
బాలకృష్ణ
‘లుక్ అదిరింది. కిర్రాక్ లుక్. భలే ఉంది కొత్త లుక్...’ ఇదిగో ఇలానే రెట్టించిన ఉత్సాహంతో బాలకృష్ణ అభిమానులు ఆనందపడిపోతున్నారు. బాలకృష్ణ తాజా చిత్రంలో ఆయన లుక్ విడుదల కావడమే ఇందుకు కారణం. నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. వాన్‌డైక్ బియర్డ్ (ఒక రకమైన గడ్డం)తో స్టైలిష్‌గా కనిపించారు బాలకృష్ణ. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. సి.వి. రావ్, పర్సా నాగరాజు సహ–నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment