నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తండేల్ రిలీజ్ ఎప్పుడంటే?
ఈ సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు నిర్మాత అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ప్రకటించారు.
తండేల్ కథేంటంటే..
నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు.
Biggest chartbuster of the season is playing in every headphone and heart ❤🔥
'Love Song of the Year' #BujjiThalli from #Thandel hits 40 MILLION+ VIEWS, 450K+ LIKES on YouTube and 610K+ REELS on Instagram ✨
▶️ https://t.co/52ZLxEJe7I
A 'Rockstar' @ThisIsDSP's soulful melody… pic.twitter.com/OVi5KpZaRm— Thandel (@ThandelTheMovie) December 30, 2024
Comments
Please login to add a commentAdd a comment