ఓటీటీల దెబ్బకు స్టార్ హీరోలు మిడ్ రేంజ్ హీరోలని తేడా లేకుండా పోయింది. ఏదో కొన్ని మూవీస్ మినహా మిగతావన్నీ కూడా నెలలోపే లేదంటే ఐదు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన రెండు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇంతకీ ఏ సినిమా?
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు తెలుసు. పునీత్ రాజ్‌కుమార్‌కి ఇతడు సొంత అన్న. మొన్నీమధ్య రజనీ 'జైలర్'లో గెస్ట్ రోల్ చేసి విజిల్స్ వేయించారు. ఇకపోతే ఈయన హీరోగా నటించిన 'ఘోస్ట్' అనే యాక్షన్ మూవీ.. సెప్టెంబరు 19న కన్నడలో రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో తీసిన ఈ చిత్రం.. తెలుగులో రెండు వారాలు లేటుగా అంటే నవంబరు 4న విడుదలైంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
ఓటీటీలో ఎప్పుడు?
పెద్దగా బజ్ లేకుండానే తెలుగులో రిలీజైన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలీదు. అలా ఇప్పుడు తెలుగులో రిలీజైన రెండు వారాల్లోలోపే అంటే నవంబరు 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ వారం వీకెండ్‌లో ఏదైనా యాక్షన్ మూవీ చూడాలనుకుంటే శివన్న 'ఘోస్ట్' ట్రై చేయొచ్చు.
'ఘోస్ట్' కథేంటి?
వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) సీబీఐ మాజీ అధికారి. 10 ఏళ్లు పోరాటం చేసి కర్ణాటకలోని సెంట్రల్ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు అనుమతి తెచ్చుకుంటాడు. భూమిపూజ కోసం జైల్లో అడుగుపెట్టిన వామన్, అతడి టీమ్‌ని ఓ ముఠా కిడ్నాప్ చేస్తుంది. అయితే వామన్‌ని అదుపులోకి తీసుకున్నది పదేళ్ల క్రితం చనిపోయిన బిగ్ డాడీ(శివరాజ్ కుమార్) అని తెలుస్తుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు? ఆ జైలులోని వెయ్యి కిలోల బంగారం కథేంటి? చివరకు ఏమైందనేదే 'ఘోస్ట్' స్టోరీ.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment