శాండల్‌వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు! | Sandalwood Actors Most Popular Stars In June Month Goes Viral | Sakshi
Sakshi News home page

Kannada Stars : కన్నడ హీరో దర్శన్‌కు ఆ లిస్ట్‌లో చోటు.. మొదటిప్లేస్‌లో ఎవరంటే!

Published Wed, Jul 17 2024 3:28 PM | Last Updated on Wed, Jul 17 2024 3:53 PM

Sandalwood Actors Most Popular Stars In June Month Goes Viral

ఇటీవల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ ఇండస్ట్రీ మోస్ట్‌ పాపులర్ తారల లిస్ట్‌ను ప్రకటిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళం, తమిళ స్టార్స్‌లో జూన్‌ నెలకు సంబంధించి ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్ల  జాబితాను వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన తెలుగు హీరోల జాబితాలో ప్రభాస్‌ మొదటిస్థానంలో నిలిచారు.

తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ స్టార్స్‌ జాబితాను ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో మొదటిస్థానంలో కేజీఎఫ్ స్టార్‌ యశ్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా సుదీప్ కిచ్చా, రక్షిత్‌ శెట్టి, దర్శన్, రిషబ్ శెట్టి ఉన్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పుష్ప భామ రష్మిక మందన్నా టాప్‌ ప్లేస్ దక్కించుకుంది. ఆమె తర్వాత రచిత రామ్, రాధిక పండిట్‌, రమ్య, ఆషిక రంగనాథ్ వరుస స్థానాలు ఆక్రమించారు.

అయితే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్‌లో కన్నడ హీరో దర్శన్ కూడా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో జరిగిన ఓ అభిమాని హత్యకేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా.. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడంటూ దర్శన్‌ అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement