Nagarjuna Ghost Movie Shooting Schedule Shifts To Ooty - Sakshi
Sakshi News home page

Nagarjuna Ghost Movie: ఊటీలో ‘ఘోస్ట్‌’ మూవీ షూటింగ్‌

Published Sat, Apr 9 2022 9:13 AM | Last Updated on Sat, Apr 9 2022 11:38 AM

Nagarjuna Ghost Movie Shooting Schedule Shifts To Ooty - Sakshi

‘ఘోస్ట్‌’ ఆపరేషన్‌ ఊటీకి షిఫ్ట్‌ అయ్యింది. ఈ ఆపరేషన్‌ రిజల్ట్స్‌ను వెండితెరపై చూసేందుకు మాత్రం కాస్త టైమ్‌ ఉంది. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఘోస్ట్‌’. ఇందులో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నారాయణ్‌దాస్‌ నారంగ్, పుసూ్కర్‌ రామ్మోహన్, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, సోనాలీ ఇద్దరూ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌ పాత్రల్లో కనిపిస్తారు.

ఇటీవలే దుబాయ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసింది ‘ఘోస్ట్‌’ టీమ్‌. తాజాగా ఊటీలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభించారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. నాగార్జున, సోనాల్‌  షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్‌ పనాగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చల్లగుళ్ల వెంకటేశ్వరరావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement