
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించారు.
విజువల్ రొమాన్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘1990వ దశకంలో జీవనోపాధిని వెతుక్కుంటూ కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. పూర్తి స్థాయిలో ఎడారి నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది’’ అని యూనిట్ పేర్కొంది.