నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో! | Actress Anu Gowda Injury Land Dispute Issue | Sakshi
Sakshi News home page

Anu Gowda: నటికి చేదు అనుభవం.. రక్తమొచ్చేలా కొట్టారు!

Jul 4 2023 5:06 PM | Updated on Jul 4 2023 5:06 PM

Actress Anu Gowda Injury Land Dispute Issue - Sakshi

ఎంతపెద్ద సెలబ్రిటీ అయినాసరే కొన్నిసార్లు కష్టాలు తప్పవు. తాజాగా ఓ సీనియర్ నటికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ విషయమై క్లారిటీ తెచ్చుకునేందుకు సొంతూరికి వెళ‍్లగా.. పలువురు ఈమెపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో సదరు నటిని ఆస‍్పత్రిలో చేర్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈమె.. అసలేం జరిగింది? ఎందుకు కొట్టారనే విషయాన్ని బయటపెట్టింది. 

(ఇదీ చదవండి: ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్)

నటి అనుగౌడ.. కన్నడలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ‍్చుకుంది. కర్ణాటకలోని షిమోగా జిల‍్లాలోని హోస్ నగర్ ఈమె సొంతూరు. అయితే సాగర్ తాలుకాలోని కస్పాడిలో ఈమెకి భూమి ఉంది. అనుగౌడ తల్లిదండ్రులు అందులో వ్యవసాయం చేసేవారు. దీంతో బెంగళూరు నుంచి తరుచూ ఇక్కడి వచ్చి వెళ్తుండేది.‍ మరోవైపు ఇదే భూమిపై వివాదం నడుస్తూ ఉండేది. ఈ ల‍్యాండ్ తమదంటూ అనుతో కొందరు గొడవపడేవారు.

రీసెంట్ గా అను గౌడ.. కస్పాడి వెళ్లగా, ఈసారి గొడవ పడటం పక్కనబెట్టి ఏకంగా ఈమెపై దాడి చేశారు. స్థానికులైన నీలమ్మ, మోహన్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు నటి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఈమెని ఆస్పత్రిలో చేర్పించారు. అనుగౌడ గతంలో సుదీప్ 'కెంపెగౌడ', విష్ణువర్ధన్ 'స్కూల్ మాస్టర్', శివరాజ్ కుమార్ 'సుగ్రీవ', పునీత్ రాజ్ కుమార్ 'బాయ్స్' సినిమాల్లో నటించింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement