The ghost
-
ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆస్ ఆడియన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు(నవంబర్ 2) నుంచి నెట్‌ఫ్లిక్స్‌తో ది ఘోస్ట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్లలో మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్న ది ఘోస్ట్ ఓటీటీలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. -
ఓటీటీలో ‘ది ఘోస్ట్’.. రిలీజ్ డేట్ ఫిక్స్?
ఇటీవల విడుదలైన నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వహించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ఫ్లిక్స్వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. గతంలోనూ నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్’ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఆ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే. (చదవండి: ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ) అసలు కథేంటంటే..: విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్‌ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది.అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ. -
నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ది ఘోస్ట్ నటీ నటులు : నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ తదితరులు బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు సంగీతం : మార్క్ కే రాబిన్ సినిమాటోగ్రఫర్ : ముఖేష్ విడుదల తేది : అక్టోబర్ 5, 2022 టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. ఈ మూవీ దసరా కానుకగా.. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం. ది ఘోస్ట్ కథ ఏంటంటే.. విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్‌ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్‌ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్‌కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్‌కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది. అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ. ఎవరెలా నటించారంటే.. నాగార్జున ఇప్పటి వరకు అన్ని రకాల పాత్రలను పోషించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల కారెక్టర్లలో కనిపించారు. ఇక ఘోస్ట్‌లో అయితే మరింత స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ కొత్తగా కనిపించాడు. విక్రమ్, ఘోస్ట్ ఇలా రెండు రకాలుగా మెప్పించేశారు. సోనాల్ చౌహాన్ చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అనుపమ పాత్ర, అదితి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ లభించింది. శ్రీకాంత్ అయ్యర్, రవి వర్మ వంటి వారు తమ స్టైల్లో నటించేశారు. ఎలా ఉందంటే.. కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్స్, బ్లాక్ మెయిల్స్ నేపథ్యంలో ఈ కథను రాసుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇక ఇందులో ఫ్యామిలీ డ్రామాను ఇరికించడంతో కొత్తదనం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చూపించాడు దర్శకుడు. ప్రవీణ్ సత్తారు సినిమాల్లో మేకింగ్ బాగుంటుందని అందరికీ తెలిసిందే. ది ఘోస్ట్ చిత్రంలోనూ ప్రవీణ్ సత్తారు మార్క్ కనిపించింది. కథనం ఎక్కడా కూడా స్లోగా అనిపించదు. అసలు కథ ప్రారంభించేందుకు కొద్దిగా సమయాన్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ కథ ట్రాక్ ఎక్కిన తరువాత.. పరుగులు పెడుతుంది. విక్రమ్.. ఘోస్ట్ అని రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ అదిరిపోతుంది. అయితే సెకండాఫ్‌లో ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్‌ను మాత్రం అంత ఎఫెక్టివ్‌గా చూపించినట్టు అనిపించదు. ద్వితీయార్థం మాత్రం కాస్త గాడితప్పినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. ప్రథమార్థంలో ఉన్న ఇంట్రెస్ట్ సెకండాఫ్‌కు వచ్చే సరికి ఉండదనిపిస్తుంది. ఇక సాంకేతిక చూస్తే.. మార్క్ కే రాబిన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు, మాటలు అంతగా గుర్తుండవు. ముఖేష్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘ది ఘోస్ట్’ మూవీ ట్విటర్ రివ్యూ
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ది ఘోస్ట్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. ది ఘోస్ట్ డీసెంట్ మూవీ అని,యాక్షన్ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ అంటున్నారు. ఫస్టాఫ్‌లో డ్రామా ఎక్కువైందని, సెకండాఫ్‌లో సెకండాఫ్‌లో యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతున్నాయని చెబుతున్నారు. ట్విస్టులు బాగున్నాయట. ఇంటర్వెల్ మాత్రం పవర్ ప్యాక్‌గా ఉందంటూ పోస్ట్ చేస్తున్నారు. #TheGhost Overall a decent movie. Stylish action sequences are a treat to watch. First half is mostly drama and set stage for 2nd half. Second half is full on action with a superb climax fight. Tamahagame fight was missing, and just showed that underworld begged for mercy. — ashokvarma (@Ashoksagi) October 5, 2022 Decent first half. Praveen was on point from the beginning and introduced many characters but the narration was flat at times. Need an explosive second half #TheGhost — sharat (@sherry1111111) October 5, 2022 Done with 1st half. Pre intermission bang adiripoindi. Entry was good, trvata konchm slow. But interval bang matram packk. Very good action sequences. ##TheGhost — STLboyy (@StlBoyy) October 4, 2022 Avergae first half ...very good second half ...nag sir kummesaru ...bgm drawback bhaga...kummese scenes ki flat vesadu ... #TheGhost https://t.co/wTYDp36FO9 — NST (@urstrulyNST) October 5, 2022 Nag babai’s best in recent times there are few shots which gives immense high, the climax portion is lit and babai’s rage is like 🔥 had the bgm is somewhat high the movie will have high chance of being a blockbuster go and watch sattaru’s flick u wont disappoint #TheGhost — KillBill (@snicky999) October 5, 2022 Decent 1st half with strictly flat 2nd half. Konni action episodes good. Story and screenplay not at all exciting. #TheGhost — Tonieee (@Tony_1439) October 5, 2022 #TheGhost ⚔️ Feast for action lovers and mass audience 🔥🔥 One man show @iamnagarjuna 🔥 — IamVK® (@Vamsi_Yuvsamrat) October 5, 2022 #TheGhost Eppude UK la premier show chusa movie is up to the expectation solid screenplay , taking , action episodes n BGM …worth watching next level standards KING is always a torch bearer 💪💪💪👌👌 — kranthi ramishetty (@kranthiramishe9) October 4, 2022 Cinematography Action sequences Interval bang Bgm Climax "One Man Show " @iamnagarjuna#TheGhost #Ghost — Lakshmi Bhavani (@iambhavani1) October 5, 2022 -
ఈ సినిమాతో ఆ కోరిక తీరింది: నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున చిత్ర విశేషాలని పంచుకున్నారు. ది ఘోస్ట్‌లో వెపన్ ప్రమోషన్స్‌లో ఆకట్టుకుంది. దీని వెనుక కథ వుందా ? తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ ఉంది. ఈ సినిమాలో ఉండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్‌గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం.(నవ్వుతూ) ది ఘోస్ట్ పై చాలా ఇష్టం పెరగడానికి కారణం ? ఈ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బాగుంటుంది. తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్‌ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీలో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్. ది ఘోస్ట్‌ని శివతో పోల్చడానికి కారణం ? నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ ఉందనిపించింది. ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ? నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్‌తో కూడిన ఒక స్టైలీష్ యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. గరుడ వేగలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాలా నచ్చింది. ప్రవీణ్‌ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్‌లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేశారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం. మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ? మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్లాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే యూఎస్‌లో రిలీజ్ అవుతోంది. ఈ రకంగా నిన్నే పెళ్లాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ). పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్లీ వస్తుందా ? తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్స్ పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి. మీరు బాలీవుడ్లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చెరిగిపోయాయని అనుకోవచ్చా ? ఇప్పుడు బౌండరీలు లేవు. యూఎస్‌లో ఐమాక్స్ స్క్రీన్‌లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్రలో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ? ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66రోజుల్లోనే పూర్తయింది. కొత్తగా చేయబోయే సినిమాలు ? రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్లో ఉంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి. -
సోనాల్ చౌహాన్ తో " గరం గరం ముచ్చట్లు "
-
ది ఘోస్ట్‌పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్.. ఆ ఒక్కటే హైలెట్ అంటూ..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన చిత్రం 'ది ఘోస్ట్'. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో నాగార్జున కొన్ని యాక్షన్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కింగ్. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఆసక్తిగా ఉంటాయన్నారు నాగ్. క్లైమాక్స్‌లో వచ్చే చర్చ్ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందన్నారు కింగ్ నాగార్జున. అలాగే దర్శకుడు సైతం ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ సీన్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. -
రక్షన్తో కోలీవుడ్‌కు నాగార్జున
టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మారర్ నిర్మించారు. నటి సోనాల్ చౌహాన్ కథానాయకిగా నటించిన ఇందులో శ్రీకాంత్ అయ్యర్, మనీశ్ చౌదరి, విక్రమాదిత్య, రవివర్మ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విజయదశమి సందర్భంగా బుధవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రం యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రం గురించి మాట్లాడే ముందు పొన్నియిన్ సెల్వన్ చిత్ర దర్శకుడు, తన మంచి మిత్రుడు మణిరత్నం అద్భుతమైన చిత్రా న్ని తెరకెక్కించినందుకు గానూ కంగ్రాట్స్ చెబుతున్నానన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తాను ఇంతకు ముందు ఇదయతై తిరుడాదే (తెలుగులో గీతాంజలి) చిత్రం చేశానని గుర్తు చేశారు. ఆయన చాలా గొప్ప దర్శకుడని ప్రశంసించారు. అదేవిధంగా తాను నటించిన ఉదయం, రక్షన్, పయనం, ఇటీవల కార్తీతో కలిసి నటించిన తోళా చిత్రాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఇకపోతే తాను చెన్నై, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివినట్లు చెప్పారు. ఆ తరువాత హైదరాబాద్‌కు వెళ్లినా, చెన్నైకి వచ్చినప్పుడల్లా ఇక్కడ తిరిగిన ప్రాంతాలు గుర్తుకొస్తాయన్నారు. రక్షకన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయిందన్నారు. కోవిడ్ తరువాత చిత్రాలకు భాషాబేధం చెరిగిపోయిందని తెలిపారు. మంచి కంటెంట్ ఉండే చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రేక్షకులు ఇప్పుడు చిత్రాలను చూడటానికి థియేటర్లకు వస్తున్నారన్నారు. రక్షన్ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలని ముందు అనుకోలేదన్నారు. ఇది యూనివర్శల్ చిత్రం అనే నమ్మకం కలగడంతో తమిళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. చిత్రం కోసం రిహార్సల్స్ చేసి నటించినట్లు తెలిపారు. తమిళ వెర్షన్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్లు చెప్పారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయన్నారు. నటి సోనాల్ చౌహాన్ పోరాట సన్నివేశాల్లోనూ చక్కగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటి సోనాల్ సౌహాన్ పేర్కొన్నారు. నాగార్జున్ ఎంతగానో సహకరించారని కొనియాడింది. -
The Ghost: నాగ్ కోసమే కథ రాశా.. రొమాన్స్ ఉంటుంది: ప్రవీణ్ సత్తారు
‘‘నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా చరిత్రలో ఓ పేజీ రాయడంలా భావిస్తాను. అలా ఆ చరిత్రలో ‘ది ఘోస్ట్’ ఓ పేజీ. వెయ్యి సంత్సరాల తర్వాతే కాదు.. మనం చనిపోయిన తర్వాత కూడా సినిమా చరిత్రలో ఆ పేజీ ఉంటుంది. అందుకే ఈ పేజీని చాలా జాగ్రత్తగా రాయలన్న భయం, బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’ అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు. ► నాగార్జునగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ది ఘోస్ట్’ కథ రాశాను.. నాగార్జునగారు అద్భుతంగా చేశారు. ఇంటర్‌పోల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఆఫీసర్ విక్రమ్ పాత్ర చేశారు నాగార్జునగారు. ఈ చిత్రంలో 12 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సినిమాలోని చెల్లి, మేనకోడలు సెంటిమెంట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రొమాన్సూ ఉంది. ► నాకు ‘గరుడవేగ’ సినిమా ఫ్లస్ అయ్యిందనే భావిస్తున్నాను. ఈ విషయంలో జీవితా రాజశేఖర్గార్లకు ధన్యవాదాలు. నేను మూడు సినిమాలు నిర్మించాను. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేయడం అనేది కొంచెం కష్టమే. నిర్మాతల కష్టాలు నాకు తెలుసు. నా తర్వాతి చిత్రం వరుణ్ తేజ్‌తో ఉంది. ఈ నెల 10న యూకేలో ఆ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. ► పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌ను చూసే సినిమా చూడాలా? వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటున్న రోజులువి. సినిమా స్టాండర్డ్స్ విషయంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంటే ఎంటర్టైన్ చేయడమే. థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వారు తమ మొబైల్ ఫోన్స్ మెసేజ్‌లను చెక్ చేసుకోనంత వరకు స్క్రీన్ పై ఏ జానర్ సినిమా ఉన్నా అప్పుడు అది హిట్టే. హిందీలో రిలీజ్ చేస్తాం – సునీల్ నారంగ్ ‘ది ఘోస్ట్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 7న రిలీజ్ అవుతుంది. ముందుగా హిందీ రిలీజ్ ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత చేశాం. నాగార్జునగారు చాలా బాగా నటించారు. ప్రవీణ్ సత్తారు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కోవిడ్ వల్ల అనుకున్నదాన్ని కన్నా సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. -
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సాక్షి " ఎక్స్ క్లూజివ్ చిట్ చాట్ "
-
‘ది ఘోస్ట్’ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
'ది ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్.. కింగ్ యాక్షన్‌కు ఫిదా అవ్వాల్సిందే
కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదలైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడంతో కింగ్ మాస్ యాక్షన్‌కు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. (చదవండి: 'నాగార్జున షాకింగ్ నిర్ణయం.. అప్పటివరకు సినిమాలకు బ్రేక్') యాక్షన్ ఎంటర్టైనర్గా తెరెకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో సన్నివేశాలు సినిమాలో కీలకమైనవిగా అర్థమవుతోంది. 'డబ్బు, సక్సెస్.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది’ అన్న డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
'నాగార్జున షాకింగ్ నిర్ణయం.. అప్పటివరకు సినిమాలకు బ్రేక్'
టాలీవుడ్లో యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని నటుడు అక్కినేని నాగార్జున. వయసు పెరుగుతున్నా తనకున్న గ్లామర్ రోల్‌తో అభిమానులకు దగ్గరవుతుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'ది ఘోస్ట్'. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో అలరించనుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాలను ఒప్పుకోలేదని ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రంలోనూ కీలక పాత్ర పోషించిన నాగార్జున.. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. (చదవండి: మా జీవితాల నుంచి వెళ్లిపోయింది.. చై-సామ్ విడాకులపై నాగార్జున కామెంట్స్) అక్కినేని నాగార్జున మాట్లాడుతూ 'కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చినట్లు గ్రహించా. ప్రజలు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. అందుకోసం కనీసం ఆరు నెలల సమయం అవసరం. ఈ ఏడాది 'ది ఘోస్ట్' తర్వాత నా సినిమాలేవీ ఉండట్లేదు. తర్వాత ఓటీటీలోనూ నటించాలనే ప్రణాళికతో ఉన్నా. అందుకే స్క్రిప్ట్ విన్నాక అది ఓటీటీకి సరిపోతుందా.. థియేటర్లో రిలీజ్ చేయాలా.. అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలి. అందుకే విరామం తీసుకోవాలనుకుంటున్నా' అని అన్నారు. -
అప్పుడు చైన్‌తో వచ్చా... ఇప్పుడు కత్తితో వస్తున్నా
‘‘ముప్పైమూడు సంవత్సరాల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాతో సైకిల్ చైన్ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ అక్టోబరు 5న ఓ కత్తితో ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి మా ‘ది ఘోస్ట్’ చిత్రానికి కూడా విజయాన్ని ఇస్తుందనుకుంటున్నాను’’ అని నాగార్జున అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల కానుంది. కాగా ఆదివారం కర్నూలులో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈరోజు ఈ వేదికపై నేను, నాగచైతన్య, అఖిల్ ఇంత ప్రేమను పొందడానికి కారణమైన తెలుగు సినీ పరిశ్రమకి, మా నాన్నగారికి (దివంగత అక్కినేని నాగేశ్వరరావు) థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ‘ది ఘోస్ట్’ లో అలానే కనపడతాను. నేను, చైతన్య చేసిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్స్‌లోనే కాదు.. టెలివిజన్ టీఆర్పీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. నెక్ట్స్ అఖిల్‌తో నేను చేయబోయే సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది. మహేశ్‌బాబు ఎప్పుడంటే అప్పుడు అతనితో కలిసి నటిస్తాను. నాకు ఎంతో ఆప్తులైన చిరంజీవిగారి సినిమా ‘గాడ్‌ఫాదర్’ కూడా అక్టోబరు 5న రిలీజ్ కాబోతుంది.. ‘ది ఘోస్ట్, గాడ్‌ఫాదర్’ సినిమాలకు విజయాలు చేకూరాలి’’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ–‘‘గత నాలుగైదు నెలలుగా నాన్నగారిని(నాగార్జున) కలిసిన ప్రతిసారి ‘ది ఘోస్ట్’ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇలాంటి ఎగై్జట్‌మెంట్‌ను నాన్నలో చూసి చాలా రోజులైంది. ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ‘ది ఘోస్ట్’కి ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు అద్భుతం. ఈ విధంగా నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. స్క్రీన్‌పై నాన్నని ఎలా చూడాలనుకున్నానో అలా ప్రవీణ్‌గారు ఈ సినిమాలో చూపించారు’’అన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను, అన్నయ్య.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాం. ముప్పై ఏళ్ల తర్వాత కూడా అదే క్రమశిక్షణతో నాన్నగారు సినిమాలు చేస్తున్నారు.. దాన్నిబట్టి మేం ఎంత పరిగెత్తాలనేది అర్థం అవుతోంది. ‘ది ఘోస్ట్’ లో ఏదో ఒక ఫైర్ ఉంది.. సినిమా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన అభిమానుల అంచనాలను అందుకునేలా ‘ది ఘోస్ట్’ ఉంటుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ‘‘నాగార్జున ఎంత స్టైలిష్‌గా ఉంటారో అంతే స్టైలిష్‌గా ఈ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత రామ్మోహన్రావు. ‘‘ది ఘోస్ట్’ తీసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సోనాల్ చౌహాన్, నటుడు విక్రమాదిత్య, కెమెరామేన్ ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, మ్యూజిక్ డియో భరత్, సౌరభ్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో ‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆ హీరోతో రొమాంటిక్ మూవీ చేయాలని ఉంది: సోనాల్ చౌహాన్
‘‘యాక్షన్ మూవీ చేయాలనే నా ఆకాంక్ష ‘ది ఘోస్ట్’తో నెరవేరింది’’ అన్నారు సోనాల్ చౌహాన్. నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్ చెప్పిన విశేషాలు... ► ప్రవీణ్ సత్తారు ‘ది ఘోస్ట్’ కథ చెప్పినపుడు థ్రిల్ అయ్యాను. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా చేశాను. ఇది సవాల్‌తో కూడుకున్న పాత్ర. అందుకే శిక్షణ తీసుకున్నాను. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అయితే ట్రైనింగ్ టైమ్‌లో రెండో రోజే కాలి వేలు ఫ్రాక్చర్ అయ్యింది. డాక్టర్ సలహా మేరకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని, మళ్లీ శిక్షణ తీసుకుని షూటింగ్‌కి ఎంటర్ అయ్యాను. ► ఇంటర్‌పోల్ ఆఫీసర్ని కాబట్టి కొన్ని రకాల తుపాకీలను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అయితే మా నాన్న పోలీస్ కావడంతో గన్స్ పట్టుకోవడం తెలుసు. కానీ ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్‌ని హ్యాండిల్ చేయాల్సి రావడంతో శిక్షణ తీసుకున్నాను. గ్లామరస్ క్యారెక్టర్సే కాదు.. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ సినిమా నిరూపిస్తుంది. ► నాగార్జునగారిని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు కాస్త నెర్వస్ అయ్యాను. అయితే పది నిమిషాలు మాట్లాడాక నా భయం పోయింది. నాగార్జునగారు కింగ్ అఫ్ రొమాన్స్. ‘వేగం...’ పాటలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. నాగార్జునగారితో ఓ రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది. ► మాది సంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబం. మా కుటుంబంలో ఆడవాళ్లు ఇంటి నుండి బయటకు రావడమే పెద్ద విషయం. అలాంటిది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా పరిశ్రమలో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏ అవగాహన కూడా లేదు. అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. ఎత్తుపల్లాలను ఎలా తీసుకోవాలో సినిమా పరిశ్రమే నేర్పింది. -
‘ఘోస్ట్’కు అతిథులుగా నాగచైతన్య, అఖిల్!
‘ది ఘోస్ట్’ ఫంక్షన్‌కు అతిథులు ఖరారయ్యారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన చిత్రం ఇది. ఆదివారం కర్నూలులో జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా నాగచైతన్య, అఖిల్ హాజరు కానున్నారు. అక్టోబరు 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్ (పాటలు భరత్–సౌరభ్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల. -
నాగార్జున ‘ది ఘోస్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
‘కింగ్’ నాగార్జున నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ఇందులో నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొంది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! కాగా ‘ది ఘోస్ట్’ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఈ సినిమాను అక్టోబర్ 5న థియేటర్లో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం స్పందించలేదు. దీంతో ది ఘోస్ట్ విడుదలపై అక్కినేని అభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ క్రమంలో ఈ మూవీ రిలీజ్‌పై కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 5న థియేటర్లోనే రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ -
నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్ అదిరిపోయిందిగా..
కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ది ఘోస్ట్. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నాగార్జున రఫ్ఫాడించాడు. ఓ తల్లీకూతుళ్లను కాపాడేందుకు ఎంతోమంది విలన్లను నేలమట్టం చేశాడు. ఇక ఈ ట్రైలర్లో భరత్- సౌరభ్అందించిన బీజీఎమ్ మరో లెవల్లో ఉంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ముఖేష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: బెడ్రూమ్లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్ ఓటీటీలో విక్రాంత్ రోణ, ఎప్పుడు? ఎక్కడంటే? -
The Ghost: ఎమోషన్.. యాక్షన్
పవర్ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, నాగార్జున–సోనాల్ల కొత్త పోస్టర్ని ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఇప్పటివరకు విడుదల చేసిన రెండు ప్రోమోలు ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని అబ్బురపరిచాయి. దాంతో ట్రైలర్‌పై అంచనాలు పెరి గాయి. ట్రైలర్లో మరింత ఎగ్జయిటింగ్ యాక్షన్‌ని చూపించనున్నాం. ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల. ∙నాగార్జున, సోనాల్ చౌహాన్ -
ది ఘోస్ట్‌లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా?
ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ కత్తి పట్టారు. అది కూడా విలువైన జపనీస్ ఉక్కుతో తయారు చేయబడిన ‘తమ హగనే’ కత్తితో రంగంలోకి దిగారు. విక్రమ్ ఎందుకు కత్తి పట్టాల్సి వచ్చిందో తెలియాలంటే ‘ది ఘోస్ట్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు ‘ది ఘోస్ట్’లో నాగార్జున పట్టుకున్న కత్తి (తమ హగనే) గురించి ఓ ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ‘‘తమ హగనే’ అనేది జపనీస్ పదం. తమ అంటే విలువైనదని, హగనే అంటే ఉక్కు అని అర్థం. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్‌లో తమ హగనేని వాడారు నాగార్జున’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు -
ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్
ఈ ఏడాది దసరా పండగ బాక్సాఫీస్ ఫైట్‌కి రంగం సిద్ధం అవుతోంది. దసరా బరిలో నిలిచేందుకు హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చిత్రంతో దసరాకు వచ్చేందుకు రెడీ అయ్యారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు మోహన్‌రాజా దర్శకుడు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రలు చేస్తున్నారు. సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కానీ విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకుని పండగ బరిలో నిలిచారు హీరో నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’లో నాగార్జున హీరోగా నటించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన చిత్రం ఇది. ఇంకోవైపు నిఖిల్ కూడా దసరా బరిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘స్పై’. ఈ సినిమాను దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించి, నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు కూడా దసరాకు రిలీజవుతాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రబృందాలు రిలీజ్ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇక దసరా పండక్కి ఓ నాలుగు రోజుల ముందే రవితేజ ‘రావణాసుర’ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదలవుతుంది. అనుకున్న ప్రకారం రిలీజైతే దసరా పండక్కి కొన్ని థియేటర్స్‌లో అయినా ‘రావణాసుర’ ఉంటాడు. సేమ్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా సెప్టెంబరు 30నే రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా దసరా సమయానికి కొన్ని థియేటర్స్‌లో ప్రదర్శనకు ఉండే చాన్సెస్ లేకపోలేదు. ఈ చిత్రంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ ప్రధాన తారలుగా నటించారు. దసరా పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌కి గురి పెడుతున్నాయి. -
ఇది ఎవరికీ తెలియదనుకుంటా: నాగార్జున
Nagarjuna About The Ghost Movie: కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ది ఘోస్ట్'. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి 'కిల్లింగ్ మెషిన్' పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు మూవీ యూనిట్ సమాధానమిచ్చింది. నాగార్జున మాట్లాడుతూ.. ''ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు. నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. సునీల్ నారంగ్ గారి నాన్నగారు నారాయణ్ దాస్ నారంగ్ తో ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదలైంది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటాయి. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్ , సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం'' అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. 'నాగార్జునతో సినిమా చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. స్టైలిష్ యాక్షన్ లో నాగార్జున అద్భుతంగా ఉంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది. సినిమా మొదలైన తర్వాత కరోనా రూపంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గొప్ప సపోర్ట్ గా నిలబడ్డారు. టెక్నికల్ టీం, డైరెక్షన్ టీమ్ కి కృతజ్ఞతలు'' తెలిపారు. శివలో చైన్ పెట్టారు ఘోస్ట్ లో రెండు కత్తులు పెట్టారు మరో శివలా అంచనాలు పెట్టుకోవచ్చా ? నాగార్జున: శివకి దీనికి పోలిక లేదు. యాక్షన్ స్టైలిష్ గా డిజైన్ చేసిన క్రమంలో కత్తులు వచ్చాయి. ఎవరికీ ఘోస్ట్ గా వుంటారు ? నాగార్జున: ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు. స్టైలిష్ పోల్ ఏజెంట్ విక్రమ్ కి కోడ్ నేమ్. ఇన్నేళ్ల మీ అనుభవంలో ఎలాంటి పాత్రలు, ఎలాంటి కథలని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారనిపించింది ? నాగార్జున: నిజంగా తెలీదండి. నాకే కాదు ఇది ఎవరికీ తెలియదని అనుకుంటాను. ప్రేక్షకులకు ఎప్పుడు, ఎందుకు ఒక సినిమా నచ్చుతుందో తెలీదు. ఈ మధ్య రాజమౌళితో మాట్లాడుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చింది. ''మన మనసుకు నచ్చిన సినిమా బలంగా నమ్మి తీసేయాలి. మనకి నమ్మకం ఉంటేనే జనాలకి నచ్చుతుంది' అన్నారు. ప్రవీణ్ సత్తారు చెప్పిన కథలో కొత్త పాయింట్ ఏమిటి ? నాగార్జున: ట్రీట్మెంట్, యాక్షన్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఉంటుంది. ఈ చిత్రానికి టికెట్ రేట్లు ఎలా ఉంటాయి ? సునీల్ నారంగ్: సాధారణమైన ధరలే ఉంటాయి. టికెట్ రేట్లు పెంచం. మిషన్ బేస్డ్ సినిమాలకి సీక్వెల్స్ ఉంటాయి కదా .. ఘోస్ట్ కి సీక్వెల్ ఉంటుందా ? ప్రవీణ్ సత్తారు: ఇది మిషన్ బేస్డ్ సినిమా కాదు. మీరంతా రివ్యూలు చక్కగా రాసి సినిమా సూపర్ హిట్ అయితే ఎన్ని సీక్వెల్స్ అయినా తీసుకోవచ్చు( నవ్వుతూ) నాగార్జున మన్మధుడు కదా.. ఆయన్ని యాక్షన్ చేయించడానికి ఎంత కష్టపెట్టారు ? ప్రవీణ్ సత్తారు: నాగార్జున నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. చాలా అలోచించి ఒక యాక్షన్ బ్లాక్ పెడితే.. ఆయన వచ్చి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. 12 భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. నాగార్జున చాలా ఫ్లెక్స్ బుల్ గా సూపర్ ఫాస్ట్ గా చేశారు. యాక్షన్ లో కొత్తదనం ఏముటుంది ? ప్రవీణ్ సత్తారు: ఇందులోని యాక్షన్ కథలో కలసి ఉంటుంది. యాక్షన్ కూడా ఎమోషన్ లో బాగంగా ఉంటుంది. యాక్షన్ చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. -
కత్తులతో నాగార్జున వేట.. 'ది ఘోస్ట్' నుంచి కొత్త అప్డేట్
Nagarjuna As A Killing Machine From The Ghost Movie: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఘోస్ట్'. ఈ చిత్రానికి 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. నాగ్, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ విజువల్ ట్రీట్‌ను చిత్రబృందం షేర్ చేసింది. 'కిల్లింగ్ మేషిన్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో నాగార్జున కత్తులతో శత్రువులను వేటాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోన్న ఈ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 5న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.