Naga Chaitanya talks about how his family deals with flops, says 'we'll be back soon' - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్‌ టైం.. ముగ్గురికీ వరుసగా ఫ్లాప్‌.. చై ఏమన్నాడంటే?

May 4 2023 4:30 PM | Updated on May 4 2023 4:43 PM

Naga Chaitanya about His Family Deal with Flops We Will be Back Soon - Sakshi

మా కుటుంబం నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు వర్కవుట్‌ అవలేదు. అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే! అందరూ దాన్ని అంగీకరించక తప్పదు.

అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్‌ టైం నడుస్తోంది. ఇటీవలి కాలంలో వారు నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. నాగార్జున మొదలు నాగ చైతన్య, అఖిల్‌ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. సక్సెస్‌ పదం విని చాలాకాలమే అయింది. గతేడాది నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన 'ది ఘోస్ట్‌', చైతన్య 'థాంక్యూ', అఖిల్‌ 'ఏజెంట్‌'.. సినిమాలన్నీ చతికిలపడ్డాయి.

ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్‌ అంతా ఓ సాలిడ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచేందుకు సిద్ధమయ్యాడు నాగచైతన్య. మే 12న కస్టడీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ సమావేశంలో చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'అక్కినేని అభిమానులు ఏడాదికాలంగా స్ట్రాంగ్‌ కమ్‌బ్యాంక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ నిరాశాజనకమైన ఫలితాలే వస్తున్నాయి. అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు?' అని ఓ పాత్రికేయుడు చైను ప్రశ్నించాడు.

దీనికి యువసామ్రాట్‌ స్పందిస్తూ.. 'అభిమానులకు మేము ఎప్పుడూ సక్సెస్‌నే ఇవ్వాలనుకుంటాం. వారు మాపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తారు. ఎల్లప్పుడూ మద్దతుగా నిలబడతారు. వారికి మేము బహుమతిగా మంచి సినిమాను మాత్రమే ఇవ్వగలం. మా కుటుంబం నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు వర్కవుట్‌ అవలేదు. అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే! అందరూ దాన్ని అంగీకరించక తప్పదు. త్వరలోనే ఈ బ్యాడ్‌టైం ముగిసిపోతుంది. మళ్లీ మేము హిట్‌ ట్రాక్‌ ఎక్కుతాం. కస్టడీతోనే అది ప్రారంభమవుతుంది. నాకు ఆ నమ్మకముంది' అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.

చదవండి: టార్చర్‌, రోజూ నన్ను కొట్టి హింసించేవాడు: నటి
సర్జరీ వికటించడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement