రోజులో సగకాలం గడిచేది వంటింట్లోనే! అది ఎంత శుచిగా.. ఆహ్లాదంగా ఉంటే వంటలు అంత రుచిగా చవులూరిస్తూంటాయి. అలాంటి వంటల్లో.. ఆ వంటగది ఇంటీరియర్‌లో ఇండియన్ స్టయిలే వేరు! ఆ అలంకరణను మీ కిచెన్‌లో సెట్‌చేసుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టాలేమో అనుకునేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఆ గ్రేస్‌ను తీసుకురావచ్చు!
కుండలు, టెర్రకోట వస్తువులు, బుట్టలు, ఇత్తడి పాత్రలతో కిచెన్‌కు సంప్రదాయ, ఆధునికతల ఫ్యూజన్‌ను అద్దవచ్చు. మన ఇళ్లల్లోని తరతరాల పాత్రల వైభవాన్నీ కొలువుదీర్చవచ్చు.
ఉపయోగంలో లేని పాత్రలకు పెయింట్ వేసి వాటిల్లో మొక్కల తొట్లను పెట్టి.. వంటిగదికి ప్రకృతి శోభతో గార్నిష్ చేయవచ్చు.
కిచెన్‌లోనూ, డైనింగ్ టేబుల్‌పైనా చక్కటి డిజైన్ల హ్యాండ్లూమ్ క్లాత్స్‌ను పరచి కొత్త కళతో మెరిపించవచ్చు.
సంప్రదాయ మండల డిజైన్లు, ప్రకృతి దృశ్యాల కళాకృతులతో డెకరేట్ చేయవచ్చు.
గాజు జాడీలతో ఉన్న ఓపెన్ షెల్ఫ్‌లు అందంగానే కాదు.. వంటకు కావల్సిన దినుసులు అందుకోవడానికీ అనువుగా ఉంటాయి.
– ఎన్.ఆర్
(చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!)
Comments
Please login to add a commentAdd a comment