ఇటీవల విడుదలైన నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వహించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. గతంలోనూ నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్’ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఆ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.
(చదవండి: ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ)
అసలు కథేంటంటే..: విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్‌ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది.అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ.
Comments
Please login to add a commentAdd a comment