‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది.
సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్‌ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్‌ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్.
Comments
Please login to add a commentAdd a comment