ghost movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చే సినిమాలపై పెద్దగా బజ్ లేదు. కాబట్టి వాటి గురించి కాసేపు అలా పక్కనబెట్టేద్దాం. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అయితే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఆసక్తి రేపుతున్నవన్నీ కూడా డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) ఈ శుక్రవారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే.. చిన్నా, కన్నూరు స్క్వాడ్, ఘోస్ట్ లాంటి డబ్బింగ్ బొమ్మలతో పాటు జెట్టీ, జోతి సినిమాలతో పాటు 'ఫ్లవర్ ఆఫ్ ఈవిల్' అనే ఓ కొరియన్ సిరీస్.. తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఆయా ఓటీటీల్లో ఏయే సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (నవంబరు 17th) అమెజాన్ ప్రైమ్ బాయ్స్ 4 - మరాఠీ సినిమా మాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రం ట్విన్ లవ్ - ఇంగ్లీష్ సిరీస్ బుదాక్ ఫ్లాట్ - మలేషియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) బిహ్తెర్ - టర్కిష్ ఫిల్మ్ (స్ట్రీమింగ్) కంగ్రాట్స్ మై ఎక్స్ - థాయ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద వానిషింగ్ ట్రయాంగిల్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కన్నూర్ స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం చిన్నా - తెలుగు డబ్బింగ్ మూవీ డ్యాషింగ్ త్రూ ద స్నో - ఇంగ్లీష్ సినిమా షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ - ఇంగ్లీష్ చిత్రం జీ5 ఘోస్ట్ - తెలుగు డబ్బింగ్ చిత్రం బ్యాడ్ బాయ్ - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఆల్ టైమ్ హై - ఫ్రెంచ్ సినిమా బిలీవర్ 2 -కొరియన్ మూవీ కోకోమెలన్ లేన్ - ఇంగ్లీష్ సిరీస్ రస్టిన్ - ఇంగ్లీష్ సినిమా స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ - ఇంగ్లీష్ సిరీస్ సీ యూ ఆన్ వీనస్ - ఇంగ్లీష్ మూవీ సుఖీ - హిందీ సినిమా ద డాడ్స్ - ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ ద క్వీన్స్ టౌన్ కింగ్స్ - ఇంగ్లీష్ మూవీ ద రైల్వే మెన్ - హిందీ సిరీస్ వి ఫర్ వెంజెన్స్ - ఇంగ్లీష్ ఫిల్మ్ ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ - జపనీస్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) బెస్ట్ క్రిస్మస్ ఎవర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) ఆహా జెట్టీ - తెలుగు సినిమా జోతి - తమిళ మూవీ ఈ-విన్ ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్ ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ - ఇంగ్లీష్ సిరీస్ బుక్ మై షో డౌన్ లో - ఇంగ్లీష్ మూవీ టి.ఐ.ఎమ్ - ఇంగ్లీష్ సినిమా (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్) -
ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!
దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజైన జపాన్, జిగర్తండ డబుల్ ఎక్స్, టైగర్-3 వచ్చిన సినిమాల సందడి అయిపోయింది. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారంలోనూ థియేటర్లలోకి వచ్చేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో మంగళవారం, మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేందుకు వస్తోన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 సుకీ- (హిందీ సినిమా)నవంబరు 17 రస్టిన్-(ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా
ఓటీటీల దెబ్బకు స్టార్ హీరోలు మిడ్ రేంజ్ హీరోలని తేడా లేకుండా పోయింది. ఏదో కొన్ని మూవీస్ మినహా మిగతావన్నీ కూడా నెలలోపే లేదంటే ఐదు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన రెండు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ ఏ సినిమా? కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు తెలుసు. పునీత్ రాజ్కుమార్కి ఇతడు సొంత అన్న. మొన్నీమధ్య రజనీ 'జైలర్'లో గెస్ట్ రోల్ చేసి విజిల్స్ వేయించారు. ఇకపోతే ఈయన హీరోగా నటించిన 'ఘోస్ట్' అనే యాక్షన్ మూవీ.. సెప్టెంబరు 19న కన్నడలో రిలీజైంది. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తీసిన ఈ చిత్రం.. తెలుగులో రెండు వారాలు లేటుగా అంటే నవంబరు 4న విడుదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) ఓటీటీలో ఎప్పుడు? పెద్దగా బజ్ లేకుండానే తెలుగులో రిలీజైన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలీదు. అలా ఇప్పుడు తెలుగులో రిలీజైన రెండు వారాల్లోలోపే అంటే నవంబరు 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ వారం వీకెండ్లో ఏదైనా యాక్షన్ మూవీ చూడాలనుకుంటే శివన్న 'ఘోస్ట్' ట్రై చేయొచ్చు. 'ఘోస్ట్' కథేంటి? వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్) సీబీఐ మాజీ అధికారి. 10 ఏళ్లు పోరాటం చేసి కర్ణాటకలోని సెంట్రల్ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు అనుమతి తెచ్చుకుంటాడు. భూమిపూజ కోసం జైల్లో అడుగుపెట్టిన వామన్, అతడి టీమ్‌ని ఓ ముఠా కిడ్నాప్ చేస్తుంది. అయితే వామన్ని అదుపులోకి తీసుకున్నది పదేళ్ల క్రితం చనిపోయిన బిగ్ డాడీ(శివరాజ్ కుమార్) అని తెలుస్తుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు? ఆ జైలులోని వెయ్యి కిలోల బంగారం కథేంటి? చివరకు ఏమైందనేదే 'ఘోస్ట్' స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
దీపావళి పండగ అయిపోయింది. కార్తీకమాసం కూడా వచ్చేసింది. రోజురోజుకీ చలి పెరుగుతోంది. దీంతో మూవీ లవర్స్ ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లే థియేటర్లలో 'మంగళవారం', 'సప్తసాగరాలు దాటి సైడ్-బి' లాంటి సినిమా కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 31 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. ఎప్పటిలానే ఈ వారం 31 సినిమాలు-సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఈ లిస్టులో 'లియో', 'కన్నూరు స్క్వాడ్', 'చిన్నా', 'ద ఫ్లాష్' చిత్రాలు.. చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటు 'సుఖి', 'అపూర్వ' మూవీస్‌తో పాటు 'ద రైల్వే మెన్' వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 13-19th వరకు) అమెజాన్ ప్రైమ్ ట్రెవార్ వల్లాస్: టెరోడాక్టల్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - నవంబరు 14 కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్ క్రిమినల్ కోడ్ (పోర్చుగీస్ సిరీస్) - నవంబరు 14 హౌ టూ బికమ్ ఏ మాబ్ బాస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 14 సబర్అటేర్నా (ఇటాలియన్ సిరీస్) - నవంబరు 14 క్రాషింగ్ ఈద్ (అరబిక్ సిరీస్) - నవంబరు 15 బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 18 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అపూర్వ (హిందీ సినిమా) - నవంబరు 15 చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 జియో సినిమా ద ఫ్లాష్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 15 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 -
Ghost Movie Review : ‘ఘోస్ట్’మూవీ రివ్యూ
టైటిల్: ఘోస్ట్ నటీనటులు: శివరాజ్ కుమార్, జయరామ్, అనుపమ్ ఖేర్, అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, సత్య ప్రకాశ్, అభిజీత్ తదితరులు నిర్మాత: సందేశ్ నాగరాజ్ దర్శకత్వం: ఎంజీ శ్రీనివాస్ సంగీతం: అర్జున్ జన్యా సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహా విడుదల తేది: నవంబర్ 4, 2023 కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌కి తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. పలు తెలుగు సినిమాల్లో అతిథి పాత్ర చేశారు. ఇటీవల రజనీకాంత్ ‘జైలర్’లో కూడా మెరిశాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఘోస్ట్’. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో రిలీజైన ఈ చిత్రం..నేడు(నవంబర్ 3) అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వామన్ శ్రీనివాస్(ప్రశాంత్ నారాయణన్) సీబీఐ మాజీ అధికారి. పదేళ్లుగా పోరాటం చేసి జైళ్ల ప్రైవేటీకరణ బిల్లుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటాడు. భూమి పూజ చేయడానికి వెళ్లిన వామన్..అతన్ని మనుషులను ఓ ముఠా కిడ్నాప్ చేసి, అదే జైలులో ఉన్న మరో టవర్‌లో బందీ చేస్తుంది. ఈ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేక అధికారి చరణ్ రాజ్(జయరామ్) రంగంలోకి దిగుతాడు. వామన్ గ్యాంగ్‌ని బందీ చేసింది బిగ్డాడీ(శివరాజ్ కుమార్)అని చరణ్ తెలుసుకుంటాడు. అసలు బిగ్డాడీ ఎవరు? జైలులోనే వామన్ని ఎలా కిడ్నాప్ చేశాడు? ఎందుకు చేశాడు? జైలులో ఉన్న 1000 కేజీల బంగారం కథేంటి? ఈ కథలో అనుపమ్ ఖేర్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఘోస్ట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కేజీయఫ్ తర్వాత గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రాలు ఎక్కువ అయ్యాయి. టాలీవుడ్లోనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలోనూన ఈ తరహా చిత్రాలే వస్తున్నాయి. ఘోస్ట్ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రమే. చివరల్లో స్పై థ్రిల్లర్ టచ్ ఇచ్చారు అంతే. కథ, కథనాలను పట్టించుకోవకుండా.. కేవలం మాస్ ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలు మధ్యలో ఓ సీబీఐ మాజీ అధికారిని హీరో గ్యాంగ్ కిడ్నాప్ చేయడం.. అతన్ని అడ్డుగా పెట్టుకొని ప్రభుత్వంతో తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం.. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమా కథ ఇంతే. అయితే ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉండాలి. పోలీసులకు, హీరో గ్యాంగ్ మధ్య జరిగే వార్తో పాటు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆడే మైండ్ గేమ్.. చాలా ఉత్కంఠ భరితంగా అనిపించాలి. కానీ ఘోస్ట్ విషయం అది మిస్ అయింది. ప్రతిసారి కథ పదేళ్ల వెనక్కి వెళ్లడం..మళ్లీ ప్రస్తుతానికి రావడం.. ఇబ్బందికరంగా మారుతుంది. శివరాజ్‌కుమార్‌ని ఎలివేట్ చేసే సీన్స్ మాత్రం ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. వామన్‌ను బిగ్డాడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసే భారీ యాక్షన్ సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారి చరణ్ రాజ్ రంగంలోకి దిగాక కథలో వేగం పుంజుకుంటుంది. అయితే పోలీసులకు, హీరో గ్యాంగ్‌కు మధ్య జరిగే మైండ్ గేమ్ అంత ఆసక్తికరంగా సాగదు. ప్రధాన పాత్రల ఫ్లాష్ బ్యాక్‌ని కొంచెం కొంచెంగా చూపిస్తూ.. అసలు విషయం ఏంటో చెప్పకుండా గందరగోళానికి గురిచేశారు. కథంతా జైలు గోడమధ్యే తిరుగుతూ.. ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. పైగా మహిళా జర్నలిస్ట్.. ఆమె తండ్రికి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోవడమే కాకుండా..అనవసరం అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. బిగ్డాడీ నేపథ్యం ఏంటి? వామన్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? జైలులో ఉన్న 1000 కేజీల బంగారంతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలన్నీంటికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుంది. అయితే ద్వితియార్థంలో కూడా హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమంత్రి కొడుకుని హీరో చంపేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో చరణ్ రాజ్‌కు బిగ్డాడీ ఇచ్చే వార్నింగ్ సీన్ కూడా అదిరిపోతుంది. యాక్షన్ పరంగా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. కానీ కథ,కథనంలో పసలేదు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కథకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. సీక్వెల్ కోసమే అనట్లుగా పలు ప్రశ్నలు లేవనెత్తి.. అసంతృప్తిగా సినిమాను ముగించారు. ఎవరెలా చేశారంటే.. ఇది పక్కా శివరాజ్ కుమార్ చిత్రం. దర్శకుడు ఆయనను దృష్టిలో పెట్టుకొనే కథను రాసుకుని ఉంటాడు. కొన్ని స్టైలీష్ యాక్షన్ సీన్స్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. సినిమా క్లైమాక్స్‌లో టెక్నాలజీ ద్వారా శివరాజ్‌ని యంగ్‌గా చూపించడం అభిమానులను అలరిస్తుంది. పోలీసు అధికారి చరణ్‌రాజ్ పాత్రలో జయరామ్ ఒదిగిపోయాడు.. వామన్ శ్రీనివాసన్ పాత్రలో ప్రశాంత్ నారాయణన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. అర్జున్ జన్యా నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
ఘోస్ట్ ట్రైలర్ విడుదల చేసిన రాజమోళి.. విధ్వంసం సృష్టించిన శివన్న
కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. తాజాగా భారత అగ్రదర్శకుడు రాజమౌళి దీనిని విడుదల చేశారు. శివన్న నటించిన ఘోస్ట్ ట్రైలర్ అద్భుతంగా ఉందని ఆయన కితాబు ఇచ్చారు.'బీర్బల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజు తన సందేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. (ఇదీ చదవండి: ఆ కారణంతో నాన్న మద్యానికి బానిసయ్యారు: స్టార్ హీరోయిన్) హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్,మొదటి పోస్టర్‌తోనే శివన్న భారీ అంచనాలు పెంచేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆయన విధ్వంసమే క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని ఘోస్ట్ మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో శివరాజ్‌కుమార్ నటన, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులోని డైలాగ్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. కొన్నీ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా డైరెక్టర్ క్రియేట్ చేశాడు. యుద్దం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం.. ఇలాంటి యుద్దాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే.. అవి చేసే నష్టాలే ఎక్కువ అనే డైలాగ్‌తో పాటు సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండవచ్చు కానీ.. విధ్వంసం సృష్టించే నా లాంటి వాడ్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు అంటూ.. శివరాజ్ కుమార్ చెప్పే డైలాగ్ అందరికీ బాగా రిజిస్టర్ అవుతుంది. -
దుమ్మురేపుతున్న 'ఘోస్ట్' సాంగ్.. ఆ రోజే సినిమా రిలీజ్!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ 'ఘోస్ట్'. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఆన్ యాక్షన్ ఫీస్ట్‌గా తీస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఒరిజినల్ గ్యాంగస్టర్ మ్యూజిక్ వీడియో విడుదల చేశారు. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటని విడుదల చేశారు. శివరాజ్ కుమార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీపై అంచనాలు పెంచుతోంది. అనుపమ్ ఖేర్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అర్జున్ జన్య సంగీతమందించారు. ఇకపోతే ఈ మధ్య 'జైలర్'లో గెస్ట్ అప్పీయరెన్స్‌తో దుమ్ములేపిన శివన్న.. పూర్తిస్థాయిలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటారో చూడాలి. (ఇదీ చదవండి: అనసూయ సోయగాలు.. విష్ణుప్రియ గ్లామర్ షో!) -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ అక్టోబర్‌లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
టీజర్ సూపర్ ఉంది కానీ ఆ ఒక్కటే!
Ghost Teaser Telugu: సినిమాపై అంచనాలు పెరగాలంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి చాలా ముఖ్యం. ఈ మధ్య వచ్చిన 'సలార్' టీజర్ బాగుంది. మేం ఒప్పుకొంటాం. కానీ అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేదని బాధ ఫ్యాన్స్‌కి ఇప్పటికీ ఉండిపోయింది. సరే దాని గురించి వదిలేస్తే తాజాగా ఓ డబ్బింగ్ సినిమా టీజర్ రిలీజైంది. దీన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ప్రభాస్ కటౌట్‌కి ఇలాంటి పడాల్సింది అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి? సూపర్ టీజర్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఎంత ఫేమస్ అనేది మీలో చాలామందికి తెలుసు. ఇతడి అన్న శివరాజ్ కుమార్ కూడా అక్కడ వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఆయన నటించిన సినిమానే 'ఘోస్ట్'. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ చిత్ర టీజర్ ని శివన్న పుట్టినరోజు సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) టీజర్లో ఉన్నది ఇదే ఓ పాడుబడిన బిల్డింగ్ లో ఓ వ్యక్తి. అతడు ప్రాణాలతో కావాలని వాయిస్ ఓవర్లో ఓ వ్యక్తి ఆర్డర్. అతడితో జాగ్రత్త అని గన్స్ తో ఉన్నవాళ్లకు హెచ్చరిక. అప్పుడు శివరాజ్ కుమార్ ఎంట్రీ. ఆయుధాలతో ఉన్న వాళ్లు తనని చుట్టుముట్టినా సరే స్టైల్‌గా విస్కీతో పానిపూరీ తింటాడు. ఓ కర్రకి నిప్పి అంటించి దాంతో సిగరెట్ వెలిగిస్తాడు. దాన్ని వెనక్కి విసిరితే కవర్ కాలిపోయి వార్ ట్యాంకర్ బయటపడుతుంది. 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనే డైలాగ్ కూడా బాగుంది. వేరే హీరో ఉంటే మాత్రం టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సూపర్ ఉన్నాయి. కాకపోతే హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇలాంటి టీజర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ హీరోలు ఎవరైనా ఉండుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ ఉండేది. ఇకపోతే 'ఘోస్ట్' చిత్రానికి శ్రీని దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. దసరాకి ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!) -
ప్రతి సినిమా ఓ చాలెంజ్.. మా మధ్య ఎలాంటి పోటీ లేదు: నాగార్జున
‘‘నేను సినిమాల్లోకి వచ్చి 36 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొంచెం నెర్వస్‌గా ఫీలవుతుంటాను. ప్రతి సినిమాని సవాల్‌గా భావిస్తాను. ఒక సినిమాకి ఏడాదికి పైగా పని చేస్తాం కాబట్టి మంచి కథ ఎంచుకున్నానా? లేదా అని ఆలోచిస్తాను. షూటింగ్లో ప్రతి రోజూ చాలెంజ్‌గానే ఉంటుంది’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు.. ►‘గరుడవేగ’ సినిమా చూసి, ప్రవీణ్ సత్తారుని పిలిచి, ఓ మంచి సినిమా చేద్దామన్నాను. యాక్షన్ ఎంటర్టైనర్ చేద్దామని తను చెప్పాడు. అందరూ అదే జానర్లో చేస్తున్నారు.. మనం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేద్దాం అన్నాను. మూడు నాలుగు నెలలు సమయం తీసుకుని ‘ది ఘోస్ట్’ కథ రాసుకొచ్చాడు ప్రవీణ్. కథ వినగానే అద్భుతంగా అనిపించడంతో ఓకే చెప్పాను. ►‘ది ఘోస్ట్’ పెద్ద కథ, అద్భుతాలు సష్టిస్తుందని చెప్పను.. కానీ చాలా మంచి కుటుంబ కథ. ‘శివ’ సినిమాలో ఫ్యామిలీ డ్రామా బాగా వర్కవుట్ అయింది. ‘ది ఘోస్ట్’లోనూ అలాగే ఉంటుంది. ఆపదలో ఉన్న సోదరిని కాపాడే పాత్ర చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇది యాక్షన్ ఫిల్మ్ అయినా ఎమోషన్ బాగా సెట్ అయింది. ఈ కథని ప్రవీణ్ చాలా కొత్తగా తీశాడు. ఫైనల్ కాపీ చూశాక నేనే షాక్ అయ్యాను. తన స్టోరీ ప్రజెంటేషన్ కి ఇంప్రెస్ అయ్యాను. ►‘ది ఘోస్ట్’ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం ఉంది.. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నాం. ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ చాలా ముఖ్యం. రిలీజ్‌కి ముందు మనం ఒక హైప్ క్రియేట్ చేయాలి. సినిమా రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ మన చేతుల్లో ఉండదు.. మూవీ బాగుంటే మౌత్ టాక్‌తో అందరికీ దగ్గరవుతుంది. ►పండగ సమయాల్లో రెండు పెద్ద సినిమాలు విడుదలఅయినా ప్రేక్షకులు చూస్తారు. చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, నా ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అవడం హ్యాపీ. మా ఇద్దరి సినిమాలు గతంలో రెండు మూడు రోజుల తేడాతో విడుదలయ్యాయి.. కానీ, ఇన్నేళ్లలో ఒకే రోజు విడుదల కావడం ఇదే మొదటిసారి. అయినా ఎలాంటి పోటీ లేదు.. రెండూ బాగా ఆడాలి. ►‘ది ఘోస్ట్’లో నేను, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా చేశాం. నాతో పాటు సోనాల్ యాక్షన్ సీక్వెన్స్ చేసింది.. ఇందుకోసం రెండు మూడు వారాలు శిక్షణ తీసుకుని అద్భుతంగా చేసింది. ‘శివ’ సినిమా రిలీజ్ తర్వాత సౌండ్ డిజైనింగ్ బాగుందని అందరూ అన్నారు. ‘ది ఘోస్ట్’ ప్రీమియర్ చూసినవారు సినిమా చాలా బాగుందని, ప్రత్యేకించి సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉందని చెప్పడంతో సినిమా విజయంపై మా నమ్మకం మరింత పెరిగింది. ►నా ‘శివ’ చిత్రాన్ని 4కేలోకి మార్చి రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం.. అందుకు సమయం పడుతుంది. ఇటీవల సినిమాకి బౌండరీలు లేకపోవడం శుభపరిణామం. ‘ఆర్ఆర్ ఆర్’ చిత్రాన్ని జపాన్ లో దాదాపు వెయ్యిమంది పట్టే ఓ థియేటర్లో నిల్చొని చూడటం గొప్ప విషయం. ‘ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, కార్తికేయ 2’ చిత్రాల్లో గ్రాఫిక్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంది. అయితే గ్రాఫిక్స్ కూడా ప్రేక్షకులు ఒరిజినల్లా భావించేలా ఉండాలి.. అంతేకానీ గ్రాఫిక్స్ అనుకునేలా ఉండకూడదు. ►నాగచైతన్యతో కలిసి ‘మనం, బంగార్రాజు’ సినిమాలు చేశాను. అఖిల్‌తో ఓ సినిమా చేద్దామనుకున్నాను. తనకి యాక్షన్ అంటే ఇష్టం.. అందుకే యాక్షన్ డ్రామా నేపథ్యంలో మా కాంబినేషన్ ఉంటుంది. ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో అమల చేసిన తల్లి పాత్ర అద్భుతంగా ఉంది.. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ‘బ్రహ్మాస్త్రం’లో నా పాత్ర నిడివి తక్కువ అయినా మంచి పేరొచ్చింది. ‘బ్రహ్మాస్త్రం 2’లో నేను ఉంటానో? లేదో తెలియదు. వరుసగా సినిమాలు చేస్తున్నాను.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని తర్వాతి సినిమా మొదలు పెడతాను. రెండు మూడు కథలు చర్చల్లో ఉన్నాయి. -
మిడిల్‌క్లాస్ వాళ్లకోసమే.. ఘోస్ట్ టికెట్ రేట్లు తగ్గించాం: నిర్మాత
‘‘వందకి ఎనభైశాతం మంది మధ్యతరగతి ప్రేక్షకులే సినిమాలు చూస్తారు. వారు లేకుంటే ఇండస్ట్రీ లేదు.. అందుకే మిడిల్‌క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకునే ‘ది ఘోస్ట్’ టికెట్ ధరలు నిర్ణయించాం’’ అని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సునీల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘నాన్నగారితో(నారాయణ్ దాస్) ఉన్న అనుబంధంతో నాగార్జునగారు ఈ సినిమా చేసినందుకు థ్యాంక్స్. ప్రవీణ్ సత్తారు అద్భుతంగా తీశాడు. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు.. రెండు వారాల తర్వాత ఓటీటీలో వస్తుందని అనుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో టికెట్ ధర పెట్టి సినిమా చూసేందుకు ఇష్టపడటం లేదు. సినిమా చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లడం లేదు. అలాగే టికెట్, క్యాంటీన్లో ధరలు కూడా తగ్గితే చిన్న సినిమాకి కూడా ప్రేక్షకులు మునుపటిలా థియేటర్‌కి వస్తారు. ఓటీటీని నియంత్రించాలనే చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. పుస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ– ‘‘గ్రేట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. నాగార్జున కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రమిది. సంక్రాంతిలానే దసరా కూడా సినిమా పండగ. రెండు పెద్ద చిత్రాలు (గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్) రావడం ప్రేక్షకులకు సినిమా పండగలా ఉంటుంది. మా సినిమా తొమ్మిదిరోజులు బాగా ఆడితే చాలు.. ఈ నెల 14వ తారీఖు వరకూ.. ఇక నాగార్జునగారి ట్రెండ్ సెట్టర్ ‘శివ’ కూడా అక్టోబర్ 5 విడుదలయింది. ఆ సెంటిమెంట్ ప్రకారం అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం మా బ్యానర్లో రూపొందిన ‘ప్రిన్స్’ దీపావళికి విడుదలవుతుంది. సందీప్ కిషన్‌తో ఓ సినిమా, సుధీర్ బాబుతో ఒక మూవీ, శేఖర్ కమ్ముల– ధనుష్ కాంబోలో ఓ చిత్రం చే స్తున్నాం. అలాగే వెంకటేష్‌గారితో ఒక సినిమా ఉంటుంది’’ అన్నారు. -
‘ఘోస్ట్’గా శివరాజ్ కుమార్.. ఫస్ట్‌లుక్ అదిరింది!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఘోస్ట్’. హైయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేడు(జులై 12) శివరాజ్ కుమార్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘ఘోస్ట్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విడుదల చేశారు. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్... వీటితో డిజైన్ చేసిన పోస్టర్ చూస్తే.. ఇది భారీ యాక్షన్ చిత్రమని తెలిసిపోతుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తగరు, సలగ చిత్రాలకు మాటలందించిన మస్తీ, కన్నడ చిత్రాల్లో అత్యుత్తమ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పుకునే బీర్బల్ కి సంభాషణలు రాసిన ప్రసన్న వి ఎం 'ఘోస్ట్' కి డైలాగ్స్ రాస్తున్నారు. కేజీయఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.ఆగస్ట్ చివరి వారంలో 'ఘోస్ట్' చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఊటీలో ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్
‘ఘోస్ట్’ ఆపరేషన్ ఊటీకి షిఫ్ట్ అయ్యింది. ఈ ఆపరేషన్ రిజల్ట్స్‌ను వెండితెరపై చూసేందుకు మాత్రం కాస్త టైమ్ ఉంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘోస్ట్’. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తున్నారు. నారాయణ్‌దాస్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, సోనాలీ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపిస్తారు. ఇటీవలే దుబాయ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసింది ‘ఘోస్ట్’ టీమ్. తాజాగా ఊటీలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభించారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు. నాగార్జున, సోనాల్ షూటింగ్లో పాల్గొంటున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చల్లగుళ్ల వెంకటేశ్వరరావు. -
150 అడుగుల ఎత్తులో ఎగిరిపడిన కారు!
-
‘ఘోస్ట్’కోసం నాగార్జున స్టంట్.. 150 అడుగుల ఎత్తులో ఎగిరిపడిన కారు!
తమిళనాడులోని కూనూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తుటుర్మట్టం ప్రాంతంలో ఓ కారు 150 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. భారీ శబ్దంతో దొర్లుకుంటూ పక్కనున్న తేయాకు తోటలో పడిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న కూలీలు హడలిపోయారు. భయంతో పరుగులు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా అసలు విషయం తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. అసలు ఏం జరిగిదంటే.. కింగ్ నాగార్జున హీరోగా ‘ఘోస్ట్’అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని కూనూర్‌లో జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ సీన్‌కి సంబంధించి షూటింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కారుని గాల్లోకి లేపారు. అది 150 ఎత్తుకు లేచి పక్కనే ఉన్న తేయాకు తోటలో పడిపోయింది. ఇది నిజమైన ప్రమాదమే అనుకొని అక్కడున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. అంతేకాదు వెంటనే పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. పోలీసులు విచారణ చేయగా.. అసలు విషయం భయటపడింది. దీంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఘోస్ట్ సినిమా విషయానికొస్తే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇటీవల దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హైలైట్‌గా ఉండనున్నాయట. -
Ghost Movie:‘చందమామ’ ఔట్.. సోనాల్ ఇన్!
కింగ్ నాగార్జున సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒక చిత్రం బంగార్రాజు.. సంక్రాంతికే రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది.మరో మూవీ ఘోస్ట్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ టీమ్ హీరోయిన్ ను ఫిక్స్ చేసేందుకు ఇబ్బందులు పడుతోంది. ఈ మూవీకి తొలుత హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత చందమామ పర్సనల్ రీజన్స్ తో తప్పుకుంది. ఆమె స్థానంలో మరో కథానాయికను ఎంపిక చేసేందుకు యూనిట్ చాలా ఇబ్బందులు పడుతోంది. కాజల్ తప్పుకోవడంతో త్రిష పేరు తెరపైకి వచ్చింది. అయితే అది పుకారుగానే మిగిలిపోయింది. రీసెంట్ గా అమలా పాల్, మెహరీన్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ, చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కింగ్‌తో జోడీ కట్టేందుకు రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండ్, పండగ చేస్కో, షేర్, డిక్టేటర్ చిత్రాల్లో కనిపించిన సోనాల్ చౌహాన్ ‘ఘోస్ట్’లో నటించబోతుదంట. ఇప్పటికే ఆమె వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3లో ఒక కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఘోస్ట్ లో నాగ్ కు జోడీగా నటించే అవకాశం అందుకుందంట. -
నటి అంజలి ఇంట్లో దెయ్యం
టీనగర్: నటి అంజలి దెయ్యం భయంతో తానుంటున్న ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి చేరడం సంచలనం కలిగించింది. తమిళ, తెలుగు చిత్రాల్లో అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివశిస్తూ వచ్చారు. నాగార్జున కుమారుడు నటుడు నాగచైతన్య ఇంటి సమీపంలో ఈమె ఇల్లు కూడా ఉండేది. ఇటీవలి కాలంగా అంజలి ఇంటి సమీపంలో పిల్లులు అధిక సంఖ్యలో సంచరించినట్లు, రాత్రి సమయాల్లో వింతవింత శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. దీంతో అంజలి భయాందోళనలకు గురైంది. తెలుగులో గీతాంజలి అనే దెయ్యం చిత్రంలో ఆమె నటించారు. ఆ చిత్రంలోని సంఘటనలాగే ఇది ఉన్నట్లు భావించారు. తన ఇంట్లో ఒకవేళ దెయ్యం సంచరిస్తుందేమో అని భావించిన ఆమె హఠాత్తుగా ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంట్లో చేరారు. త్వరలో సొంతగా హైదరాబాద్‌లో ఒక బంగళా, లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు అంజలి నిర్ణయించారు. ప్రస్తుతం జైకు జంటగా బెలూన్ చిత్రంలో నటించారు. అంజలి, జై ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. -
దెయ్యం సినిమాకి చావుపీడ!
* అది ఒక హారర్ సినిమా. * చూసినవాళ్లను భయపెట్టింది. * చేసినవాళ్లను హడలెత్తించింది. యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 1982... గడియారపు ముళ్లు పన్నెండున్నరను దాటి ఒంటిగంట వైపు పరుగులు తీస్తు న్నాయి. జోబెత్ విలియమ్స్‌కి నిద్ర పట్టట్లేదు. దిండ్లు ఎత్తుగా వేసుకుని, మంచమ్మీద వెనక్కి వాలింది. వెచ్చగా రగ్గు కప్పుకుని ఏదో నవల చదువుకుం టోంది. చదివితే నిద్ర వస్తుందనుకుంది. కానీ నవల ఆసక్తికరంగా ఉండటంతో ఉన్న కాస్త మత్తు కూడా మెల్లమెల్లగా దూరమవుతోంది. ఇంకా రెండు పేజీలు మిగిలి వున్నాయి. అవి కూడా చదివేస్తే పడుకో వచ్చు. జోబెత్ కళ్లు అక్షరాల వెంట పరు గులు పెడుతున్నాయి. అంతలో... ఎక్కడో ఏదో అలికిడి. చదవడం ఆపి అటూ ఇటూ చూసింది జోబెత్. ఆ అలికిడికి కారణమే మిటో అర్థం కాలేదు. మళ్లీ పుస్తకంలో తలదూర్చింది. కానీ చదవలేకపోయింది. ఎందుకంటే... మళ్లీ ఏదో అలికిడి. ఈసారి పుస్తకాన్ని మూసి శ్రద్ధగా వినసాగింది. టప్... టప్... టప్... అడుగుల సవ్వడిలా అనిపిస్తోంది. ఆ సవ్వడి దూరం నుంచి తనకు దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఎవరది? ఇంట్లో ఎవ్వరూ లేరు. ఉన్నదల్లా తనొక్కతే. మరి ఇంకెవరు నడుస్తున్నారు? అది కూడా ఇంత అర్ధరాత్రి సమయంలో! గమనించుకోలేదు కానీ అప్పటికే జోబెత్ శరీరం చెమటతో తడిసి ముద్ద య్యింది. భయంతో కాళ్లు, చేతులు వణుకుతున్నాయి కూడా. పుస్తకం పక్కన పడేసింది. తనకేమీ కనిపించకూడదని, తాను ఎవరికీ కనిపించకూడదని దుప్పటి ముఖం మీదకంటా కప్పేసుకుంది. కానీ ఫలితం లేదు. ఆ శబ్దం వినిపిస్తూనే ఉంది. అది తనని మరింత సమీపిస్తోంది. వణికిపోతోంది జోబెత్. భయాన్ని అణచుకోలేక దుప్పటిని ఇంకా ఇంకా గట్టిగా చుట్టేసుకుంటోంది. కానీ అంతలో ఆమె ఊహించనిది జరిగింది. దుప్పటిని ఎవరో గట్టిగా లాగేశారు. ఉలిక్కిపడింది జోబెత్. ఎవరది? ఎవరు అలా చేసింది? కళ్లు తెరిచే ధైర్యం లేదు. కానీ తెరవక తప్పలేదు. ఎందుకంటే... ఎవరో తనని పిలుస్తున్నారు. ‘‘జోబెత్... జోబెత్... కళ్లు తెరు. నన్ను చూడు.’’ జోబెత్ గుండెలు అదురుతున్నాయి. రెప్పల మాటున కనుగుడ్లు భయంతో అటూ ఇటూ కదులుతున్నాయి. మెల్లగా కళ్లు తెరించింది. చూస్తే ఎదురుగా ఓ వృద్ధురాలు. తెల్లని దుస్తులు... తెల్లని మేనిఛాయ... తెల్లని జుత్తు... చూడటానికే భయంకరంగా ఉంది. పైగా తనని చూసి వికృతంగా నవ్వుతోంది. అంతే... కెవ్వున కేక పెట్టింది జోబెత్. కళ్లు మూసేసుకుని అరుస్తూనే ఉంది... ఎవరో ఆమెను పట్టి, కుదిపి, లేపేవరకూ. ఉలిక్కిపడి లేచి కూర్చుంది జోబెత్. ఎదురుగా పనిమనిషి. ‘‘ఏమైంది మేడమ్. ఎందుకలా అరుస్తున్నారు? పీడకలేమైనా వచ్చిందా?’’... కంగారుగా అడిగిందామె. అప్పటికి కాస్త తేరుకుంది జోబెత్. అంటే ఇప్పటివరకూ జరిగినదంతా కలా? తాను పుస్తకం చదువుకోవడం... అడుగుల సవ్వడి వినబడటం... ఆపైన దెయ్యం తన దగ్గరకు రావడం... తాను భయంతో అరవడం... ఇవేవీ నిజం కాదా? ‘‘చూడండి మేడమ్ ఎంత పొద్దెక్కి పోయిందో. లేచి ఫ్రెష్ అవ్వండి. ఏదో పీడకల కన్నట్టున్నారు మర్చిపోండి’’... పనమ్మాయి నిర్థారించేసింది. అప్పటికి జోబెత్కి కూడా అర్థమైపోయింది... అదంతా కలేనని. గబగబా నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంది. నైట్ గౌన్ సర్దుకుని లేవబోతూ ఎందుకో ఎదురుగా ఉన్న గోడవైపు చూసి అవాక్కయ్యింది. ‘‘అదేంటి? ఆ ఫొటోలు, పెయింటింగ్స్ అన్నీ అలా తిరగబడిపోయాయ్’’ అంది పనమ్మాయి వైపు చూస్తూ. ‘‘గాలికి తిరబడి ఉంటాయిలెండి మేడమ్. దానికి కూడా కంగారు పడతా రేంటి’’ అంటూ వెళ్లి అన్నిటినీ సరి చేసి వెళ్లిపోయిందా అమ్మాయి. కానీ జోబెత్ మాత్రం అంత తేలికగా తీసుకోలేక పోయిందా విషయాన్ని. ఎందుకంటే ఇది ఇవాళ జరిగింది కాదు. కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. అది కూడా తాను ‘పోల్టర్‌గైస్ట్’ సినిమాలో నటించడం మొదలు పెట్టినప్పట్నుంచే జరుగుతోంది. రోజూ నిద్ర లేచేటప్పటికి, షూటింగు నుంచి ఇంటికొచ్చేసరికి తన గదిలో ఉన్న ఫొటోలు, పెయింటింగ్‌లు తిరగబడి పోతున్నాయి. ఎన్నోసార్లు సరి చేస్తోంది. కానీ ఇవాళ కూడా అదే జరిగింది. పైగా రోజూ పీడకలలు. ఏవేవో శబ్దాలు విన పడుతున్నట్టు, ఆకారాలు కనబడుతు న్నట్టు, ఎవరో వెంటాడుతున్నట్టు ఫీలింగ్. ఇక ఆలస్యం చేయకూడదనుకుంది. ఆ రోజు షూటింగ్ స్పాట్‌కి వెళ్లగానే దర్శ కుడు టోబ్ హూపర్తో అంతా చెప్పింది. కానీ అతడు సీరియస్‌గా తీసుకోలేదు. పైగా నవ్వాడు. హారర్ సినిమాల్లో నటి స్తున్నప్పుడు ఇలాంటి భయాలు కలగడం మామూలే లైట్ తీసుకోమన్నాడు. అదే అతడు చేసిన తప్పు. ఆరోజే జోబెత్ చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే... ఎన్నో అనర్థాలు జరగకుండా ఆగేవి. ఎన్నో ప్రాణాలు పోకుండా నిల బడేవి. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది?! సినిమా అంటేనే కల్పన. ఓ అంద మైన కథను అల్లి, అందరినీ అలరించేం దుకు తగిన అంశాలను ఆ కథలో మేళ వించి తెరకెక్కిస్తాడు దర్శకుడు. కొన్నిసార్లు వాటిలోని సన్నివేశాలు నిజ జీవితాన్ని ప్రతిబింబించవచ్చు. కొన్నిసార్లు అందు లోని పాత్రల స్వభావాన్ని పోలిన వ్యక్తులు మనకు తారస పడవచ్చు. కానీ సినిమా కోసం సృష్టించిన ప్రేతాత్మలు, దెయ్యాలు వెంటపడితే? అవి తమను శపిస్తే? అంత వరకూ ఆనందంగా సాగిపోతోన్న జీవితాలను చిన్నాభిన్నం చేసి పారేస్తే? చివరకు ప్రాణాలను సైతం హరిస్తే? వినడానికే భయంగా ఉంది కదూ! కానీ 1982లో విడుదలైన ‘పోల్టర్‌గైస్ట్’ అనే హాలీవుడ్ సినిమా అలాంటి భయోత్పా తాన్ని కలిగించింది. ఇప్పటివరకూ హాలీవుడ్లో వచ్చిన హారర్ చిత్రాల్లో ‘పోల్టర్‌గైస్ట్’ది ముఖ్య స్థానమే. స్టీవెన్ స్పీల్బర్గ్ కథ, కథనాలను అందించిన ఆ చిత్రం మూడు పార్టులుగా తెరకెక్కి విజయం సాధించింది. ఎందరో ఆ సినిమా చూసి హడలిపోయారు. ఓ మంచి హారర్ సినిమాను చూసినందుకు సంతోష పడ్డారు. కానీ ఆ సినిమాల కోసం పని చేసినవారు మాత్రం ఆనందించలేక పోయారు. ఆ విజయాన్ని ఆస్వాదించలేక పోయారు. ఎందుకంటే... ఆ సినిమాలకి పని చేసిన తర్వాత వాళ్లందరి జీవితాల్లోని సంతోషం ఆవిరైపోయింది. ‘పోల్టర్‌గైస్ట్’లో ‘డానా ఫ్రీలింగ్స’ పాత్రలో నటించిన డొమినిక్ డ్యూన్ మరణంతో మొదలయ్యింది అసలు కథ. 1982లో ఆ చిత్రం తొలి భాగం విడుదలైన కొద్ది రోజులకే ఇరవై రెండేళ్ల డొమినిక్ తన శాడిస్టు ప్రియుడు జాన్ స్వీనీ చేతిలో హత్యకు గురయ్యింది. ఆమె మరణం చిత్ర టీమ్‌నే కాదు, యావత్ దేశాన్నీ షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత వరుసగా అలాంటి షాకులు తగులుతూనే ఉన్నాయి. ‘పోల్టర్‌గైస్ట్’ మూడు భాగాల్లోనూ ప్రధాన పాత్రధారి... హీథర్ రూర్కీ. మొదటి భాగంలో నటించేనాటికి హీథర్ వయసు ఏడేళ్లు. మూడో భాగంలో నటించే నాటికి పన్నెండేళ్లు. పార్ట్ 1లో నటిస్తున్న ప్పుడే హీథర్ అనారోగ్యం పాలయ్యింది. డాక్టర్లు ఫ్లూ అన్నారు. చికిత్స చేసినా తరచూ ఏవేవో ఇబ్బందులు తలెత్తేవి. 1988లో ‘పోల్టర్‌గైస్ట్ 3’ విడుదలకు సరిగ్గా పది రోజుల ముందు ఉన్నట్టుండి వాంతులు మొదలయ్యాయి హీథర్కి. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరయ్యింది. చివరికి కళ్లు తిరిగి పడిపోయింది. ఆస్పత్రికి తీసు కెళ్తే, కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. కానీ చికిత్స ప్రారంభించేలోపే చనిపోయింది. ‘పోల్టర్‌గైస్ట్ 2’లో నటించిన విల్ శామ్సన్‌కి... ఆ చిత్రం విడుదలయ్యాక గుండె, ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ ఆ ఆపరేషన్ వికటించింది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కిడ్నీలు కూడా ఫెయిలవ్వడంతో అతని ఊపిరి ఆగిపోయింది. మరో పాత్రధారి జూలియన్ బెక్ స్టమక్ క్యాన్సర్‌తో మర ణించాడు. చిత్ర దర్శకుడు బ్రెయిన్ గిబ్సన్ కూడా క్యానర్తోనే చనిపోయాడు. అలాగే మూడు భాగాల్లోనూ నటించిన జెల్డా రూబిన్స్టీన్ అనే నటికి మూడో పార్టు రిలీ జయ్యాక గుండెనొప్పి వచ్చింది. మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వీరు మాత్రమే కాదు. ఈ చిత్రానికి పని చేసిన చాలామంది నటీనటులు, టెక్నీషియన్స్‌ని సమస్యల పాలయ్యారు. కొందరు అనారోగ్యం పాలయ్యారు. ఇంకొందరు అప్పుల పాలయ్యారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. కొందరికైతే విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవి. దెయ్యాలు వెంటాడుతున్నా యనేవారు. ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నా యనేవారు. హీథర్ తల్లిగా నటించిన జోబెత్ పీడకలలతో చిత్రవధ అనుభ వించింది. వీటన్నిటికీ తోడు ఎన్నోసార్లు షూటింగ్ కోసం వేసిన సెట్స్‌లో ప్రమా దాలు సంభవించి, సెట్లు నాశనమయ్యేవి. ఇవన్నీ చూశాక అందరూ ఒకటే అన్నారు... పోల్టర్‌గైస్ట్ చిత్రాలు శాపానికి గురయ్యాయి, అందుకే వాటిలో నటించిన వారి జీవితాలు అల్లకలోలమౌతున్నాయి అని! ఎంతోమంది ఆ మాటను నమ్మారు. ఇప్పటినీ నమ్ముతున్నారు. అయితే నమ్మని వారు కూడా ఉన్నారు. అదే నిజమైతే అందరు నటీనటులకి, టెక్నీషియన్లకి ఏదో ఒకటి జరగాలి, కొందరు బాగానే ఉన్నారు కదా అన్నారు. దానికి జవాబు ఎవరూ చెప్పలేకపోయారు. చెప్పలేరు కూడా. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధా నాలు ఉండవు. కొన్ని నమ్మకాల విష యంలో లాజిక్కులు పని చేయవు. కొన్ని భయాలను.. ఎవరి ధైర్య వచనాలూ తొల గించలేవు. ఇంతకీ నిజం ఏమిటి! పోల్టర్ గైస్ట్ చిత్రాలు శాపగ్రస్తమయ్యాయా? లేక అదంతా భ్రమా??