అందుకు గర్వంగా ఉంది! | Amala Paul designed her own dress for the Filmfare Awards! | Sakshi
Sakshi News home page

అందుకు గర్వంగా ఉంది!

Jun 24 2018 2:00 AM | Updated on Jun 24 2018 2:00 AM

Amala Paul designed her own dress for the Filmfare Awards! - Sakshi

అమలాపాల్‌

డ్రెస్‌ చాలా బాగుంది.. ఎవరు డిజైన్‌ చేశారో! డ్రెస్‌ స్టైల్‌ కూడా అదుర్స్‌! ఇలాంటి మాటలే మాట్లాడుకున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ ఫంక్షన్‌లో నటి అమలాపాల్‌ని చూసి. ఇంతకీ ఆ డ్రెస్‌ను డిజైన్‌ చేసింది ఎవరో చెప్పలేదు కదూ. అమలాపాల్‌నే డిజైన్‌ చేసుకున్నారు. పైన ఉన్న ఫొటోలో అమలాపాల్‌ ఉన్నది ఆ డ్రెస్‌లోనే. ‘‘ప్రతి మహిళలో రెడ్‌ షేడ్‌ ఉంటుంది. నేను నా రెడ్‌ను ధరించాను. నా డ్రెస్‌ డిజైనర్‌ పేరు చెప్పమని నన్ను చాలా మంది అడిగారు. అది నేనే అని చెప్పడానికి గర్వంగా ఉంది. టాలెంటెడ్‌ టైలర్‌ స్ట్రిచ్చింగ్‌ చేశారు’’ అన్నారు అమలాపాల్‌. నిజానికి ఫుల్‌ లెంగ్త్‌ డ్రెస్‌ చూస్తే ఈ బ్యూటీ ఎంతమంచి డిజైనరో అర్థమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని వెరైటీ డ్రెస్సులు డిజైన్‌ చేసుకుంటారేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement