యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" లిరికల్ (Namo Namah Shivaya Lyrical Song) వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ నామస్మరణతో కొనసాగిన ఈ శివ శక్తి పాట బ్రీత్ టేకింగ్ మాస్టర్ పీస్. డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడాడు. హరిప్రియ గాత్రం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరించడం బాగుంది.
'లవ్ స్టోరీ' మూవీలో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
Comments
Please login to add a commentAdd a comment