The Ghost Movie Update: Nagarjuna And Movie Unit In Dubai For Shooting - Sakshi
Sakshi News home page

Nagarjuna: దుబాయ్‌లో సందడి చేస్తున్న నాగార్జున

Published Thu, Mar 10 2022 2:54 PM | Last Updated on Thu, Mar 10 2022 3:24 PM

The Ghost Movie Update: Nagarjuna ANd Movie Unit In Dubai For Shooting - Sakshi

‘బంగార్రాజు’ మూవీతో మంచి హిట్‌ కొట్టి న్యూయర్‌ను స్టార్ట్‌ చేశాడు ‘కింగ్‌’ నాగార్జున. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘దీ గోస్ట్‌’ ఈ మూవీ షూటింగ్‌ నేపథ్యంలో నాగ్‌ విదేశాల్లో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ‘ది గోస్ట్‌’ మూవీ ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్‌ను జరుపుకుంటున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ను కూడా మూవీ యూనిట్‌ అధికారికంగా విడుదల చేసింది.

చదవండి: గుర్తు పట్టలేనంతగా ‘ఓయ్‌’ హీరోయిన్‌ షామిలీ, ఫొటోలు వైరల్‌

అక్కడ హీరోయిన్‌ సోనాల్‌ చౌహన్‌, నాగార్జునలకు సంబంధించిన ఓ సాంగ్‌, రొమాంటి సన్నివేశాలతో పాటు మూడు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌‍కు చిత్ర బృందం ప్లాన్‌ చేసిందట. భారీ యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ ఫైట్‌ సీన్స్‌ను థాయిలాండ్ చెందిన ఫేమస్ స్టంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కించబోతున్నారట. ఇదిలా ఉంటే నాగార్జున దీనితో పాటు బిగ్బాస్ తెలుగు నాన్ స్టాప్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్‌లో ఈ రియాలిటీ షో కోసం హైదరాబాద్ వచ్చి షూటింగుకు హాజరయ్యే విధంగా నాగ్‌ ప్లాన్ చేస్తుకున్నాడట. ఇక ఏడాది చివరి లోపు సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

చదవండి: పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్‌ నిర్ణయం! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement