Sandalwood actor Darshan
-
శాండల్‌వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!
ఇటీవల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ తారల లిస్ట్‌ను ప్రకటిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళం, తమిళ స్టార్స్‌లో జూన్ నెలకు సంబంధించి ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన తెలుగు హీరోల జాబితాలో ప్రభాస్ మొదటిస్థానంలో నిలిచారు.తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో మొదటిస్థానంలో కేజీఎఫ్ స్టార్ యశ్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా సుదీప్ కిచ్చా, రక్షిత్ శెట్టి, దర్శన్, రిషబ్ శెట్టి ఉన్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పుష్ప భామ రష్మిక మందన్నా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె తర్వాత రచిత రామ్, రాధిక పండిట్, రమ్య, ఆషిక రంగనాథ్ వరుస స్థానాలు ఆక్రమించారు.అయితే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్‌లో కన్నడ హీరో దర్శన్ కూడా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో జరిగిన ఓ అభిమాని హత్యకేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా.. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడంటూ దర్శన్ అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Ormax Stars India Loves: Most popular female Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/72De2ze5MK— Ormax Media (@OrmaxMedia) July 17, 2024Ormax Stars India Loves: Most popular male Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/NYPwHgPNUC— Ormax Media (@OrmaxMedia) July 17, 2024 -
సంక్షోభంలో శాండల్‌వుడ్
సాక్షి, బెంగళూరు: కన్నడ చలనచిత్ర పరిశ్రమ శాండల్‌వుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రేక్షకులు థియేటర్లకు ముఖం చాటేస్తుండడంతో వాటిని మూసేయాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు నటీనటుల జీవితాల్లో సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. హీరో హీరోయిన్లే కాకుండా కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, నిర్మాతలు పలు వివాదాల్లో చిక్కుకుంటూ శాండల్‌వుడ్‌కు ఏమైంది అనేలా తయారయ్యారు. హత్యలు, విడాకులు, కుమ్ములాటలతో చందనసీమ నలిగిపోతోంది. ఒకప్పుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, రెబెల్ స్టార్ అంబరీష్, సాహససింహ విష్ణువర్ధన్, శంకర్‌నాగ్ వంటి మహామహులతో విరాజిల్లిన శాండల్‌వుడ్ ఇప్పుడు సంక్షోభాన్నే చవిచూస్తోంది.థియేటర్లు వెలవెలఈ ఏడాది ప్రారంభం నుంచి కన్నడ కళాకారులు, సాంకేతిక నిపుణులు వ్యక్తిగత జీవితాలతో పాటు అనేక నెగెటివ్ వార్తలతో చిత్రపరిశ్రమ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గడిచిన ఆరునెలల్లో వందకు పైగా సినిమాలు విడుదల కాగా అందులో భారీ స్థాయిలో హిట్ అయిన సినిమా ఒక్కటీ లేకపోవడం చందనవనాన్ని కలవరపరుస్తోంది. అంతేకాకుండా నేటితరం ప్రేక్షకులు థియేటర్లకే రావడం లేదు. అలాగే సినిమాలను ఏ టీవీ చానెల్ కానీ, ఓటీటీ సంస్థలు కానీ కొనుగోలు చేయడం లేదని కన్నడ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి మీద పుట్రలా దర్శన్ వంటి బడా హీరోలు హత్య కేసుల్లో ఇరుక్కోవడంతో చిత్రపరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో చాలెంజింగ్ స్టార్, నటుడు దర్శన్, నటి పవిత్ర, మరో 12 మందికి పైగా అనుచరులు అరెస్టు అయ్యారు. ఒక స్టార్ నటుడు హత్య కేసులో భాగం కావడం ఇంతవరకు జరగలేదు.గోవాలో నిర్మాతల గొడవఇటీవల కన్నడ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్‌తో పాటు తదితర చిత్రరంగ ముఖ్యులు గోవాకు వెళ్లారు. కొందరు అక్కడ గొడవ పడ్డారు. ఈ గొడవలో నిర్మాత గణేశ్‌పై దాడి కూడా జరిగింది.కాపురాల్లో కలతలుశాండల్వుడ్లోని ప్రముఖులు ఇటీవల ఒక్కొక్కరే విడాకుల పేరుతో రచ్చకెక్కుతున్నారు. రియాల్టీ షో కలసికట్టుగా కనిపించిన చందన్ శెట్టి–నివేదిత ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ చకచకా తమ నిజజీవితంలో అడుగులు వేశారు. అయితే మూణ్నాళ్ల ముచ్చటే అన్నట్లు పెళ్లి అయిన మూడేళ్లకే వీరిద్దరూ విడిపోతామని కోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరికీ పొసగక విడాకులకు సిద్ధమయ్యారు. కన్నడ కంఠీరవ దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో కూడా విడాకుల ఉదంతం వెలుగు చూసింది. కొన్నేళ్ల క్రితం ప్రేమించి, ఇంట్లో పెద్దలను ఒప్పించి యువ రాజ్‌కుమార్, శ్రీదేవీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కలతలు రావడంతో విడిపోతామని శ్రీదేవి ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో పెద్ద ఇంటిగా పేరుగాంచిన రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల పేరు వినిపించడం కలకలం రేపింది. మరో స్టార్ నటుడు దునియా విజయ్ సంసారంలో కూడా అలజడులతో సాగుతోంది. ఇటీవల ఆయన దాఖలు చేసిన విడాకులు కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మొదటి భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వకుండానే కీర్తి గౌడను దునియా విజయ్ మరో పెళ్లి చేసుకున్నాడు. -
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆరాధనా రామ్ జంటగా నటించిన చిత్రం కాటేరా. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే కూ. 19.79 కోట్లు, రెండో రోజు కూ.17.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరుసగా మూడో రోజు ఏకంగా రూ.20.94 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.58 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాటేరా.. న్యూ ఇయర్ రోజు సైతం రూ.18.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవరాల్‌గా నాలుగు రోజుల్లోనే రూ.77.6 కోట్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత సోమవారం కూడా కాటేరా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. కాటేరా మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం సోమవారం బెంగళూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. .@dasadarshan 's #Kaatera remains unstoppable at the box office, enjoying a substantial #NewYear2024's boost with a gross collection of Rs 18.26 crore on #Jan1, bringing the total to an impressive Rs 77.6 crore in 4 days. @TharunSudhir @RocklineEnt @jadeshaakhampi #Maasthi… pic.twitter.com/1WQeQL1Yok — A Sharadhaa (@sharadasrinidhi) January 2, 2024 This is huge for 3rd day 💥 Official announcement from team itself 🔥#Kaatera 3rd day collection: 20.94 cr Overall collection from 3 days: 58.8 cr💥 Film crossed 50 cr+ in just 3 days ❤️ Inching towards 💯 cr🔥#Dboss @dasadarshan 👑#BossOfSandalwood #KaateraBORampage pic.twitter.com/RgHsbrbhIP — ಕೃಷ್ಣ❤️ KAATERA 29th DEC (@JacksparrowD60) January 1, 2024 -
హైకోర్టుకు నటుడు దర్శన్
బెంగళూరు : శాండల్ వుడ్ నటుడు దర్శన్ హైకోర్టును ఆశ్రయించాడు. రాజకాలువ కబ్జాకు పాల్పడి నిర్మించిన రాజరాజేశ్వరి నగర ఐడియల్ హోమ్ లేఔట్ ప్రదేశాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆస్తిగా గుర్తించడాన్ని ప్రశ్నిస్తూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కాగా దర్శన్ 2,100 చదరపు అడుగుల స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు నిర్మించినట్లు అధికార యంత్రాంగం నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ఈనెల 22న బెంగళూరు జిల్లా యంత్రాంగం ఈ లేఔట్లో 44 ఇళ్లకు ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించి బోర్డు పెట్టింది. జిల్లా యంత్రాంగం తీరుపై దర్శన్ హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ వేశారు. పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. కాగా హలగేవడరహళ్లి గ్రామ సర్వే నెంబరు 38 నుంచి 46 వరకు, సర్వే నెంబరు 51 నుంచి 56 వరకు ఉన్న 7 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమి. ఇందులో ఐడియల్‌హోమ్స్ సహకార సంఘం పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా లేఔట్ వేశారు.అందులో 3 ఎకరాల 20 గుంటల స్ధలంలో మొత్తం 32 ఖాళీ స్థలాలు ఉండగా, ఎకరా 38 గుంటల స్థలంలో ఇళ్లు, భవనాలు నిర్మించారు. 22 గుంటల స్థలంలో ఎస్.ఎస్ ఆసుపత్రిని నిర్మించగా ఎకరా 24 గుంటల స్థలం రోడ్డుకు వినియోగిస్తున్నారు. 7 గుంటల స్థలంలో బీబీఎంపీ వాటర్ ట్యాంకు నిర్మించినట్లు జాయింట్ కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి నివేదిక అందజేశారు. ఇందుకు సంబంధించి గతంలో దర్శన్‌కు నోటీసులు కూడా అందాయి. 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో దర్శన్ న్యాయస్థానం మెట్లెక్కాడు.