ఈ దీపావళికి థియేటర్స్‌లోకి రానున్నాడట ‘కుబేర’. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నాగార్జున–ధనుష్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment