
‘కుబేర అండ్ కో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తయారు చేయించిన ఓ స్పెషల్ సెట్‌లో ధనుష్–నాగార్జున పాల్గొంటుండగా, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్‌తో ‘కుబేర’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ‘‘చాలా వరకు టాకీ పార్టును పూర్తి చేశాం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment