
రాకింగ్ స్టార్ యష్ 19 చిత్రంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న యష్ తన తదుపరి చిత్రం ప్రకటించడంలో చాలా సమయం తీసుకున్నాడు. ఆయనకు భారీగానే ఆఫర్లు వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ ఫైనల్‌గా తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యశ్.. నువ్వు వెతుకుతున్నదే.. నిన్ను కోరుకుంటుంది' అనే క్యాప్షన్‌ను అక్కడ చేర్చారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రధానంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన కథగా ఉంది.
ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment