కాజోల్‌ను భయపెడుతున్న ధనుష్‌ | Veelaila Pattadari 2 Movie Audio Innovation Program will be held in Mumbai. | Sakshi
Sakshi News home page

కాజోల్‌ను భయపెడుతున్న ధనుష్‌

Published Fri, Jun 23 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

కాజోల్‌ను భయపెడుతున్న ధనుష్‌

కాజోల్‌ను భయపెడుతున్న ధనుష్‌

నటుడు ధనుష్‌ చిత్రంతో బాలీవుడ్‌ భామ కాజోల్‌ భయపడుతోందట.అదేమిటో చూద్దామా‘ నటుడు ధనుష్‌ కథ, కథనం,మాటలు అందిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం వేలైఇల్లా పట్టాదారి 2. ఇందులో అమాలాపాల్‌ నాయకి. ప్రతినాయకిగా బాలీవుడ్‌ భామ కాజోల్‌ నటిస్తున్నారు. సుధీర్ఘ కాలం తరువాత కాజోల్‌ నటిస్తున్న తమిళ చిత్రం ఇది. సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తమిళం, తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నటి కాజోల్‌ నటించడం, ఇప్పటికే రాంజానా, షమితాబ్‌ చిత్రాలతో ధనుష్‌ బాలీ వుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో వేలైఇల్లా పట్టాదారి– 2 చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర దర్శక నిర్మాతలు వచ్చారట. అందుకే ఈ  అయితే చిత్రాన్ని హిందీలో విడుదల చేసే విషయాన్ని కాజోల్‌కు చెప్పలేదట.దీంతో బాలీవుడ్‌లో మంచి ఇమేజ్‌ ఉన్న తనకు ఈ చిత్రంలో ప్రతినాయకి పాత్రతో భంగం కలుగుతుందనే భయం కలుగుతోందట. అందువల్ల హిందీలో విడుదలకు అడ్డుకట్ట వేసే విధంగా వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రాన్ని హిందీలో విడుదల చేసేటట్‌లైతే తనక అధిక పారితోషికం చెల్లించాలని కాజోల్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement