‘డ్రెస్‌ని ఖరీదుతో చూడకూడదు. ఆ డ్రెస్ కలర్, ఫిటింగ్ మనకు ఎంత బాగా నప్పాయి... అనేవి చెక్ చేసుకొని తీసుకోవాలి’ అంటున్నారు హైదరాబాద్‌లోని భరత్‌నగర్ వాసి రాధ పర్వతరెడ్డి. తక్కువ బడ్జెట్‌లో డ్రెస్ డిజైనింగ్‌ని స్పెషల్‌గా, కంఫర్ట్‌గా, క్రియేటివ్‌గా ఎలా ప్లాన్‌న్ చేసుకుంటున్నారో వివరిస్తున్నారు.
‘‘ఎంత సింపుల్‌గా రెడీ అయితే అంత గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాం. అందుకే నా వార్డ్ రోబ్‌లో ప్లెయిన్ శారీస్‌కు ఎక్కువ చోటు ఉంటుంది. ప్లెయిన్ సిల్క్ శారీస్ జాబితా ఎక్కువే ఉంటుంది. వాటిలోనూ లైట్ కలర్స్‌వే తీసుకుంటాను. వీటికి కాంట్రాస్ట్ కలర్‌లో ఉన్న కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేస్తాను. పొడవుగా ఉన్నవారికి ఈ కాంబినేషన్ చీరలు బాగుంటాయి. గెట్ టు గెదర్ పార్టీలకు ఈ స్టైల్ బాగా నప్పుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకునే సదుపాయం ఉంది.
యూ ట్యూబర్‌ని కాబట్టి స్పెషల్ లుక్స్ కోసం ట్రై చేస్తుంటాను. ఈ కాంబినేషన్‌కి హెయిర్ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. నా జుట్టు పొడవుగా ఉంటుంది. శారీ కట్టుకుంటే మాత్రం జుట్టుకి ఒక చిన్న క్లిప్ పెట్టుకొని, మిగతా హెయిర్ అంతా లీవ్ చేస్తుంటాను. జుట్టు బాగుంటే డ్రెస్సింగ్ కూడా బాగుంటుంది కాబట్టి, హెయిర్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.
చందేరీ స్పెషల్
దుపట్టా పెద్దగా ఉండే చుడీదార్స్ అంటే ఇష్టం. వీటిలోనూ లైట్ కలర్స్‌కే పప్రాధాన్యత. రెడీ టు వేర్ ఉండే డ్రెస్సులు ఈ జాబితాలో ఉంటాయి. పండగల సమయాల్లో అయితే చందేరీ శారీస్ ఎంచుకుంటాను. చందేరీ చీరల రంగులు బాగుంటాయి. చూడటానికి ప్రత్యేకంగానూ ఉంటాయి.
ఏ సంప్రదాయ వేడుకల్లోనైనా ఈ చీరలు బాగుంటాయి. బ్లౌజ్‌కి కొంచెం డిజైన్ ఉన్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నేను వీటికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్‌లనే మ్యాచ్ చేసుకుంటాను. చందేరీ చీరల్లో బ్రైట్ రెడ్, గ్రీన్ కలర్స్ ఎంచుకుంటాను. పెళ్లి వేడుకల్లో పట్టు చీరలు, లెహంగాలు ఎంచుకుంటాను. లెహంగాకు మ్యాచ్ చేయడానికి కొంచెం స్టైల్స్‌లో మార్పుకు క్రాప్‌టాప్స్, మ్యాచింగ్ దుపట్టాలు సెలెక్ట్ చేసుకుంటాను.
ప్రింటెడ్ బ్లౌజులు
బ్లౌజ్ డిజైన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనే విషయానికి చాలా దూరంగా ఉంటాను. ప్రింటెడ్ కాటన్ మెటీరియల్స్ చాలా రకాల డిజైన్లలో మార్కెట్లో లభిస్తున్నాయి. వీటితో శారీ లుక్ స్పెషల్ అనిపించేలా డిజైన్ చేయిస్తాను. షార్ట్ స్లీవ్స్, స్ట్రాప్స్ .. యంగ్ లుక్‌ని మరింత ఎలివేట్ చేస్తాయి.
సౌకర్యమే ఫస్ట్...
టూర్స్‌కి వెళ్లినప్పుడు సౌకర్యానికే పప్రాధాన్యత. గంటల సమయాన్ని ప్రయాణంలోనే గడపాలి. అందుకని జీన్స్‌కు బదులు జెగ్గింగ్స్, టీ షర్ట్స్, నైట్ డ్రెస్‌లకే ఓటు వేస్తాను. ఎక్కువ లైట్ కలర్స్‌కి పప్రాముఖ్యం ఇచ్చినా నాకు ఇష్టమైన కలర్ మాత్రం బ్లాక్. లైట్–బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు నా వద్ద చాలానే ఉన్నాయి’’ అంటూ తన డ్రెస్ సెలక్షన్, కలెక్షన్ గురించి వివరించారు రాధ.
(చదవండి: బాత్‌రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారా..? స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్న నిపుణులు)
Comments
Please login to add a commentAdd a comment