ఆయనకు మంచి భార్యగా ఉంటా! | Amalapal recently said she will marry again. | Sakshi
Sakshi News home page

ఆయనకు మంచి భార్యగా ఉంటా!

Published Thu, Jun 29 2017 1:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

ఆయనకు మంచి భార్యగా ఉంటా!

ఆయనకు మంచి భార్యగా ఉంటా!

తమిళసినిమా: నటుడు ధనుష్‌కు మంచి భార్యగా ఉంటానని చెప్పింది నటి అమలాపాల్‌. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు రెండేళ్లు గడవక ముందే ఆయనతో తెగతెంపులు చేసుకుని మళ్లీ నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న అమలాపాల్‌ ఇటీవల తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ధనుష్, అమలాపాల్‌ జంటగా నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి వీఐపీ–2 పేరుతో సీక్వెల్‌ సిద్ధం అవుతోంది. ఇందులోనూ ధనుష్‌కు జంటగా అమలాపాలే నటిస్తోంది. వీఐపీ–2లో అమలాపాల్‌ ధనుష్‌ను సతాయించే భార్యగా నటించింది. దీని గురించి ఇటీవల జరిగిన చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో అమలాపాల్‌ మాట్లాడుతూ వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో తన పాత్రను కొనసాగించినందుకు ధనుష్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానంది. అందులో ప్రియురాలిగానూ, ఈ చిత్రంలో హింసించే అర్ధాంగిగా నటించిన తాను వీఐపీ–3 చిత్రం చేస్తే అందులో తప్పకుండా ధనుష్‌కు మంచి భార్యగా ఉంటానని చెప్పింది. ఈ అమ్మడి మాటలు చూస్తుంటే వీఐపీ–3 చిత్రం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఊహించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement