పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర‍్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్‌లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?)
'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది.
మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్' మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స‍్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట‍్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?)
Comments
Please login to add a commentAdd a comment