Ghost Teaser Telugu: సినిమాపై అంచనాలు పెరగాలంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి చాలా ముఖ్యం. ఈ మధ్య వచ్చిన 'సలార్' టీజర్ బాగుంది. మేం ఒప్పుకొంటాం. కానీ అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేదని బాధ ఫ్యాన్స్‌కి ఇప్పటికీ ఉండిపోయింది. సరే దాని గురించి వదిలేస్తే తాజాగా ఓ డబ్బింగ్ సినిమా టీజర్ రిలీజైంది. దీన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ప్రభాస్ కటౌట్‌కి ఇలాంటి పడాల్సింది అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
సూపర్ టీజర్
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఎంత ఫేమస్ అనేది మీలో చాలామందికి తెలుసు. ఇతడి అన‍్న శివరాజ్ కుమార్ కూడా అక్కడ వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఆయన నటించిన సినిమానే 'ఘోస్ట్'. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ చిత్ర టీజర్ ని శివన్న పుట్టినరోజు సందర‍్భంగా బుధవారం రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)
టీజర్‌లో ఉన్నది ఇదే
ఓ పాడుబడిన బిల్డింగ్ లో ఓ వ్యక్తి. అతడు ప్రాణాలతో కావాలని వాయిస్ ఓవర్‌లో ఓ వ్యక్తి ఆర్డర్. అతడితో జాగ్రత్త అని గన్స్ తో ఉన్నవాళ్లకు హెచ్చరిక. అప్పుడు శివరాజ్ కుమార్ ఎంట్రీ. ఆయుధాలతో ఉన్న వాళ్లు తనని చుట్టుముట్టినా సరే స్టైల్‌గా విస్కీతో పానిపూరీ తింటాడు. ఓ కర్రకి నిప్పి అంటించి దాంతో సిగరెట్ వెలిగిస్తాడు. దాన్ని వెనక్కి విసిరితే కవర్ కాలిపోయి వార్ ట్యాంకర్ బయటపడుతుంది. 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనే డైలాగ్ కూడా బాగుంది.
వేరే హీరో ఉంటే మాత్రం
టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ ఉన్నాయి. కాకపోతే హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇలాంటి టీజర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ హీరోలు ఎవరైనా ఉండుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ ఉండేది. ఇకపోతే 'ఘోస్ట్' చిత్రానికి శ్రీని దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. దసరాకి ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
(ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!)
Comments
Please login to add a commentAdd a comment