డంప్‌యార్డ్‌లో ధనుష్‌.. ఫ్యాన్స్‌ అభినందనలు | Dhanush Kubera Movie Shooting In Mumbai Dumpyard | Sakshi
Sakshi News home page

డంప్‌యార్డ్‌లో ధనుష్‌.. ఫ్యాన్స్‌ అభినందనలు

May 6 2024 12:13 PM | Updated on May 6 2024 12:30 PM

Dhanush Kubera Movie Shooting In Mumbai Dumpyard

ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌), అమిగోస్‌ క్రియేషన్స్‌పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ముంబై మహానగరంలో అత్యంత భారీ డంప్‌యార్డ్‌లో ధనుష్‌తో ఒక సీన్‌ తీయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారట. కానీ ఆ డంప్‌ యార్డ్‌ను సెట్టింగ్స్‌తో క్రియేట్‌ చేయాలని అనుకున్నారట. అయితే సినిమాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సీన్‌ను సహజంగా రావడం కోసం డంప్‌ యార్డ్‌లోనే షూటింగ్‌ చేద్దామని ధనుష్‌ చెప్పడమే కాకుండా.. అందుకు తగ్గట్లుగా సుమారు 10 గంటల పాటు మాస్క్‌ లేకుండానే డంప్‌యార్డ్‌లో ధనుష్‌ నటించారట.  

ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్‌ ధనుష్‌ను అభినందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌లో కూడా ధనుష్‌ డీగ్లామరైజ్‌గా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్న నాగార్జున ఫస్ట్‌ లుక్‌ను కూడా మీకర్స్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. నాగ్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్‌ కూడా ఫిదా అవుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కుబేర ఇదే ఏడాదిలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement