దుమ్మురేపుతున్న 'ఘోస్ట్' సాంగ్.. ఆ రోజే సినిమా రిలీజ్! | Actor Shivarajkumar Ghost: OGM Movie Song Out - Sakshi
Sakshi News home page

Ghost Movie: 'ఘోస్ట్' సాంగ్.. ఆ రోజే సినిమా రిలీజ్

Published Fri, Sep 22 2023 7:57 PM | Last Updated on Fri, Sep 22 2023 8:05 PM

Actor Shivarajkumar Ghost Movie Song - Sakshi

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ 'ఘోస్ట్'. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఆన్ యాక్షన్ ఫీస్ట్‌గా తీస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఒరిజినల్ గ్యాంగస్టర్ మ్యూజిక్ వీడియో విడుదల చేశారు.

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ)

చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటని విడుదల చేశారు. శివరాజ్ కుమార్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీపై అంచనాలు పెంచుతోంది. అనుపమ్ ఖేర్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అర్జున్ జన్య సంగీతమందించారు. ఇకపోతే ఈ మధ్య 'జైలర్'లో గెస్ట్ అప్పీయరెన్స్‌తో దుమ్ములేపిన శివన్న.. పూర్తిస్థాయిలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటారో చూడాలి.

(ఇదీ చదవండి: అనసూయ సోయగాలు.. విష్ణుప్రియ గ్లామర్ షో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement