హిందీలో పాల్కర్ పేరుతో విడుదలకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా ఈ చిత్ర మూడు భాషల ఆడియో, టీజర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ముంబాయిలోని పీవీఆర్ సినిమాలో నిర్వహించారు. ఇదే రోజు నిర్మాత కలైపులి ఎస్. థాను పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కాగా కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకులు బాల్కీ, ఆనంద్.ఎల్.రాయ్‌లతో పాటు లతారజనీకాంత్ తదితరులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాఆంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర కథకుడు, మాటల రచయిత, కథానాయకుడు ధనుష్ విలేకరులతో ముచ్చటించారు. ♦ వీఐపీ– 2 చిత్రం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? జ: వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ) చిత్రం మంచి విజయాన్ని మించి అమ్మ సెంటిమెంట్, ప్రేమ, తమ్ముడుతో అనుబంధం, యాక్షన్ అంటూ జనరంజకమైన అంశాలతో కూడినది. దాన్ని అలా వదిలేయకూడదని ఆ చిత్ర విడుదలైన సమయంలోనే అనిపించింది. అయితే అలాంటి కథ«ను సిద్ధం చేయడం సవాల్‌గా మారింది. దానికి మించిన స్థాయిలో కాన్సెప్ట్స్ కోసం ఏడాదిన్నర కాలంపాటు ఆలోచించాను. అలా పొల్లాచ్చిలో కొడి చిత్ర షూటింగ్ సమయంలో వచ్చిన థాట్‌తో తయారు చేసిన కథతో రూపొందించిన చిత్రం ఈ వీఐపీ– 2. వీఐపీ చిత్రంలో మాదిరిగానే ఇందులోనూ అమ్మసెంటిమెంట్, నాన్న, తమ్ముడు, అర్ధాంగి, స్నేహితులు అనే అన్ని అంశాలు ఉంటాయి. ♦ వీఐపీ– 2 చిత్రాన్ని తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయాలను కోవడానికి కారణం? జ: నిజం చెప్పాలంటే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని ముందు అనుకోలేదు. ఇటీవల బాహుబలి, దంగల్ లాంటి చిత్రాలు అన్ని భాషల్లోనూ పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వీఐపీ– 2 చిత్రంపైనా మంచి అంచనాలు నెలకొనడంతో తాము అలాంటి ప్రయత్నం చేయాలనుకున్నాం. అందుకే ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. ♦ హిందీ నటి కాజోల్‌తో నటించిన అనుభవం గురించి? జ: నేను చదువుకునే రోజుల్లోనే ఆమె నటించిన చిత్రాలను చేసేవాడిని. ఇప్పటికీ 14, 15 ఏళ్ల వయసు ఎనర్జీ కలిగిన నటి కాజోల్. వీఐపీ– 2 చిత్రం తమిళ భాషలో సంభాషణలు చెప్పి నటించడానికి మొదటి రెండు రోజులు కష్టపడినా, తరువాత వాటిని బట్టీపట్టి అద్భుతంగా నటించారు. కాజోల్ చాలా మంచి నటి. ఆమె పక్కన ఫ్రేమ్‌లో నిలబడటమే నాకు ఛాలేంజ్ అనిపించింది. కాజోల్‌తో కలిసి నటించడం ఓ మంచి అనుభవం ♦ ఈ చిత్రాన్ని మీ భార్య ఐశ్వర్య దర్శకత్వంలోనూ, వీఐపీ– 2 చిత్రాన్ని ఆమె చెల్లెలు సౌందర్యరజనీకాంత్ దర్శకత్వంలోనూ నటించారు. ఇద్దరిలో వ్యత్యాసం గురించి? జ: ఇద్దరి మధ్య వ్యత్యాసం గురించి కంటే ఏకత్వం గురించి చెప్పాలి. సినిమాపై వారి నిజాయితీ, అంకితభావం, తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన, కఠిన శ్రమను గుర్తించాను. ఇద్దరూ వైవిధ్యంగా ఆలోచిస్తారు. మహిళా దర్శకులను ప్రోత్సహించడం ఘనతగా భావిస్తున్నాను. ♦ పవర్‌పాండి– 2 చిత్రాన్ని చేస్తానన్నారు. అదెప్పుడు? జ: పవర్‌పాండి– 2 చిత్రానికి కథను సిద్ధం చేశాను. అందులో నటించడానికి రాజ్‌కిరణ్ సంసిద్ధత వ్యక్తం చేశాడు. అయితే ఆ చిత్రాన్ని వెంటనే ప్రారంభిద్దామా? వేరే చిత్రం చేసిన తరువాత పవర్‌పాండి– 2ను చేద్దామా, అన్న ఆలోచనలో ఉన్నాను. ♦ కొడి తరువాత ద్విపాత్రాభినయం మళ్లీ ఎప్పుడు చేస్తారు? జ: ఏదైనా వైవిధ్యంగా ఉండాలని ఆశిస్తాను. కొడి చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన పాత్రల రూపాలు ఒకేలా ఉన్నా, వాటి అభినయంలో వైవిధ్యంగా ఉంటుంది. అలాంటి మంచి కథ వస్తే ద్విపాత్ర చేయడానికి నేను రెడీ. ♦ నటుడు, కథారచయిత, గాయకుడు, నిర్మాత, దర్శకుడు వంటి పలు రంగాల్లో రాణిస్తున్నారు. మీలో ఇంత ఎనర్జీకీ కారణం? జ: నా కొడుకులు యాత్ర, లింగాలే నాకు ఎనర్జీ. వారు పెరిగి 18 ఏళ్ల వయసుకు చేరే సరికి వారు గర్వపడేలా తాను ఉన్నత స్థాయికి చేరుకోవాలి. -
కాజోల్‌ను భయపెడుతున్న ధనుష్
నటుడు ధనుష్ చిత్రంతో బాలీవుడ్ భామ కాజోల్ భయపడుతోందట.అదేమిటో చూద్దామా‘ నటుడు ధనుష్ కథ, కథనం,మాటలు అందిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం వేలైఇల్లా పట్టాదారి 2. ఇందులో అమాలాపాల్ నాయకి. ప్రతినాయకిగా బాలీవుడ్ భామ కాజోల్ నటిస్తున్నారు. సుధీర్ఘ కాలం తరువాత కాజోల్ నటిస్తున్న తమిళ చిత్రం ఇది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తమిళం, తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నటి కాజోల్ నటించడం, ఇప్పటికే రాంజానా, షమితాబ్ చిత్రాలతో ధనుష్ బాలీ వుడ్ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో వేలైఇల్లా పట్టాదారి– 2 చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర దర్శక నిర్మాతలు వచ్చారట. అందుకే ఈ అయితే చిత్రాన్ని హిందీలో విడుదల చేసే విషయాన్ని కాజోల్కు చెప్పలేదట.దీంతో బాలీవుడ్లో మంచి ఇమేజ్ ఉన్న తనకు ఈ చిత్రంలో ప్రతినాయకి పాత్రతో భంగం కలుగుతుందనే భయం కలుగుతోందట. అందువల్ల హిందీలో విడుదలకు అడ్డుకట్ట వేసే విధంగా వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రాన్ని హిందీలో విడుదల చేసేటట్లైతే తనక అధిక పారితోషికం చెల్లించాలని కాజోల్ డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
టైటిల్ మారింది
తమిళసినిమా: అమలాపాల్ చిత్రం టైటిల్ మారింది. దర్శకుడు విజయ్‌తో విడాకులు పొందిన తరువాత నటిగా రీఎంట్రీ ఇచ్చిన అమలాపాల్‌ను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న అమలాపాల్ చేస్తున్న చిత్రాల్లో విష్ణువిశాల్‌తో నటిస్తున్న చిత్రం ఒకటి. ముండాసిపట్టి చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యాక్సస్ ఫిలిం ఫాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రానికి రెండో సారి టైటిల్ మార్చారు. ముందు సిండ్రెల్లా అనే టైటిల్‌ను పెట్టారు. ఆ తరువాత మిన్మినిగా మార్చారు. తాజాగా రక్షకన్ అంటూ పేరు మార్చారు. ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు నాగార్జున, సుస్మితాసేన్ నటించిన చిత్రం తెరపైకి వచ్చిందన్నది గమనార్హం. కాగా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన విష్ణువిశాల్, అమలాపాల్‌ల చిత్రానికి పవర్ఫుల్ టైటిల్ అవసరం కావడంతో రక్షకన్గా మార్చినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. విష్ణువిశాల్ పోలీస్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ టీచర్‌గా నటిస్తున్నారట. ఇందులో కాళీవెంకట్, మునీష్కాంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. -
ధనుష్ వీఐపీ-2 వచ్చేస్తోంది
వీఐపీ-2 చిత్రం విడుదలకు తేదీ ఖరారైంది. నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన, నిర్మించిన వేలైఇల్లా పట్టాదారి (వీఐపీ) మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం వీఐపీ-2. ఈ చిత్రంలో అమలాపాల్ నాయకిగా నటించింది. ముఖ్య పాత్రలో బాలీవుడ్ భామ కాజోల్ నటించడం విశేషం. ఇందులో ఆమె ప్రతినాయకిగా నటించారని సమాచారం. కాగా,నటుడు ధనుష్ కథ, కథనాలు అందించిన ఈ చిత్రానికి సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహించారు. సాన్ రోల్డన్ సంగీతాన్ని అందించగా ఇంజినీర్లు తమ హక్కుల కోసం పోరాడే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిసింది. ఇటీవల వండలూర్ సమీపంలోని మణివాక్కంలో 300 మంది ఇంజినీర్లు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. నిర్మాత కలైపులి ఎస్.థాను, ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. పా.పాండి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ధనుష్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు. -
అన్నీ కొత్త నోట్లే!
‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’... ఇలా స్ట్రెయిట్ చిత్రాలతో పాటు ‘మన్యంపులి’ వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా కూడా మోహన్‌లాల్ తెలుగులో వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆయన నటించిన ‘రన్ బేబీ రన్’ని త్వరలో ‘బ్లాక్ మనీ’ పేరుతో మాజిన్ మూవీ మేకర్స్ పతాకంపై నిజాముద్దీన్ తెలుగులో విడుదల చేయనున్నారు. మోహన్‌లాల్–అమలాపాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి జోషి దర్శకుడు. ‘అన్నీ కొత్త నోట్లే’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిజాముద్దీన్ మాట్లాడుతూ – ‘‘నోట్ల రద్ద తర్వాత దేశమంతటా బ్లాక్‌మనీ గురించే చర్చ జరిగింది. నల్లకుబేరులు కొత్త కరెన్సీతో అడ్డంగా దొరికిపోయారు. ఈ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘రన్ బేబీ రన్’ మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ నెలలోనే తెలుగులో విడుదల చేయబోతున్నాం. ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మోహన్‌లాల్ నటన, వెన్నెల కంటి సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
నయన నో.. అమలాపాల్ ఎస్
నటి నయనతార నో అన్న అవకాశానికి అమలాపాల్ ఎస్ అన్నారన్నది తాజా సమాచారం. దర్శకుడు ఏఎల్.విజయ్ నుంచి విడాకులు పొందిన తరువాత నటి అమలాపాల్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. భర్త నుంచి విడిపోయిన తరువాత నటనపై దృష్టి పెట్టిన అమలాపాల్‌కు నటుడు ధనుష్ స్నేహహస్తం అందించారు.తాను నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం కల్పించారు. అంతకు ముందే వీరిద్దరూ కలిసి నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న వేలై ఇల్లా పట్టాదారి–2లోనూ ధనుష్, అమలాపాల్ జంటగా నటిస్తున్నారు. అంతే కాదు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న వడచెన్నై చిత్రంలోనూ ఈ మలయాళీ అమ్మడే నాయకి. వీటితో పాటు తిరుట్టిప్పయలే–2లోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ తమిళ రీమేక్‌లో నయనతార పాత్రను పోషించనున్నారు. సిద్ధిక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ ఇదే నెలలో ప్రారంభం కానుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి అమలాపాల్‌కు తాజాగా మరో అవకాశం తలుపు తట్టినట్లు తాజా సమాచారం. వినోద్ అనే నూతన దర్శకుడు నేటి టాప్ హీరోయిన్ నయనతారను దృష్టిలో పెట్టుకుని ఒక యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రాన్ని తయారు చేసుకున్నారు.అయితే కారణాలేమైనా ఈ చిత్రంలో నటించడానికి నయనతార నో చెప్పారట. దీంతో అమలాపాల్‌ను సంప్రదించగా తను ఒకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారకపూర్వకంగా త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.