‘ఘోస్ట్‌’కు అతిథులుగా నాగచైతన్య, అఖిల్‌! | Naga Chaitanya And Akhil Turns Chief Guest For The Ghost Movie | Sakshi
Sakshi News home page

The Ghost Movie: ‘ఘోస్ట్‌’కు అతిథులుగా నాగచైతన్య, అఖిల్‌!

Published Sat, Sep 24 2022 9:54 AM | Last Updated on Sat, Sep 24 2022 9:59 AM

Naga Chaitanya And Akhil Turns Chief Guest For The Ghost Movie - Sakshi

‘ది ఘోస్ట్‌’ ఫంక్షన్‌కు అతిథులు ఖరారయ్యారు. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో గుల్‌ పనాగ్, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. నారాయణ్‌దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మించిన చిత్రం ఇది.

ఆదివారం కర్నూలులో జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా నాగచైతన్య, అఖిల్‌ హాజరు కానున్నారు. అక్టోబరు 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌ (పాటలు భరత్‌–సౌరభ్‌), ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement