హ్యాట్రిక్ హిట్ కోసం స్వీటీ | anushka shetty experimental movie size zero releasing on nov 27 | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ హిట్ కోసం స్వీటీ

Published Fri, Oct 16 2015 10:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

హ్యాట్రిక్ హిట్ కోసం స్వీటీ

హ్యాట్రిక్ హిట్ కోసం స్వీటీ

ఈ ఏడాది ఇప్పటికే రెండు భారీ విజయాలను నమోదు చేసిన అనుష్క. మరో ఇంట్రస్టింగ్ సినిమాను రిలీజ్కు రెడీ చేసింది. అనుష్క లీడ్ రోల్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన 'సైజ్ జీరో' సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలతో మంచి విజయాలు సాధించిన అనుష్క 'సైజ్ జీరో'తో హ్యాట్రిక్ హిట్ సాధించాలని చూస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగి, చాలా రిస్క్ చేసిన స్వీటీ, సక్సెస్ మీద అంతే కాన్ఫిడెంట్గా ఉంది. దసరా సీజన్లోనే సైజ్ జీరో రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో వెనక్కి తగ్గారు.

పివిపి సినిమా బ్యానర్పై పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ సినిమాను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా 1500 వందల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement