సాయిపల్లవికి తండేల్‌ టీమ్‌ సన్మానం.. ఎందుకో తెలుసా? | Thandel Team Celebrates Sai Pallavi Victory in Filmfare South Awards | Sakshi
Sakshi News home page

సాయిపల్లవిని సన్మానించిన తండేల్‌ టీమ్‌.. సెట్‌లోనే కేక్‌ కటింగ్‌.. ఎందుకంటే?

Published Wed, Jul 17 2024 6:55 PM | Last Updated on Wed, Jul 17 2024 7:10 PM

Thandel Team Celebrates Sai Pallavi Victory in Filmfare South Awards

నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవిని తండేల్‌ టీమ్‌ ఘనంగా సత్కరించింది. నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకుడు చందూ మొండేటి తనతో కేక్‌ కట్‌ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా సెట్‌లోని వారంతా ఆరు సింబల్స్‌ చూపించారు. అవును.. సాయిపల్లవికి ఇప్పటివరకు ఆరు ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకుంది. అందులో భాగంగానే తన విజయాలను ఇలా సెలబ్రేట్‌ చేశారు. 

ఎన్ని అవార్డులంటే?
కాగా సాయిపల్లవి ప్రేమమ్‌ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ మూవీకి గానూ బెస్ట్‌ ఫీమేల్‌ డెబ్యూగా ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డు గెలుచుకుంది. ఫిదా, లవ్‌ స్టోరీ చిత్రాలకు ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డుల జాబితాలోనూ సాయిపల్లవి మరోసారి సత్తా చాటింది. గార్గి, విరాటపర్వం (క్రిటిక్స్‌ విభాగంలో) చిత్రాలకుగానూ మరో రెండు అవార్డులు అందుకుంది. వీటితో కలిపి సాయిపల్లవి అందుకున్న ఫిలింఫేర్‌ పురస్కారాల సంఖ్య ఆరుకు చేరింది. ఇలా ఆరు ఫిలింఫేర్లు అందుకున్న ఏకైక నటిగా ఈ బ్యూటీ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే తన విజయాన్ని చిత్రబృందం కేక్‌ కటింగ్‌తో సెలబ్రేట్‌ చేసింది.

తండేల్‌ సంగతులు..
తండేల్‌ విషయానికి వస్తే.. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో చై, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

 

 

చదవండి: కోపంతో ఆ హీరోయిన్‌ చెంప చెళ్లుమనిపించా..: హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement