బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు.. నాలుగు రోజుల్లోనే రికార్డ్! | Sandalwood Movie Hits Record At Box Office Just In Three Days | Sakshi
Sakshi News home page

Sandalwood Movie: బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు.. కాటేరా మూవీకి ఎన్ని కోట్లంటే?

Jan 2 2024 11:40 AM | Updated on Jan 2 2024 12:13 PM

Sandalwood Movie Hits Record At Box Office just In Three Days - Sakshi

శాండల్‌వుడ్‌ ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌, ఆరాధనా రామ్‌ జంటగా నటించిన చిత్రం కాటేరా. తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా  బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.  మొదటి నాలుగు రోజుల్లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. 

డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే కూ. 19.79 కోట్లు, రెండో రోజు కూ.17.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరుసగా మూడో రోజు ఏకంగా రూ.20.94 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.58 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాటేరా.. న్యూ ఇయర్ రోజు సైతం రూ.18.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవరాల్‌గా నాలుగు రోజుల్లోనే రూ.77.6 కోట్లు రాబట్టింది. 

వీకెండ్ తర్వాత సోమవారం కూడా కాటేరా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. కాగా.. ఈ  చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. కాటేరా మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం సోమవారం బెంగళూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement