‘మన్మథుడు 2’ ఎవరి కోసం..! | Nagarjuna Registered Manmadhudu 2 Title With Film Chamber | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 14 2018 11:56 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna Registered Manmadhudu 2 Title With Film Chamber - Sakshi

నాగార్జున కెరీర్‌లో బిగెస్ట్‌ హిట్స్‌లో మన్మథుడు సినిమా ఒకటి. విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్‌ నిజంగా మన్మథుడు లాగే ఆకట్టుకున్నాడు. అమ్మాయిలను ద్వేషించే పాత్రలో కూడా అమ్మాయిల కలల రాకుమారుడిగా కనిపించాడు కింగ్‌. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కలం మన్మథుడు సినిమాలో మరింత పదునుగా పంచ్‌లు విసిరింది.

ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకుంటే తాజాగా కింగ్ నాగార్జున ‘మన్మథుడు 2’ అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్‌ చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మన్మథుడు సినిమాకు నాగ్‌ సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ సీక్వెల్‌లో మరోసారి నాగే మన్మథుడిగా అలరిస్తాడా..? నాగచైతన్య, అఖిల్‌లలో ఒకరు మన్మథుడి పాత్రలో కనిపించనున్నారా..?  అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement