అలనాటి హీరోయిన్ షర్మిల ఠాగూర్‌పై గతంలో చేయి చేసుకున్నానని చెప్తున్నాడు బెంగాలీ హీరో ప్రోసెంజిత్ చటర్జీ. చిన్న వయసులో ఆమె చెంప చెళ్లుమనిపించానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. 'అప్పుడు నాకు నాలుగైదు ఏళ్లు ఉంటాయనుకుంటాను. నాన్న(విశ్వజిత్ చటర్జీ)తో పాటు షూటింగ్‌కు వెళ్లాను. అప్పుడు హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఓ ఎమోషనల్ సీన్‌లో నాన్నను కొట్టింది.
ఆ కోపం నా మీద..
లంచ్ బ్రేక్‌లో అంతా ఒకేచోట కూర్చున్నాం. ఆమె నన్ను తన దగ్గరికి తీసుకున్న వెంటనే చెంప మీద కొట్టాను. ఇప్పటికీ మేము కలిసిన ప్రతిసారి ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఉంటుంది. మీ నాన్నను కొట్టానన్న కోపంతో నన్ను కొట్టావు కదా.. అంటుంది' అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా విశ్వజిత్ చటర్జీ, షర్మిల ఠాగూర్.. ప్రభాతెర్ రంగ్, యె రాత్ ఫిర్ నా ఆయేగి అనే రెండు సినిమాల్లో జంటగా నటించారు.
గోల్డెన్ కపుల్..
ఇక ప్రోసెంజిత్ విషయానికి వస్తే.. హీరోయిన్ రితుపర్ణ సేన్‌గుప్తతో కలిసి దాదాపు 50 సినిమాలు చేశాడు. వీరిని అభిమానులు గోల్డెన్ కపుల్ అని పిలుచుకుంటారు. ఇటీవలే వీరు అజోగ్యో మూవీలో జంటగా నటించారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment