కింగ్ నాగార్జున సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒక చిత్రం బంగార్రాజు.. సంక్రాంతికే రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది.మరో మూవీ ఘోస్ట్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ టీమ్ హీరోయిన్ ను ఫిక్స్ చేసేందుకు ఇబ్బందులు పడుతోంది.
ఈ మూవీకి తొలుత హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత చందమామ పర్సనల్ రీజన్స్ తో తప్పుకుంది. ఆమె స్థానంలో మరో కథానాయికను ఎంపిక చేసేందుకు యూనిట్ చాలా ఇబ్బందులు పడుతోంది. కాజల్ తప్పుకోవడంతో త్రిష పేరు తెరపైకి వచ్చింది. అయితే అది పుకారుగానే మిగిలిపోయింది. రీసెంట్ గా అమలా పాల్, మెహరీన్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ, చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కింగ్‌తో జోడీ కట్టేందుకు రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండ్, పండగ చేస్కో, షేర్, డిక్టేటర్ చిత్రాల్లో కనిపించిన సోనాల్ చౌహాన్ ‘ఘోస్ట్’లో నటించబోతుదంట. ఇప్పటికే ఆమె వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3లో ఒక కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఘోస్ట్ లో నాగ్ కు జోడీగా నటించే అవకాశం అందుకుందంట.
Comments
Please login to add a commentAdd a comment