Kannada cinema
-
ఈవెంట్ తెచ్చిన తంటా.. రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
శాండల్‌వుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్‌కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు శాండల్‌వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు. -
అర్జున్ డైరెక్షన్లో కొత్త చిత్రం.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో అర్జున్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయనున్నారు. సీతా పయనం పేరుతో మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ చివరిసారిగా ప్రేమ బరహా అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు.కాగా.. యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో నటించారు. కన్నడకు చెందిన అర్జున్ భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో దర్శకత్వం వహించిన సేవాగన్ (1992), జై హింద్ (1994),తాయిన్ మణికోడి (1998) లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. హీరోగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అర్జున్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by 𝙉𝙄𝙍𝙍𝘼𝙉𝙅𝘼𝙉 (@niranjansudhindra) -
ఒకేసారి ఐదు పాన్ ఇండియా మూవీస్.. ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి
కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కెవిఎన్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్స్ సరసన ఆర్సీ స్టూడియోస్ కూడా ఉంటుంది. ఈ మధ్యే వీళ్లు తీసిన మొదటి ప్రాజెక్ట్ 'కబ్జా' మిగతా చోట్ల అంతగా ఆడలేదు కానీ కన్నడలో మాత్రం హిట్ అయింది. ఆర్.చంద్రు కొత్త వెంచర్ ఆర్సీ స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని పాన్ ఇండియా మూవీస్ తీసేందుకు రెడీ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) ఆర్సీ స్టూడియోస్ నిర్మాణంలో ఒకేసారి 5 సినిమాలు తీయబోతున్నారు. మంగళవారం(జనవరి 23) సాయంత్రం బెంగళూరులో జరిగే ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు, నిర్మాతలు హాజరు కానున్నారు. హీరో ఉపేంద్ర కూడా రాబోతున్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టులని ఆర్సీ స్టూడియోస్.. సింగపూర్‌కు చెందిన మిస్టర్ అలంకార్ పాండియన్, వ్యాపారవేత్త శ్రీ సీకల్ రామచంద్ర గౌడతో కలిసి నిర్మించనుంది. (ఇదీ చదవండి: Sitara Income: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) -
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆరాధనా రామ్ జంటగా నటించిన చిత్రం కాటేరా. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే కూ. 19.79 కోట్లు, రెండో రోజు కూ.17.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరుసగా మూడో రోజు ఏకంగా రూ.20.94 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.58 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాటేరా.. న్యూ ఇయర్ రోజు సైతం రూ.18.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవరాల్‌గా నాలుగు రోజుల్లోనే రూ.77.6 కోట్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత సోమవారం కూడా కాటేరా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. కాటేరా మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం సోమవారం బెంగళూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. .@dasadarshan 's #Kaatera remains unstoppable at the box office, enjoying a substantial #NewYear2024's boost with a gross collection of Rs 18.26 crore on #Jan1, bringing the total to an impressive Rs 77.6 crore in 4 days. @TharunSudhir @RocklineEnt @jadeshaakhampi #Maasthi… pic.twitter.com/1WQeQL1Yok — A Sharadhaa (@sharadasrinidhi) January 2, 2024 This is huge for 3rd day 💥 Official announcement from team itself 🔥#Kaatera 3rd day collection: 20.94 cr Overall collection from 3 days: 58.8 cr💥 Film crossed 50 cr+ in just 3 days ❤️ Inching towards 💯 cr🔥#Dboss @dasadarshan 👑#BossOfSandalwood #KaateraBORampage pic.twitter.com/RgHsbrbhIP — ಕೃಷ್ಣ❤️ KAATERA 29th DEC (@JacksparrowD60) January 1, 2024 -
టీజర్ సూపర్ ఉంది కానీ ఆ ఒక్కటే!
Ghost Teaser Telugu: సినిమాపై అంచనాలు పెరగాలంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి చాలా ముఖ్యం. ఈ మధ్య వచ్చిన 'సలార్' టీజర్ బాగుంది. మేం ఒప్పుకొంటాం. కానీ అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేదని బాధ ఫ్యాన్స్‌కి ఇప్పటికీ ఉండిపోయింది. సరే దాని గురించి వదిలేస్తే తాజాగా ఓ డబ్బింగ్ సినిమా టీజర్ రిలీజైంది. దీన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ప్రభాస్ కటౌట్‌కి ఇలాంటి పడాల్సింది అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? సూపర్ టీజర్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఎంత ఫేమస్ అనేది మీలో చాలామందికి తెలుసు. ఇతడి అన్న శివరాజ్ కుమార్ కూడా అక్కడ వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఆయన నటించిన సినిమానే 'ఘోస్ట్'. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ చిత్ర టీజర్ ని శివన్న పుట్టినరోజు సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) టీజర్లో ఉన్నది ఇదే ఓ పాడుబడిన బిల్డింగ్ లో ఓ వ్యక్తి. అతడు ప్రాణాలతో కావాలని వాయిస్ ఓవర్లో ఓ వ్యక్తి ఆర్డర్. అతడితో జాగ్రత్త అని గన్స్ తో ఉన్నవాళ్లకు హెచ్చరిక. అప్పుడు శివరాజ్ కుమార్ ఎంట్రీ. ఆయుధాలతో ఉన్న వాళ్లు తనని చుట్టుముట్టినా సరే స్టైల్‌గా విస్కీతో పానిపూరీ తింటాడు. ఓ కర్రకి నిప్పి అంటించి దాంతో సిగరెట్ వెలిగిస్తాడు. దాన్ని వెనక్కి విసిరితే కవర్ కాలిపోయి వార్ ట్యాంకర్ బయటపడుతుంది. 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనే డైలాగ్ కూడా బాగుంది. వేరే హీరో ఉంటే మాత్రం టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ ఉన్నాయి. కాకపోతే హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇలాంటి టీజర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ హీరోలు ఎవరైనా ఉండుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ ఉండేది. ఇకపోతే 'ఘోస్ట్' చిత్రానికి శ్రీని దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. దసరాకి ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!) -
నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!
ఎంతపెద్ద సెలబ్రిటీ అయినాసరే కొన్నిసార్లు కష్టాలు తప్పవు. తాజాగా ఓ సీనియర్ నటికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ విషయమై క్లారిటీ తెచ్చుకునేందుకు సొంతూరికి వెళ్లగా.. పలువురు ఈమెపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో సదరు నటిని ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈమె.. అసలేం జరిగింది? ఎందుకు కొట్టారనే విషయాన్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్) నటి అనుగౌడ.. కన్నడలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని హోస్ నగర్ ఈమె సొంతూరు. అయితే సాగర్ తాలుకాలోని కస్పాడిలో ఈమెకి భూమి ఉంది. అనుగౌడ తల్లిదండ్రులు అందులో వ్యవసాయం చేసేవారు. దీంతో బెంగళూరు నుంచి తరుచూ ఇక్కడి వచ్చి వెళ్తుండేది. మరోవైపు ఇదే భూమిపై వివాదం నడుస్తూ ఉండేది. ఈ ల్యాండ్ తమదంటూ అనుతో కొందరు గొడవపడేవారు. రీసెంట్ గా అను గౌడ.. కస్పాడి వెళ్లగా, ఈసారి గొడవ పడటం పక్కనబెట్టి ఏకంగా ఈమెపై దాడి చేశారు. స్థానికులైన నీలమ్మ, మోహన్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు నటి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఈమెని ఆస్పత్రిలో చేర్పించారు. అనుగౌడ గతంలో సుదీప్ 'కెంపెగౌడ', విష్ణువర్ధన్ 'స్కూల్ మాస్టర్', శివరాజ్ కుమార్ 'సుగ్రీవ', పునీత్ రాజ్ కుమార్ 'బాయ్స్' సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!) -
లేడీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన 'కేజీఎఫ్' యశ్!
పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?) 'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది. మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్' మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?) -
ఫ్రెండ్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!
మూవీ ఇండస్ట్రీలో బహుమతులు ఇవ్వడం లాంటివి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. సినిమా హిట్ అయితే సదరు నిర్మాతలు.. దర్శకులకు ఖరీదైన కార్స్ ని బహుమతులుగా ఇస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరో మాత్రం అలాంటిదేం లేకపోయినాసరే తన ఫ్రెండ్ కి కాస్ట్ లీ కారుని బహుమతిగా ఇచ్చాడు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ధ్రువ సర్జా గురించి తెలుగులో కొంతమందికి తెలుసు. హీరో అర్జున్ మేనల్లుడు, చిరంజీవి సర్జాకి తమ్ముడు అయిన ఇతడు.. కన్నడలో యావరేజ్ హీరో. ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తుంటాడు. కొన్నాళ్ల ముందు 'పొగరు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం 'మార్టిన్', 'KD' లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ధ్రువ సర్జా.. తన ఫ్రెండ్ అయిన అశ్విన్ కి పుట్టినరోజున సర్ ప్రైజ్ చేశాడు. రూ.50 లక్షలు విలువ చేసే టొయాటో కారుని అతడి గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారిపోయాయి. దీనిపై ధ్రువ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్) -
మార్టిన్ వస్తున్నాడు
‘‘దేశవ్యాప్తంగా కన్నడ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. సుదీప్, యశ్గార్లు నా సీనియర్ యాక్టర్స్. వారు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు చేశారు. వారితో నేను పోటీపడటం లేదు. ఓ యాక్టర్‌గా ఇంకా మెరుగయ్యేందుకు నాతోనే నేనుపోటీ పడుతుంటాను’’ అని అన్నారు హీరో ధృవ సర్జా. ‘అద్దూరి’ (2012) చిత్రం తర్వాత హీరో ధృవ సర్జా, దర్శకుడు ఏపీ అర్జున్ కాంబోలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మార్టిన్’. ఈ చిత్రంలో వైభవి శాండల్య, అన్వేషి జైన్ హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కథ అందించిన ఈ సినిమాను ఉదయ్ కె. మెహతా నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘మార్టిన్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ధృవ సర్జా మాట్లాడుతూ– ‘‘మార్టిన్’ చిత్రం దేశభక్తి నేపథ్యంలో ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇంటర్నేషనల్ ఫైటర్స్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల కోసం బాగా బరువు పెరిగాను’’ అన్నారు. ‘‘రాజమౌళి, ప్రశాంత్ నీల్, మణిరత్నం వంటి దర్శకులు భాషా పరమైన హద్దులను చెరిపేశారు. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమాయే’’ అన్నారు అర్జున్. ‘‘ధృవతో నేను గతంలో ప్రేమకథ చేశాను. ఇప్పుడు యాక్షన్ మూవీగా ‘మార్టిన్’ చేశాను’’ అన్నారు అర్జున్ ఏపీ. -
సొసైటీపై విరక్తితో డైరెక్షన్ చేస్తున్న స్టార్ హీరో
సంప్రదాయ కుటుంబంలో పుట్టాడు.. ఇలాంటి సినిమాలా తీసేది అనే విమర్శలు ఉపేంద్రనెప్పుడూ గాయపర్చలేదట. కానీ, ‘తేడా దర్శకుడు’ అనే మాట విన్నప్పుడల్లా కోపం నషాలానికి అంటుందట. కారణం.. వాస్తవ పరిస్థితుల్ని యథాతథంగా అలాంటి ట్యాగ్ లైన్‌ను అంటగడుతున్నారనే ఆయన ఫీలింగ్. ఉపేంద్ర సినిమాల్ని మెచ్చుకునేవాళ్లకంటే.. అందులోని ప్లాట్లైన్లను, కథనాల్ని తిట్టేవాళ్లు కూడా అదే రేంజ్లో ఉంటారు. అయినప్పటికీ ఆయనొక స్టార్ మేకర్. సెప్టెంబర్ 18న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (ఉపేంద్ర రావు) పుట్టినరోజు.. ఉడుప్పీ కొటేశ్వర గ్రామంలో 1968లో జన్మించారాయన. కన్ననాటే కాదు.. తెలుగులోనూ ఉప్పీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ►సినీ పరిశ్రమలో ఉపేంద్రలా ఆలోచించేవాళ్లు ఇంకెవరూ ఉండరు. ఉపేంద్ర ఒక్కడే గొప్పగా ఆలోచించగలడు : రజినీకాంత్ ►కన్నడ దర్శకుడు, నటుడు కాశీనాథ్.. ఉపేంద్రకి దగ్గరి బంధువు. అందుకే ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. ►కాశీనాథ్ స్టయిల్లోనే తీసిన మొదటి సినిమా ఆడకపోవడంతో.. తన స్టైల్లో ‘ష్’ తీసి మంచి దర్శకుడనే పేరు దక్కించుకున్నాడు. ►తన నిజజీవితంలో ఎదురైన.. ఎదురవుతున్న ఘటనలనే ‘పచ్చి’గా సినిమాగా చూపించడం ఉప్పీ స్టయిల్. ►సామాజిక స్పృహను తెరపై చూపించినప్పటికీ.. అందులోని బోల్డ్నెస్ వల్ల విమర్శలు ఎదురవుతుంటాయి ►ఉపేంద్ర చిన్నతనంలో కంటి సమస్య ఎదుర్కొన్నాడు. అందుకే కొన్ని సినిమాల్లో కళ్లను అటు ఇటు తిప్పుతూ ఓ స్పెషల్ సిగ్నేచర్‌ను చూపిస్తుంటారు. ‘‘నావి ఫిలసాఫికల్ సినిమాలేం కాదు. మెసేజ్‌లు ఇచ్చే ప్రయత్నమూ చేయను. ప్రతీ మనిషి తానే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. నేను దేవుడ్ని భ్రమలో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ, ఎదుటివారి ఆలోచనల్లోని ఒడిదుడుకులు పట్టుకోవాలనుకున్నప్పుడు, మనిషి గందరగోళంగా మారతాడు. స్వార్థంతో నిండిపోయిన ఈ సొసైటీ తీరే అంతా. అలాంటి వాళ్లపైన విరక్తితోనే డైరెక్షన్ చేస్తున్నా - ఓ ఇంటర్వ్యూలో ఉప్పీ చెప్పిన మాటలివి. ►ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘ఓం’.. కన్నడనాట ఓ సెన్సేషన్. శివరాజ్‌కుమార్-ప్రేమ లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ కల్ట్ క్లాసిక్ జాబితాలో చోటు దక్కించుకుంది. ►హీరో కమ్ డైరెక్టర్‌గా ఉపేంద్ర తొలి భారీ సక్సెస్ ‘ఏ’. ఇది ఉప్పీ గతంలో ఓ నటితో జరిపిన ‘ప్రేమ’ వ్యవహారం ఆధారంగా తీసిన సినిమాగా ఓ ప్రచారం వినిపిస్తుంటుంది. ఈ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ తన ప్రొడక్షన్ హౌజ్‌లో ఓ సినిమా తీయాలంటూ ఉప్పీతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ►ఆ శాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ లీడ్ రోల్లో ‘ఆపరేషన్ అంత’ డైరెక్ట్ చేశాడు ఉపేంద్ర. కానీ, అది అంతగా ఆడలేదు. రాజకీయ కోణంలో వివాదాల్లో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ఉపేంద్ర’ భారీ సక్సెస్ అందుకుంది. ►ఉపేంద్ర సినిమా ముగింపును.. తన సినిమాను ఓపెనింగ్ షాట్‌గా వాడుకోవాలనే కోరికను స్టార్ దర్శకుడు శంకర్ గతంలో ఓ ఈవెంట్లో బయటపెట్టాడు కూడా. ►ముగ్గురు హీరోయిన్లను మనిషిలోని డబ్బు, అహం, డబ్బు-బాధ్యతలు అనే వాటితో పోలుస్తూ.. నేను అనే స్వార్థం ఉండకూడదనే ఉద్దేశంతో తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ ►షారూక్ ఖాన్ హిట్ మూవీ ‘డర్’ కన్నడ రీమేక్ ‘ప్రీత్సే’లో ఉప్పీ నటనకు ప్రశంసలు ►ఏ, ఉపేంద్ర, ప్రీత్సే, కుటుంబ, రక్త కన్నీరు, గోకర్ణ, గౌరమ్మా, ఆటో శంకర్.. 1998-2005 మధ్య ఏడు వంద రోజుల హిట్ సినిమాలు. ►రక్తకన్నీరుకు బెస్ట్ డైలాగ్ రైటర్‌గా అవార్డు ► వరుస సూపర్ హిట్లతో కన్నడ సూపర్ స్టార్‌గా గుర్తింపు ►తెలుగులో ఈవీవీ సత్యనారాయణ ‘కన్యాదానం’తో యాక్టింగ్ డెబ్యూ ►విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు.. విలక్షణమైన నటుడిగా అలరించడం ఉప్పీకి ఉన్న ప్రత్యేకత ►డిఫరెంట్ సినిమాలు తీసినా.. కొంతకాలం సక్సెస్‌కి దూరం ► రోబో క్యారెక్టర్లో నటించిన తొలి నటుడు ఈయనే(హాలీవుడ్) ►2008లో ‘బుద్ధివంత’(బుద్ధిమతుడు)తో బ్యాక్ టు ఫామ్. ►దశాబ్దం గ్యాప్ తర్వాత 2010లో సూపర్ సినిమా డైరెక్షన్ ► రీమేక్‌లతో ఉప్పీకి అంతగా అచ్చీరాని సక్సెస్ ► ఉప్పీ 2తో మరోసారి డైరెక్టర్‌గా బాధ్యతలు ► తెలుగులో ఓంకారంతో దర్శకుడిగా డెబ్యూ. ఆ సినిమాకు నారేటర్ కూడా. ఆపై కన్యాదానం, రా, ఒకేమాట, నీతోనే ఉంటా, టాస్, సెల్యూట్, సన్నాఫ్ సత్యమూర్తిలో నటించారు. త్వరలో వరుణ్‌తేజ్ ‘గనీ’తో కనిపించనున్నారు. - సాక్షి, వెబ్ స్పెషల్ -
ఏప్రిల్ 7, 8న కేసీసీ క్రికెట్ టోర్నీ
కేపీఎల్, సీసీఎల్ తరహాలో సాండల్‌వుడ్ హీరోలతో కొత్తగా కేసీసీ టోర్నీ నిర్వహించటానికి రంగం సిద్దమైంది. కర్ణాటక చలనచిత్ర కప్ పేరుతో నిర్వహించే ఈ పోటీలకు జట్టును ఎంపిక చేశారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆరు జట్లను ఎంపిక చేశారు. మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే జట్టు ఎంపికకు సంబంధించి నియమ, నిబంధనలను వివరించారు. ఈ పోటీలు ఏప్రిల్ 7, 8 రెండు రోజుల పాటు 10 ఓవర్లతో ఆదిత్య గోబ్లల్ మైదానంలో జరుగునుంది. ఇందులో పాత్రికేయులు, సినిమా డైరక్టర్లు, నిర్మాతలు, నటులకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుధీప్, రవిచంద్రన్, వినయ్‌కుమార్, అశోక్ఖేణిలు పాల్గొన్నారు. -
84 వసంతాల వినోదం
కన్నడ సినిమాలు అనగానే అందమైన కుటుంబ కథలు, సంగీతం, పాటలు, హృద్యమైన లొకేషన్లు, మానవీయత జోడించిన నటీనటుల నటన గుర్తుకువస్తాయి. శాండల్‌వుడ్‌కు నేడు ఒక మరపురాని మధుర దినం. మార్చి 3 కన్నడ సినిమా రంగానికి ఓ సువర్ణదినంగా పేర్కొనవచ్చు. నేటికి సరిగ్గా కన్నడ వెండితెరకు 84 ఏళ్లు. కన్నడ సినిమాలు ఊపిరి పోసుకున్న అద్భుతమైన రోజు. వై.వి.రావు డైరెక్షన్లో విడుదలైన చిత్రం ‘సతీ సులోచన’ 1934 మార్చి 3న విడుదలైన కన్నడ మొదటి మాటల సినిమా. ఈ చిత్రం విడుదలై నేటీకి 84 ఏళ్లు. దీంతో ఈ రోజును శాండల్‌వుడ్ పండుగా భావిస్తుంది. కన్నడంలో ఓ సినిమా తీయాలనే యోచన నాగేంద్ర రాయరకు రావటంతో బెంగళూరులో వంటపాత్రల సామగ్రి వ్యాపారం చేస్తున్న డంగోజి కుటుంబం దృష్టికి తెచ్చారు. వారు రూ.40 వేలు పెట్టుబడితో ‘సతీ సులోచనా‘ అనే కన్నడ సినిమాను తీయాలని పునాది వేశారు. అన్నీ సిద్ధమైన తరువాత ఈ చిత్రం షూటింగ్ మహరాష్ట్ర కొల్మాపురలో తీయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి నటీమణులుగా అక్కచెల్లెలైయిన కమలా బాయి, లక్ష్మీబాయిలను ఎంపిక చేశారు. వీరు బెంగళూరు నుంచి షూటింగ్ కోసం కొల్హాపురకు రైలులో ప్రయాణం చేసేవారు. ఇలా పరిచయాలు పెరిగి హీరో నాగేంద్ర రాయరు కమలాబాయిని, విలన్ ఎం.వీ సుబ్బయ్య నాయుడు లక్ష్మీబాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికి 3986 సినిమాలు మొదట్లో నాటకాల్లో ఆదరణ పొందిన కథలనే సినిమాలుగా మార్చేవారు. నాటక పాత్రధారులే నటులుగా చేసేవారు. 1956 నుండి సినిమాలకు ప్రత్యేకంగా కథలను రాయటంను ప్రారంభించారు. డాక్టర్ రాజ్‌కుమార్ నటించిన ‘రాయర సోసె’ కల్యాణ కుమార్ నటించిన ‘నటశేఖర’లు సినిమా కథలు ఇలాంటివే. మైసూర్ సౌండ్ స్టూడియో కర్ణాటకకు మొదటి స్టూడియో. ఇదీ కన్నడ చిత్రరంగానికే కాకూండ ఇతర రాష్ట్రాల సినీరంగాని అకర్షించిన మొదటి స్టూడియోగా చెప్పవచ్చు. కన్నడంలో మొదటి కలర్ సినిమా బీఎస్ రంగ డైరక్షన్లో అమర శిల్పి జక్కణాచారి. కన్నడ చిత్రరంగం ఇప్పటివరకు 3986 సినిమాలకు ప్రేక్షకులకు సమర్పించింది. సింహాన్ని చూసి ప్రేక్షకుల పరుగు సతీసులోచన 1934 మార్చి 3 విడుదలైంది. ఆరువారాల పాటు ప్రదర్శన జరిగింది. బెంగళూరులో మొట్టమొదటి టాకీస్ దొడ్డణ్ణ హాల్ (ప్యారా మౌంట్)లో ప్రదర్శితమైంది. మూడు నెలల వ్యవధిలో షూటింగ్‌ను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం నిడివి 170 నిమిషాలు. ఈ చిత్రంలో ఓ తమాషా చోటుచేసుకుంది. సినిమాలో ఒకచోట సింహం కనిపిస్తుంది. అది చూసి సినిమాహాల్లోకి నిజంగానే సింహం వచ్చిందనే భయంతో చాలామంది ప్రేక్షకులు భయంతో మూర్ఛపడిపోగా, మరికొందరు బయటకు పరుగులు పెట్టారు. ఏ సినిమా అయినా హీరోకు జేజేలు పలుకుతారు, కానీ ఇక్కడ విలన్ పాత్రధారుడైన సుబ్బయ్య నాయుడుకు మంచి పేరు వచ్చింది. కన్నడంలో మొదట విడుదల కావాలసిన చిత్రం ‘భక్త ధృవ’, కానీ చిత్రీకరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. -
సినిమా బాగా నచ్చిందట: నిఖిల్
బెంగళూరు: కన్నడ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన జాగ్వార్ చిత్రంతో కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్‌గౌడ తన మొదటి చిత్రంతోనే కన్నడనాట భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. జాగ్వార్ చిత్రంతో ఘనవిజయం సాధించడంతో చిత్రం ప్రచారంతో పాటు అభిమానులను కలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న అతడు మంగళవారం తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి చిత్రంతోనే కన్నడ ప్రజలు తనను చాలా బాగా ఆదరించారన్నారు. సినిమా బాగా నచ్చిందని ఇటీవల ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే ఉత్తరాదికి చెందిన ఉద్యోగులు పేర్కొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. జాగ్వార్ సినిమాను ఇంకా బాగా తెరకెక్కించి ఉంటే ప్రేక్షకుల్లోకి మరింత చొచ్చుకెళ్లేదన్నాడు. మొదటి చిత్రంతో చాలా నేర్చుకున్నానని, దొర్లిన తప్పులను రెండవ చిత్రంలో పునరావృతం కాకుండా మరింత శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కన్నడ సినీ ఇండస్ట్రీకి మంచి ప్రతిభావంతులను పరిచయం చేసే ఉద్దేశంతో కొత్త స్టూడియోను నిర్మించనున్నామని, అందులో కంప్యూటర్ గ్రాఫిక్స్, అధునాతన డబ్బింగ్ టెక్నాలజీ తదితర సాంకేతికత సౌకర్యాలను కల్పించనున్నట్లు నిఖిల్ గౌడ పేర్కొన్నాడు. కాగా అతడు నటించబోయే రెండవ చిత్రానికి రేసుగుర్రం, ఊసరవెల్లి,కిక్ తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సురేందరరెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. -
కన్నడ సినిమా... ఛలో అమెరికా!
సినిమా రాబడికి సంబంధించి ఇండియాతో పాటు విదేశాల్లో వసూళ్ళు చాలా కీలకం. హిందీతో పాటు తమిళ, తెలుగు చిత్రాలకు ఈ ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది. మలయాళ సినిమాలకూ కొన్ని దేశాల్లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. ఇప్పుడు క్రమంగా కన్నడ సినిమాలు కూడా ఆ బాట పడుతున్నాయి. గడచిన 2015 గణాంకాలను బట్టి చూస్తే, కన్నడ చిత్రాలు కూడా అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల్ని ప్రేక్షకులుగా మలుచుకుంటూ, క్రమంగా ఓవర్సీస్లో విస్తరిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. 2015లో దాదాపు 14 కన్నడ సినిమాలు అమె రికాలో రిలీజయ్యాయి. అందులో మన సాయి కుమార్ నటించగా, కొత్తవాళ్ళు తీసిన ప్రయోగా త్మక థ్రిల్లర్ చిత్రం ‘రంగి తరంగ’, ఉపేంద్ర చేసిన ‘ఉప్పి2’ లాంటివి బాగా ఆడాయి. ఈ కన్నడ చిత్రాలన్నీ కలిపి 4.2 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు పేర్కొ న్నాయి. ఇతర దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ లతో పోలిస్తే, అమెరికాలో రిలీజవు తున్న కన్నడ సినిమాల సంఖ్య, వాటి వసూళ్ళు కొద్దిపాటే కావచ్చు. కానీ క్రమంగా పెరిగే సూచ నలు కనబడుతున్నాయి. కొత్త ఏడాదిలో మరిన్ని కన్నడ ఫిల్మ్స్ యుఎస్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. గతంలో అమెరికాలోని కన్నడ సంఘాలు స్పాన్సర్ చేసి, ఒకటి రెండు రోజుల పాటు ఈ సినిమాల్ని ప్రదర్శించేవి. ఆ సంఘాల సభ్యులు టికెట్లు కొనుక్కొని, ప్రదర్శనలు జరుగుతున్న చోటుకెళ్ళి చూసొచ్చే వారు. కానీ, ‘రంగి తరంగ’ ఏకంగా 40 చోట్ల రిలీజైంది. నిరుడు అమెరికాలో వచ్చిన కన్నడ సినీ వసూళ్ళలో అధిక భాగం ఈ చిత్రం సంపాదించినవే. ఇక, ‘ఉప్పి-2’ కూడా 25 చోట్ల విడుదలైంది. ఈ చిత్ర యూనిట్లు అమెరికాలో ఈ ప్రాంతాలు తిరిగి, అక్కడి ప్రేక్షకుల్ని కలిశారు. ఆ పబ్లిసిటీ వసూళ్ళకి తోడ్పడింది. ‘కేరాఫ్ ఫుట్‌పాత్ 2’, ‘మిస్టర్ ఐరావత’, ‘ప్లస్’ లాంటి చిత్రాలు గత ఏడాది బాగా ఆకర్షించాయి. దాంతో, ఈ కొత్త ఏడాది మరిన్ని కన్నడ సినిమాలు ఓవర్సీస్ రిలీజ్‌కు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే, తెలుగు, తమిళాలకు భిన్నంగా కన్నడ సినిమాలు ఇండియాలో రిలీజయ్యాక ఒకటి, రెండు వారాలు ఆలస్యంగా అమెరికాకు వెళుతున్నాయి. -
స్టార్ నటుల యాంకరింగ్‌పై దుమారం
బెంగళూరు: స్టార్ నటులు టీవీ యాంకరింగ్ చేయడంపై కన్నడ సినీమా రంగంలో పెద్ద దుమారం లేచింది. అన్ని భాషల హీరోలు, హీరోయిన్లు ఇటీవల టీవీ యాంకర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శాండల్‌వుడ్ స్టార్లుగా వెలుగొందుతున్న వారు యాంకర్లుగా మారుతుండడంపై కన్నడ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టార్ యాంకర్ల కార్యక్రమాలు వారాంతాల్లో ప్రసారం అవుతుండడంతో థియేటర్లకు రావాల్సిన అభిమానులు టీవీ చూడ్డానికే పరిమితమవుతున్నారని నిర్మాతలు చెబుతున్నారు. యాంకర్లుగా వ్యవహరిస్తున్న స్టార్ నటులను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని నిర్మాతల సంఘం కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలికి ఫిర్యాదు చేసింది. -
'అత్తారింటికి దారి'ని వెతుక్కుంటున్న సుదీప్!
-
మహేష్‌నే ఫాలో అవుతున్న పవర్‌స్టార్!
-
శాండల్‌వుడ్ పిలిచింది.. వాలిపోయింది!