sonal chouhan
-
ఓటీటీలో ‘ది ఘోస్ట్’.. రిలీజ్ డేట్ ఫిక్స్?
ఇటీవల విడుదలైన నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వహించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ఫ్లిక్స్వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. గతంలోనూ నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్’ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఆ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే. (చదవండి: ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ) అసలు కథేంటంటే..: విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్‌ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది.అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ. -
‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ది ఘోస్ట్ నటీ నటులు : నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ తదితరులు బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు సంగీతం : మార్క్ కే రాబిన్ సినిమాటోగ్రఫర్ : ముఖేష్ విడుదల తేది : అక్టోబర్ 5, 2022 టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. ఈ మూవీ దసరా కానుకగా.. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం. ది ఘోస్ట్ కథ ఏంటంటే.. విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్‌ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది. అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ. ఎవరెలా నటించారంటే.. నాగార్జున ఇప్పటి వరకు అన్ని రకాల పాత్రలను పోషించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల కారెక్టర్లలో కనిపించారు. ఇక ఘోస్ట్‌లో అయితే మరింత స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ కొత్తగా కనిపించాడు. విక్రమ్, ఘోస్ట్ ఇలా రెండు రకాలుగా మెప్పించేశారు. సోనాల్ చౌహాన్ చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అనుపమ పాత్ర, అదితి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ లభించింది. శ్రీకాంత్ అయ్యర్, రవి వర్మ వంటి వారు తమ స్టైల్లో నటించేశారు. ఎలా ఉందంటే.. కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్స్, బ్లాక్ మెయిల్స్ నేపథ్యంలో ఈ కథను రాసుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇక ఇందులో ఫ్యామిలీ డ్రామాను ఇరికించడంతో కొత్తదనం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చూపించాడు దర్శకుడు. ప్రవీణ్ సత్తారు సినిమాల్లో మేకింగ్ బాగుంటుందని అందరికీ తెలిసిందే. ది ఘోస్ట్ చిత్రంలోనూ ప్రవీణ్ సత్తారు మార్క్ కనిపించింది. కథనం ఎక్కడా కూడా స్లోగా అనిపించదు. అసలు కథ ప్రారంభించేందుకు కొద్దిగా సమయాన్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ కథ ట్రాక్ ఎక్కిన తరువాత.. పరుగులు పెడుతుంది. విక్రమ్.. ఘోస్ట్ అని రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ అదిరిపోతుంది. అయితే సెకండాఫ్‌లో ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్‌ను మాత్రం అంత ఎఫెక్టివ్‌గా చూపించినట్టు అనిపించదు. ద్వితీయార్థం మాత్రం కాస్త గాడితప్పినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. ప్రథమార్థంలో ఉన్న ఇంట్రెస్ట్ సెకండాఫ్‌కు వచ్చే సరికి ఉండదనిపిస్తుంది. ఇక సాంకేతిక చూస్తే.. మార్క్ కే రాబిన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు, మాటలు అంతగా గుర్తుండవు. ముఖేష్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
రక్షన్తో కోలీవుడ్‌కు నాగార్జున
టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మారర్ నిర్మించారు. నటి సోనాల్ చౌహాన్ కథానాయకిగా నటించిన ఇందులో శ్రీకాంత్ అయ్యర్, మనీశ్ చౌదరి, విక్రమాదిత్య, రవివర్మ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విజయదశమి సందర్భంగా బుధవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రం యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రం గురించి మాట్లాడే ముందు పొన్నియిన్ సెల్వన్ చిత్ర దర్శకుడు, తన మంచి మిత్రుడు మణిరత్నం అద్భుతమైన చిత్రా న్ని తెరకెక్కించినందుకు గానూ కంగ్రాట్స్ చెబుతున్నానన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తాను ఇంతకు ముందు ఇదయతై తిరుడాదే (తెలుగులో గీతాంజలి) చిత్రం చేశానని గుర్తు చేశారు. ఆయన చాలా గొప్ప దర్శకుడని ప్రశంసించారు. అదేవిధంగా తాను నటించిన ఉదయం, రక్షన్, పయనం, ఇటీవల కార్తీతో కలిసి నటించిన తోళా చిత్రాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఇకపోతే తాను చెన్నై, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివినట్లు చెప్పారు. ఆ తరువాత హైదరాబాద్‌కు వెళ్లినా, చెన్నైకి వచ్చినప్పుడల్లా ఇక్కడ తిరిగిన ప్రాంతాలు గుర్తుకొస్తాయన్నారు. రక్షకన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయిందన్నారు. కోవిడ్ తరువాత చిత్రాలకు భాషాబేధం చెరిగిపోయిందని తెలిపారు. మంచి కంటెంట్ ఉండే చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రేక్షకులు ఇప్పుడు చిత్రాలను చూడటానికి థియేటర్లకు వస్తున్నారన్నారు. రక్షన్ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలని ముందు అనుకోలేదన్నారు. ఇది యూనివర్శల్ చిత్రం అనే నమ్మకం కలగడంతో తమిళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. చిత్రం కోసం రిహార్సల్స్ చేసి నటించినట్లు తెలిపారు. తమిళ వెర్షన్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్లు చెప్పారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయన్నారు. నటి సోనాల్ చౌహాన్ పోరాట సన్నివేశాల్లోనూ చక్కగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటి సోనాల్ సౌహాన్ పేర్కొన్నారు. నాగార్జున్ ఎంతగానో సహకరించారని కొనియాడింది. -
కత్తులతో నాగార్జున వేట.. 'ది ఘోస్ట్' నుంచి కొత్త అప్డేట్
Nagarjuna As A Killing Machine From The Ghost Movie: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఘోస్ట్'. ఈ చిత్రానికి 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. నాగ్, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ విజువల్ ట్రీట్‌ను చిత్రబృందం షేర్ చేసింది. 'కిల్లింగ్ మేషిన్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో నాగార్జున కత్తులతో శత్రువులను వేటాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోన్న ఈ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 5న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
మూడోవారం కూడా డబ్బులొస్తున్నాయి, సక్సెస్ అంటే ఇదే: హీరో
‘‘ఎఫ్ 3’లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్స్‌తో ‘దిల్’ రాజు తీసిన ‘ఎఫ్ 3’ పాన్ ఇండియా సినిమా కింద లెక్క. ఓ హీరోకి రేచీకటి, మరో హీరోకి నత్తి, హీరోయిన్స్‌కు డబ్బు పిచ్చి. ‘ఎఫ్ 3’లో ఇలాంటివి పెట్టి సినిమాను హిట్ చేయడం అనిల్‌కే సాధ్యం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలైంది. సోమవారం జరిగిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాఘవేంద్రరావు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండటం కంటే మించిన ఆనందం ఓ యాక్టర్‌కు ఏదీ ఉండదు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘సక్సెస్ అంటే ఈ కరోనా పరిస్థితుల్లోనూ మూడో వారంలో ఇంకా రెవెన్యూ రావడమే. సక్సెస్ అంటే ఇదే. ‘ఎఫ్ 3’కి అందరూ హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇప్పుడు సినిమాకి ప్యారలల్‌గా ఓటీటీ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘ఎఫ్ 3’ని ఆదరిస్తున్నారంటే ఇది రియల్ సక్సెస్’’ అన్నారు అనిల్ రావిపూడి. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ప్రదానం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజువల్ ఫీస్ట్‌లా ‘ది ఘోస్ట్’
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్‌లు ఆస్వాదించేవారికి ‘ది ఘోస్ట్’ కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్లో భాగంగా హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. ముఖ్యంగా ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. -
Ghost Movie:‘చందమామ’ ఔట్.. సోనాల్ ఇన్!
కింగ్ నాగార్జున సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒక చిత్రం బంగార్రాజు.. సంక్రాంతికే రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది.మరో మూవీ ఘోస్ట్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ టీమ్ హీరోయిన్ ను ఫిక్స్ చేసేందుకు ఇబ్బందులు పడుతోంది. ఈ మూవీకి తొలుత హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత చందమామ పర్సనల్ రీజన్స్ తో తప్పుకుంది. ఆమె స్థానంలో మరో కథానాయికను ఎంపిక చేసేందుకు యూనిట్ చాలా ఇబ్బందులు పడుతోంది. కాజల్ తప్పుకోవడంతో త్రిష పేరు తెరపైకి వచ్చింది. అయితే అది పుకారుగానే మిగిలిపోయింది. రీసెంట్ గా అమలా పాల్, మెహరీన్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ, చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కింగ్‌తో జోడీ కట్టేందుకు రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండ్, పండగ చేస్కో, షేర్, డిక్టేటర్ చిత్రాల్లో కనిపించిన సోనాల్ చౌహాన్ ‘ఘోస్ట్’లో నటించబోతుదంట. ఇప్పటికే ఆమె వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3లో ఒక కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ఘోస్ట్ లో నాగ్ కు జోడీగా నటించే అవకాశం అందుకుందంట. -
‘రూలర్’ సక్సెస్ మీట్
-
మా ప్రయత్నాన్ని ఆదరించారు
‘‘రూలర్ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మేం ఓ మంచి ప్రయత్నం చేశాం.. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు. సి.కల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా ఇది. మంచి కథా విలువలున్న చిత్రం చేయాలని భావించే ఆయనకు నా తరఫున, అభిమానుల తరఫున కృతజ్ఞతలు’’ అని బాలకృష్ణ అన్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (డిసెంబర్ 20) విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ పరుచూరి మురళిగారు మంచి కథ, డైలాగ్స్‌ను అందించారు. ఈ కథలో మంచి సందేశాన్ని కూడా చొప్పించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఆర్టిస్టుల దగ్గర నుంచి తనకు ఏం కావాలో రాబట్టుకునే దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌గారు. ఆయన నిర్మాతల దర్శకుడు కూడా. మా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘జై సింహా’ తర్వాత మా కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మా కాంబినేషన్లో వచ్చే తర్వాతి చిత్రం ‘రూలర్’ కంటే మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు వేదిక. ‘‘జైసింహా’ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’కి సినిమాటోగ్రఫీ అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్ రాంప్రసాద్. ‘‘కల్యాణ్‌గారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పరుచూరి మురళి అన్నారు. -
రివ్యూ: ‘రూలర్’ చిత్రం ఎట్లుందంటే?
మూవీ: రూలర్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, భూమిక, జయసుధ, షియాజీ షిండే, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, నాగినీడు, ఝాన్సీ సంగీతం: చిరంతన్ భట్ దర్శకత్వం: కె.ఎస్ రవికుమార్ నిర్మాత: సి. కల్యాణ్ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ హీరో సినిమా వస్తే ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు డబుల్ ధమాకానే. వారికి కావాల్సిన ఫుల్ మాస్ ఎలిమెంట్స్ బాలయ్య సినిమాలో చూడొచ్చనే ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఇక తమిళనాట స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన కెఎస్ రవికుమార్ బాలయ్య బాబుతో రెండో సారి జత కట్టి ‘రూలర్’ ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్లతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ శుక్రవారం ‘రూలర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? నయా లుక్స్‌లో బాలయ్య ఏ మేరకు ఆకట్టుకున్నారు? ‘రూలర్’తో బాలకృష్ణ ఈ ఏడాదిని ఘనంగా ముగించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: ఈ సినిమా కథ ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ప్రారంభమై వయా రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. సరోజిని నాయుడు(జయసుధ)కు చెందిన పలు కంపెనీల బాధ్యతలను రెండేళ్లు విదేశాల్లో ఐటీ రంగంపై ప్రత్యేక శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తన వారసుడు అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ)కు అప్పగిస్తారు. అయితే పోటీ ప్రపంచంలో భాగంగా తన ప్రత్యర్థి కంపెనీకి చెందిన హారిక(సోనాల్) అర్జున్‌కు తారసపడుతుంది. ఈ క్రమంలోనే అర్జున్‌తో హారిక ప్రేమలో పడుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అర్జున్ ప్రసాద్ భావిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సరోజిని నాయుడు అడ్డుపడతారు. ఈ ప్రాజెక్ట్‌కు తన తల్లి ఎందుకు అడ్డుపడుతుందో తెలుసుకొని ఉత్తర ప్రదేశ్ బయల్దేరుతాడు అర్జున్. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. యూపీలో అర్జున్ను అందరూ పోలీస్ అఫీసర్ ధర్మ అని పిలుస్తారు. ఇదే క్రమంలో లోకల్ మినిస్టర్ భవానీనాథ్ ఠాగూర్(పరాగ్ త్యాగీ) అర్జున్‌పై దాడి చేయిస్తాడు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ధర్మ, అర్జున్ ఒక్కరేనా? లేక వేరువేరా?. అసలు ఈ కథలోకి సంధ్య(వేదిక), సీతారామయ్య(నాగినీడు), నిరంజనా ప్రసాద్(భూమిక)లు ఎందుకు ఎంటర్ అవుతారు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: ఈ సినిమాలో రెండు ఢిపరెంట్ షేడ్స్‌లో కనిపించిన బాలయ్య తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రేమనని.. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోనని ఈ సినిమాతో నిరూపించారు. ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఇరగదీశాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్రంలో బాలయ్య వేసిన స్టెప్పులకు థియేటర్లో ఒకటే ఈలలు గోలలు. ఇక నటనకు పెద్ద స్కోప్ లేకపోయినప్పటికీ గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లు సోనాల్, వేదికలు ఆకట్టుకున్నారు. వారి అందచందాలతో కుర్రకారును కట్టిపడేశారు. మరోవైపు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భూమికకు ఈ చిత్రంలో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కానీ స్టోరీ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రల్లో నాగినీడు, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, ఝాన్సీ, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ‘నలభైకి పైగా అంతస్థుల గల మేడ నుంచి పడిపోతున్న ఓ యువతిని హెలికాప్టర్లో వచ్చి బాలయ్య కాపాడతాడు’. ఈ ఒక్క సీన్‌తో అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందో. బాలకృష్ణ సినిమా అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నందమూరి ఫ్యాన్స్ ఊహించని సీన్లు, హీరో ఎలివేషన్ షాట్స్, ఫైట్లు హై రేంజ్లో ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్ రవికుమార్‌కు అప్పగించాడు. అయితే బాలయ్య బాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుబు నూటికినూరు శాతం నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం బాలకృష్ణ ఇమేజ్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథలో ఏదో మూలన కాస్త కొత్త దనం కనిపించినప్పటికీ.. దానిని అటుతిప్పి ఇటుతిప్పి రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మలిచాడు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, కమర్షియల్ హంగుల మీద దృష్టిపెట్టినంత శ్రద్ద కథ, కథనంపై పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక రెండో అర్థబాగంలో పోలీస్ ఆఫీసర్‌గా వచ్చే బాలయ్య లుక్ సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్లు, ఇంగ్లీష్ డైలాగ్ సోనాల్ అందచందాలు, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్, శ్రీనివాస్ రెడ్డి బృందం కామెడీతో ఫస్టాఫ్ సక్సెస్ ఫుల్‌గా ముగుస్తుంది. తొలి అర్థభాగం ముగిసే సరికి సినిమా అసలు కథలోకి ఎంటర్ కాదు. అయితే సెకండాఫ్‌లో అసలు స్టోరీలోకి ఎంటర్ అయ్యాక సినిమా ఎటో వెళ్లిపోతుంది. దీనిపై దర్శకుడు తన సీనియార్టీని ఉపయోగించి అభిమానులను కాస్త మెస్మరైజ్ చేయాల్సింది. కానీ దర్శకుడు ఏమాత్రం తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించలేదని ఈ సినిమాతో అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకు చాల ప్లస్‌గా నిలిచింది డ్యాన్స్. బాలయ్య ఇమేజ్ను పరిగణలోకి తీసుకుని డ్యాన్స్‌లను ఎక్సలెంట్‌గా కంపోజ్ చేశారు మూవీ కొరియోగ్రాఫర్స్. ఫార్మేషన్స్, బాలయ్యకు ఆప్ట్ అయ్యే స్లైలీష్ స్టెప్పులను కంపోజ్ చేశారు. సినిమాకు మరోప్లస్ పాయింట్స్ ఫైట్స్. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించిన ఫైట్లు వారిని మైమరిపిస్తాయి. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్స్, హీరోయిన్ ఎంట్రీ సీన్లలో కెమెరా పనితనం కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు తగ్గట్టు పాటలను కంపోజ్ చేశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రఫ్పాడించాడు. అయితే ఎడిటింగ్, స్క్రీన్ ప్లేపై కాస్త దృష్టి పెట్టాల్సి ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షోతో సినిమాను బాలయ్య నెట్టుకొచ్చాడు. బాలకృష్ట కష్టానికి తగ్గట్టు దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శిస్తే సినిమా వేరే రేంజ్లో ఉండేది. ప్లస్ పాయింట్స్ బాలకృష్ణ ఎనర్జీ డ్యాన్స్ ఫార్మేషన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ దర్శకత్వ విలువలు ఎడిటింగ్ సాగదీత సీన్లు సినిమా నిడివి కథనంలో కొత్తదనం లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే తెలుగులో వీలు కుదర్లేదు
‘‘ఒక్కో ఇండస్ట్రీ ఒక్కోలాంటి సినిమాలు తీస్తుంది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో నేను సినిమాలు చేస్తుంటాను. పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల విభిన్నత చూపించడానికి నటిగా నాకు మంచి అవకాశం అనుకుంటాను’’ అన్నారు వేదిక. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూలర్’. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ‘బాణం, విజయ దశమి, దగ్గరగా దూరంగా’ సినిమాల్లో కనిపించి వేదిక 7 ఏళ్ల విరామం తర్వాత ‘రూలర్’ అనే తెలుగు సినిమా చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న విశేషాలు... ► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉండటంతో తెలుగులో సినిమాలు చేసే వీలు కుదర్లేదు. అక్కడ వరుస చిత్రాలతో ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. నాకు తెలుగులో మేనేజర్ కూడా లేరు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన 3’ తమిళంలో, తెలుగులో హిట్ అయింది. నా పాత్రకు మంచి స్పందన రావడంతో ‘రూలర్’కి నన్ను సంప్రదించారు. ► బాలకృష్ణగారిలాంటి పెద్ద స్టార్ సినిమాలో అవకాశం రావడం మంచి అవకాశంగా భావించాను. కేఎస్ రవికుమార్‌గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఈ సినిమాను పూర్తి చేయాలంటే ఏడాది పడుతుంది. కానీ, మూడున్నర నెలల్లో పూర్తి చేశారాయన. సి.కల్యాణ్‌గారు రాజీపడకుండా క్వాలిటీతో తెరకెక్కించారు. ► ‘రూలర్’ సినిమాలో నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధంగా, మరొకటి ఫుల్ గ్లామరస్‌గా ఉండేది. డామినేటింగ్‌గా ఉండే పాత్ర నాది. సప్తగిరితో కలసి కామెడీ చేస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ సినిమాలో పాత్రలానే నేనూ డామినేటింగే. కానీ నా ఫేస్ అలా కనిపించదు(నవ్వుతూ). ► బాలకృష్ణగారి ఎనర్జీ సూపర్. డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను(నవ్వుతూ). ఆయన డైలాగ్స్, యాక్టింగ్‌లో ఒక స్టయిల్ ఉంటుంది. ఆయన అందర్నీ సమానంగా చూసుకుంటారు. -
ఆ స్ఫూర్తితోనే రూలర్ చేశాం
‘‘రైతుల మీద సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఓ సందర్భంలో చాలామందిని కలిశాను కూడా. కానీ కుదర్లేదు. ‘రూలర్’ సినిమాతో ఆ కోరిక కొంత తీరింది’’ అన్నారు బాలకృష్ణ. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఇందులో వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సినిమా ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శీను, నందమూరి రామకృష్ణ విడుదల చేశారు. బాల కృష్ణ మాట్లాడుతూ–‘‘నేనూ, కల్యాణ్, కేఎస్ రవికుమార్ కలిసి చేసిన ‘జై సింహా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ‘రూలర్’ సినిమా తీశాం. మొదట్లో ఈ సినిమాకు మరో కథ అనుకున్నాం. కుదర్లేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళిగారికి ఫోన్ చేశాను. ఆయన దగ్గర ఉన్న ఓ కథను వినిపించారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించు కున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. కళామతల్లికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘రూలర్’ అనే పేరు బాలకృష్ణగారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తమిళంలో రవికుమార్‌గారు చేసిన సినిమాలు మాలాంటి దర్శకులకు రిఫరెన్స్లా ఉపయోగపడతాయి. సి.కల్యాణ్‌గారికి అభినందనలు’’అన్నారు బోయపాటి శీను. ‘‘ఇండస్ట్రీలో నాకు బాగా సపోర్ట్ అందించిన వ్యక్తి బాలకృష్ణగారు. కేఎస్ రవికుమార్ సూపర్ డైరెక్టర్. సి.కల్యాణ్‌గారితో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఇంతమంది నాకు కావాల్సిన వ్యక్తులు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘జైసింహా’ తర్వాత మా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ఇది. టీమ్ అందరూ ఎంతగానో కష్టపడ్డారు’’ అన్నారు కేఎస్ రవికుమార్. ‘‘బాలకృష్ణగారు ఈజ్ గ్రేట్’ అనేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు సి. కల్యాణ్. కథానాయికలు సోనాల్ చౌహాన్, వేదిక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, అంబికా కృష్ణ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రొమాంటిక్ రూలర్
ప్రేయసితో ప్రణయ గీతాలా పన చేస్తున్నారు బాలకృష్ణ. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. సి.వి. రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు బాలకృష్ణ. అందులో ఒకటి పోలీసాఫీసర్. మరొకటి ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ మున్నార్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఓ మెలోడీ సాంగ్‌ను బాలకృష్ణ, వేదికలపై చిత్రీకరిస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ‘రూలర్’ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
కిర్రాక్ లుక్
‘లుక్ అదిరింది. కిర్రాక్ లుక్. భలే ఉంది కొత్త లుక్...’ ఇదిగో ఇలానే రెట్టించిన ఉత్సాహంతో బాలకృష్ణ అభిమానులు ఆనందపడిపోతున్నారు. బాలకృష్ణ తాజా చిత్రంలో ఆయన లుక్ విడుదల కావడమే ఇందుకు కారణం. నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. వాన్‌డైక్ బియర్డ్ (ఒక రకమైన గడ్డం)తో స్టైలిష్‌గా కనిపించారు బాలకృష్ణ. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. సి.వి. రావ్, పర్సా నాగరాజు సహ–నిర్మాతలు. -
'షేర్' మూవీ రివ్యూ
టైటిల్ : షేర్ తారాగణం : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, దర్శకుడు : మల్లికార్జున్ నిర్మాత : కొమర వెంకటేష్ సంగీతం : థమన్ 2015 జనవరిలో పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండింగ్ లో షేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమా కథాకథనాల పరంగా ప్రయోగాల జోలికి పోకపోయినా, షేర్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేశాడు ఈ నందమూరి హీరో. గతంలో తనే హీరోగా రెండు భారీ డిజాస్టర్ లు అందించిన అదే దర్శకుడితో మరో సినిమా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి కళ్యాణ్ రామ్ నమ్మకాన్ని దర్శకుడు మల్లిఖార్జున్ ఎంత వరకు నిలబెట్టుకున్నాడు. దశాబ్ద కాలం తరువాత హిట్ ట్రాక్‌లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ షేర్ సినిమాతో ఆ టెంపోను కంటిన్యూ చేశాడా..? రివ్యూలో చూద్దాం. కథ : గౌతమ్ ( కళ్యాణ్ రామ్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ సాదా సీదా కుర్రాడు. సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే హీరో తన కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ నందిని (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా తన జీవితంలో ఒకేసారి రెండు మార్పులు చోటు చేసుకుంటాయి. తన జీవితంలో ఊహించని మార్పుల కారణంగా తాను ఎప్పటినుంచో కలగంటున్నవాటిని.. కుటుంబం కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో హీరో తన ప్రేమను, తన కలను ఎలా సాధించాడు అన్నదే మిగతా కథ. విశ్లేషణ : నటుడిగా కళ్యాణ్ రామ్ తన మార్క్ చూపించాడు. పటాస్ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ అదే జోరు చూపించాడు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్‌లు, ఫైట్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కించాలన్న దర్శకుడి ప్రయత్నం సినిమాకు మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. కథకు అవసరం లేకపోయినా హీరోయిజం కోసం, కామెడీ కోసం ప్లాన్ చేసిన సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి. ఇక హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ షో తప్ప ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, విక్రమ్ జిత్ లాంటి విలన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. రోటీన్ కామెడీ సీన్స్ సినిమాకు చాలా పెద్ద మైనస్. ప్రమోషన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే ఓపెనింగ్స్ బాగుండేవి. ప్లస్ పాయింట్స్ : కళ్యాణ్ రామ్ సోనాల్ చౌహాన్ గ్లామర్ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ కామెడీ సీన్స్ సినిమా నిడివి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ ఓవరాల్‌గా కళ్యాణ్ రామ్, మల్లికార్జున్ ల మూడో ప్రయత్నం కూడా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. -
హ్యాట్రిక్ హిట్ కోసం స్వీటీ
ఈ ఏడాది ఇప్పటికే రెండు భారీ విజయాలను నమోదు చేసిన అనుష్క. మరో ఇంట్రస్టింగ్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసింది. అనుష్క లీడ్ రోల్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన 'సైజ్ జీరో' సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలతో మంచి విజయాలు సాధించిన అనుష్క 'సైజ్ జీరో'తో హ్యాట్రిక్ హిట్ సాధించాలని చూస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగి, చాలా రిస్క్ చేసిన స్వీటీ, సక్సెస్ మీద అంతే కాన్ఫిడెంట్‌గా ఉంది. దసరా సీజన్లోనే సైజ్ జీరో రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో వెనక్కి తగ్గారు. పివిపి సినిమా బ్యానర్‌పై పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ సినిమాను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా 1500 వందల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.