దేవిశ్రీ ప్రసాద్, బన్నీ వాసు, అశ్వనీదత్, నాగచైతన్య, అల్లు అరవింద్, నాగార్జున, చందు మొండేటి
‘‘తండేల్’ కోసం చైతన్య రెండేళ్లు కష్టపడ్డాడు. ఓ రోజు ‘సముద్రంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే మత్స్యకారుల కష్టాలు అర్థం అవుతున్నాయి’ అన్నాడు చైతన్య. నెలల తరబడి సముద్రంలో చిన్న పడవపై ఉండే మత్స్యకారులందరికీ చేతు లెత్తి దండం పెడుతున్నాను. ఈ మూవీలో నాగచైతన్య నటన చూస్తుంటే మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) గుర్తొచ్చారు. 2025లో ‘తండేల్’ మంచి ముహూర్తం. వస్తున్నాం... కొడుతున్నాం’’ అన్నారు అక్కినేని నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలైంది.
మంగళవారం నిర్వహించిన ‘తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్’కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘అరవింద్‌గారు ‘తండేల్’ కథ విన్న, చందు మొండేటితో తీద్దామన్న, దేవిశ్రీతో మ్యూజిక్ చేయిద్దామన్న వేళా విశేషం... టీమ్ అందర్నీ సెట్ చేయడానికి బన్నీ వాసు, అందరూ ప్రయత్నించిన వేళా విశేషం... వీళ్లందరూ నాగచైతన్యని అడిగిన వేళా విశేషం.. శోభితని చైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం... ఇవన్నీ బాగున్నాయి. ‘తండేల్’ విడుదలైన రోజు ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారిని కలిసేందుకు వెళ్లాం. అప్పుడు ఫోన్ సెక్యూరిటీలో ఇచ్చి వెళ్లాం.
వచ్చాక ఫోన్ ఆన్ చేయగానే... ఫ్యాన్స్ వద్ద నుంచి కంగ్రాట్స్ అంటూ మెసేజులు. నాకన్నా, చైతన్య కన్నా మా శ్రేయోభిలాషులు, అక్కినేని ఫ్యాన్స్ ఎంత ఆనందపడుతున్నారో అప్పుడు అర్థమైంది. ‘తండేల్’ కథని నాక్కూడా వినిపించారు అరవింద్‌గారు. ‘100 పర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్’... ఇలా మా ఫ్యామిలీకి ఒకదాన్ని మించి మరొక సక్సెస్ ఇచ్చిన మీకు థ్యాంక్స్. అల్లు... అక్కినేని కుటుంబాలకు బాగా సెట్టయింది. అరవింద్‌గారిని బన్నీ వాసు చక్కగా కన్విన్స్ చేసి, ఇలాంటి మంచి సినిమాలు తీసేలా చేస్తాడు. చైతన్యలోని ఒక నటుణ్ణి బయటకు తీసుకొచ్చాడు చందు’’ అన్నారు.
‘‘తండేల్’కి సంబంధించి బిగ్గెస్ట్ తండేల్ (నాయకుడు) చందు మొండేటి. మా గీతా ఆర్ట్స్‌లో కలకాలం నిలిచి΄ోయే చిత్రాల్లో ‘తండేల్’ని ది బెస్ట్ సినిమాగా తీసుకుంటాం. తన నటనతో చింపేశాడు చైతు’’ అని పేర్కొన్నారు అల్లు అరవింద్.
‘‘నాపై నమ్మకంతో చైతన్యగారిని నాకు అప్పగించిన నాగార్జున సార్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా ‘తండేల్’తో నాగచైతన్యగారిని వంద కోట్ల క్లబ్‌లో కూర్చోబెడతాం. నాలుగైదు రోజుల్లో 100 కోట్ల ΄పోస్టర్‌ని వేసి, పెద్ద వేడుక చేస్తాం. చైతన్యతో ‘100 పర్సెంట్ లవ్, తండేల్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచి లర్’ వంటి హిట్ సినిమాలు తీశాం. ఇక మీరు (నాగార్జున) కూడా గీతా ఆర్ట్స్‌కి డేట్స్ ఇస్తే వీటన్నిటికంటే పెద్ద సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొడతాం’’ అని చె΄్పారు బన్నీ వాసు.
‘‘మా నాన్నగారిని చూసి నాకు క్రమశిక్షణ, భక్తి వచ్చాయి. నాన్నగారి కన్నా ఇంకా గొప్ప అర్హతలు ఎవరిలో అయినా ఉన్నాయా? అంటే అది అరవింద్‌గారే. చైతన్యగారితో భవిష్యత్తులో ఓ గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన ‘తెనాలి రామకృష్ణ’ కథని మళ్లీ అత్యద్భుతంగా రాసి, ఈ తరానికి ఎలా కావాలి?
ఏం చె΄్పాలి? అని తీసుకొస్తాం. ఆ మూవీలో ఏఎన్‌ఆర్‌గారు చేసినటువంటి అభినయం మళ్లీ చైతన్యగారు చేస్తారు. అది మనం చూడబోతున్నాం’’ అని తెలి΄ారు చందు మొండేటి.
నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజులాంటిపాత్రలు అరుదుగా దొరుకుతాయి. ఈ మూవీతో వంద కోట్ల క్లబ్‌లో చేరతావని వాసు ఎప్పుడో చె΄్పాడు. ఈ మూవీ నీ కెరీ ర్‌లో బెస్ట్ అవుతుందని అరవింద్‌గారు చె΄్పారు. నేనూ నమ్మా. చందు, నా కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఎన్నోపాత్రలతో ఆడియన్స్‌ని అలరించాలి, ఎంతో కష్టపడాలనేప్రోత్సాహం, ధైర్యాన్ని ఈ సినిమా ద్వారా అరవింద్‌గారు, వాసు ఇచ్చారు. సినిమా లవర్స్ అంటే మన తెలుగు ప్రేక్షకుల తర్వాతే. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తారో మీరు మాకు చూపించారు’’ అన్నారు. నిర్మాత అశ్వినీదత్, సహ నిర్మాత భాను, నటి, నాగచైతన్య వైఫ్ శోభితా ధూళి΄ాళ్ల,పాటల రచయిత శ్రీమణి, కథా రచయిత కార్తీక్ తదితరులుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment