నాగచైతన్య తండేల్‌.. బుజ్జి తల్లి వచ్చేసింది | Naga chaitanya sai pallavi Starrer Thande Movie Lyrical Song Out Now | Sakshi

Thande Movie: నాగచైతన్య తండేల్‌.. బుజ్జి తల్లి వచ్చేసింది

Nov 21 2024 6:31 PM | Updated on Nov 21 2024 6:53 PM

Naga chaitanya sai pallavi Starrer Thande Movie Lyrical Song Out Now

అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం తండేల్. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ  సాంగ్‌ లవ్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్‌తో కనెక్ట్‌ అయ్యేలా రూపొందించారు. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. 

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement